← Back to ఇ · Booklets 11–20 (digitized file 2)

ఇంద్రియములు iṃdriyamulu

Original — తెలుగు
  1. “నాసికా, లోచనే, జిహ్వా, త్వక్, శ్రోత్రౌ చేంద్రియాణిచ |

హస్తే పా యురుపస్థశ్చ వాక్పాదౌ చేతి పంచకః |

కర్మేంద్రియాణి జానీత మనశ్చే హో భయాత్మకం ||“. (చికిత్సాసార సంగ్రహము)

(ముక్కు, కండ్లు, నాలుక, చర్మము, చెవులు - ఈ అయిదు జ్ఞానేంద్రీయములు; చేతులు, పాయువు, ఉపస్థు, వాక్కు, కాళ్ళు - ఈ అయిదు కర్మేంద్రియములు. మనస్సు ఈ రెండువిధముల ఇంద్రియము).

  1. “తత్ర వైకారికాదహంకారా త్తైజస సహాయాత్తల్లక్షణా న్యైవాకా దశేంద్రియాణ్యుత్పద్యంతే - శ్రోత్రత్వ క్చక్షుర్జిహ్వా ఘ్రాణ వాక్ హస్తోపస్థపాయుపాదమనాం నీతి తత్ర పూర్వాణి పంచ బుద్ధేంద్రియాణి, ఇతరాణి పంచ కర్మేంద్రియాణి, ఉభయాత్మకం మనః”.

(తైజసాహంకారముతో కూడిన వైకారికాహంకారము వలన వాటి లక్షణములుగల పదకొండు ఇంద్రియములు పుట్టుచున్నవి. చెవి, చర్మము, కన్ను, జిహ్వ, ఆఘ్రాణము, వాక్కు, చేతులు, ఉపస్థు, పాయువు, పాదములు, మనస్సు, వీటిలో మొదటి అయిదు జ్ఞానేద్రియములు, తర్వాత అయిదు కర్మేంద్రియములు. మనస్సు ఈ రెండిటి క్రింద వచ్చును).

వ. “--- తైజసంబైన రాజసాహంకారంబువలన దిగ్దైవతంబైన త్వగింద్రియంబును, సూర్యదైవతంబైన నయనేంద్రియంబును బ్రచేతో దైవతంబైన ఘ్రాణీంద్రియంబును, నశ్వినీదైవతంబైన ఘ్రాణేంద్రియంబును, వహ్నిదైవతంబైన వాగింద్రియంబును, నింద్రదైవతంబైన హస్తేంద్రియంబును, నుపేంద్రదైవతంబైన పాదేంద్రియంబును, మిత్రదైవతంబైన గుదేంద్రియంబును, బ్రజాపతి దైవతంబైన గుహ్యేంద్రియంబును ననియెడి దశేంద్రియంబులును, బోధజనకాంతః కరణైక భాగంబయిన బుద్ధియు క్రియాజనితాంతః కరణంబైన ప్రాణంబునుం గలిగె ---” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 86)

  1. గృహ్ణంతి పురుషపశుం బధ్నంతీతి గ్రహాః ఇంద్రియాణి. తేషాం గ్రహ త్వం విషయాధీనం. అసతివిషయే తేషామ కించిత్కరత్వాత్.

(అజ్ఞానముచేత పశుప్రాయుడైన పురుషుని గ్రహించునది - పశువును త్రాడుతో కట్టినట్లు బంధించునవికనుక ఇంద్రియములు గ్రాహకశక్తి విషయముల ఆధీనము - విషయములను గ్రహించునవి ఇంద్రియములు).

  1. శృణోమి, పస్యామీత్యాది ప్రత్యక్ ప్రకాశద్వార భూతాని ఇంద్రియాణి, తవత్ స్థూలాని.

(వినుచున్నాను, చూచుచున్నాను అని ఈ విధముగా ప్రత్యాగాత్మ లోపలనుండి పైకి అనిపించి చేయించునవి ఇంద్రియములు - స్థూలములు).

