← Back to ఇ · Booklets 11–20 (digitized file 2)

ఇంద్రియ విషయములు iṃdriya viṣayamulu

Original — తెలుగు
  1. శబ్ద, స్పర్స్ద, రూప రస గంధములు -

  2. “ఇంద్రియాణి పంచీకృత భూత తత్కర్యాణ్యేవ విషయాకుర్యుః చక్షురింద్రియం నీల పీతాదివర్ణయుక్త ఘటాది నిష్ట నైల్యాది రూపం, తదాధారభూత ఘటాదిచ విషయీ కరోతి. త్వగింద్రియమపి స్పర్శం తదాశ్రయంచ ఉభయం విషయీ కరోతి. జిహ్వఘ్రాణశ్రవణాని తుత్రీని ఇంద్రియాణి వస్త్వాశ్రితరసగ్రంధ శబ్దానేవ క్రమాత్ విషయీ కుర్వంతి, నతు తదాశ్రయద్రవ్యం. అతః ఏవ ఏతత్రయేణాపి ఇంద్రియేణ అంతరం అంతఃకరణం న విషయీ క్రియతే. తధైవ న చక్షుషా త్వచాచ అంతఃకరణం విషయీ క్రియతే యతః బాహ్యపంచీకృత భూతాని తత్కార్యం రూపాశ్రయం స్పర్శాశ్రయంవా వస్తు, చక్షుషా త్వచాచ విషయీ క్రియంతే. అంతఃకరణం తు అపంచీకృత భూతకార్యత్వాత్ నేత్ర త్వచోః న వి షయీ భవతి. అతః ఏవ అపంచీకృత భూతకార్యం నేతేంద్రియమపి నేతేంద్రియేణ న విషయీ క్రియతే; బాహ్యవస్తూ ని ఏవ సర్వేంద్రియాణాం విషయీభవంతి. ఇంద్రియాపేక్షయా ఆంతరత్వాత్ అంతఃకరణం న ఇంద్రియాణాం విషయీ భవతి”

(పంచీకృతమైన పంచభూతముల కార్యములే ఇంద్రియములకు విషయములు. నీలవర్ణము మొదలగు రంగులుగల కుండ మొదలగువాటియొక్క రూపము చక్షురింద్రియమునకు విషయము. చర్మమునకు స్పర్శము విషయము. వస్తువులకు సంబంధించిన రస,గంధ,శబ్దములు. జిహ్వ,ముక్కు, చెవులకు విషయములు; రసగంధ శబ్దములు ఆశ్రయించియున్న వస్తువులు వాటికి విషయములుకావు - అందుచేత ఈ మూడు ఇంద్రియములకు అంతఃకరణము విషయముకాదు. ఆ ప్రకారముగానే కంటికి, చర్మమునకు అంతఃకరణము విషయముకాదు. అందుచేత బాహ్య పంచీకృతభూతములు వాటికార్యమైన రూపము. ఆశ్రయించుకొనియున్న వస్తువు, కంటికి, చర్మమునకు విషయమైయున్నది. అంతఃకరణము పంచీకృతముకాని భూతములయొక్క కార్యమగుటవలన కంటికి, చర్మమునకు విషయముకాదు. అందుచేతనే నేత్రము పంచీకృతముకాని భూతముల కార్యమైనప్పటికీ అంతఃకరణమునువిషయముగా చేసుకొనలేదు - అన్ని ఇంద్రియములకు బాహ్య వస్తువులే విషయములు. అంతఃకరణము ఇంద్రియముఅని చెప్పబడునను, లోపలనుండుటచేత - అంతరింద్రియమగుటచేత ఇంద్రియములకు విషయముకాదు).

(ఇంద్రియములయిదును తాము పంచీకృతము అయిన స్థూలపంచభూతముల ఏకార్యమువలన పుట్టినవో వాటికి సంబంధించిన విషయములందు ప్రవర్తించి వానినే బోధించుచుండును. త్వగింద్రియము స్పర్శగుణమైన వాయువువలన పుట్టినందున స్పర్శమునే బోదించును. చక్షురింద్రియము రూపగుణముగల తేజస్సువలన పుట్టినందున రూపమునే బోధించును - శ్రోత్రముశబ్దగుణముగల ఆకాసమువలన పుట్టినందున శబ్దమునే బోధించును. జిహ్వ రసగుణముగల జలమువలన పుట్టినందున మధురాదిరసములనే బోధించును. ఘ్రాణేంద్రియము గంధిగుణముగల పృధ్వివలన పుట్టినందున గంధమునే బోధించును).

