సర్వశక్తిమాన్.
(సర్వశక్తులు కలిగియున్నందున ఈశ్వరుడు).
నిఖిలజగన్నియంతా, నిఖిలజగన్నియామకః. (జగత్తు అంతను నియమించువాడు).
ఆత్మానాం జీవానాం కర్మానుసారేణ ఫలదానాత్ ఈశ్వరః - ఆత్మానాం జీవానాం నియమకత్వాత్ ఈశ్వరః.
(సమస్త జీవులకు వారివారి కర్మలననుసరించి ఫలమునిచ్చువాడు - వాటిని నియమించువాడు).
ఈశనశీలః. (అన్నింటిని నియమించు స్వభావముకలవాడు)
ఈశ్వరశీలానాం బ్రహ్మదీనాం ఉత్పత్తి, మరణ దర్శనేన విరోధా భావాత్ ఈశ్వరః.
(నియమించు స్వభావము చతుర్ముఖబ్రహ్మ మొదలగు వారికికూడా జననమరణములు కలిగించువాడు).
“శ్లో||. ఈశేభ్యో బ్రహ్మ రుద్రశ్రీ శేషాదిభ్యో యతో భవాన్ |
ఇతి బ్రహ్మ వైవర్తికే.
(చతుర్ముఖబ్రహ్మ, రుద్రుడు, లక్ష్మి, శేషుడు మొదలగు ఈశానశీలురుకన్న, నీవి అధికుడవు, కనుక నీవు ఈశ్వరుడవు).
(సమర్థుడైనవాడి ఈశుడు అని చెప్పబడును. అట్టివారిలో నీవు శ్రేష్టుడవు - ఈశ + వరుడు = ఈశ్వరుడు. ఈశులలో మిక్కిలి సమర్ధుడవు)
(ఇతరులనుండి అపేక్షించని ఐశ్వర్యముగలవాడు - స్వతంత్త్రైశ్వర్యము కలవాడు).
(పరిమితిలేని ఐశ్వర్యముగలవాడు - లెక్కలేనన్ని రూపములుగా తానే అగువాడు - అట్టి శక్తి గలవాడు).
(లేనిదానిని చేయుటకు, చేయకుండుటకు, ఒకరీతిని చేసినదానిని ఇంకొకరీతిగా చేయుటకు సామర్థ్యముగలవాడు నిగ్రహానుగ్రహ సమర్థుడు - కప్ప విప్ప సమర్ధుడు).
(ప్రతివస్తువులోను ప్రవేశించి వాటిని వాటి వాటి పనులలో ప్రవర్తింపచేయుటచే ప్రభువు అయినవాడు).
(ప్రకృతి యనుపేరున చెప్పబడుచున్న తన స్వశక్తిని ఆశ్రయించి లోకములను సృష్టించి అందులోని ప్రతి వస్తువులోను అంతర్యామిగాప్రవేశించి బ్రహ్మ మొదలగువారి బుద్ధిని, ఇంద్రియములను నియమించుటవలన ఈశ్వరుడు).
దదామిచ సదైశ్వర్య మీశ్వస్తేన కీర్తితః ||“.
(అన్నింటిని నేనే నియమించువాడను, నన్ను నియమించివాడు లేడు - ఎల్లపుడు నేను ఐశ్వర్యము నిచ్చెదను. అందుచేత ఈశ్వరుడని చెప్పబడుచున్నాను).
ఈశ్వరః ||“. (పతంజలి యోగసూత్రములు - 1 - 24)
(క్లేశములచేగాని, కర్మలచేగాని, కర్మఫలముచేగాని, ఆశయములచేగాని సంబంధములేనివాడు).
య ఈష్టే, సర్వైశ్వర్యవాన్. (సర్వశక్తిమంతుడు, అనంతజ్ఞానసంపన్నుడు).