  1. “విషయ ద్రవణాత్తేషా మింద్రియత్వ ముదాహృతం”.

(విషయములయడల పరుగిడునవి కనుక ఇంద్రియములు).

  1. “శృత్వా, స్పృష్ట్వా చ దృష్ట్వా చ భుక్త్వా ఘ్రత్వా విమృశ్యచ |

ఇంద్రమానంద. యత్యేషా తేనేంద్రియమితి స్మృతిం ||“. (యోగవాశిష్టము - 96 - 27)

(మనసుగా మారిన చైతన్యము, వినుచు స్పృశించుచు, చూచుచు, ఆస్వాదించుచు, మూర్కొనుచు, సంకల్పించుచు, ఇట్లు సర్వేంద్రియములచే భోగానుభవకార్యములను గావించుచు - అందువలన జీవుడనిపించుకొను ఇంద్రుడను పేరున చెప్పబడు పరమేశ్వరును తృప్తి పరచుటచేత ఇంద్రియమని చెప్పబడుచున్నది).

  1. “అంతఃకరణ జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబులు పదునాల్గును ఆధ్యాత్మికంబులు” (వివేకచింతామణి - పరమానందతీర్థ)

  2. “అగ్ని సంగాత్తథా లోహమగ్నిత్వ ముపగచ్ఛతి |

ఆత్మ సంగత్తథా గచ్ఛత్యాత్మ తా మింద్రియాదికం |

నదేహోపి. న జీవోపి న భవేదుభయం తతః |

జాత్యేత రాదికం భ్రాంతం సత్యే స్వాత్మని కల్పితం ||“.

(అగ్నితో కూడియుండుటవలన లోహమును అగ్నిత్వమును పొందును - అనగా అగ్నియొక్క వేడిమిని కాంతిని పొందును - ఇంద్రియములు మొదలైనవి ఆత్మతో సాంగత్యము కలిగియుండుటవలన ఆత్మవలె నగపడుచుండును. ఆత్మ వాటిలో నుండుటవలన అవి వాటి పని చేయుచున్నవి; దేహమనికాని జీవుడనికాని, ఈ రెండును అనికాని యనుట కల్ల - అది వేఱు ఇది వేఱు యనుకొనుట భ్రాంతి. సద్రూపుడైన తనయందే - జీవాత్మ లేక పరమాత్మయందే అన్నీ కల్పితము).

  1. “అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశత్; వాయుః ప్రాణోభూత్వా నాసికే ప్రావిశత్; ఆదిత్యశ్చక్షుర్భూత్వా అక్షిణీప్రావిశత్; దిశః శ్రోత్రంభూత్వా కర్ణౌ ప్రావిశత్, ఔషధి వనస్పతయో లోమాని భూత్వాత్వచం ప్రావిసత్; చంద్రమాః మనోభూత్వా హృదయం ప్రావిశన్మృత్యురపానో భూత్వా నాభిం ప్రావిశత్; ఆసోరేతో భూత్వా శిశ్నం ప్రావిశత్” (ఐతరేయోపనిషత్)

(దీని అర్థము 11 తర్వాత చూడుము)