Transliteration
  1. śabda, sparsda, rūpa rasa gaṃdhamulu -

  2. “iṃdriyāṇi paṃcīkṛta bhūta tatkaryāṇyēva viṣayākuryuḥ cakṣuriṃdriyaṃ nīla pītādivarṇayukta ghaṭādi niṣṭa nailyādi rūpaṃ, tadādhārabhūta ghaṭādica viṣayī karōti. tvagiṃdriyamapi sparśaṃ tadāśrayaṃca ubhayaṃ viṣayī karōti. jihvaghrāṇaśravaṇāni tutrīni iṃdriyāṇi vastvāśritarasagraṃdha śabdānēva kramāt viṣayī kurvaṃti, natu tadāśrayadravyaṃ. ataḥ ēva ētatrayēṇāpi iṃdriyēṇa aṃtaraṃ aṃtaḥkaraṇaṃ na viṣayī kriyatē. tadhaiva na cakṣuṣā tvacāca aṃtaḥkaraṇaṃ viṣayī kriyatē yataḥ bāhyapaṃcīkṛta bhūtāni tatkāryaṃ rūpāśrayaṃ sparśāśrayaṃvā vastu, cakṣuṣā tvacāca viṣayī kriyaṃtē. aṃtaḥkaraṇaṃ tu apaṃcīkṛta bhūtakāryatvāt nētra tvacōḥ na vi ṣayī bhavati. ataḥ ēva apaṃcīkṛta bhūtakāryaṃ nētēṃdriyamapi nētēṃdriyēṇa na viṣayī kriyatē; bāhyavastū ni ēva sarvēṃdriyāṇāṃ viṣayībhavaṃti. iṃdriyāpēkṣayā āṃtaratvāt aṃtaḥkaraṇaṃ na iṃdriyāṇāṃ viṣayī bhavati”

(paṃcīkṛtamaina paṃcabhūtamula kāryamulē iṃdriyamulaku viṣayamulu. nīlavarṇamu modalagu raṃgulugala kuṃḍa modalaguvāṭiyokka rūpamu cakṣuriṃdriyamunaku viṣayamu. carmamunaku sparśamu viṣayamu. vastuvulaku saṃbaṃdhiṃcina rasa,gaṃdha,śabdamulu. jihva,mukku, cevulaku viṣayamulu; rasagaṃdha śabdamulu āśrayiṃciyunna vastuvulu vāṭiki viṣayamulukāvu - aṃducēta ī mūḍu iṃdriyamulaku aṃtaḥkaraṇamu viṣayamukādu. ā prakāramugānē kaṃṭiki, carmamunaku aṃtaḥkaraṇamu viṣayamukādu. aṃducēta bāhya paṃcīkṛtabhūtamulu vāṭikāryamaina rūpamu. āśrayiṃcukoniyunna vastuvu, kaṃṭiki, carmamunaku viṣayamaiyunnadi. aṃtaḥkaraṇamu paṃcīkṛtamukāni bhūtamulayokka kāryamaguṭavalana kaṃṭiki, carmamunaku viṣayamukādu. aṃducētanē nētramu paṃcīkṛtamukāni bhūtamula kāryamainappaṭikī aṃtaḥkaraṇamunuviṣayamugā cēsukonalēdu - anni iṃdriyamulaku bāhya vastuvulē viṣayamulu. aṃtaḥkaraṇamu iṃdriyamuani ceppabaḍunanu, lōpalanuṃḍuṭacēta - aṃtariṃdriyamaguṭacēta iṃdriyamulaku viṣayamukādu).

(iṃdriyamulayidunu tāmu paṃcīkṛtamu ayina sthūlapaṃcabhūtamula ēkāryamuvalana puṭṭinavō vāṭiki saṃbaṃdhiṃcina viṣayamulaṃdu pravartiṃci vāninē bōdhiṃcucuṃḍunu. tvagiṃdriyamu sparśaguṇamaina vāyuvuvalana puṭṭinaṃduna sparśamunē bōdiṃcunu. cakṣuriṃdriyamu rūpaguṇamugala tējassuvalana puṭṭinaṃduna rūpamunē bōdhiṃcunu - śrōtramuśabdaguṇamugala ākāsamuvalana puṭṭinaṃduna śabdamunē bōdhiṃcunu. jihva rasaguṇamugala jalamuvalana puṭṭinaṃduna madhurādirasamulanē bōdhiṃcunu. ghrāṇēṃdriyamu gaṃdhiguṇamugala pṛdhvivalana puṭṭinaṃduna gaṃdhamunē bōdhiṃcunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.