ఈశ్వరస్య రూపంతు బహుధా అనేకైర్వర్ణ్యతే - తథాహి :-
సచ ఈశ్వరః క్లేశకర్మ తత్ఫాలదిభిః అసం సృష్టో జీవవత్ అసంగః, చిన్మాత్రః. జీవస్యాపి క్లేశాద్య భావేప్యవివేకవశాత్ తత్సత్వం ప్రతీయతే. అయమేవ జీవేశ్వరయోః భేదహేతుః.
న్యాయమతానుసారిణః తు - అసంగస్య ఈశ్వరస్య నియామకత్వా సంభవాత్ యోగమతమాక్షిప్య ఈశ్వరస్య జ్ఞానేచ్ఛా ప్రయత్నాది గిణాః నిత్యాః, అతః జీవాద్విలక్షణో భిన్నశ్చ ఈశ్వరః ఇత్యాహుః -
హిరణ్యగర్భో పాసకాస్తు :- ఈశ్వర జ్ఞానాదీనాం నిత్యత్వే “సో అకామ యత” ఇత్యాది శుతి వాక్యాదీనాం సృష్ట్యారంభసమయే ఈశ్వరజ్ఞానాదీనాం ఉత్పత్తి ప్రతిపాదకానాం విరోధః స్యాత్, న దా షష్టి ప్రసంగశ్చ స్యాత్. అతః అసంగతం న్యాయమతం. హిరణ్యగర్భః ఏవ ఈశ్వరః అన్య లింగశరీర సత్వే ప్యవిద్యాకామ కర్మాద్య భావాత్. జీవవిలక్షణః సః ఇత్యాచ క్షతే.
విరాడుపాసకాస్తు :- వినా స్థూలదేహం లింగదేహమాత్యస్య కుత్రాప్యనుభూతత్వాత్ విరా ట్పురుషః ఏవ ఈశ్వరః ఇత్యాహుః.
ప్రజావత్యుపాసకాస్తు :- ప్రజాకామాః నంతః పాణి పారాదియుక్త ప్రాకృత శరీరవతః ఈశ్వరత్వే క్రిమ్యాదేరపి ఈశ్వరత్వ ప్రసంగాత్ హిరణ్యగర్భోపాసకమతం అసంగతం, తథా విరాడుపాసకమతమపి అసంగతం, కింతు చతుర్ముఖో బ్రహ్మ ఏవ ఈశ్వరః ఇతి ప్రాహుః -
వైష్ణవాస్తు - విష్ణోర్నాభి కమలోత్పన్నాత్ విష్ణురేవ ఈశ్వరః ఇతి కధయంతి.
శైవాస్తు :- శివస్య పదాన్వేషణే అశక్త త్వాత్ విష్ణోః శివ ఏవ ఈశ్వరః ఇతి వదంతి.
గణపత్యుపాసకాస్తు :- త్రిపురాసర జయార్థం - ఈశ్వరేణాప్యుపాసితః గణపతిరేవ ఈశ్వరః ఇతి మన్యంతే.
భైరవమైరా లాద్యుపాపకాస్తు :- మారణోచ్చాటన వశీకరణ స్తంభనాది సిద్ధి హేతు భూత భైరవాది మంత్రాన్ తత్తత్ స్తోత్రాణి, తద్భవన తర్పణ పురశ్చరణాది ప్రతిపాదక తంత్ర గ్రంధాంశ్చ ప్రమాణీ కృత్య భైరవాది దేవతా ఈశ్వరత్వేన వర్ణయంతి.
“ఇత్థం అనంతమతాని స్వస్వ మతివిలసితాని పరస్పర విలక్షణాని, అన్యోన్య విరుద్ధాని చ ఉపలభ్యంతే”.
