← Back to జ్ఞ · Booklets 11–20 (digitized file 2)

జ్ఞానము jñānamu

Original — తెలుగు
  1. జ్ఞాయతే అనేన ఇతి జ్ఞానం ; “జ్ఞాయతే అనేన ఇతి సర్వ విషయం అవిశేషేణ ఉచ్యతే” (శ్రీ శంకరః)

అంతఃకరణం.

(సమస్త విషయములు దీని వలన పూర్తిగా తెలుసుకొను చున్నాడు - కనుక ఇది జ్ఞానము - అంతఃకరణము)

  1. “జ్ఞాయతే అనేన ఆత్మా ఇతి జ్ఞానం” (శ్రీ రామానుజః)

(పరమాత్మ దీని వలన తెలియబడుచున్నాడు. అందుచేత ఇది జ్ఞానము).

  1. ‘ఆత్మ విషయం’ (ఆత్మను గుఱించి తెలియచేయునది).

  2. బ్రహ్మైక్య గోచరం. (ఉన్నదంతయు బ్రహ్మమే యని చెప్పునది).

  3. “పరావర తత్వ యథాత్మ్య జ్ఞానం” (శ్రీ రామానుజః)

  4. “ఆత్మాది పదార్థానాం అవ బోధః”. (శ్రీ శంకరః)

(ఆత్మ మొదలగు పదార్థములను - వస్తువులను - తెలుసుకొనుట).

  1. “శాస్త్ర తః ఆచార్య తశ్చ ఆత్మా దీనాం అవబోధః, ఆత్మస్వరూప విషయం, పరోక్ష జ్ఞానం”

(శాస్త్రమువల్లను, గురువు వల్లను, ఆత్మ మొదలగువాటిగుఱించి బోధపఱచుకొనుట జ్ఞానము. ఆత్మ స్వరూపమెట్టిదో అను విషయము చెప్పునవి పరోక్షజ్ఞానము).

  1. “శాస్త్ర జన్యం ఆత్మ స్వరూపం ఆధ్యాత్మావగాహి”.

(శాస్త్రమువలన కలుగు ఆత్మయొక్క స్వరూపజ్ఞానము. ఆధ్యాత్మ తత్వమును అవగాహనము చేయునది).

  1. జ్ఞాన శబ్దేన ప్రకృతి విలక్షణా త్మయాధాత్మ్య జ్ఞానం వివక్షితం.

(ప్రకృతికన్న వేరైన లక్షణములుగల ఆత్మయొక్క స్వస్వభావమును తెలియచేయు యధాత్మ్యజ్ఞానము).

  1. తత్వ జ్ఞానం -

(తత్వములన్నింటినీ తెలుసుకొనుట. పరమాత్మ తత్వమును తెలుసుకొనుట - ప్రపంచమంతట, ప్రపంచములోనున్న వస్తువులన్నింటిలోను ఉన్న తత్వమొకటే, అదే పరమాత్మ తత్వము - ఈ విషయమును తెలుసుకొనుట జ్ఞానము).

  1. యథా ఆదిత్యః సమస్తం వస్తు జాతం అవభాసయతి తద్యత్ జ్ఞానం. (అపరోక్షజ్ఞానం). జ్ఞేయ వస్తుసర్వం ప్రకాశయతి, - తత్పరమార్థ తత్వం ప్రకాశయతి.

(సూర్యుడు సమస్త వస్తువులను ఎట్లు ప్రకాశింపచేయుచున్నాడో, ఆ ప్రకారముగానే జ్ఞానము - అనగా, అపరోక్షజ్ఞానము - జ్ఞేయవస్తువు నంతటినీ ప్రకాశింపచేయును - దాని పరమార్థ తత్వమును ప్రకాశింప చేయును).

  1. అభేద దర్శనం.

(జీవాత్మ పరమాత్మలకు, పరబ్రహ్మకు ప్రపంచమునకు భేదము లేదు అని చెప్పునది జ్ఞానము).

  1. “బ్రహ్మైవ సర్వం బ్రహ్మాతిరిక్తం న కించిదస్తి ఇతి జ్ఞానం”

(ఈ కనుపించు సర్వప్రపంచమున్నూ బ్రహ్మమే. బ్రహ్మముకానిది యేకొంచెమైనదియును లేదు - ఇదియే జ్ఞానము -).

(1). “క. హరిమయము విశ్వమంతయు

హరి విశ్వమయుండు, సంశయము పనిలేదా

హరిమయము కానిద్రవ్యము

పరమాణువులేదు, వంశపావన, వింటే“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 - 17)

(2).”ఏ యెడలన్ లేద ఈశ్వరేతరము సుతా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 85)

  1. “జ్ఞాతం యేన నిజం రూపం, కైవల్యం పరమం పదం |

నిష్కలం నిర్మలం సాక్షాత్ సచ్ఛిదానందరూపకం |

ఉత్పత్తి స్థితి సమ్హార స్ఫూర్తి జ్ఞాన వివర్జితం |

ఏ తత్ జ్ఞాన మితి ప్రోక్తం - - - ||“. (యోగతత్వోపనిషత్)

కైవల్యము - కేవల ఆత్మ తత్వమే అయి యుండుట -, పరమ పదము - మోక్షరూపమైనది , నిష్కలము, ఏ విధమైన దోషము లేనిది. సాక్షాత్తు సచ్చిదానంద రూపమైనది, సృష్టి స్థితి లయ కారణమైనది అగుతన స్వస్వరూపమును తెలుసుకొనుటయే జ్ఞానము).

  1. “అపరోక్షాత్మవస్తు విషయం యద్బ్రహ్మ విద్యారూపం తత్ జ్ఞానశబ్దేన ఉచ్యతే”.

(అపరోక్షమైన బ్రహ్మవస్తువు విషయముగా గలదానిని బోధించునది; పరబ్రహ్మనుగుఱించి అయినవిద్య).

  1. “స్వప్రకాశం జ్ఞానం , సర్వ ప్రకాశం జ్ఞానం; నిరావరణ చిన్మాత్రం జ్ఞానం, అనాద్యనంతం, నిరంతర - మ వృత్తి సాక్షి చైతన్యమేవ జ్ఞానం”.

(స్వయముగా ప్రకాశించునది జ్ఞానము; అన్నింటినీ ప్రకాశింపచేయునది జ్ఞానము; ఆవరణ - ఆచ్ఛాదనము - లేని చైతన్యమాత్రము జ్ఞానము, అనాది, అనంతము సాక్షి చైతన్యమైనది జ్ఞానము).

  1. “సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ -”,

“సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ , అనంతం బ్రహ్మేతి - జ్ఞానశబ్దః జ్ఞప్తి స్వరూపం బ్రహ్మ లక్ష యిత్వా జడత్వం నిషేధతి”.

(బ్రహ్మ సత్యము, బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మ అనంతము, బ్రహ్మ జ్ఞప్తిస్వరూపము - ఇట్లు చెప్పుటచేత బ్రహ్మ జడము కాదు అని చెప్పినట్లు).

“జ్ఞానపదం నిత్యా సంకుచిత జ్ఞానైకాకారమాహ -”.

(ఎల్లపుడు తరగని జ్ఞానమే స్వరూపముగా గలవాడు బ్రహ్మ అని జ్ఞానపదమున కర్థము).

  1. “దేహేంద్రియ నిగ్రహ సద్గురూపాసన శ్రవణ, మనన, నిధి ధ్యాసనైః యద్యత్ దృక్ దృశ్య స్వరూపం, సర్వాంతరస్థం, సర్వసమం, ఘటఘటాదిపద్ఫార్థమివా వికారం, వికారేషు చైతన్యం వినా కించిన్నా స్తీతి సాక్షాత్కారానుభవః జ్ఞానం”. (నిరాలంబోపనిషత్)

(దేహమును, ఇంద్రియములను నిగ్రహించుట (తన వశములో నుంచుకొనుట), సద్గురువు వలన ఉపాసన పొందుట, శ్రవణ, మనన, నిధి ధ్యాసములు - వీటి అన్నింటిచేతను దృక్ రూపము దృశ్యరూపము - ఈ రెండు రూపములు తానే అయినదిన్నీ, అన్నింటిలోను అంతర్యామిగా నుండునదినీ, అన్నింటి యడల హెచ్చు తక్కువలు లేక సమముగా నుండునదిన్నీ, కుండ, బట్ట, మొదలగు పదార్థములవలె వికారము పొందనిది (మార్పు లేనిది) అయిన వస్తువును, (వికారమును పొందిన ప్రతి వస్తువులోను చైతన్యం తప్ప మరేమియు లేదు). సాక్షాత్కారము చేసుకొను అను భావము జ్ఞానము).

  1. “జ్ఞేయం పరం తత్వం వాసుదేవాఖ్యం, అపరం చ ప్రకృత్యాదికం లక్ష్యతే జ్ఞానశబ్దేన” -

(జ్ఞేయమగు వస్తువు వాసుదేవుడను పేరుగల పరతత్వము, ప్రకృతి మొదలగునవి అపరము - ఈ రెండు తత్వములను తెలియచేయుటయే లక్ష్యముగా గలది జ్ఞానము).

  1. “ఇదం శరీరం కౌంతేయ క్షేత్ర మిత్యభిధీయతే |

ఏ తద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః |

క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత |

క్షేత్ర క్షేత్రయో ర్జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ ||“. (శ్రీమద్భగవద్గీత - 13 - 1, 2)

(ఈ శరీరము క్షేత్రము - దీనిని తెలిసినవాడు - క్షేత్రజ్ఞుడు - సమస్తమైన క్షేత్రములందుండు క్షేత్రజ్ఞుడను నేనే (భగవంతుడు).

అహంహి సర్వభూతేషు సర్వ భూతాన్యధోమయి | ఇతి జ్ఞానం - - ||.