“జ్ఞానైశ్వర్య శక్తిః బల వీర్య తేజోభిః ఐశ్వర్యైః ధర్మైః అన్వితః.”
(జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి, బలము, వీర్యము, తేజస్సు, అను ఆరువిధములగు ధర్మములు లేక, ఐశ్వర్యములుగలవాడు భగవంతుడు - అతనే ఈశ్వరుడు).
(జ్ఞానైశ్వర్యయోః శక్తిః అంతరం సామర్థ్యం, బలం శరీరసామర్థ్యం, వీర్యం శౌర్యం, తేజః ప్రాగల్భ్యం).
“ఇంద్రియ నిరపనుండును, గుణసంగ విర్క్తుండు నైనవాడే ఈశ్వరుండు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 109)
“క. పరబ్రహ్మమనంగా
బరతత్వమనంగ, పరమపదమనగను, నీ
శ్వరుండన, గృష్ణుడన, జగ
ద్భరితుడు నారాయణుండు దా వెలుగొందున్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 51)
(కార్యమైన శరీరము ఉపాధిగాగలవాడు జీవుడు. కారణమైన ప్రకృతి లేక మాయ ఉపాధిగాగలవాడు ఈశ్వరుడు. ఈ రెండునూ ఒకటే, ఒకే భగవంతుడైనప్పటికీ ప్రకృతినధిష్టించి యున్నపుడు పరమాత్మ ఈశ్వరడనబడుచున్నాడు. ప్రకృతియొక్క పరిణామ కార్యములతో కూడిన శరీరమునధిష్టించి యున్నపుడు జీవుడనబడుచున్నాడు. ఒకే భగవంతుడు ఉపాధిభేదమువలన ఈశ్వరుడని జీవుడని వేరువేరుగా చెప్పబడుచున్నాడు. గాని ఈ రెండింటికి పరమార్థదృష్టిలో భేదములేదు).
(మాయలో ప్రతిబింబించిన భగవంతునియొక్క - మాయను అధిష్టించియున్న భగవంతునియొక్క శక్తి, ఈ రెండుకలసి ఈశ్వరుడని చెప్పబడుచున్నది. ఈ ఈశ్వరుడే అంతర్యామి యని చెప్పబడుచున్నాడు. నిత్యముక్తుడు, సర్వజ్ఞుడు, శుద్ధసత్వుడు అయినవాడు ఈశ్వరుడు).
(రజస్తమోగుణములతో కలియని శుద్ధసత్వగుణముగల మాయయున్నూ, మాయను అధిష్టించియున్న చైతన్యము న్నూ మాయలో ప్రతిబింబించిన చైతన్య భాసమున్నూ - ఈ మూడు కలిసి ఈశ్వరుడని చెప్పబడుచున్నాడు, ఈ ఈశ్వరుడు సర్వజ్ఞుడు. ఇతనే జగత్తునకు కారణమైనవాడు - ఉపాదానకారణము, నిమిత్తకారణము కూడ ఈశ్వరుడే). (లేనిది ఉన్నట్లుచూచుట ఆభాసము).
(మోహమును కలుగచేయునదిన్నీ, భగవంతుడు ఆశ్రయించియుండునదిన్నీ, శుద్ధ సత్వగుణము ప్రధానముగా గలిగియున్న మాయయందు పరమాత్మయొక్క ప్రతిబింబము ఈశ్వరుడని చెప్పబడుచున్నది)
(సనస్త భూతములకు ఈశ్వరుడైనవాడు).
ఈశతే భగవాన్ ఏకః సత్యమేతత్ బ్రవీమితా ||“.
(కాలమును మృత్యువును, చరాచర ప్రపంచమును శాసించువాడు - ఈశ్వరుడైనవాడు - భగవంతుడొక్కడే).
(బ్రహ్మాండములన్నింటికి ఈశ్వరుడైనవాడు ఒక్కడే).
(సమస్త భూతముల హృదయములో ఈశ్వరుడున్నాడు).