(ఈశ్వరుని స్వరూపము అనేకమతములవారిచే వేరువేరుగా వర్ణింపబడినది, ఎట్లనగా :-
యోగమతముననుసరించు వారీప్రకారముగా చెప్పుచున్నారు _ ప్రకృతి సమీపమందున్న, ప్రకృతితో కలిసియున్న - ప్రకృతిని ప్రేరేపించు పురుషుడు జీవునికన్న వేరులక్షణములుకలవాడు ఈశ్వరుడు - ఇట్టి ఈశ్వరుడు జీవునివలె క్లేశకర్మలతోను, వాటిఫలములతోను సంబంధము లేనివాడు, చిన్మాత్రుడు. జీవునకుకూడా క్లేశములు మొదలగునవి లేనప్పటికీ అజ్ఞానము కలిగియుండును - ఇదియే జీవేశ్వరుల భేదమునకు కారణము -
న్యాయమతమువారి అభిప్రాయము :- ఈశ్వరుడు అసంగుడు - దేనితోను సంబంధములేనివాడు -. కనుక నియమించుట మొదలగునవి చేయుట సంభవింపవు; కనుక పైన చెప్పిన యోగమతము ఆక్షేపణీయము - ఈశ్వరునికి సర్వజ్ఞత్వము, సృష్టిచేయుకోరిక, ప్రయత్నములు మొదలగు గుణములు నిత్యములు. అందుచేత జీవునికంటె వేరగు లక్షణములు కలవాడు ఈశ్వరుడు.
హిరణ్యగర్భోపాసకుల అభిప్రాయము :- ఈశ్వరుని యొక్క సర్వజ్ఞత్వము మొదలగు గుణములు నిత్యములైన యడల, సృష్టి ప్రారంభమందు “స అకామ య త” (అతను కోరెను - సృష్టి చేయుదును, నేనే అన్నివస్తువులుగా మారెదను) అని కోరిక మొదలగు వాక్యములు ఈశ్వరుని సర్వజ్ఞత్వమునకు, సృష్టించుట మొదలగు వాక్యములకు విరోధముకలుగును - అందుచేత పైన చెప్పిన న్యాయమతము కుదరదు - హిరణ్యగర్భుడే ఈశ్వరుడు. హిరణ్యగర్భునికి సూక్ష్మశరీరమందు అవిద్యకు సంబంధించిన కామకర్మలు మొదలగునవి లేకుండుట జీవుని కన్న వేరు లక్షణములు కలవాడు.
విరాడుపాసకుల అభిప్రాయము ఈ విధముగానున్నది :- స్థూలదేహము లేకుండగనే, లింగదేహముండుట మాత్రముచేతనే కలిగియుండుటచేత విరాట్పురుషుడే ఈశ్వరుడు.
ప్రజాపతిని ఉపాసించువారిమతము ఈ విధముగానున్నది:-
(సంతానకోరికగలవారై చేతులు, కాళ్ళు మొదలగునవి కలిగియున్న శరీరముగలవారు, క్రిములు మొదలగువాటివలె ఈశ్వరుడనుటకు అవకాశము కలిగియుండుటచేత విరాడుపాసకుల మతము సంగతముకాదు - చతుర్ముఖ బ్రహ్మమే ఈశ్వరుడు).
వైష్ణవమతమువారి అభిప్రాయము :- విష్ణువుయొక్క బొడ్డులోనుండి చతుర్ముఖబ్రహ్మ పుట్టినందున, చతుర్ముఖ బ్రహ్మ పుట్టుటకు కారణమగుటచేత విష్ణువే ఈశ్వరుడు.
శైవమతస్థుల అభిప్రాయము :- లింగరూపములో ఆవిర్భవించిన శివునియొక్క పాదము - లింగముయొక్క అడుగుభాగము - ఎక్కడనున్నదో అని అన్వేషించి విష్ణువు కనుగొనలేకపోవుటచేత శివుడే ఈశ్వరుడు.
గనపత్యుపాసకుల మతము :- త్రిపురాసుర సమ్హారము చేయుటకు శివుడు గణపతి నుపాసించెను; కనుక గణపతియే ఈశ్వరుడు.
భైరవ ఉపాసకులమతము :- మారణోచ్ఛాటనము వశీకరణము, స్తంభనము, మొదలగు సిద్ధులు కలిగియుండు కారణముగానుండు భైరవాదిమంత్రములను, వాటికి సంబంధించిన స్తోత్రములను, యజ్ఞము, తర్పణము, పురశ్చరణము మొదలగువాటిని ప్రతిపాదించు గ్రంధములను ప్రమాణముగా తెసుకొని భైరవుడు మొదలగు దేవతలే ఈశ్వరుడు.