  1. “జ్ఞానం తే అహం సవిజ్ఞాన మిధం వక్ష్యామ్య శేషతః |

యత్ జ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్య మవశిష్యతే |

- - - భూమిరాపో(అ)నలో వాయుః ఖం మనోబుద్ధి రేవచ |

అహంకారః ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టథా |

అపరేయం ఈతస్త్వ న్యాం ప్రకృతిం మే పరాం |

జీవాభూతాం మహాభూతాం య యేదం ధార్యతే జగత్ |

ఏ తద్యోనీని భూతాని సర్వాణీ త్యుపధారయ |

అహం కృత్స్నస్య జగతః ప్రబహవః ప్రలయస్తథా |

మత్తః పరతరం నాన్యదస్తి ధనంజయ |

మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణి గణా ఇవ |

- - బీజం మాం సర్వభూతానాం విద్ధిపార్థ సనాతనం |

యేచైవ సాత్వికా భావా రాజసాస్తా మ సాశ్చ యే |

మత్త ఏవేతి తాన్ విద్ధి - - - |

- - నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 2, 4 to 7, 10, 12, 25)

(నాకు (భగవంతునికి) రెండు శక్తులు గలవు - పరాప్రకృతి, అపరాప్రకృతి. అపరాప్రకృతి ఎనిమిది విధములుగా నున్నది - సూక్ష్మరూపములోనున్న భూమి, జలము, అగ్ని వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము. ఇక్కడ బుద్ధి యనగా మహత్తత్త్వము - దీనిలోనుండి అహంకారము పుట్టినది. ఇవియే అష్ట ప్రకృతులు - ఈ అపరాప్రకృతియే క్షేత్రము - ఇది జడము, స్వతంత్రముగా ఏమియు చేయలేనిది. రెండవశక్తి పరాశక్తి. ఇది చైతన్య శక్తి - భగవంతుడు ఈ చైతన్యశక్తితో అపరాప్రకృతిలో కలియగనే అపరాప్రకృతికి చైతన్యము కలిగి దానిలోనుండి - ఒకదానిలోనుండి ఒకటిగా - ఈసృష్టిలోనున్న సమస్త వస్తువులు పుట్టుచున్నవి. అందుచేత ఆ సమస్త వస్తువులకు ఇది యోని - పుట్టుచోటు - ఈ ప్రపంచమంతటిని - దానిలోని వస్తువులన్నింటినీ - పుట్టించువాడను, సమ్హరించువాడను - లయము చేయువాడను నేనే. నాకంటె ఉత్కృష్టమైనది వేరొకటి లేదు. దారముతో మణులు గ్రుచ్చి ఉన్నట్లు ఇదంతయు - ఈ జగత్తులోని వస్తువులన్నింటిలోను - నేనుండి వాటిని నాలో కట్టిపెట్టి యున్నాను. సమస్తమైన వస్తువులు పుట్టుటకు బీజము నేనే - ఏ యే వస్తువులు పుట్టుచున్నవో అవన్నియు నా వలననే పుట్టుచున్నవి. నేను ప్రతి వస్తువులో నుండి, దానికి చైతన్యము కలిగించి, దానిలోనుండి ఇంకొక వస్తువును పుట్టించుచున్నాను - నేను అన్నింటిలోనుండి వాటికి నా చైతన్యమునిచ్చి వాటి చేత వాటి పనులు చేయించుచున్నాను - ఇట్లు అన్నింటిలోనున్నప్పటికీ నా యోగమాయచేత నేను కప్పబడియుండుటచేత నేను అన్నింటిలోను ఉన్నట్లు ఎవరికి కనబడను (“మరుగేలరా, ఓ, రాఘవా | - త్యాగరాజు). ఇట్లు ప్రకృతి పురుషుల సం యోగము వలననే - పరాశక్తి (చైతన్య శక్తి) గల భగవంతుడు అపరాశక్తి యైన ప్రకృతితో కలియుటచేతనే ఒకవస్తువులోనుండి ఇంకొక వస్తువు పుట్టుచున్నది - సృష్టి జరుగుచున్నది. (Creation is the result of the combination of matter and energy). ఈ పైన చెప్పిన విషయము సౄష్టి క్రమమునకు సంబంధించినది. దీని విషయమైన జ్ఞానముకంటె ఉత్కృష్టమైన జ్ఞానము లేదు - అన్ని విధములైన జ్ఞానము ఈ సృష్టి క్రమములోనే ఇమిడి యున్నవి కనుక).

  1. “చిద చిద్వస్తు విశేష విష యో నిశ్చయః”. (శ్రీరామానుజః)

(చిత్, అచిత్ - ఆత్మ, అనాత్మ - ఏది ఏదో అను విషయమును నిశ్చయించి చెప్పునది జ్ఞానము).

“ఆత్మానాత్మ వివేకః, అజడం, పరమాత్మ విషయం”.

(ఆత్మ యనగా ఏమిటి, అనాత్మ యనగా నేమిటి ? అను వివేకము కలిగించునది ; పరమాత్మయే విషయమగుచున్నది. పరమాత్మ గుఱించి చెప్పునది - జడముకానిది).

  1. “ఆత్మనః ప్రకృతి పురుషాఖ్యాం విలక్షణత్వేన అవలోకనం”.

(ప్రకృతి పురుషులకన్న, ప్రకృతి జీవాత్మలకన్న ఆత్మ వేరైనది అను తెలుసుకొనుట).

  1. “మనంబందు ప్రతిబింబించిన చైతన్యంబు జ్ఞానమనంబడు”. (వివేకచింతామణి - పరమానందతీర్థ)

  2. “యతః జ్ఞానేసతి భక్తి వైరాగ్యే సాంగే సంపూర్ణే సిద్ధ్యతః తస్మాత్ భక్తే ర్వైరాగ్యస్య చ యా పరాకాష్టా సా జ్ఞానం”.

(జ్ఞానము కలిగిన భక్తి వైరాగ్యములు పూర్తిగా సిద్ధించును. అందుచేత ఆ భక్తి వైరాగ్యములు పరాకాష్టా సా జ్ఞానం“.

(జ్ఞానము కలిగిన భక్తి వైరాగ్యములు పూర్తిగా సిద్ధించును. అందుచేత ఆ భక్తి వైరాగ్యములు పరా కాష్టయే - అవి ఉచ్ఛస్థితిలోనుండుటయే జ్ఞానము).

  1. “జ్ఞానం నామ చిత్తస్య మదాకార మరిణామః, స చ మాం భజతః స్వభావతః ఏవ భవతి, నతు యత్నాంతర మపేక్షతే.

(జ్ఞానమనగా చిత్తము భగవదాకారముగా మారుట. ఇది భగవంతుని భజించు వారికి స్వభావసిద్ధముగనే కలుగును, ఇంకొక ప్రయత్నమవసరము లేకుండగనే).

  1. “న వైకాదశ పంచత్రీన్ భావాన్ భూతేషు యే న వై |

ఈ క్షేతాధైక మప్యేషు తత్ జ్ఞానం మమ నిశ్చితం ||. (శ్రీమద్భాగవతం - 11 - 19 -)

(ప్రకృతి పురుషుడు - ఈ ఇద్దరి సం యోగమువలన మిగిలిన తత్వములు - అనగా, మహత్తత్త్వము, అహంకారము, పంచతన్మాత్రలు, పంచమహాభూతములు, ఏకాదశ ఇంద్రియములు, సత్వరజస్థమోగుణములు అను ఇరువది ఎనిమిది తత్వములు భగవంతుని భావములు - విభూతులు - అతనిలోనుండి పుట్టి అతని రూపములే అయి యున్నవి. ఇవి యన్నియును కలిసి ఈ కనబడు ప్రపంచముగా మారినవి. ఈ ప్రపంచమంతయు, అందులోని వస్తువులన్నియు పైన చెప్పిన తత్వములన్నింటితోను నిండియున్నవి. ఈ తత్వములన్నియు ప్రపంచమంతటిలోను, దానిలోని వస్తువులన్నింటిలోను వ్యాపించియున్నవి. ఇట్టి ఈ తత్వములన్నింటిలోను, వాటితో వ్యాపించియున్న ప్రపంచమంతటిలోను, వాటితో (పాటు వ్యాపించి పూర్తిగా నిండియున్నది పరమాత్మతత్వము అని, అంతా పరమాత్మయే యని, అన్నీపరమాత్మయేయని, అతను తప్ప మఱియొక వస్తువు లేదని తెలుసుకొనుటయే జ్ఞానము).

  1. “జ్ఞాయతే అనేన ఇతి వ్యుత్పత్యా జ్ఞానాని ఇంద్రియాణి ఇత్యర్థః” (రంగరామానుజః)

(ఇంద్రియములవలన తెలుసుకొనుచున్నాము కనుక జ్ఞానమనగా ఇంద్రియములు) –

“జ్ఞానార్థత్వాత్ శ్రోత్రాదీని ఇంద్రియాణి జ్ఞనాని ఉచ్యతే”

(జ్ఞానమునకు సాధనములగుటచేత చెవి మొదలగు ఇంద్రియములు జ్ఞానము అని చెప్పబడుచున్నవి).

  1. శాస్త్రోత్థం; వేద తాత్పర్య నిశ్చయః -

(వేదమువలన కలిగినది; వేదములో చెప్పిన విషయమును నిశ్చయముగా, సంశయము లేకుండతెలుసుకొనుట).

  1. జ్ఞాయతే అనేన ఇతి జ్ఞానం - శాస్త్రం.

(శాస్త్రమువలన తెలుసుకొనబడుచున్నవి గనుక శాస్త్రము జ్ఞానము).

  1. “సాంఖ్యా యోగః పాంచరాత్రం వేదాః పాశ్యుపతం తథా |

జ్ఞానాన్యేతాని పంచైవ జ్ఞేయశ్చైవ మహేశ్వరః ||“. (పద్మపురాణము)

(సాంఖ్యము, యోగము, పాంచరాత్రము, వేదములు, పాశ్యుపతము - ఈ అయిదున్నూ జ్ఞానములు - జ్ఞానమును కలుగచేయునవి కనుక. వీటి వలన తెలియతగు వస్తువు - మహేశ్వరుడు).

  1. “శబ్ద ప్రమాణకం జ్ఞానం బ్రహ్మ తత్వైక గోచరం” (గీతాభావ ప్రకాశము - 9 - 12)

(వేదమే ప్రమాణముగాగలపరమాత్మ తత్వమును గోచరింపచేయునది - ఉన్నదంతయు ఒకే తత్వముఅని తెలియచేయునది)

“జ్ఞానం వేదశిరోద్భూతమితిమే నిశ్చితా మతిః”. (సూత సంహిత)

  1. “శాస్త్రోక్తానాం పదార్థానాం జ్ఞానం స్యా దౌ పదేశికం”.