మనసశ్చా స్యహంకారో హ్యహంకారాన్ మహాన్ పరః |
మహతః పరమ వ్యక్తమవ్యక్తాత్పురుషః పరః |
పురుషాత్ భగవాన్ ప్రాణస్తస్య సర్వమిదం జగత్ |
ప్రాణాత్ పరతరం వ్యోమః వ్యోమాతీతో (అ)హమీశ్వరః |
నాస్తిమత్తః పరంభూతం మాం విజ్ఞాయ విముచ్యతే ||“.
(విద్వాంసులు - తత్వజ్ఞులు - ఈ ప్రకారముగా చెప్పుచున్నారు - ఇంద్రియములకన్న మనస్సు ఉత్కృష్టమైనది, మనస్సుకంటె అహంకారము, అహంకారముకంటె మహత్తత్త్వము, మహత్తత్త్వముకంటె అవ్యక్తము, అవ్యక్తముకంటె పురుషుడు ఉత్కృష్టము - పురుషునికన్న భగవంతుడైన ప్రాణము, ప్రాణముకంటె ఆకాశము, ఆకాశముకంటె ఈశ్వరుడైననేను ఉత్కృష్టమైనవాడను - నాకంటె ఉత్కృష్టమైనదిలేదు. ఇట్లు నన్ను తెలుసుకొనిన ముక్తుడగును).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 13 - 288)
“సహస్తాది తూపంబైన విశ్వమంతయు నీశ్వరుండుగా తెలియుము. అతనికి వేఱులేదు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 17 - 288)
“నిర్విశేషమగు బ్రహ్మమే తన్నెఱుంగని మూఢులచేత తనయందున్నట్లు కల్పింపబడిన మూలప్రకృతియను పేరుగల స్వశక్తినాశ్రయించి, ఈశ్వరత్వము నొంది, తన్నెఱుగనివారిచేత తనకంటె వేరుగానున్నట్లు చూడబడునది యగు లోకములను సృజించి, అనంతకోటి బ్రహ్మాండరూపములను ఆ లోకములందు తావే అంతర్యామిగా ప్రవేశించి బ్రహ్మ దేవుడు మొదలు గడ్డిపోచవరకుగల జీవుల బుద్ధీంద్రియములకు నియంతయగుటవలన ఈశ్వరుడగుచున్నాడు).
sarvaśaktimān.
(sarvaśaktulu kaligiyunnaṃduna īśvaruḍu).
nikhilajaganniyaṃtā, nikhilajaganniyāmakaḥ. (jagattu aṃtanu niyamiṃcuvāḍu).
ātmānāṃ jīvānāṃ karmānusārēṇa phaladānāt īśvaraḥ - ātmānāṃ jīvānāṃ niyamakatvāt īśvaraḥ.
(samasta jīvulaku vārivāri karmalananusariṃci phalamuniccuvāḍu - vāṭini niyamiṃcuvāḍu).
īśanaśīlaḥ. (anniṃṭini niyamiṃcu svabhāvamukalavāḍu)
īśvaraśīlānāṃ brahmadīnāṃ utpatti, maraṇa darśanēna virōdhā bhāvāt īśvaraḥ.
(niyamiṃcu svabhāvamu caturmukhabrahma modalagu vārikikūḍā jananamaraṇamulu kaligiṃcuvāḍu).
“ślō||. īśēbhyō brahma rudraśrī śēṣādibhyō yatō bhavān |
iti brahma vaivartikē.
(caturmukhabrahma, rudruḍu, lakṣmi, śēṣuḍu modalagu īśānaśīlurukanna, nīvi adhikuḍavu, kanuka nīvu īśvaruḍavu).
(samarthuḍainavāḍi īśuḍu ani ceppabaḍunu. aṭṭivārilō nīvu śrēṣṭuḍavu - īśa + varuḍu = īśvaruḍu. īśulalō mikkili samardhuḍavu)
(itarulanuṃḍi apēkṣiṃcani aiśvaryamugalavāḍu - svataṃttraiśvaryamu kalavāḍu).