(పైన చెప్పినప్రకారము వారివారి మనసునకు తోచినవి, నచ్చినవి, ఒకటికొకటి విరుద్ధమైనవి, వేరు వేరు లక్షణములు గలవి అనంతములుగా మతములున్నవి).
īśvarasya rūpaṃtu bahudhā anēkairvarṇyatē - tathāhi :-
saca īśvaraḥ klēśakarma tatphāladibhiḥ asaṃ sṛṣṭō jīvavat asaṃgaḥ, cinmātraḥ. jīvasyāpi klēśādya bhāvēpyavivēkavaśāt tatsatvaṃ pratīyatē. ayamēva jīvēśvarayōḥ bhēdahētuḥ.
nyāyamatānusāriṇaḥ tu - asaṃgasya īśvarasya niyāmakatvā saṃbhavāt yōgamatamākṣipya īśvarasya jñānēcchā prayatnādi giṇāḥ nityāḥ, ataḥ jīvādvilakṣaṇō bhinnaśca īśvaraḥ ityāhuḥ -
hiraṇyagarbhō pāsakāstu :- īśvara jñānādīnāṃ nityatvē “sō akāma yata” ityādi śuti vākyādīnāṃ sṛṣṭyāraṃbhasamayē īśvarajñānādīnāṃ utpatti pratipādakānāṃ virōdhaḥ syāt, na dā ṣaṣṭi prasaṃgaśca syāt. ataḥ asaṃgataṃ nyāyamataṃ. hiraṇyagarbhaḥ ēva īśvaraḥ anya liṃgaśarīra satvē pyavidyākāma karmādya bhāvāt. jīvavilakṣaṇaḥ saḥ ityāca kṣatē.
virāḍupāsakāstu :- vinā sthūladēhaṃ liṃgadēhamātyasya kutrāpyanubhūtatvāt virā ṭpuruṣaḥ ēva īśvaraḥ ityāhuḥ.
prajāvatyupāsakāstu :- prajākāmāḥ naṃtaḥ pāṇi pārādiyukta prākṛta śarīravataḥ īśvaratvē krimyādērapi īśvaratva prasaṃgāt hiraṇyagarbhōpāsakamataṃ asaṃgataṃ, tathā virāḍupāsakamatamapi asaṃgataṃ, kiṃtu caturmukhō brahma ēva īśvaraḥ iti prāhuḥ -
vaiṣṇavāstu - viṣṇōrnābhi kamalōtpannāt viṣṇurēva īśvaraḥ iti kadhayaṃti.
śaivāstu :- śivasya padānvēṣaṇē aśakta tvāt viṣṇōḥ śiva ēva īśvaraḥ iti vadaṃti.
gaṇapatyupāsakāstu :- tripurāsara jayārthaṃ - īśvarēṇāpyupāsitaḥ gaṇapatirēva īśvaraḥ iti manyaṃtē.
bhairavamairā lādyupāpakāstu :- māraṇōccāṭana vaśīkaraṇa staṃbhanādi siddhi hētu bhūta bhairavādi maṃtrān tattat stōtrāṇi, tadbhavana tarpaṇa puraścaraṇādi pratipādaka taṃtra graṃdhāṃśca pramāṇī kṛtya bhairavādi dēvatā īśvaratvēna varṇayaṃti.
“itthaṃ anaṃtamatāni svasva mativilasitāni paraspara vilakṣaṇāni, anyōnya viruddhāni ca upalabhyaṃtē”.