(శాస్త్రములో చెప్పబడిన పదార్థముల గుఱించి అయిన జ్ఞానము ఔపదేశికము).

  1. లౌకిక, శుద్ధ లౌకిక, లోకోత్తర భేదేన యత్ జ్ఞాయతే తత్ జ్ఞానం, శాస్త్ర జన్య మిత్యర్థః -

(ఇది లౌకిక జ్ఞానము, ఇది శుద్ధలౌకికము, ఇది ఉత్త్రరలోకములకు సంబంధించినది అని తెలుసుకొనుట జ్ఞానము - అనగా శాస్త్రమువలన కలిగిన జ్ఞానము).

  1. “జ్ఞానం సన్యాస లక్షణం”.

(జ్ఞానము సన్యాసి లక్షణము - సర్వసంగ సన్యాసము, సర్వకర్మ సన్యాసము చేసిన వాడే సన్యాసి. అదియే జ్ఞానము).

  1. “సత్వాత్ సం జాయతే జ్ఞానం” (శ్రీమద్భగవద్గీత - 14 - 17)

(సత్వగుణము కలిగియుండుటవలన జ్ఞానము కలుగును).

  1. “వైరాగ్యేణ వినా జ్ఞానం న చ భక్తి రతః స్ఫుటం” -

(వైరాగ్యము లేనిచో జ్ఞానము, భక్తి కలుగదు).

  1. “వాసుదేవే భగవతి భక్తి యోగః ప్రయోజితః |

జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం ||“. (శ్రీమద్భాగవతం - 1 - 2 - 7)

“శ్రద్ధావాన్ లభతే జ్ఞానం మత్సరః”.

(“పురుషులకు పరమ ధర్మంబగు వాసుదేవునియందు బ్రయోగింపబడిన భక్తియోగంబు వైరాగ్య విజ్ఞానంబుల బుట్టించు” –

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 27)

  1. “బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి” (మనుః)

(జ్ఞానముచేత చిత్తశుద్ధి కలుగును).

  1. “జ్ఞానము అజ్ఞానమును నాశము చేయును -

    1. “యథా ఏకః ఏవ ఆదిత్యః అంధకారం నాశయతి, భూమండలం చ ప్రకాశయతి, తథా ఏకమేవ జ్ఞానం అజ్ఞానం నివర్తయతి, పరం చ ప్రకాశయతి”.

(ఒకే సూర్యుడు చీకటిని పోగొట్టుచూ భూమండలమును ప్రకాశింప చేయును - ఆ ప్రకారముగానే జ్ఞానము అనునది ఒకటే అజ్ఞానమును పోగొట్టును, మఱియు పరమాత్మను ప్రకాశింపచేయును - పరమాత్మ జ్ఞానమును కలుగచేయును, - మోక్షమును కలుగచేయును).

  1. “జ్ఞానేనతు తదజ్ఞానం యేషాం నాశిత మాత్మనః |

తేషామాదిత్యవత్ ప్రకాశయతి తత్పరం“. (శ్రీమద్భగవద్గీత - 5 - 16)

(జ్ఞానముచేత ఎవరియొక్క అజ్ఞానము నశింప చేయబడినదో వారికి అజ్ఞానము సూర్యునివలె పరతత్వమును - పరమాత్మను ప్రకాశింపచేయును. (జ్ఞానే నైవతు కైవల్యం)

  1. జ్ఞానమువలన - భగవత్ జ్ఞానము కలుగుటవలన పాపములన్నియు నశించును -

    1. “సర్వం జ్ఞాన ప్లవేనైన వృజినం సంతరిష్యసి” (శ్రీమద్భగవద్గీత - 4 - 36)

(మహాపాపివైనను బ్రహ్మజ్ఞానమను తెప్పచేతనే అన్నిపాపకర్మల ఫలమును దాటగలవు).

  1. య ధైధాం సి సమిద్భో(అ)గ్నిర్భస్మసాత్ కురుతే (అ)ర్జున |

జ్ఞానాగ్నిః సర్వ కర్మాణి భస్మసాత్కురుతే తథా ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 37)

“యథా యథాంసి కాష్టాని సమిద్ధః అగ్నిః దీప్తాగ్నిః భస్మీ భావం కరోతి తథా జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మస్దాత్ కురుతే, నిర్బీజంకరో తీత్యర్థః - నహి సాక్షా దేవజ్ఞానాగ్నిః కర్మాణి ఇంధనవత్ భస్మీకర్తుం శక్నోతి తస్మాత్ సమ్యక్ దర్శనం సర్వ కర్మణాం నిర్బీజత్వే కారణం ఇత్యభి ప్రాయః. సామర్థ్యాత్ యేన కర్మణా శరీరం ఆరబ్దం తత్ ప్రవృత్త ఫలత్వాత్ ఉపభోగే నైవ క్షీయతే -” తస్యతావ దేవ చి రం యావన్న విమోక్ష్యే అథ సంపత్స్యే -“ఇతి శ్రితేః - అతోయాని అప్రవృత్త ఫలాని జ్ఞానోత్పత్తేః ప్రాక్ కృతాని జ్ఞాన సహ బావీని వా అతీతానేక జన్మ కృతాని చ తాన్యేవ సర్వాణి భస్మసాత్ కురుతే”. (శ్రీ శంకరః)

(బాగా మండుచున్న అగ్ని కట్టెలను ఎట్లు భస్మము చేయునో ఆ ప్రకారముగానే జ్ఞానమను అగ్ని - బ్రహ్మజ్ఞానమను అగ్ని - కర్మలనన్నింటిని భస్మము చేయును, నిర్బీజము చేయును - మరల మొలకెత్తి ఫలమునిచ్చుటకు వీలు లేనట్లు చేయును - కట్టెలను అగ్ని భస్మము చేసినట్లు జ్ఞానాగ్ని యధార్థముగా భస్మము చేయలేదు - ఏ కర్మ చేయుటవలన దాని ఫలముగా ఇప్పటి జన్మ కలిగినదో అది దాని ఫలమునిచ్చుటకు మొదలు పెట్టినది కనుక ఆ కర్మ అనుభవమువలననే క్షీణించును - ఆ కర్మ ఫలము ననుభవించుట తీరగనే ముక్తుడగును - అని శ్రుతి చెప్పుచున్నది. అందుచేత ప్రారబ్ధకర్మను తప్ప మిగిలిన ఎన్ని జన్మములలో చేసిన కర్మలనైనను జ్ఞానము భస్మము చేయును).

  1. “వాసుదేవపరం జ్ఞానం” (శ్రీమద్భాగవతం 1 - 2 - 28)

(జ్ఞానము వాసుదేవుని పరము - అతని ద్వారా లభ్యమగునది - అందుచేత “భక్త్యా వినా బ్రహ్మజ్ఞానంకదాపి న జాయతే” (భగవంతునియందు భక్తి లేనిదే జ్ఞానము కలుగదు - “వేద యాగ యోగ క్రియా జ్ఞాన తపోగతి ధర్మంబులు వాసుదేవ పరంబులు”

(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1 - 2 - 24)

“శ్రద్ధావాన్ లభతే జ్ఞానం మత్పరః సం యతేంద్రియః |

జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేణాధిగచ్ఛతి ||” (శ్రీమద్భగవద్గీత - 4 - 39)

(గురువునందు, వేదాంతవాక్యములందు నమ్మకము కలిగి, ఇంద్రియజయము కలిగి, భగవంతునియందు భక్తి కలిగి యుండువానికి బ్రహ్మజ్ఞానము కలుగును - బ్రహ్మజ్ఞానము కలిగిన తర్వాత త్వరగా పరమశాంతియగు మోక్షమును పొందును).

“జ్ఞానమిచ్ఛేత్ మహేశ్వరాత్” (జ్ఞానముకొఱకు మహేశ్వరుని ఉపాసించవలెను).,

“యస్సర్వజ్ఞ స్సర్వవిత్” (అతను సర్వజ్ఞుడు - అన్నియు తెలిస్నవాడుకనుక).

  1. జ్ఞానమువలననే మోక్షము కలుగును - “జ్ఞానే నైవతు కైవల్యం”

    1. “జ్ఞానమేవ మహావిష్ణో మోక్షసాధన ముచ్యతే |

జ్ఞానం వేద శిరోర్భూతమితి మే నిశ్చితామతిః |

అనేక జన్మ సిద్ధానాం శ్రౌత స్మార్తాను వర్తినాం |

జాయతే తస్య విజ్ఞానం ప్రసాదాదేవమే, హరే ! ||” (సూత సంహిత)

(ఓ మహావిష్ణూ ! జ్ఞానమే మోక్షమునకు సాధనము. జ్ఞానము ఉపనిషత్తులవలన కలుగునది. శ్రౌత స్మార్తులకు అనేక జన్మములలో నా ప్రసాదము - అనుగ్రహము - కలుగుటవలన కలిగిన జ్ఞానము).

