← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జీవ విలక్షణః jīva vilakṣaṇaḥ

Original — తెలుగు
  1. భగవాన్ జీవాత్ వ్యతిరిక్తః - వైలక్షణ్యం ఉక్తం - భగవాన్ నిత్య ముక్తః. జీవస్తు భగవత్ప్రసాదాత్ ముచ్యతే. భగవాన్ పరిశుద్ధః, జీవస్తు మలినః భగవాన్ విబుద్ధిః, సర్వజ్ఞః,జీవస్తి కించిత్ జ్ఞః భగవాన్ ఆత్మా, జీవస్తు జడః, భగవాన్ కూటస్థః, సతు వికారీ - భగవాన్ ఆది పురుషః, జీవః ఆదిమాన్, భగవాన్ భగవాన్, జీవః భగహీనః, భగవాన్ త్రయాణాం గుణానాం అధీశః, జీవః పరతంత్రః“.

(భగవంతుడు జీవునికన్న వేరైన లక్షణములు గలవాడు - ఎట్లంటే - భగవంతుడు నిత్యముక్తుడు, జీవుడు భగవంతునియొక్క అనుగ్రహము వలన ముక్తుడగును. భగవంతుడు పరిశుద్ధుడు, జీవుడు మలినుడు - దోషములతో కూడియున్నవాడు - భగవంతుడు సర్వజ్ఞుడు, జీవుడు కించిత్ జ్ఞుడు. (కొంచెము తెలిసినవాడు, అల్పజ్ఞుడు), భగవంతుడు కూటస్థుడు - నిర్వికారుడు, వికారములు లేనివాడు - “సదా ఏక రసః”. జీవుడు మార్పులు పొందువాడు. భగవంతుడు ఆత్మ, జీవుడు జడము. భగవంతుడు ఆది పురుషుడు, జన్మలేనివాడు - ప్రకృతి అను పురములో మొదట ప్రవేశించినవాడు, జీవుడు జన్మగలవాడు. భగవంతుడు అష్టైశ్వర్యములు గలవాడు, జీవుడు ఐశ్వర్యహీనుడు. భగవంతుడు సత్వరజస్తమోగుణములను త్రిగుణములకు అధీశుడు, అతీతుడు, వాటిని తన అధీనములో నుంచుకొనినవాడు - స్వతంత్రుడు, జీవుడు పరతంత్రుడు).

Transliteration
  1. bhagavān jīvāt vyatiriktaḥ - vailakṣaṇyaṃ uktaṃ - bhagavān nitya muktaḥ. jīvastu bhagavatprasādāt mucyatē. bhagavān pariśuddhaḥ, jīvastu malinaḥ bhagavān vibuddhiḥ, sarvajñaḥ,jīvasti kiṃcit jñaḥ bhagavān ātmā, jīvastu jaḍaḥ, bhagavān kūṭasthaḥ, satu vikārī - bhagavān ādi puruṣaḥ, jīvaḥ ādimān, bhagavān bhagavān, jīvaḥ bhagahīnaḥ, bhagavān trayāṇāṃ guṇānāṃ adhīśaḥ, jīvaḥ parataṃtraḥ”.

(bhagavaṃtuḍu jīvunikanna vēraina lakṣaṇamulu galavāḍu - eṭlaṃṭē - bhagavaṃtuḍu nityamuktuḍu, jīvuḍu bhagavaṃtuniyokka anugrahamu valana muktuḍagunu. bhagavaṃtuḍu pariśuddhuḍu, jīvuḍu malinuḍu - dōṣamulatō kūḍiyunnavāḍu - bhagavaṃtuḍu sarvajñuḍu, jīvuḍu kiṃcit jñuḍu. (koṃcemu telisinavāḍu, alpajñuḍu), bhagavaṃtuḍu kūṭasthuḍu - nirvikāruḍu, vikāramulu lēnivāḍu - “sadā ēka rasaḥ”. jīvuḍu mārpulu poṃduvāḍu. bhagavaṃtuḍu ātma, jīvuḍu jaḍamu. bhagavaṃtuḍu ādi puruṣuḍu, janmalēnivāḍu - prakṛti anu puramulō modaṭa pravēśiṃcinavāḍu, jīvuḍu janmagalavāḍu. bhagavaṃtuḍu aṣṭaiśvaryamulu galavāḍu, jīvuḍu aiśvaryahīnuḍu. bhagavaṃtuḍu satvarajastamōguṇamulanu triguṇamulaku adhīśuḍu, atītuḍu, vāṭini tana adhīnamulō nuṃcukoninavāḍu - svataṃtruḍu, jīvuḍu parataṃtruḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.