(వివేకించి విషయములను తెలుసుకొను జ్ఞానమనే చక్షువు).
(శాస్త్రముచేత, గురువు ప్రసాదమువలన కలిగిన ఉపదేశముచేత కలిగిన ఆత్మను గుఱించి అయిన జ్ఞానమే చక్షువు).
అజ్ఞాన చక్షుర్నే క్షేత భాస్వంతం భాసమం ధవత్ ||“.
(అన్నింటిలోను వ్యాపించియుండే సచ్చిదానందపరమాత్మను జ్ఞాననేత్రము గలవాడే చూడగలుగును - ప్రకాశించుచున్న సూర్యుని గ్రుడ్డివాడు చూడలేనట్లు జ్ఞాననేత్రము లేనివాడు (అజ్ఞాని) పరమాత్మను చూడలేడు).
విమూఢాః నాను పశ్యంతి, పశ్యంతి జ్ఞాన చక్షుషః ||’. (శ్రీమద్భగవద్గీత - 15 - 10)
(శరీరమందున్న జీవాత్మను, శరీరమందున్నపుడుగాని, శరీరమునుండి వెడలిపోవునపుడుగాని, విషయములను భోగించునపుడుకాని, సత్వరజస్థమములను త్రిగుణములతో కూడి సుఖ దుఃఖములననుభవించునపుడుగాని, మూఢులు అతనిని తెలుసుకొనలేరు. చూడలేరు. జ్ఞానచక్షువు గలవారు - బ్రహ్మజ్ఞానమను చక్షువు (కన్ను) గలవారు చూచుచున్నారు - చూడగల్గుచున్నారు. ఎందుచేతననగా భగవంతుడు - ఆత్మ - సూక్ష్మాతి సూక్ష్ముడు -“అణోరణీయాన్” (అతి చిన్నవస్తువైన పరమాణువుకన్న చిన్నవాడు - అందుచేత సాధారణుల కంటికికనపడడు - జ్ఞాననేత్రము - బ్రహ్మజ్ఞానమే నేత్రము - గా గలవారికి కనబడును –
“ఏష సర్వేషు భూతేషు గూఢాత్మా న ప్రకాశతే |
దృశ్యతే త్పగ్ర్యా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మ దర్శిభిః ||“.
(ఈ భగవంతుడు సమస్త భూతములందు గూఢమైన శరీరము - ఆకారముతో - ఉన్నట్లు పైకి కనబడకుండా ఉన్నాడు - అందుచేత అతనిని అందరూ చూడజాలరు - కుశాగ్రబుద్ధిగలవారు - (దర్భ కొస ఎంత తీక్ష్ణముగా నుండునో అంత తీక్ష్ణమైన బుద్ధిగలవారు) - సూక్ష్మాతి సూక్ష్మమైన వస్తువులను చూడగలవారు వారి సూక్ష్మదృష్టిలో చూడ గలుగుచున్నారు - వీరి సూక్ష్మదృష్టియే జ్ఞానేత్రము - ప్రహ్లాదుడు పరమభక్తుడు, బ్రహ్మజ్ఞానియగుట వలన అతను సమస్త వస్తువులలోను భగవంతుని చూడగలిగెను. హిరణ్యకశిపునకు ఆ జ్ఞాన నేత్రము లేదు కనుక అతనికి భగవంతుడు కనబడలేదు).
(అందుచేతనే “ఎందెందు వెతకి చూచిన” అని ప్రహ్లాదుడు చెప్పెను. నమ్మకముతో, శ్రద్ధతో, ఉప నిషన్మార్గమున ననుసరించి బ్రహ్మజ్ఞానము సంపాదించినవారికి, వారి జ్ఞానేత్రమునకు భగవంతుడు కనుపించును అని ప్రహ్లాదుని ఆశయము).