  1. “ఆత్మనః పరమా ముక్తిర్జ్ఞానాదేవ, న కర్మణా |

జ్ఞానం వేదాంత వాక్యానాం మహా తాత్పర్య నిర్ణయాత్ |

ఉత్పన్నయాం మనో వృత్తౌ మహాత్మ్యా యంబుజేక్షణ |

అభివ్యక్తం భవే దేతత్ బ్రహ్మైవాత్మవిచారతః |

అనే నైవాత్మనో (అ)జ్ఞానమాత్మన్యేవ విలీయతే |

విలీనే స్వాత్మనో(అ) జ్ఞానే ద్వైతం వస్తు వినశ్యతి |

ద్వైత వస్తు వినాశేతు శోభనా శోభనా మటిః |

లీయతే మతి నాశేన రాగద్వేషౌ వినశ్యతః

ధర్మా ధర్మ క్షయాద్దేహో జ్ఞాత్వా దేవమితి శ్రుతిః |

ఘటజ్ఞానాత్ ఘటాజ్ఞానం యథా లోకే వినశ్యతి |

తధాత్మజ్ఞాన మాత్రేణ నశ్యత్య జ్ఞానమాత్మనః |

రజ్జ్వజ్ఞాన వినాశేన రజ్జు సర్వో వినశ్యతి |

తస్మాదజ్ఞాన మూలస్య సంసారస్య క్షయో, హరే |

ఆత్మనస్త త్వ విజ్ఞానాత్ తత్వం బ్రహ్మైవ కేవలం ||“. (సూతసంహిత)

“తత్ర సాయుజ్య రూపా యా ముక్తే స్సాక్షాత్తు సాధనం |

సమ్యక్ జ్ఞానం. నకర్మోక్తం, న తయోశ్చ సముచ్చయః ||“. (సూతసంహిత)

(ఆత్మకు పరమముక్తి జ్ఞానమువలననే కలుగును, కర్మవలన కాదు. జ్ఞానమనగా వేదాంత వాక్యముల మహా తాత్పర్యమును నిర్ణయించుటవలన కలిగిన మనోవృత్తిలో కలిగిన మహాత్మ్యము. ఇది ఆత్మ గుఱించి చేసిన విచారమువలన కలుగునది. దీని చేత ఆత్మ గుఱించి కలిగిన అజ్ఞానము ఆత్మయందే లీనమగును. తన అజ్ఞానము లయమైపోగా ద్వైతవస్తువు - ఆత్మకాక మఱియొక్క వస్తువు ఉన్నదనుకొనుట నశించిపోవును - ద్వైతవస్తువు నశించిపోగా శోభనా శోభనామతి లయమైపోవును - అందువలన రాగద్వేషములు నశించును. ఘటమును తెలియగానే - ఇది మట్టియని తెలియగానే - ఇదిఘటము అను అజ్ఞానము నశించును - అట్లే ఆత్మను తెలుసుకొనిన తర్వాత ఆత్మ గుఱించి అయిన అజ్ఞానము నశించును - రజ్జు గుఱించి అది పాము అను అజ్ఞానము నశించగనే పాము కూడ నశించును. ఆ ప్రకారముగానే ఆత్మతత్వము తెలియగానే అజ్ఞానమునకు మూలమైన (కారణమైన) సంసారము (జననమరణములు) నశించును. ఆత్మతత్వము తెలియగానే తత్వమనగా (అన్నింటిలోను ఉన్నది, అన్నీ తానే అయినది) పరబ్రహ్మమను జ్ఞానము కలుగును).

(సాయుజ్యముక్తికి - భగవంతునిలో కలిసిపోయీతనితో ఏకమగుట). సమ్యక్ జ్ఞానము సాక్షాత్సాధనము - ఇది కర్మవలన కాదు, ఈ రెండునూ కలిసియు కాదు. సమ్యక్ జ్ఞానము ఒక్కటే సాక్షాత్ సాధనము - మిగిలినవన్నియు పరంపరా సాధనములు - చిత్తశుద్ధి, భక్తి కలుగచేసి వాటిద్వారా జ్ఞానము కలుగచేసి, జ్ఞానముద్వారా ముక్తిని కలుగచేయునవి).

  1. “జీవవంతు డైన పురుషునికికర్తృత్వ భోక్తృత్వ సుఖత్వ దుఃఖత్వాది గుణాలు ఏవి కలవో అవి చిత్త ధర్మాలు, క్లేశరూపాలు గాబట్టి బంధమనిపించును. ఈ బంధము జ్ఞానము వలననే నివారణము - బంధనివారణమే ముక్తి). (బ్రహ్మవిద్యా సుధార్ణవము - 9)

  2. “కేవలాత్మ కర్మణో జ్ఞానాన్నహి మోక్షో అభిజాయతే |

కింతూభాభ్యాం భావేన్మోక్షః సాధనం తూ భాయం విదుః ||“.

(కేవలము కర్మవలనగాని, జ్ఞానమువలన గాని మోక్షము కలుగదు. రెండింటివలన మోక్షము కలుగును - మోక్షమునకీ రెండును సాధనములే).

  1. “జ్ఞానం జ్ఞానవతామహం” (శ్రీమద్భగవద్గీత - 10 - 37)

(జ్ఞానులలోని జ్ఞానమే నేను - జ్ఞానము (Abstract thing) భగవంతుని విభూతి).

    1. జ్ఞానము పరోక్షమనియు, అపరోక్షమనియు రెండు విధములు. శాస్త్రమువలన కలిగినది పరోక్షజ్ఞానము, బ్రహ్మసాక్షాత్కారమువలన కలిగినది అపరోక్షజ్ఞానము).

    2. “జ్ఞానంతు ద్వివిధం ప్రోక్తం శాబ్దికం ప్రథమం స్మృతం |

వేద శాస్త్రార్థ విజ్ఞానాత్ తద్భవేత్ బుద్ధి యోగతః |

వికల్పాః తత్ర బహవో భవంతి మతికల్పితాః |

అనుభవాఖ్యం ద్వితీయస్తు జ్ఞానం తద్దుర్లభం నృపః ||“.

(జ్ఞానము రెండువిధములు - మొదటిది శాబ్దికము - వేదములయొక్క, శాస్త్రములయొక్క అర్థమును తెలుసుకొనుట వలన బుద్ధియోగమువలన కలిగినది. దీనిలో అనేకమైన వికల్పములు మనసు వలన కలుగును. రెండవది అనుభవజ్ఞానము - ఇది కలుగుట చాలాకష్టము).

  1. ధర్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం - అభ్యుదయ ఫలం ధర్మజ్ఞానం, తచ్ఛానుష్టానాపేక్షం. విశ్రేయసఫలం తు బ్రహ్మ విజ్ఞానం, నచానుష్టానాంతరా పేక్షం -“. (శ్రీశంకరః - బ్రహ్మ సూత్ర భాష్యే)

(ధర్మజ్ఞానమని, బ్రహ్మజ్ఞానమని జ్ఞానము రెండు విధములు _ (ధర్మముల ననుష్టించుట. ఇది అభ్యుదయ ఫలమునిచ్చును, శ్రేయస్సు, అన్ని విధముల సౌఖ్యమును కలుగచేయును - రెండవది బ్రహ్మజ్ఞానము - ఇది నిశ్శ్రేయ సఫలమునిచ్చును, మోక్షమునిచ్చును - దీని అనుష్టానము అవసరములేదు.

  1. జ్ఞానము మూడు విధములు : -

    1. “జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవగుణభేదతః |

ప్రోచ్యతే గుణసంఖ్యా యథావచ్ఛృణు తాన్యపి |

సర్వ భూతేషు యేనైకం భావమవ్యయ మీక్షతే |

అవిభక్తం విభక్తేషు తత్జ్ఞానం విద్ధి సాత్వికం |

పృధక్త్వేన తు యత్ జ్ఞానం నానా భావాన్ పృధక్ విధాన్ |

వేత్తి సర్వేషు భూతేషు తత్ జ్ఞానం విద్ధి రాజసం |

యత్తు కృత్స్నవదేకస్మి న్కార్యే సక్తమ హైతుకం |

అతత్వార్థవ దల్పం చ తత్తామస ముదాహృతం ||“. (శ్రీమద్భగవద్గీత - 18 - 19 to 22)

“కర్తవ్య కర్మ విషయ జ్ఞానం. ఏతత్ సత్వాదిగుణ భేదతః త్రిథా - సాత్విక జ్ఞానం రాజస జ్ఞానం, తామస జ్ఞానం”. (శ్రీరామానుజః)

(చేయవలసిన పనికి సంబంధించిన జ్ఞానము మూడు విధములు _ సాత్వికజ్ఞానము, రాజసజ్ఞానము, తామసజ్ఞానము - సాంఖ్య శాస్త్రములో త్రిగుణములను బట్టి జ్ఞానము మూడువిధములుగా చెప్పబడినది -విభక్తమై - వేరు వేరు వస్తువులుగా ఉన్నటువంటి సమస్త భూతములందు - ఇవి అన్నియు కలిసి ఏకముగాను, (అద్వితీయుడుగాను) అవ్యయము గాను ఉన్న భగవంతుని చూచుట సాత్వికజ్ఞానము, అద్వైతాత్మ దర్శనరూపమగు జ్ఞానము -). అనేకముగా కనబడుచున్న వస్తువులను అనేక భూతముల్కుగా చూచు జ్ఞానము రాజసజ్ఞానము). (ఒకానొక వస్తువునందే భగవంతుడున్నాడు అను అభినివేశము కలుగునో అట్టి జ్ఞానము తాకసజ్ఞానము - ఇది యుక్తియుక్తము కాదు, నిజమైనది కాదు - తుచ్ఛమైనది).

  1. జ్ఞానము మూడు విధములు : - సమ్యక్ జ్ఞానం, సంశయజ్ఞానం, మిధ్యాజ్ఞానం, “ఇది కుండ, యిది బట్ట యని నిశ్చయముగా చెప్పుట సమ్యక్ జ్ఞానము(ప్రమాణజ్ఞానము) - చీకటిలో చూచిన త్రాడు అది త్రాడా, పామా ? అనునది సంశయజ్ఞానము - చీకటిలో త్రాడును చూచి పాము అనుకొనుట మిధ్యాజ్ఞానము - (అప్రమాణజ్ఞానము).
  1. జ్ఞానము జీవుడు గర్భములోనున్నంతవరకు ఉండును - జన్మించగానే జ్ఞానమును కోల్పోవును. అది యెట్లు మరలకలుగుననగా : -

    1. “క. గర్భమున పరిజ్ఞానము

నిర్భరమైయుండు జీవునికి, తుదినతడా

విర్భూతుడైన జెడు;నం

తర్భావంబైన బోధమంతయు ననఘా.

వ. అట్లు గావున జనుండు బాల్య, కైశోర, కౌమార, వయో విశేషణంబుల వెనుకనైననుం, బెద్దయైన వెనుకనైననను, నన్నెఱింగెనేని కృత కృత్యుండగు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - 110, 111)

“భక్త్యా వినా బ్రహ్మజ్ఞానం కదాపి నజాయతే”.

  1. “జ్ఞానమిచ్ఛేత్ మహేశ్వరాత్”.

విద్యాకామునకు నుమావల్లభుండును - - - భజనీయులగుదురు“(చూడుము - 38 - Corrected Number 41). అందుచేత జ్ఞానముకొఱకు ఈశ్వరుని ఉపాసించవలెను.

