వాక్యమునందు చెప్పబడు పదార్థమునువిడిచి ఇంకొక పదార్థమును తాత్పర్యముకొఱకు తీసుకొనుట.
“గంగాయాం ఘోషః”
(గంగయందు గొల్లపల్లి) గంగానదిలోపల్లెయుండుట సంభవింపదు. గంగతో సంబంధముగల నదీతీరమును తీసుకోవలెను - అప్పుడు - గంగ ఒడ్డున గ్రామమున్నదయని యర్ధమగును - ఇట్లు గంగానదికి బదులుగా దాని తీరమును తీసుకొనుట జహలక్షణము - ” “సర్వం ఖిల్విదం బ్రహ్మ” (నామరూపములలో కనబడు ఈ జగత్తు అంతా బ్రహ్మమే). (విరామములు గలది, జడమైనది, దుఃఖము గలది అయిన జగత్తు అంతా, వికారములు లేనటువంటిన్నీ, చైతన్యమాత్రమైనటువంటిన్నీ, ఆనందరూపుడైనటువంటిన్నీ, పరబ్రహ్మమే అని విరుద్ధధర్మములుగల జగత్తు బ్రహ్మమే అని చెప్పబడినది. విరుద్ధధర్మములను వదలివేసిన పరబ్రహ్మ చైతన్యమున్నూ, జగత్తును అధిష్టించియున్న చైతన్యము ఒకటేయని భావించుటకు చెప్పబడినది).
vākyamunaṃdu ceppabaḍu padārthamunuviḍici iṃkoka padārthamunu tātparyamukoṟaku tīsukonuṭa.
“gaṃgāyāṃ ghōṣaḥ”
(gaṃgayaṃdu gollapalli) gaṃgānadilōpalleyuṃḍuṭa saṃbhaviṃpadu. gaṃgatō saṃbaṃdhamugala nadītīramunu tīsukōvalenu - appuḍu - gaṃga oḍḍuna grāmamunnadayani yardhamagunu - iṭlu gaṃgānadiki badulugā dāni tīramunu tīsukonuṭa jahalakṣaṇamu - ” “sarvaṃ khilvidaṃ brahma” (nāmarūpamulalō kanabaḍu ī jagattu aṃtā brahmamē). (virāmamulu galadi, jaḍamainadi, duḥkhamu galadi ayina jagattu aṃtā, vikāramulu lēnaṭuvaṃṭinnī, caitanyamātramainaṭuvaṃṭinnī, ānaṃdarūpuḍainaṭuvaṃṭinnī, parabrahmamē ani viruddhadharmamulugala jagattu brahmamē ani ceppabaḍinadi. viruddhadharmamulanu vadalivēsina parabrahma caitanyamunnū, jagattunu adhiṣṭiṃciyunna caitanyamu okaṭēyani bhāviṃcuṭaku ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.