  1. సప్తప్రాణాః ప్రభవంతి తస్మాత్ “ఇతి ఇంద్రియాణి సప్త సంకీర్త్యంతే, క్వచిదష్టౌ క్వచిన్నవ, క్వచిద్దశ, క్వచిదేకాదశ, ఇత్యేవం సప్తత్వాష్ట త్వాది సంఖ్యానాం శ్రుతీనాం పరస్పర విరోధోస్తి పంచధీంద్రియాణి వాఙ్మనశ్చఇతి సప్త ప్రాణాః తే ఏవ హస్తేన సహాష్టౌద్వే శ్రోత్రౌ, ద్వే చక్షుషీ, ద్వే ఘ్రాణే వాక్చ ఇతి సప్తశీర్షి భవాః ప్రాణాః, ద్వౌవాంచౌ పాయూపస్థౌ చేతి నవ, జ్ఞాన కర్మేంద్రియాణి దశమే పురుషే దేహే ప్రాణాః. అత్మా మనః ఏకాదశప్రాణాః ఇతి ఇతి సిద్ధాంతకోటిరుక్తో తే ఏవ హృదయాఖ్యాయా బుద్ధ్యా సహ ద్వాదశ; అహంకారేణ సహ త్రయో దశ, చిత్తేన చతుర్థశత్వం మంతవ్యం. శ్రుతితస్సప్తత్వా నగతేర్యే శీర్షణ్యాః సప్తతే ప్రాణాః ఇతి శీర్షణ్యోద్దేశేన ప్రాణత్వ విశేషణాద్వా శీర్హణ్యానాం ప్రాణ శబ్ద తేంద్రియత్వపరిసంఖ్యయా వా సప్తైవప్రాణాః ఇతి సూత్రయో జనా.”

(“దాని నుండి ఏడు ప్రాణములు పుట్టుచున్నవి” అని చెప్పబడియుండుటవలన ఇంద్రియములు ఏడు అని చెప్పబడుచున్నవి. ఈ ఇంద్రియములు ఒకచోట ఎనిమిది అనియు, ఒకచోట తొమ్మిది అనియు - ఇంకొకచోట పదియనియు, మఱియొకచోట పదకొండు అనియు - ఈ ప్రకారముగా ఇంద్రియముల సంఖ్య శ్రుతులలో ఒకదానికి ఒకటి విరుద్ధముగా చెప్పబడినది. ఎందుచేతననగా - పంచజ్ఞానేంద్రియములు, వాక్కు, మనస్సు కలిసి ఏడుప్రాణములు. ఆ ఏడు చేయితో కలిసి ఎనిమిది, రెండు చెవులు, రెండు కన్నులు రెండు ముక్కు రంధ్రములు వాక్కు అను ఏడున్నూ శిరస్సు జనించు ప్రాణములు. ఈ ఏడున్నూ పాయువు, ఉపస్థుతో కలిపి తొమ్మిది. జ్ఞానేంద్రియములు అయిదు, కర్మేంద్రియములు అయిదు - ఈ పదిన్నీ పురుషుని దేహమందుండు ప్రాణములు. ఇవి ఆత్మతో - మనస్సుతో - కలిసి పదకొండు అని సిద్ధాంతము చేయబడినది. ఆ పదకొండు, హృదయమను బుద్ధితో కలిసి పన్నెండు, అహంకారముతో కలిసి పదమూడు, చిత్తముతో కలిసి పదునాలుగు అని తెలుసుకోతగినది. శ్రుతినిబట్టి శీర్షణ్యములైన ప్రాణములు ఏడు అని చెప్పుటచేత, ప్రాణములు అని ఇంద్రియములను చెప్పుటచేతను ప్రాణములు ఏడే).

10 - తాత్పర్యము :-

(అగ్ని సూక్ష్మవాగ్రూపములో ముఖమును ప్రవేశించెను; వాయువు ప్రాణరూపములో నాసికను, ముక్కును - ప్రవేశించెను. సూర్యుడు చక్షువు రూపములో కండ్లలో ప్రవేశించెను - దిక్కులు చెవులరూపములో కర్ణములను ప్రవేశించెను - ఔషధులు - వనస్పతులు రోమములై చర్మమును ప్రవేశించెను, చంద్రుడు మనోరూపములో హృదయములో ప్రవేశించెను - మృత్యువు అపానరూపములో బొడ్డును పరవేశించెను - జలము రూపములో శిశ్నమును ప్రవేశించెను). (చూడుము - 3))

వ. ఇంద్రియములు రెండువిధములు - జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు; “జ్ఞానేంద్రియంబులైన త్వక్చక్షుశ్రోత్రజిహ్వాఘ్రాణంబులు; కర్మేంద్రియంబులైన వాక్పాణి పాదపాయూపస్థములు, అను విధేంద్రియ జననంబు చతుర్థ సర్గంబు

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 10 - 344)

  1. ఇంద్రియములు రెండు విధములు - బాహ్యేంద్రియములు, అంతరింద్రియములు. బాహ్యేంద్రియములనగా శరీరము పైననుండునవి - కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు అంతరింద్రియములు అనగా శరీరములోపలనుండునవి - మనస్సు.