  1. “వైరాగ్యేణవినా జ్ఞానం న చ భక్తిరతః స్ఫుటం”. (చూడుము 38(3) i.e. 41(3) - 35 i.e.
  2. “శ్రద్ధావాన్ లభతే జ్ఞానం” మత్పరః సం యతేంద్రియః“. (శ్రీమద్భగవద్గీత - 4 - 39)

(భగవద్భక్తుడు జితేంద్రియుడు, శ్రద్ధగలవాడు జ్ఞానమును పొందును).

  1. “తద్విద్ద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |

ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వ దర్శినః ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 34)

(బ్రహ్మజ్ఞానం గల గురువును ఆశ్రయించి, నమస్కరించి, బోధపడే విషయముగుఱించి ప్రశ్నలు వేసి,ఆయన సేవ చేసి ఆయన దయ సంపాదించినయడల అట్టి భగవత్తత్త్వమును తెలిసినవారు ఉపదేశించెదరు - ఇట్లు బ్రహ్మజ్ఞానమును సంపాదింపవలెను).

  1. “యేనా శ్రుతం శ్రుతం భవత్య మతం మతమ విజ్ఞాతం విజ్ఞాతం భవతి”. (ఛాందోగ్యోపనిషత్)

(దేనిని తెలుసుకొనినచో తెలుసుకొనవలసినదంతయు తెలిసినదగును -)

“కస్మిన్ను భవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి” (ముండకోపనిషత్)

(దేనిని తెలుసుకొనిన ఈ ప్రపంచకమంతయు తెలిసినట్లగును ?).

(పైన చెప్పిన రెండింటికి సమాధానము ఈ క్రిందవిధముగానున్నది : -

“యథా మృత్పిండే విజ్ఞాతే సర్వ, మృణ్మయం విజ్ఞాతం భవతి, ఏవం కస్మిం శ్చితే వస్తుని విజ్ఞాతే సర్వం కార్య జాతం విజ్ఞాతం భవతి”.

(దేనిని తెలుసుకొనిన ఈ ప్రపంచమంతుయు తెలిసినట్లగును అను ఈ రెండింటికి ఉత్తరము ఈ క్రిందవిధముగా చెప్పబడినది : - ఒక మట్టిముద్దను తెలుసుకొనిన మట్టితో తయారయిన వస్తువులన్నియు తెలియనగునట్లు భగవంతుని తెలుసుకొనిన అతని నుండి పుట్టినవస్తువులన్నియు - కార్యవస్తువులన్నియు తెలియనగును - ఈ కార్యవస్తువులన్నియు భగవంతుడే, భగవంతుని రూపములే యగుటవలన).

  1. సామాన్య జ్ఞానం - సామాన్యైః సాధారణైః పురుషైః సామాన్య విషయం తు జ్ఞానం ఇత్యపి తు ద్రష్టవ్యం -

(జనసామాన్యముచేత, సాధారణ పురుషులచేత తెలియబడు సామాన్య విషయము జ్ఞానము).

  1. తెలివి.
Transliteration
  1. jñāyatē anēna iti jñānaṃ ; “jñāyatē anēna iti sarva viṣayaṃ aviśēṣēṇa ucyatē” (śrī śaṃkaraḥ)

aṃtaḥkaraṇaṃ.

(samasta viṣayamulu dīni valana pūrtigā telusukonu cunnāḍu - kanuka idi jñānamu - aṃtaḥkaraṇamu)

  1. “jñāyatē anēna ātmā iti jñānaṃ” (śrī rāmānujaḥ)

(paramātma dīni valana teliyabaḍucunnāḍu. aṃducēta idi jñānamu).

  1. ‘ātma viṣayaṃ’ (ātmanu guṟiṃci teliyacēyunadi).

  2. brahmaikya gōcaraṃ. (unnadaṃtayu brahmamē yani ceppunadi).

  3. “parāvara tatva yathātmya jñānaṃ” (śrī rāmānujaḥ)

  4. “ātmādi padārthānāṃ ava bōdhaḥ”. (śrī śaṃkaraḥ)

(ātma modalagu padārthamulanu - vastuvulanu - telusukonuṭa).

  1. “śāstra taḥ ācārya taśca ātmā dīnāṃ avabōdhaḥ, ātmasvarūpa viṣayaṃ, parōkṣa jñānaṃ”

(śāstramuvallanu, guruvu vallanu, ātma modalaguvāṭiguṟiṃci bōdhapaṟacukonuṭa jñānamu. ātma svarūpameṭṭidō anu viṣayamu ceppunavi parōkṣajñānamu).

  1. “śāstra janyaṃ ātma svarūpaṃ ādhyātmāvagāhi”.

(śāstramuvalana kalugu ātmayokka svarūpajñānamu. ādhyātma tatvamunu avagāhanamu cēyunadi).

  1. jñāna śabdēna prakṛti vilakṣaṇā tmayādhātmya jñānaṃ vivakṣitaṃ.

(prakṛtikanna vēraina lakṣaṇamulugala ātmayokka svasvabhāvamunu teliyacēyu yadhātmyajñānamu).

  1. tatva jñānaṃ -

(tatvamulanniṃṭinī telusukonuṭa. paramātma tatvamunu telusukonuṭa - prapaṃcamaṃtaṭa, prapaṃcamulōnunna vastuvulanniṃṭilōnu unna tatvamokaṭē, adē paramātma tatvamu - ī viṣayamunu telusukonuṭa jñānamu).

  1. yathā ādityaḥ samastaṃ vastu jātaṃ avabhāsayati tadyat jñānaṃ. (aparōkṣajñānaṃ). jñēya vastusarvaṃ prakāśayati, - tatparamārtha tatvaṃ prakāśayati.

(sūryuḍu samasta vastuvulanu eṭlu prakāśiṃpacēyucunnāḍō, ā prakāramugānē jñānamu - anagā, aparōkṣajñānamu - jñēyavastuvu naṃtaṭinī prakāśiṃpacēyunu - dāni paramārtha tatvamunu prakāśiṃpa cēyunu).

  1. abhēda darśanaṃ.

(jīvātma paramātmalaku, parabrahmaku prapaṃcamunaku bhēdamu lēdu ani ceppunadi jñānamu).

  1. “brahmaiva sarvaṃ brahmātiriktaṃ na kiṃcidasti iti jñānaṃ”

(ī kanupiṃcu sarvaprapaṃcamunnū brahmamē. brahmamukānidi yēkoṃcemainadiyunu lēdu - idiyē jñānamu -).

(1). “ka. harimayamu viśvamaṃtayu

hari viśvamayuṃḍu, saṃśayamu panilēdā

harimayamu kānidravyamu

paramāṇuvulēdu, vaṃśapāvana, viṃṭē”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 - 17)

(2).”ē yeḍalan lēda īśvarētaramu sutā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 85)

  1. “jñātaṃ yēna nijaṃ rūpaṃ, kaivalyaṃ paramaṃ padaṃ |

niṣkalaṃ nirmalaṃ sākṣāt sacchidānaṃdarūpakaṃ |

utpatti sthiti samhāra sphūrti jñāna vivarjitaṃ |

ē tat jñāna miti prōktaṃ - - - ||“. (yōgatatvōpaniṣat)

kaivalyamu - kēvala ātma tatvamē ayi yuṃḍuṭa -, parama padamu - mōkṣarūpamainadi , niṣkalamu, ē vidhamaina dōṣamu lēnidi. sākṣāttu saccidānaṃda rūpamainadi, sṛṣṭi sthiti laya kāraṇamainadi agutana svasvarūpamunu telusukonuṭayē jñānamu).

  1. “aparōkṣātmavastu viṣayaṃ yadbrahma vidyārūpaṃ tat jñānaśabdēna ucyatē”.

(aparōkṣamaina brahmavastuvu viṣayamugā galadānini bōdhiṃcunadi; parabrahmanuguṟiṃci ayinavidya).

  1. “svaprakāśaṃ jñānaṃ , sarva prakāśaṃ jñānaṃ; nirāvaraṇa cinmātraṃ jñānaṃ, anādyanaṃtaṃ, niraṃtara - ma vṛtti sākṣi caitanyamēva jñānaṃ”.

(svayamugā prakāśiṃcunadi jñānamu; anniṃṭinī prakāśiṃpacēyunadi jñānamu; āvaraṇa - ācchādanamu - lēni caitanyamātramu jñānamu, anādi, anaṃtamu sākṣi caitanyamainadi jñānamu).

  1. “satyaṃ jñānamanaṃtaṃ brahma -”,

“satyaṃ brahma, jñānaṃ brahma , anaṃtaṃ brahmēti - jñānaśabdaḥ jñapti svarūpaṃ brahma lakṣa yitvā jaḍatvaṃ niṣēdhati”.

(brahma satyamu, brahma jñānamu, brahma anaṃtamu, brahma jñaptisvarūpamu - iṭlu ceppuṭacēta brahma jaḍamu kādu ani ceppinaṭlu).

“jñānapadaṃ nityā saṃkucita jñānaikākāramāha -”.

(ellapuḍu taragani jñānamē svarūpamugā galavāḍu brahma ani jñānapadamuna karthamu).

  1. “dēhēṃdriya nigraha sadgurūpāsana śravaṇa, manana, nidhi dhyāsanaiḥ yadyat dṛk dṛśya svarūpaṃ, sarvāṃtarasthaṃ, sarvasamaṃ, ghaṭaghaṭādipadphārthamivā vikāraṃ, vikārēṣu caitanyaṃ vinā kiṃcinnā stīti sākṣātkārānubhavaḥ jñānaṃ”. (nirālaṃbōpaniṣat)

(dēhamunu, iṃdriyamulanu nigrahiṃcuṭa (tana vaśamulō nuṃcukonuṭa), sadguruvu valana upāsana poṃduṭa, śravaṇa, manana, nidhi dhyāsamulu - vīṭi anniṃṭicētanu dṛk rūpamu dṛśyarūpamu - ī reṃḍu rūpamulu tānē ayinadinnī, anniṃṭilōnu aṃtaryāmigā nuṃḍunadinī, anniṃṭi yaḍala heccu takkuvalu lēka samamugā nuṃḍunadinnī, kuṃḍa, baṭṭa, modalagu padārthamulavale vikāramu poṃdanidi (mārpu lēnidi) ayina vastuvunu, (vikāramunu poṃdina prati vastuvulōnu caitanyaṃ tappa marēmiyu lēdu). sākṣātkāramu cēsukonu anu bhāvamu jñānamu).