(īśvaruni svarūpamu anēkamatamulavāricē vēruvērugā varṇiṃpabaḍinadi, eṭlanagā :-
yōgamatamunanusariṃcu vārīprakāramugā ceppucunnāru _ prakṛti samīpamaṃdunna, prakṛtitō kalisiyunna - prakṛtini prērēpiṃcu puruṣuḍu jīvunikanna vērulakṣaṇamulukalavāḍu īśvaruḍu - iṭṭi īśvaruḍu jīvunivale klēśakarmalatōnu, vāṭiphalamulatōnu saṃbaṃdhamu lēnivāḍu, cinmātruḍu. jīvunakukūḍā klēśamulu modalagunavi lēnappaṭikī ajñānamu kaligiyuṃḍunu - idiyē jīvēśvarula bhēdamunaku kāraṇamu -
nyāyamatamuvāri abhiprāyamu :- īśvaruḍu asaṃguḍu - dēnitōnu saṃbaṃdhamulēnivāḍu -. kanuka niyamiṃcuṭa modalagunavi cēyuṭa saṃbhaviṃpavu; kanuka paina ceppina yōgamatamu ākṣēpaṇīyamu - īśvaruniki sarvajñatvamu, sṛṣṭicēyukōrika, prayatnamulu modalagu guṇamulu nityamulu. aṃducēta jīvunikaṃṭe vēragu lakṣaṇamulu kalavāḍu īśvaruḍu.
hiraṇyagarbhōpāsakula abhiprāyamu :- īśvaruni yokka sarvajñatvamu modalagu guṇamulu nityamulaina yaḍala, sṛṣṭi prāraṃbhamaṃdu “sa akāma ya ta” (atanu kōrenu - sṛṣṭi cēyudunu, nēnē annivastuvulugā māredanu) ani kōrika modalagu vākyamulu īśvaruni sarvajñatvamunaku, sṛṣṭiṃcuṭa modalagu vākyamulaku virōdhamukalugunu - aṃducēta paina ceppina nyāyamatamu kudaradu - hiraṇyagarbhuḍē īśvaruḍu. hiraṇyagarbhuniki sūkṣmaśarīramaṃdu avidyaku saṃbaṃdhiṃcina kāmakarmalu modalagunavi lēkuṃḍuṭa jīvuni kanna vēru lakṣaṇamulu kalavāḍu.
virāḍupāsakula abhiprāyamu ī vidhamugānunnadi :- sthūladēhamu lēkuṃḍaganē, liṃgadēhamuṃḍuṭa mātramucētanē kaligiyuṃḍuṭacēta virāṭpuruṣuḍē īśvaruḍu.
prajāpatini upāsiṃcuvārimatamu ī vidhamugānunnadi:-
(saṃtānakōrikagalavārai cētulu, kāḷḷu modalagunavi kaligiyunna śarīramugalavāru, krimulu modalaguvāṭivale īśvaruḍanuṭaku avakāśamu kaligiyuṃḍuṭacēta virāḍupāsakula matamu saṃgatamukādu - caturmukha brahmamē īśvaruḍu).
vaiṣṇavamatamuvāri abhiprāyamu :- viṣṇuvuyokka boḍḍulōnuṃḍi caturmukhabrahma puṭṭinaṃduna, caturmukha brahma puṭṭuṭaku kāraṇamaguṭacēta viṣṇuvē īśvaruḍu.
śaivamatasthula abhiprāyamu :- liṃgarūpamulō āvirbhaviṃcina śivuniyokka pādamu - liṃgamuyokka aḍugubhāgamu - ekkaḍanunnadō ani anvēṣiṃci viṣṇuvu kanugonalēkapōvuṭacēta śivuḍē īśvaruḍu.
ganapatyupāsakula matamu :- tripurāsura samhāramu cēyuṭaku śivuḍu gaṇapati nupāsiṃcenu; kanuka gaṇapatiyē īśvaruḍu.
bhairava upāsakulamatamu :- māraṇōcchāṭanamu vaśīkaraṇamu, staṃbhanamu, modalagu siddhulu kaligiyuṃḍu kāraṇamugānuṃḍu bhairavādimaṃtramulanu, vāṭiki saṃbaṃdhiṃcina stōtramulanu, yajñamu, tarpaṇamu, puraścaraṇamu modalaguvāṭini pratipādiṃcu graṃdhamulanu pramāṇamugā tesukoni bhairavuḍu modalagu dēvatalē īśvaruḍu.
(paina ceppinaprakāramu vārivāri manasunaku tōcinavi, naccinavi, okaṭikokaṭi viruddhamainavi, vēru vēru lakṣaṇamulu galavi anaṃtamulugā matamulunnavi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.