  2. ఇంద్రియమనగా రేతస్సు - (చూడుము ‘ఇంద్రియ జయము’, ‘ఇంద్రియ లోలత్వము’).

Transliteration
  1. “nāsikā, lōcanē, jihvā, tvak, śrōtrau cēṃdriyāṇica |

hastē pā yurupasthaśca vākpādau cēti paṃcakaḥ |

karmēṃdriyāṇi jānīta manaścē hō bhayātmakaṃ ||“. (cikitsāsāra saṃgrahamu)

(mukku, kaṃḍlu, nāluka, carmamu, cevulu - ī ayidu jñānēṃdrīyamulu; cētulu, pāyuvu, upasthu, vākku, kāḷḷu - ī ayidu karmēṃdriyamulu. manassu ī reṃḍuvidhamula iṃdriyamu).

  1. “tatra vaikārikādahaṃkārā ttaijasa sahāyāttallakṣaṇā nyaivākā daśēṃdriyāṇyutpadyaṃtē - śrōtratva kcakṣurjihvā ghrāṇa vāk hastōpasthapāyupādamanāṃ nīti tatra pūrvāṇi paṃca buddhēṃdriyāṇi, itarāṇi paṃca karmēṃdriyāṇi, ubhayātmakaṃ manaḥ”.

(taijasāhaṃkāramutō kūḍina vaikārikāhaṃkāramu valana vāṭi lakṣaṇamulugala padakoṃḍu iṃdriyamulu puṭṭucunnavi. cevi, carmamu, kannu, jihva, āghrāṇamu, vākku, cētulu, upasthu, pāyuvu, pādamulu, manassu, vīṭilō modaṭi ayidu jñānēdriyamulu, tarvāta ayidu karmēṃdriyamulu. manassu ī reṃḍiṭi kriṃda vaccunu).

va. “--- taijasaṃbaina rājasāhaṃkāraṃbuvalana digdaivataṃbaina tvagiṃdriyaṃbunu, sūryadaivataṃbaina nayanēṃdriyaṃbunu bracētō daivataṃbaina ghrāṇīṃdriyaṃbunu, naśvinīdaivataṃbaina ghrāṇēṃdriyaṃbunu, vahnidaivataṃbaina vāgiṃdriyaṃbunu, niṃdradaivataṃbaina hastēṃdriyaṃbunu, nupēṃdradaivataṃbaina pādēṃdriyaṃbunu, mitradaivataṃbaina gudēṃdriyaṃbunu, brajāpati daivataṃbaina guhyēṃdriyaṃbunu naniyeḍi daśēṃdriyaṃbulunu, bōdhajanakāṃtaḥ karaṇaika bhāgaṃbayina buddhiyu kriyājanitāṃtaḥ karaṇaṃbaina prāṇaṃbunuṃ galige ---” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 86)

  1. gṛhṇaṃti puruṣapaśuṃ badhnaṃtīti grahāḥ iṃdriyāṇi. tēṣāṃ graha tvaṃ viṣayādhīnaṃ. asativiṣayē tēṣāma kiṃcitkaratvāt.

(ajñānamucēta paśuprāyuḍaina puruṣuni grahiṃcunadi - paśuvunu trāḍutō kaṭṭinaṭlu baṃdhiṃcunavikanuka iṃdriyamulu grāhakaśakti viṣayamula ādhīnamu - viṣayamulanu grahiṃcunavi iṃdriyamulu).

  1. śṛṇōmi, pasyāmītyādi pratyak prakāśadvāra bhūtāni iṃdriyāṇi, tavat sthūlāni.