  1. “jñēyaṃ paraṃ tatvaṃ vāsudēvākhyaṃ, aparaṃ ca prakṛtyādikaṃ lakṣyatē jñānaśabdēna” -

(jñēyamagu vastuvu vāsudēvuḍanu pērugala paratatvamu, prakṛti modalagunavi aparamu - ī reṃḍu tatvamulanu teliyacēyuṭayē lakṣyamugā galadi jñānamu).

  1. “idaṃ śarīraṃ kauṃtēya kṣētra mityabhidhīyatē |

ē tadyō vētti taṃ prāhuḥ kṣētrajña iti tadvidaḥ |

kṣētrajñaṃ cāpimāṃ viddhi sarvakṣētrēṣu bhārata |

kṣētra kṣētrayō rjñānaṃ yattat jñānaṃ mataṃ mama ||“. (śrīmadbhagavadgīta - 13 - 1, 2)

(ī śarīramu kṣētramu - dīnini telisinavāḍu - kṣētrajñuḍu - samastamaina kṣētramulaṃduṃḍu kṣētrajñuḍanu nēnē (bhagavaṃtuḍu).

ahaṃhi sarvabhūtēṣu sarva bhūtānyadhōmayi | iti jñānaṃ - - ||.

  1. “jñānaṃ tē ahaṃ savijñāna midhaṃ vakṣyāmya śēṣataḥ |

yat jñātvā nēha bhūyō anyat jñātavya mavaśiṣyatē |

- - - bhūmirāpō(a)nalō vāyuḥ khaṃ manōbuddhi rēvaca |

ahaṃkāraḥ itīyaṃ mē bhinnā prakṛti raṣṭathā |

aparēyaṃ ītastva nyāṃ prakṛtiṃ mē parāṃ |

jīvābhūtāṃ mahābhūtāṃ ya yēdaṃ dhāryatē jagat |

ē tadyōnīni bhūtāni sarvāṇī tyupadhāraya |

ahaṃ kṛtsnasya jagataḥ prabahavaḥ pralayastathā |

mattaḥ parataraṃ nānyadasti dhanaṃjaya |

mayi sarvamidaṃ prōtaṃ sūtrē maṇi gaṇā iva |

- - bījaṃ māṃ sarvabhūtānāṃ viddhipārtha sanātanaṃ |

yēcaiva sātvikā bhāvā rājasāstā ma sāśca yē |

matta ēvēti tān viddhi - - - |

- - nāhaṃ prakāśaḥ sarvasya yōgamāyā samāvṛtaḥ ||“. (śrīmadbhagavadgīta - 7 - 2, 4 to 7, 10, 12, 25)

(nāku (bhagavaṃtuniki) reṃḍu śaktulu galavu - parāprakṛti, aparāprakṛti. aparāprakṛti enimidi vidhamulugā nunnadi - sūkṣmarūpamulōnunna bhūmi, jalamu, agni vāyuvu, ākāśamu, manassu, buddhi, ahaṃkāramu. ikkaḍa buddhi yanagā mahattattvamu - dīnilōnuṃḍi ahaṃkāramu puṭṭinadi. iviyē aṣṭa prakṛtulu - ī aparāprakṛtiyē kṣētramu - idi jaḍamu, svataṃtramugā ēmiyu cēyalēnidi. reṃḍavaśakti parāśakti. idi caitanya śakti - bhagavaṃtuḍu ī caitanyaśaktitō aparāprakṛtilō kaliyaganē aparāprakṛtiki caitanyamu kaligi dānilōnuṃḍi - okadānilōnuṃḍi okaṭigā - īsṛṣṭilōnunna samasta vastuvulu puṭṭucunnavi. aṃducēta ā samasta vastuvulaku idi yōni - puṭṭucōṭu - ī prapaṃcamaṃtaṭini - dānilōni vastuvulanniṃṭinī - puṭṭiṃcuvāḍanu, samhariṃcuvāḍanu - layamu cēyuvāḍanu nēnē. nākaṃṭe utkṛṣṭamainadi vērokaṭi lēdu. dāramutō maṇulu grucci unnaṭlu idaṃtayu - ī jagattulōni vastuvulanniṃṭilōnu - nēnuṃḍi vāṭini nālō kaṭṭipeṭṭi yunnānu. samastamaina vastuvulu puṭṭuṭaku bījamu nēnē - ē yē vastuvulu puṭṭucunnavō avanniyu nā valananē puṭṭucunnavi. nēnu prati vastuvulō nuṃḍi, dāniki caitanyamu kaligiṃci, dānilōnuṃḍi iṃkoka vastuvunu puṭṭiṃcucunnānu - nēnu anniṃṭilōnuṃḍi vāṭiki nā caitanyamunicci vāṭi cēta vāṭi panulu cēyiṃcucunnānu - iṭlu anniṃṭilōnunnappaṭikī nā yōgamāyacēta nēnu kappabaḍiyuṃḍuṭacēta nēnu anniṃṭilōnu unnaṭlu evariki kanabaḍanu (“marugēlarā, ō, rāghavā | - tyāgarāju). iṭlu prakṛti puruṣula saṃ yōgamu valananē - parāśakti (caitanya śakti) gala bhagavaṃtuḍu aparāśakti yaina prakṛtitō kaliyuṭacētanē okavastuvulōnuṃḍi iṃkoka vastuvu puṭṭucunnadi - sṛṣṭi jarugucunnadi. (Creation is the result of the combination of matter and energy). ī paina ceppina viṣayamu sṝṣṭi kramamunaku saṃbaṃdhiṃcinadi. dīni viṣayamaina jñānamukaṃṭe utkṛṣṭamaina jñānamu lēdu - anni vidhamulaina jñānamu ī sṛṣṭi kramamulōnē imiḍi yunnavi kanuka).

  1. “cida cidvastu viśēṣa viṣa yō niścayaḥ”. (śrīrāmānujaḥ)

(cit, acit - ātma, anātma - ēdi ēdō anu viṣayamunu niścayiṃci ceppunadi jñānamu).

“ātmānātma vivēkaḥ, ajaḍaṃ, paramātma viṣayaṃ”.

(ātma yanagā ēmiṭi, anātma yanagā nēmiṭi ? anu vivēkamu kaligiṃcunadi ; paramātmayē viṣayamagucunnadi. paramātma guṟiṃci ceppunadi - jaḍamukānidi).

  1. “ātmanaḥ prakṛti puruṣākhyāṃ vilakṣaṇatvēna avalōkanaṃ”.

(prakṛti puruṣulakanna, prakṛti jīvātmalakanna ātma vērainadi anu telusukonuṭa).

  1. “manaṃbaṃdu pratibiṃbiṃcina caitanyaṃbu jñānamanaṃbaḍu”. (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)

  2. “yataḥ jñānēsati bhakti vairāgyē sāṃgē saṃpūrṇē siddhyataḥ tasmāt bhaktē rvairāgyasya ca yā parākāṣṭā sā jñānaṃ”.

(jñānamu kaligina bhakti vairāgyamulu pūrtigā siddhiṃcunu. aṃducēta ā bhakti vairāgyamulu parākāṣṭā sā jñānaṃ”.

(jñānamu kaligina bhakti vairāgyamulu pūrtigā siddhiṃcunu. aṃducēta ā bhakti vairāgyamulu parā kāṣṭayē - avi ucchasthitilōnuṃḍuṭayē jñānamu).

  1. “jñānaṃ nāma cittasya madākāra mariṇāmaḥ, sa ca māṃ bhajataḥ svabhāvataḥ ēva bhavati, natu yatnāṃtara mapēkṣatē.

(jñānamanagā cittamu bhagavadākāramugā māruṭa. idi bhagavaṃtuni bhajiṃcu vāriki svabhāvasiddhamuganē kalugunu, iṃkoka prayatnamavasaramu lēkuṃḍaganē).

  1. “na vaikādaśa paṃcatrīn bhāvān bhūtēṣu yē na vai |

ī kṣētādhaika mapyēṣu tat jñānaṃ mama niścitaṃ ||. (śrīmadbhāgavataṃ - 11 - 19 -)

(prakṛti puruṣuḍu - ī iddari saṃ yōgamuvalana migilina tatvamulu - anagā, mahattattvamu, ahaṃkāramu, paṃcatanmātralu, paṃcamahābhūtamulu, ēkādaśa iṃdriyamulu, satvarajasthamōguṇamulu anu iruvadi enimidi tatvamulu bhagavaṃtuni bhāvamulu - vibhūtulu - atanilōnuṃḍi puṭṭi atani rūpamulē ayi yunnavi. ivi yanniyunu kalisi ī kanabaḍu prapaṃcamugā mārinavi. ī prapaṃcamaṃtayu, aṃdulōni vastuvulanniyu paina ceppina tatvamulanniṃṭitōnu niṃḍiyunnavi. ī tatvamulanniyu prapaṃcamaṃtaṭilōnu, dānilōni vastuvulanniṃṭilōnu vyāpiṃciyunnavi. iṭṭi ī tatvamulanniṃṭilōnu, vāṭitō vyāpiṃciyunna prapaṃcamaṃtaṭilōnu, vāṭitō (pāṭu vyāpiṃci pūrtigā niṃḍiyunnadi paramātmatatvamu ani, aṃtā paramātmayē yani, annīparamātmayēyani, atanu tappa maṟiyoka vastuvu lēdani telusukonuṭayē jñānamu).

  1. “jñāyatē anēna iti vyutpatyā jñānāni iṃdriyāṇi ityarthaḥ” (raṃgarāmānujaḥ)

(iṃdriyamulavalana telusukonucunnāmu kanuka jñānamanagā iṃdriyamulu) –

“jñānārthatvāt śrōtrādīni iṃdriyāṇi jñanāni ucyatē”

(jñānamunaku sādhanamulaguṭacēta cevi modalagu iṃdriyamulu jñānamu ani ceppabaḍucunnavi).

