జీవుడు చేసిన పాపములకు నరకమున యాతనల ననుభవించి తిరిగి పూర్వకర్మ శేషమువలన పురుషుని రేతో బిందువులో ప్రవేశించి, దానితో వధూ గర్భములో జొరబడి అక్కడ క్రమ క్రమముగా శరీరమును అవయవములను కల్పించుకొని, పెంచుకొని, గర్భ యాతనను అనుభవించి పదియవ మాసమున గర్భమునుండి బైట పడి - పుట్టి, పెరిగి, విషయములంది కోరిక గలవాడై మరల కర్మలు చేయుచు, మరల జన్మించుట (“పునరపి జననం, పునరపి మరణం,, పునరపి జననీ జఠరే శయనం” అని చెప్పినట్లుగా) - ఈ విధముగా జననమరణములు పొందుచూ భగవద్భ
క్తిచే భగవంతుని చేరి ముక్తిని పొందును - ఇదియే జీవుని యాత్ర - జీవయాత్ర). ఈ విషయము శ్రీమదాంధ్రమహాభాగవతములో 3 - 30, 31 అధ్యాయములలో విపులముగా చెప్పబడినవి) (చూడుము - పునర్జన్మ ; ‘సంసారము’).
jīvuḍu cēsina pāpamulaku narakamuna yātanala nanubhaviṃci tirigi pūrvakarma śēṣamuvalana puruṣuni rētō biṃduvulō pravēśiṃci, dānitō vadhū garbhamulō jorabaḍi akkaḍa krama kramamugā śarīramunu avayavamulanu kalpiṃcukoni, peṃcukoni, garbha yātananu anubhaviṃci padiyava māsamuna garbhamunuṃḍi baiṭa paḍi - puṭṭi, perigi, viṣayamulaṃdi kōrika galavāḍai marala karmalu cēyucu, marala janmiṃcuṭa (“punarapi jananaṃ, punarapi maraṇaṃ,, punarapi jananī jaṭharē śayanaṃ” ani ceppinaṭlugā) - ī vidhamugā jananamaraṇamulu poṃducū bhagavadbha
kticē bhagavaṃtuni cēri muktini poṃdunu - idiyē jīvuni yātra - jīvayātra). ī viṣayamu śrīmadāṃdhramahābhāgavatamulō 3 - 30, 31 adhyāyamulalō vipulamugā ceppabaḍinavi) (cūḍumu - punarjanma ; ‘saṃsāramu’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.