(vinucunnānu, cūcucunnānu ani ī vidhamugā pratyāgātma lōpalanuṃḍi paiki anipiṃci cēyiṃcunavi iṃdriyamulu - sthūlamulu).

  1. “viṣaya dravaṇāttēṣā miṃdriyatva mudāhṛtaṃ”.

(viṣayamulayaḍala parugiḍunavi kanuka iṃdriyamulu).

  1. “śṛtvā, spṛṣṭvā ca dṛṣṭvā ca bhuktvā ghratvā vimṛśyaca |

iṃdramānaṃda. yatyēṣā tēnēṃdriyamiti smṛtiṃ ||“. (yōgavāśiṣṭamu - 96 - 27)

(manasugā mārina caitanyamu, vinucu spṛśiṃcucu, cūcucu, āsvādiṃcucu, mūrkonucu, saṃkalpiṃcucu, iṭlu sarvēṃdriyamulacē bhōgānubhavakāryamulanu gāviṃcucu - aṃduvalana jīvuḍanipiṃcukonu iṃdruḍanu pēruna ceppabaḍu paramēśvarunu tṛpti paracuṭacēta iṃdriyamani ceppabaḍucunnadi).

  1. “aṃtaḥkaraṇa jñānēṃdriya karmēṃdriyaṃbulu padunālgunu ādhyātmikaṃbulu” (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)

  2. “agni saṃgāttathā lōhamagnitva mupagacchati |

ātma saṃgattathā gacchatyātma tā miṃdriyādikaṃ |

nadēhōpi. na jīvōpi na bhavēdubhayaṃ tataḥ |

jātyēta rādikaṃ bhrāṃtaṃ satyē svātmani kalpitaṃ ||“.

(agnitō kūḍiyuṃḍuṭavalana lōhamunu agnitvamunu poṃdunu - anagā agniyokka vēḍimini kāṃtini poṃdunu - iṃdriyamulu modalainavi ātmatō sāṃgatyamu kaligiyuṃḍuṭavalana ātmavale nagapaḍucuṃḍunu. ātma vāṭilō nuṃḍuṭavalana avi vāṭi pani cēyucunnavi; dēhamanikāni jīvuḍanikāni, ī reṃḍunu anikāni yanuṭa kalla - adi vēṟu idi vēṟu yanukonuṭa bhrāṃti. sadrūpuḍaina tanayaṃdē - jīvātma lēka paramātmayaṃdē annī kalpitamu).

  1. “agnirvāgbhūtvā mukhaṃ prāviśat; vāyuḥ prāṇōbhūtvā nāsikē prāviśat; ādityaścakṣurbhūtvā akṣiṇīprāviśat; diśaḥ śrōtraṃbhūtvā karṇau prāviśat, auṣadhi vanaspatayō lōmāni bhūtvātvacaṃ prāvisat; caṃdramāḥ manōbhūtvā hṛdayaṃ prāviśanmṛtyurapānō bhūtvā nābhiṃ prāviśat; āsōrētō bhūtvā śiśnaṃ prāviśat” (aitarēyōpaniṣat)

(dīni arthamu 11 tarvāta cūḍumu)

  1. saptaprāṇāḥ prabhavaṃti tasmāt “iti iṃdriyāṇi sapta saṃkīrtyaṃtē, kvacidaṣṭau kvacinnava, kvaciddaśa, kvacidēkādaśa, ityēvaṃ saptatvāṣṭa tvādi saṃkhyānāṃ śrutīnāṃ paraspara virōdhōsti paṃcadhīṃdriyāṇi vāṅmanaścaiti sapta prāṇāḥ tē ēva hastēna sahāṣṭaudvē śrōtrau, dvē cakṣuṣī, dvē ghrāṇē vākca iti saptaśīrṣi bhavāḥ prāṇāḥ, dvauvāṃcau pāyūpasthau cēti nava, jñāna karmēṃdriyāṇi daśamē puruṣē dēhē prāṇāḥ. atmā manaḥ ēkādaśaprāṇāḥ iti iti siddhāṃtakōṭiruktō tē ēva hṛdayākhyāyā buddhyā saha dvādaśa; ahaṃkārēṇa saha trayō daśa, cittēna caturthaśatvaṃ maṃtavyaṃ. śrutitassaptatvā nagatēryē śīrṣaṇyāḥ saptatē prāṇāḥ iti śīrṣaṇyōddēśēna prāṇatva viśēṣaṇādvā śīrhaṇyānāṃ prāṇa śabda tēṃdriyatvaparisaṃkhyayā vā saptaivaprāṇāḥ iti sūtrayō janā.”