  1. śāstrōtthaṃ; vēda tātparya niścayaḥ -

(vēdamuvalana kaliginadi; vēdamulō ceppina viṣayamunu niścayamugā, saṃśayamu lēkuṃḍatelusukonuṭa).

  1. jñāyatē anēna iti jñānaṃ - śāstraṃ.

(śāstramuvalana telusukonabaḍucunnavi ganuka śāstramu jñānamu).

  1. “sāṃkhyā yōgaḥ pāṃcarātraṃ vēdāḥ pāśyupataṃ tathā |

jñānānyētāni paṃcaiva jñēyaścaiva mahēśvaraḥ ||“. (padmapurāṇamu)

(sāṃkhyamu, yōgamu, pāṃcarātramu, vēdamulu, pāśyupatamu - ī ayidunnū jñānamulu - jñānamunu kalugacēyunavi kanuka. vīṭi valana teliyatagu vastuvu - mahēśvaruḍu).

  1. “śabda pramāṇakaṃ jñānaṃ brahma tatvaika gōcaraṃ” (gītābhāva prakāśamu - 9 - 12)

(vēdamē pramāṇamugāgalaparamātma tatvamunu gōcariṃpacēyunadi - unnadaṃtayu okē tatvamuani teliyacēyunadi)

“jñānaṃ vēdaśirōdbhūtamitimē niścitā matiḥ”. (sūta saṃhita)

  1. “śāstrōktānāṃ padārthānāṃ jñānaṃ syā dau padēśikaṃ”.

(śāstramulō ceppabaḍina padārthamula guṟiṃci ayina jñānamu aupadēśikamu).

  1. laukika, śuddha laukika, lōkōttara bhēdēna yat jñāyatē tat jñānaṃ, śāstra janya mityarthaḥ -

(idi laukika jñānamu, idi śuddhalaukikamu, idi uttraralōkamulaku saṃbaṃdhiṃcinadi ani telusukonuṭa jñānamu - anagā śāstramuvalana kaligina jñānamu).

  1. “jñānaṃ sanyāsa lakṣaṇaṃ”.

(jñānamu sanyāsi lakṣaṇamu - sarvasaṃga sanyāsamu, sarvakarma sanyāsamu cēsina vāḍē sanyāsi. adiyē jñānamu).

  1. “satvāt saṃ jāyatē jñānaṃ” (śrīmadbhagavadgīta - 14 - 17)

(satvaguṇamu kaligiyuṃḍuṭavalana jñānamu kalugunu).

  1. “vairāgyēṇa vinā jñānaṃ na ca bhakti rataḥ sphuṭaṃ” -

(vairāgyamu lēnicō jñānamu, bhakti kalugadu).

  1. “vāsudēvē bhagavati bhakti yōgaḥ prayōjitaḥ |

janayatyāsu vairāgyaṃ jñānaṃ ca yadahaitukaṃ ||“. (śrīmadbhāgavataṃ - 1 - 2 - 7)

“śraddhāvān labhatē jñānaṃ matsaraḥ”.

(“puruṣulaku parama dharmaṃbagu vāsudēvuniyaṃdu brayōgiṃpabaḍina bhaktiyōgaṃbu vairāgya vijñānaṃbula buṭṭiṃcu” –

(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 27)

  1. “buddhirjñānēna śuddhyati” (manuḥ)

(jñānamucēta cittaśuddhi kalugunu).

  1. “jñānamu ajñānamunu nāśamu cēyunu -

    1. “yathā ēkaḥ ēva ādityaḥ aṃdhakāraṃ nāśayati, bhūmaṃḍalaṃ ca prakāśayati, tathā ēkamēva jñānaṃ ajñānaṃ nivartayati, paraṃ ca prakāśayati”.

(okē sūryuḍu cīkaṭini pōgoṭṭucū bhūmaṃḍalamunu prakāśiṃpa cēyunu - ā prakāramugānē jñānamu anunadi okaṭē ajñānamunu pōgoṭṭunu, maṟiyu paramātmanu prakāśiṃpacēyunu - paramātma jñānamunu kalugacēyunu, - mōkṣamunu kalugacēyunu).

  1. “jñānēnatu tadajñānaṃ yēṣāṃ nāśita mātmanaḥ |

tēṣāmādityavat prakāśayati tatparaṃ”. (śrīmadbhagavadgīta - 5 - 16)

(jñānamucēta evariyokka ajñānamu naśiṃpa cēyabaḍinadō vāriki ajñānamu sūryunivale paratatvamunu - paramātmanu prakāśiṃpacēyunu. (jñānē naivatu kaivalyaṃ)

  1. jñānamuvalana - bhagavat jñānamu kaluguṭavalana pāpamulanniyu naśiṃcunu -

    1. “sarvaṃ jñāna plavēnaina vṛjinaṃ saṃtariṣyasi” (śrīmadbhagavadgīta - 4 - 36)

(mahāpāpivainanu brahmajñānamanu teppacētanē annipāpakarmala phalamunu dāṭagalavu).

  1. ya dhaidhāṃ si samidbhō(a)gnirbhasmasāt kurutē (a)rjuna |

jñānāgniḥ sarva karmāṇi bhasmasātkurutē tathā ||“. (śrīmadbhagavadgīta - 4 - 37)

“yathā yathāṃsi kāṣṭāni samiddhaḥ agniḥ dīptāgniḥ bhasmī bhāvaṃ karōti tathā jñānāgniḥ sarvakarmāṇi bhasmasdāt kurutē, nirbījaṃkarō tītyarthaḥ - nahi sākṣā dēvajñānāgniḥ karmāṇi iṃdhanavat bhasmīkartuṃ śaknōti tasmāt samyak darśanaṃ sarva karmaṇāṃ nirbījatvē kāraṇaṃ ityabhi prāyaḥ. sāmarthyāt yēna karmaṇā śarīraṃ ārabdaṃ tat pravṛtta phalatvāt upabhōgē naiva kṣīyatē -” tasyatāva dēva ci raṃ yāvanna vimōkṣyē atha saṃpatsyē -“iti śritēḥ - atōyāni apravṛtta phalāni jñānōtpattēḥ prāk kṛtāni jñāna saha bāvīni vā atītānēka janma kṛtāni ca tānyēva sarvāṇi bhasmasāt kurutē”. (śrī śaṃkaraḥ)

(bāgā maṃḍucunna agni kaṭṭelanu eṭlu bhasmamu cēyunō ā prakāramugānē jñānamanu agni - brahmajñānamanu agni - karmalananniṃṭini bhasmamu cēyunu, nirbījamu cēyunu - marala molaketti phalamuniccuṭaku vīlu lēnaṭlu cēyunu - kaṭṭelanu agni bhasmamu cēsinaṭlu jñānāgni yadhārthamugā bhasmamu cēyalēdu - ē karma cēyuṭavalana dāni phalamugā ippaṭi janma kaliginadō adi dāni phalamuniccuṭaku modalu peṭṭinadi kanuka ā karma anubhavamuvalananē kṣīṇiṃcunu - ā karma phalamu nanubhaviṃcuṭa tīraganē muktuḍagunu - ani śruti ceppucunnadi. aṃducēta prārabdhakarmanu tappa migilina enni janmamulalō cēsina karmalanainanu jñānamu bhasmamu cēyunu).

  1. “vāsudēvaparaṃ jñānaṃ” (śrīmadbhāgavataṃ 1 - 2 - 28)

(jñānamu vāsudēvuni paramu - atani dvārā labhyamagunadi - aṃducēta “bhaktyā vinā brahmajñānaṃkadāpi na jāyatē” (bhagavaṃtuniyaṃdu bhakti lēnidē jñānamu kalugadu - “vēda yāga yōga kriyā jñāna tapōgati dharmaṃbulu vāsudēva paraṃbulu”

(śrīmadāṃdhra mahābhāgavatamu - 1 - 2 - 24)

“śraddhāvān labhatē jñānaṃ matparaḥ saṃ yatēṃdriyaḥ |

jñānaṃ labdhvā parāṃ śāṃti macirēṇādhigacchati ||” (śrīmadbhagavadgīta - 4 - 39)

(guruvunaṃdu, vēdāṃtavākyamulaṃdu nammakamu kaligi, iṃdriyajayamu kaligi, bhagavaṃtuniyaṃdu bhakti kaligi yuṃḍuvāniki brahmajñānamu kalugunu - brahmajñānamu kaligina tarvāta tvaragā paramaśāṃtiyagu mōkṣamunu poṃdunu).

“jñānamicchēt mahēśvarāt” (jñānamukoṟaku mahēśvaruni upāsiṃcavalenu).,

“yassarvajña ssarvavit” (atanu sarvajñuḍu - anniyu telisnavāḍukanuka).

  1. jñānamuvalananē mōkṣamu kalugunu - “jñānē naivatu kaivalyaṃ”

    1. “jñānamēva mahāviṣṇō mōkṣasādhana mucyatē |

jñānaṃ vēda śirōrbhūtamiti mē niścitāmatiḥ |

anēka janma siddhānāṃ śrauta smārtānu vartināṃ |

jāyatē tasya vijñānaṃ prasādādēvamē, harē ! ||” (sūta saṃhita)

(ō mahāviṣṇū ! jñānamē mōkṣamunaku sādhanamu. jñānamu upaniṣattulavalana kalugunadi. śrauta smārtulaku anēka janmamulalō nā prasādamu - anugrahamu - kaluguṭavalana kaligina jñānamu).