(ఏ విధమైన ఉపాధులు లేక, ఏ విధమైన ఆవరణచేత కప్పబడకయుండి కేవలుడైన పరబ్రహ్మను తెలుసుకోగలుగు జ్ఞానమే - బ్రహ్మజ్ఞానమే - జ్ఞాననేత్రము).
(vivēkiṃci viṣayamulanu telusukonu jñānamanē cakṣuvu).
(śāstramucēta, guruvu prasādamuvalana kaligina upadēśamucēta kaligina ātmanu guṟiṃci ayina jñānamē cakṣuvu).
ajñāna cakṣurnē kṣēta bhāsvaṃtaṃ bhāsamaṃ dhavat ||“.
(anniṃṭilōnu vyāpiṃciyuṃḍē saccidānaṃdaparamātmanu jñānanētramu galavāḍē cūḍagalugunu - prakāśiṃcucunna sūryuni gruḍḍivāḍu cūḍalēnaṭlu jñānanētramu lēnivāḍu (ajñāni) paramātmanu cūḍalēḍu).
vimūḍhāḥ nānu paśyaṃti, paśyaṃti jñāna cakṣuṣaḥ ||’. (śrīmadbhagavadgīta - 15 - 10)
(śarīramaṃdunna jīvātmanu, śarīramaṃdunnapuḍugāni, śarīramunuṃḍi veḍalipōvunapuḍugāni, viṣayamulanu bhōgiṃcunapuḍukāni, satvarajasthamamulanu triguṇamulatō kūḍi sukha duḥkhamulananubhaviṃcunapuḍugāni, mūḍhulu atanini telusukonalēru. cūḍalēru. jñānacakṣuvu galavāru - brahmajñānamanu cakṣuvu (kannu) galavāru cūcucunnāru - cūḍagalgucunnāru. eṃducētananagā bhagavaṃtuḍu - ātma - sūkṣmāti sūkṣmuḍu -“aṇōraṇīyān” (ati cinnavastuvaina paramāṇuvukanna cinnavāḍu - aṃducēta sādhāraṇula kaṃṭikikanapaḍaḍu - jñānanētramu - brahmajñānamē nētramu - gā galavāriki kanabaḍunu –
“ēṣa sarvēṣu bhūtēṣu gūḍhātmā na prakāśatē |
dṛśyatē tpagryā buddhyā sūkṣmayā sūkṣma darśibhiḥ ||“.
(ī bhagavaṃtuḍu samasta bhūtamulaṃdu gūḍhamaina śarīramu - ākāramutō - unnaṭlu paiki kanabaḍakuṃḍā unnāḍu - aṃducēta atanini aṃdarū cūḍajālaru - kuśāgrabuddhigalavāru - (darbha kosa eṃta tīkṣṇamugā nuṃḍunō aṃta tīkṣṇamaina buddhigalavāru) - sūkṣmāti sūkṣmamaina vastuvulanu cūḍagalavāru vāri sūkṣmadṛṣṭilō cūḍa galugucunnāru - vīri sūkṣmadṛṣṭiyē jñānētramu - prahlāduḍu paramabhaktuḍu, brahmajñāniyaguṭa valana atanu samasta vastuvulalōnu bhagavaṃtuni cūḍagaligenu. hiraṇyakaśipunaku ā jñāna nētramu lēdu kanuka ataniki bhagavaṃtuḍu kanabaḍalēdu).
(aṃducētanē “eṃdeṃdu vetaki cūcina” ani prahlāduḍu ceppenu. nammakamutō, śraddhatō, upa niṣanmārgamuna nanusariṃci brahmajñānamu saṃpādiṃcinavāriki, vāri jñānētramunaku bhagavaṃtuḍu kanupiṃcunu ani prahlāduni āśayamu).
(ē vidhamaina upādhulu lēka, ē vidhamaina āvaraṇacēta kappabaḍakayuṃḍi kēvaluḍaina parabrahmanu telusukōgalugu jñānamē - brahmajñānamē - jñānanētramu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.