(“dāni nuṃḍi ēḍu prāṇamulu puṭṭucunnavi” ani ceppabaḍiyuṃḍuṭavalana iṃdriyamulu ēḍu ani ceppabaḍucunnavi. ī iṃdriyamulu okacōṭa enimidi aniyu, okacōṭa tommidi aniyu - iṃkokacōṭa padiyaniyu, maṟiyokacōṭa padakoṃḍu aniyu - ī prakāramugā iṃdriyamula saṃkhya śrutulalō okadāniki okaṭi viruddhamugā ceppabaḍinadi. eṃducētananagā - paṃcajñānēṃdriyamulu, vākku, manassu kalisi ēḍuprāṇamulu. ā ēḍu cēyitō kalisi enimidi, reṃḍu cevulu, reṃḍu kannulu reṃḍu mukku raṃdhramulu vākku anu ēḍunnū śirassu janiṃcu prāṇamulu. ī ēḍunnū pāyuvu, upasthutō kalipi tommidi. jñānēṃdriyamulu ayidu, karmēṃdriyamulu ayidu - ī padinnī puruṣuni dēhamaṃduṃḍu prāṇamulu. ivi ātmatō - manassutō - kalisi padakoṃḍu ani siddhāṃtamu cēyabaḍinadi. ā padakoṃḍu, hṛdayamanu buddhitō kalisi panneṃḍu, ahaṃkāramutō kalisi padamūḍu, cittamutō kalisi padunālugu ani telusukōtaginadi. śrutinibaṭṭi śīrṣaṇyamulaina prāṇamulu ēḍu ani ceppuṭacēta, prāṇamulu ani iṃdriyamulanu ceppuṭacētanu prāṇamulu ēḍē).

10 - tātparyamu :-

(agni sūkṣmavāgrūpamulō mukhamunu pravēśiṃcenu; vāyuvu prāṇarūpamulō nāsikanu, mukkunu - pravēśiṃcenu. sūryuḍu cakṣuvu rūpamulō kaṃḍlalō pravēśiṃcenu - dikkulu cevularūpamulō karṇamulanu pravēśiṃcenu - auṣadhulu - vanaspatulu rōmamulai carmamunu pravēśiṃcenu, caṃdruḍu manōrūpamulō hṛdayamulō pravēśiṃcenu - mṛtyuvu apānarūpamulō boḍḍunu paravēśiṃcenu - jalamu rūpamulō śiśnamunu pravēśiṃcenu). (cūḍumu - 3))

va. iṃdriyamulu reṃḍuvidhamulu - jñānēṃdriyamulu, karmēṃdriyamulu; “jñānēṃdriyaṃbulaina tvakcakṣuśrōtrajihvāghrāṇaṃbulu; karmēṃdriyaṃbulaina vākpāṇi pādapāyūpasthamulu, anu vidhēṃdriya jananaṃbu caturtha sargaṃbu

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 10 - 344)

  1. iṃdriyamulu reṃḍu vidhamulu - bāhyēṃdriyamulu, aṃtariṃdriyamulu. bāhyēṃdriyamulanagā śarīramu painanuṃḍunavi - karmēṃdriyamulu, jñānēṃdriyamulu aṃtariṃdriyamulu anagā śarīramulōpalanuṃḍunavi - manassu.

  2. iṃdriyamanagā rētassu - (cūḍumu ‘iṃdriya jayamu’, ‘iṃdriya lōlatvamu’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.