← Back to ఈ · Booklets 11–20 (digitized file 2)

ఈశుడు īśuḍu

Original — తెలుగు
  1. ఈశ్వరః (ఈశ్వరుడు, శివుడు, ప్రభువు, అధిపతి).

  2. నియంతా, సర్వనియంతృత్వాత్ ఈశః -

(నియమించువాడు, అన్నింటిలోపలనుండి అన్నింటిని వాటి పనులలో నియమించువాడు - లోపల భగవంతుని శక్తిలేనిదీ ఎవరూ ఏ పనియు చేయలేరు).

  1. సర్వం ఈశతే ఈశనీభిః మాయాశక్తిభిః - మాయావీ.

(తన మాయాశక్తిచేత అందఱినీ, అన్నింటినీ నియమించువాడు - మాయావి - మాయగలవాడు).

  1. సర్వనియంతా జీవ విలక్షణో అసంసారీ -

(అన్నింటినీ నియమించువాడు, జీవునికంటె వేరైనవాడు; సంసారము లేనివాడు - జననమరణ రూపమైన సంసారము లేనివాడు).

  1. నిరతిశయ సుఖదాన సమర్థః (అన్నింటికంటె మించినసుఖమును ఇచ్చుటలో సమర్థుడైనవాడు).

  2. ఐశ్వర్యదానాత్ ఈశ్వరః. (ఐశ్వర్యమునిచ్చువాడు కనుక ఈశ్వరుడు).

  3. పరమార్థ దృష్ట్యా స్వాన శేషేణ అవస్థాతుం ఈష్టే స ఈశః |.

(పరమార్థదృష్టిలో ప్రపంచమంతయు లయమైనపుడు తానొకడే మిగిలియుండువాడు).

  1. అశనాయా పిపాస శోకమోహ జరామృత్యు వ్యతీతః సర్వస్య జగతః ఈశ్వరః.

(ఆకలి దప్పులు, శోకమోహములు, ముసలితనము, మృత్యువు - వీటి అన్నింటికీ అతీతమైనవాడు - ఇవిలేనివాడు).

  1. యో యజ్ఞై రఖిలై రీశః యోగా ద్యైశ్చ సమర్చ్యతే |

యమాహురీశ్వరం దేవం సదేవః స్యాత్ పినాకదృత్ | (బ్రహ్మాండపురాణే)

(ఎవడు యజ్ఞములచేత, యోగములచేత ఈశ్వరుడని ఆరాధించబడుచున్నాడో అతనే పినాకపాణి అయిన ఈశ్వరుడు).

  1. క. “ఆ యీశుడనంతుడు హరి

నాయకుడీ భువనమునకు నాకున్ నీకున్

మాయకు బ్రాణివ్రాతము

కే యేదలన్లేదు యీశ్వరేతరము సుతా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 85)

  1. “ఈశస్యహివశే లోకో యోషా దారుమయీ యథా” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 1 - 7)

  2. “తమయం మన్యతే లోకోహ్యసంగమపి సంగినం |

ఆత్మాపమ్యేన మనుజం వ్యామ్నవానం యతో(అ)బుధః |

ఏత దీశనమీశస్య ప్రకృతి స్థోపి తద్గుణైః |

మయుజ్యతే సదాత్మస్థైర్యథా బుద్ధిస్తదాశ్రయా ||“. (శ్రీమద్భాగవతం - 1 - 11 - 37, 38)

(అజ్ఞానులైనవారు అసంగుడైన భగవంతుని వారివలనే మానవునివలనే సంసారమందు సంగముకలవానిగ తలెంచెదరు. ప్రకృతిలో కలిసి అందఱివలె తిరుగుచున్నప్పటికీ ఆ ప్రకృతి గుణములు తనని అంటవు - ఇదియే ఆ ఈశునియొక్క ఈశనము - ఈశ్వరత్వము).

  1. “ఈశావాస్యమిదం సర్వం” (ఈశావాశ్యోపనిషత్)

(ఈ ప్రపంచమంతయు ఈశ్వరునిచే ఆవేశింపబడియున్నది - ఈ ప్రపంచమంతటిను ఈశ్వరుడు వ్యాపించియున్నాడు).