(parimitilēni aiśvaryamugalavāḍu - lekkalēnanni rūpamulugā tānē aguvāḍu - aṭṭi śakti galavāḍu).
(lēnidānini cēyuṭaku, cēyakuṃḍuṭaku, okarītini cēsinadānini iṃkokarītigā cēyuṭaku sāmarthyamugalavāḍu nigrahānugraha samarthuḍu - kappa vippa samardhuḍu).
(prativastuvulōnu pravēśiṃci vāṭini vāṭi vāṭi panulalō pravartiṃpacēyuṭacē prabhuvu ayinavāḍu).
(prakṛti yanupēruna ceppabaḍucunna tana svaśaktini āśrayiṃci lōkamulanu sṛṣṭiṃci aṃdulōni prati vastuvulōnu aṃtaryāmigāpravēśiṃci brahma modalaguvāri buddhini, iṃdriyamulanu niyamiṃcuṭavalana īśvaruḍu).
dadāmica sadaiśvarya mīśvastēna kīrtitaḥ ||“.
(anniṃṭini nēnē niyamiṃcuvāḍanu, nannu niyamiṃcivāḍu lēḍu - ellapuḍu nēnu aiśvaryamu niccedanu. aṃducēta īśvaruḍani ceppabaḍucunnānu).
īśvaraḥ ||“. (pataṃjali yōgasūtramulu - 1 - 24)
(klēśamulacēgāni, karmalacēgāni, karmaphalamucēgāni, āśayamulacēgāni saṃbaṃdhamulēnivāḍu).
ya īṣṭē, sarvaiśvaryavān. (sarvaśaktimaṃtuḍu, anaṃtajñānasaṃpannuḍu).
“jñānaiśvarya śaktiḥ bala vīrya tējōbhiḥ aiśvaryaiḥ dharmaiḥ anvitaḥ.”
(jñānamu, aiśvaryamu, śakti, balamu, vīryamu, tējassu, anu āruvidhamulagu dharmamulu lēka, aiśvaryamulugalavāḍu bhagavaṃtuḍu - atanē īśvaruḍu).
(jñānaiśvaryayōḥ śaktiḥ aṃtaraṃ sāmarthyaṃ, balaṃ śarīrasāmarthyaṃ, vīryaṃ śauryaṃ, tējaḥ prāgalbhyaṃ).
“iṃdriya nirapanuṃḍunu, guṇasaṃga virktuṃḍu nainavāḍē īśvaruṃḍu” (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 109)
“ka. parabrahmamanaṃgā
baratatvamanaṃga, paramapadamanaganu, nī
śvaruṃḍana, gṛṣṇuḍana, jaga
dbharituḍu nārāyaṇuṃḍu dā velugoṃdun “. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 51)
(kāryamaina śarīramu upādhigāgalavāḍu jīvuḍu. kāraṇamaina prakṛti lēka māya upādhigāgalavāḍu īśvaruḍu. ī reṃḍunū okaṭē, okē bhagavaṃtuḍainappaṭikī prakṛtinadhiṣṭiṃci yunnapuḍu paramātma īśvaraḍanabaḍucunnāḍu. prakṛtiyokka pariṇāma kāryamulatō kūḍina śarīramunadhiṣṭiṃci yunnapuḍu jīvuḍanabaḍucunnāḍu. okē bhagavaṃtuḍu upādhibhēdamuvalana īśvaruḍani jīvuḍani vēruvērugā ceppabaḍucunnāḍu. gāni ī reṃḍiṃṭiki paramārthadṛṣṭilō bhēdamulēdu).