  1. “ఈశాస్తీతి ఈశః” - “ఈకారేణోచ్యతే రమా” -

(ఈ అనగా లక్ష్మీదేవి - లక్ష్మీదేవికలవాడు ఈశుడు - లక్ష్మీదేవిని నియమించువాడు).

Transliteration
  1. īśvaraḥ (īśvaruḍu, śivuḍu, prabhuvu, adhipati).

  2. niyaṃtā, sarvaniyaṃtṛtvāt īśaḥ -

(niyamiṃcuvāḍu, anniṃṭilōpalanuṃḍi anniṃṭini vāṭi panulalō niyamiṃcuvāḍu - lōpala bhagavaṃtuni śaktilēnidī evarū ē paniyu cēyalēru).

  1. sarvaṃ īśatē īśanībhiḥ māyāśaktibhiḥ - māyāvī.

(tana māyāśakticēta aṃdaṟinī, anniṃṭinī niyamiṃcuvāḍu - māyāvi - māyagalavāḍu).

  1. sarvaniyaṃtā jīva vilakṣaṇō asaṃsārī -

(anniṃṭinī niyamiṃcuvāḍu, jīvunikaṃṭe vērainavāḍu; saṃsāramu lēnivāḍu - jananamaraṇa rūpamaina saṃsāramu lēnivāḍu).

  1. niratiśaya sukhadāna samarthaḥ (anniṃṭikaṃṭe miṃcinasukhamunu iccuṭalō samarthuḍainavāḍu).

  2. aiśvaryadānāt īśvaraḥ. (aiśvaryamuniccuvāḍu kanuka īśvaruḍu).

  3. paramārtha dṛṣṭyā svāna śēṣēṇa avasthātuṃ īṣṭē sa īśaḥ |.

(paramārthadṛṣṭilō prapaṃcamaṃtayu layamainapuḍu tānokaḍē migiliyuṃḍuvāḍu).

  1. aśanāyā pipāsa śōkamōha jarāmṛtyu vyatītaḥ sarvasya jagataḥ īśvaraḥ.

(ākali dappulu, śōkamōhamulu, musalitanamu, mṛtyuvu - vīṭi anniṃṭikī atītamainavāḍu - ivilēnivāḍu).

  1. yō yajñai rakhilai rīśaḥ yōgā dyaiśca samarcyatē |

yamāhurīśvaraṃ dēvaṃ sadēvaḥ syāt pinākadṛt | (brahmāṃḍapurāṇē)

(evaḍu yajñamulacēta, yōgamulacēta īśvaruḍani ārādhiṃcabaḍucunnāḍō atanē pinākapāṇi ayina īśvaruḍu).

  1. ka. “ā yīśuḍanaṃtuḍu hari

nāyakuḍī bhuvanamunaku nākun nīkun

māyaku brāṇivrātamu

kē yēdalanlēdu yīśvarētaramu sutā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 85)

  1. “īśasyahivaśē lōkō yōṣā dārumayī yathā” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 1 - 7)

  2. “tamayaṃ manyatē lōkōhyasaṃgamapi saṃginaṃ |

ātmāpamyēna manujaṃ vyāmnavānaṃ yatō(a)budhaḥ |

ēta dīśanamīśasya prakṛti sthōpi tadguṇaiḥ |

mayujyatē sadātmasthairyathā buddhistadāśrayā ||“. (śrīmadbhāgavataṃ - 1 - 11 - 37, 38)

(ajñānulainavāru asaṃguḍaina bhagavaṃtuni vārivalanē mānavunivalanē saṃsāramaṃdu saṃgamukalavāniga taleṃcedaru. prakṛtilō kalisi aṃdaṟivale tirugucunnappaṭikī ā prakṛti guṇamulu tanani aṃṭavu - idiyē ā īśuniyokka īśanamu - īśvaratvamu).

  1. “īśāvāsyamidaṃ sarvaṃ” (īśāvāśyōpaniṣat)

(ī prapaṃcamaṃtayu īśvarunicē āvēśiṃpabaḍiyunnadi - ī prapaṃcamaṃtaṭinu īśvaruḍu vyāpiṃciyunnāḍu).

  1. “īśāstīti īśaḥ” - “īkārēṇōcyatē ramā” -

(ī anagā lakṣmīdēvi - lakṣmīdēvikalavāḍu īśuḍu - lakṣmīdēvini niyamiṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.