(māyalō pratibiṃbiṃcina bhagavaṃtuniyokka - māyanu adhiṣṭiṃciyunna bhagavaṃtuniyokka śakti, ī reṃḍukalasi īśvaruḍani ceppabaḍucunnadi. ī īśvaruḍē aṃtaryāmi yani ceppabaḍucunnāḍu. nityamuktuḍu, sarvajñuḍu, śuddhasatvuḍu ayinavāḍu īśvaruḍu).
(rajastamōguṇamulatō kaliyani śuddhasatvaguṇamugala māyayunnū, māyanu adhiṣṭiṃciyunna caitanyamu nnū māyalō pratibiṃbiṃcina caitanya bhāsamunnū - ī mūḍu kalisi īśvaruḍani ceppabaḍucunnāḍu, ī īśvaruḍu sarvajñuḍu. itanē jagattunaku kāraṇamainavāḍu - upādānakāraṇamu, nimittakāraṇamu kūḍa īśvaruḍē). (lēnidi unnaṭlucūcuṭa ābhāsamu).
(mōhamunu kalugacēyunadinnī, bhagavaṃtuḍu āśrayiṃciyuṃḍunadinnī, śuddha satvaguṇamu pradhānamugā galigiyunna māyayaṃdu paramātmayokka pratibiṃbamu īśvaruḍani ceppabaḍucunnadi)
(sanasta bhūtamulaku īśvaruḍainavāḍu).
īśatē bhagavān ēkaḥ satyamētat bravīmitā ||“.
(kālamunu mṛtyuvunu, carācara prapaṃcamunu śāsiṃcuvāḍu - īśvaruḍainavāḍu - bhagavaṃtuḍokkaḍē).
(brahmāṃḍamulanniṃṭiki īśvaruḍainavāḍu okkaḍē).
(samasta bhūtamula hṛdayamulō īśvaruḍunnāḍu).
manasaścā syahaṃkārō hyahaṃkārān mahān paraḥ |
mahataḥ parama vyaktamavyaktātpuruṣaḥ paraḥ |
puruṣāt bhagavān prāṇastasya sarvamidaṃ jagat |
prāṇāt parataraṃ vyōmaḥ vyōmātītō (a)hamīśvaraḥ |
nāstimattaḥ paraṃbhūtaṃ māṃ vijñāya vimucyatē ||“.
(vidvāṃsulu - tatvajñulu - ī prakāramugā ceppucunnāru - iṃdriyamulakanna manassu utkṛṣṭamainadi, manassukaṃṭe ahaṃkāramu, ahaṃkāramukaṃṭe mahattattvamu, mahattattvamukaṃṭe avyaktamu, avyaktamukaṃṭe puruṣuḍu utkṛṣṭamu - puruṣunikanna bhagavaṃtuḍaina prāṇamu, prāṇamukaṃṭe ākāśamu, ākāśamukaṃṭe īśvaruḍainanēnu utkṛṣṭamainavāḍanu - nākaṃṭe utkṛṣṭamainadilēdu. iṭlu nannu telusukonina muktuḍagunu).
(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 13 - 288)
“sahastādi tūpaṃbaina viśvamaṃtayu nīśvaruṃḍugā teliyumu. ataniki vēṟulēdu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 17 - 288)
“nirviśēṣamagu brahmamē tanneṟuṃgani mūḍhulacēta tanayaṃdunnaṭlu kalpiṃpabaḍina mūlaprakṛtiyanu pērugala svaśaktināśrayiṃci, īśvaratvamu noṃdi, tanneṟuganivāricēta tanakaṃṭe vērugānunnaṭlu cūḍabaḍunadi yagu lōkamulanu sṛjiṃci, anaṃtakōṭi brahmāṃḍarūpamulanu ā lōkamulaṃdu tāvē aṃtaryāmigā pravēśiṃci brahma dēvuḍu modalu gaḍḍipōcavarakugala jīvula buddhīṃdriyamulaku niyaṃtayaguṭavalana īśvaruḍagucunnāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.