  1. “ātmanaḥ paramā muktirjñānādēva, na karmaṇā |

jñānaṃ vēdāṃta vākyānāṃ mahā tātparya nirṇayāt |

utpannayāṃ manō vṛttau mahātmyā yaṃbujēkṣaṇa |

abhivyaktaṃ bhavē dētat brahmaivātmavicārataḥ |

anē naivātmanō (a)jñānamātmanyēva vilīyatē |

vilīnē svātmanō(a) jñānē dvaitaṃ vastu vinaśyati |

dvaita vastu vināśētu śōbhanā śōbhanā maṭiḥ |

līyatē mati nāśēna rāgadvēṣau vinaśyataḥ

dharmā dharma kṣayāddēhō jñātvā dēvamiti śrutiḥ |

ghaṭajñānāt ghaṭājñānaṃ yathā lōkē vinaśyati |

tadhātmajñāna mātrēṇa naśyatya jñānamātmanaḥ |

rajjvajñāna vināśēna rajju sarvō vinaśyati |

tasmādajñāna mūlasya saṃsārasya kṣayō, harē |

ātmanasta tva vijñānāt tatvaṃ brahmaiva kēvalaṃ ||“. (sūtasaṃhita)

“tatra sāyujya rūpā yā muktē ssākṣāttu sādhanaṃ |

samyak jñānaṃ. nakarmōktaṃ, na tayōśca samuccayaḥ ||“. (sūtasaṃhita)

(ātmaku paramamukti jñānamuvalananē kalugunu, karmavalana kādu. jñānamanagā vēdāṃta vākyamula mahā tātparyamunu nirṇayiṃcuṭavalana kaligina manōvṛttilō kaligina mahātmyamu. idi ātma guṟiṃci cēsina vicāramuvalana kalugunadi. dīni cēta ātma guṟiṃci kaligina ajñānamu ātmayaṃdē līnamagunu. tana ajñānamu layamaipōgā dvaitavastuvu - ātmakāka maṟiyokka vastuvu unnadanukonuṭa naśiṃcipōvunu - dvaitavastuvu naśiṃcipōgā śōbhanā śōbhanāmati layamaipōvunu - aṃduvalana rāgadvēṣamulu naśiṃcunu. ghaṭamunu teliyagānē - idi maṭṭiyani teliyagānē - idighaṭamu anu ajñānamu naśiṃcunu - aṭlē ātmanu telusukonina tarvāta ātma guṟiṃci ayina ajñānamu naśiṃcunu - rajju guṟiṃci adi pāmu anu ajñānamu naśiṃcaganē pāmu kūḍa naśiṃcunu. ā prakāramugānē ātmatatvamu teliyagānē ajñānamunaku mūlamaina (kāraṇamaina) saṃsāramu (jananamaraṇamulu) naśiṃcunu. ātmatatvamu teliyagānē tatvamanagā (anniṃṭilōnu unnadi, annī tānē ayinadi) parabrahmamanu jñānamu kalugunu).

(sāyujyamuktiki - bhagavaṃtunilō kalisipōyītanitō ēkamaguṭa). samyak jñānamu sākṣātsādhanamu - idi karmavalana kādu, ī reṃḍunū kalisiyu kādu. samyak jñānamu okkaṭē sākṣāt sādhanamu - migilinavanniyu paraṃparā sādhanamulu - cittaśuddhi, bhakti kalugacēsi vāṭidvārā jñānamu kalugacēsi, jñānamudvārā muktini kalugacēyunavi).

  1. “jīvavaṃtu ḍaina puruṣunikikartṛtva bhōktṛtva sukhatva duḥkhatvādi guṇālu ēvi kalavō avi citta dharmālu, klēśarūpālu gābaṭṭi baṃdhamanipiṃcunu. ī baṃdhamu jñānamu valananē nivāraṇamu - baṃdhanivāraṇamē mukti). (brahmavidyā sudhārṇavamu - 9)

  2. “kēvalātma karmaṇō jñānānnahi mōkṣō abhijāyatē |

kiṃtūbhābhyāṃ bhāvēnmōkṣaḥ sādhanaṃ tū bhāyaṃ viduḥ ||“.

(kēvalamu karmavalanagāni, jñānamuvalana gāni mōkṣamu kalugadu. reṃḍiṃṭivalana mōkṣamu kalugunu - mōkṣamunakī reṃḍunu sādhanamulē).

  1. “jñānaṃ jñānavatāmahaṃ” (śrīmadbhagavadgīta - 10 - 37)

(jñānulalōni jñānamē nēnu - jñānamu (Abstract thing) bhagavaṃtuni vibhūti).

    1. jñānamu parōkṣamaniyu, aparōkṣamaniyu reṃḍu vidhamulu. śāstramuvalana kaliginadi parōkṣajñānamu, brahmasākṣātkāramuvalana kaliginadi aparōkṣajñānamu).

    2. “jñānaṃtu dvividhaṃ prōktaṃ śābdikaṃ prathamaṃ smṛtaṃ |

vēda śāstrārtha vijñānāt tadbhavēt buddhi yōgataḥ |

vikalpāḥ tatra bahavō bhavaṃti matikalpitāḥ |

anubhavākhyaṃ dvitīyastu jñānaṃ taddurlabhaṃ nṛpaḥ ||“.

(jñānamu reṃḍuvidhamulu - modaṭidi śābdikamu - vēdamulayokka, śāstramulayokka arthamunu telusukonuṭa valana buddhiyōgamuvalana kaliginadi. dīnilō anēkamaina vikalpamulu manasu valana kalugunu. reṃḍavadi anubhavajñānamu - idi kaluguṭa cālākaṣṭamu).

  1. dharmajñānaṃ brahmajñānaṃ - abhyudaya phalaṃ dharmajñānaṃ, tacchānuṣṭānāpēkṣaṃ. viśrēyasaphalaṃ tu brahma vijñānaṃ, nacānuṣṭānāṃtarā pēkṣaṃ -“. (śrīśaṃkaraḥ - brahma sūtra bhāṣyē)

(dharmajñānamani, brahmajñānamani jñānamu reṃḍu vidhamulu _ (dharmamula nanuṣṭiṃcuṭa. idi abhyudaya phalamuniccunu, śrēyassu, anni vidhamula saukhyamunu kalugacēyunu - reṃḍavadi brahmajñānamu - idi niśśrēya saphalamuniccunu, mōkṣamuniccunu - dīni anuṣṭānamu avasaramulēdu.

  1. jñānamu mūḍu vidhamulu : -

    1. “jñānaṃ karma ca kartā ca tridhaivaguṇabhēdataḥ |

prōcyatē guṇasaṃkhyā yathāvacchṛṇu tānyapi |

sarva bhūtēṣu yēnaikaṃ bhāvamavyaya mīkṣatē |

avibhaktaṃ vibhaktēṣu tatjñānaṃ viddhi sātvikaṃ |

pṛdhaktvēna tu yat jñānaṃ nānā bhāvān pṛdhak vidhān |

vētti sarvēṣu bhūtēṣu tat jñānaṃ viddhi rājasaṃ |

yattu kṛtsnavadēkasmi nkāryē saktama haitukaṃ |

atatvārthava dalpaṃ ca tattāmasa mudāhṛtaṃ ||“. (śrīmadbhagavadgīta - 18 - 19 to 22)

“kartavya karma viṣaya jñānaṃ. ētat satvādiguṇa bhēdataḥ trithā - sātvika jñānaṃ rājasa jñānaṃ, tāmasa jñānaṃ”. (śrīrāmānujaḥ)

(cēyavalasina paniki saṃbaṃdhiṃcina jñānamu mūḍu vidhamulu _ sātvikajñānamu, rājasajñānamu, tāmasajñānamu - sāṃkhya śāstramulō triguṇamulanu baṭṭi jñānamu mūḍuvidhamulugā ceppabaḍinadi -vibhaktamai - vēru vēru vastuvulugā unnaṭuvaṃṭi samasta bhūtamulaṃdu - ivi anniyu kalisi ēkamugānu, (advitīyuḍugānu) avyayamu gānu unna bhagavaṃtuni cūcuṭa sātvikajñānamu, advaitātma darśanarūpamagu jñānamu -). anēkamugā kanabaḍucunna vastuvulanu anēka bhūtamulkugā cūcu jñānamu rājasajñānamu). (okānoka vastuvunaṃdē bhagavaṃtuḍunnāḍu anu abhinivēśamu kalugunō aṭṭi jñānamu tākasajñānamu - idi yuktiyuktamu kādu, nijamainadi kādu - tucchamainadi).

  1. jñānamu mūḍu vidhamulu : - samyak jñānaṃ, saṃśayajñānaṃ, midhyājñānaṃ, “idi kuṃḍa, yidi baṭṭa yani niścayamugā ceppuṭa samyak jñānamu(pramāṇajñānamu) - cīkaṭilō cūcina trāḍu adi trāḍā, pāmā ? anunadi saṃśayajñānamu - cīkaṭilō trāḍunu cūci pāmu anukonuṭa midhyājñānamu - (apramāṇajñānamu).
  1. jñānamu jīvuḍu garbhamulōnunnaṃtavaraku uṃḍunu - janmiṃcagānē jñānamunu kōlpōvunu. adi yeṭlu maralakalugunanagā : -

    1. “ka. garbhamuna parijñānamu

nirbharamaiyuṃḍu jīvuniki, tudinataḍā

virbhūtuḍaina jeḍu;naṃ

tarbhāvaṃbaina bōdhamaṃtayu nanaghā.

va. aṭlu gāvuna januṃḍu bālya, kaiśōra, kaumāra, vayō viśēṣaṇaṃbula venukanainanuṃ, beddayaina venukanainananu, nanneṟiṃgenēni kṛta kṛtyuṃḍagu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - 110, 111)

“bhaktyā vinā brahmajñānaṃ kadāpi najāyatē”.

  1. “jñānamicchēt mahēśvarāt”.

vidyākāmunaku numāvallabhuṃḍunu - - - bhajanīyulaguduru”(cūḍumu - 38 - Corrected Number 41). aṃducēta jñānamukoṟaku īśvaruni upāsiṃcavalenu.

  1. “vairāgyēṇavinā jñānaṃ na ca bhaktirataḥ sphuṭaṃ”. (cūḍumu 38(3) i.e. 41(3) - 35 i.e.
  2. “śraddhāvān labhatē jñānaṃ” matparaḥ saṃ yatēṃdriyaḥ”. (śrīmadbhagavadgīta - 4 - 39)

(bhagavadbhaktuḍu jitēṃdriyuḍu, śraddhagalavāḍu jñānamunu poṃdunu).

  1. “tadvidddhi praṇipātēna paripraśnēna sēvayā |

upadēkṣaṃti tē jñānaṃ jñāninastatva darśinaḥ ||“. (śrīmadbhagavadgīta - 4 - 34)

(brahmajñānaṃ gala guruvunu āśrayiṃci, namaskariṃci, bōdhapaḍē viṣayamuguṟiṃci praśnalu vēsi,āyana sēva cēsi āyana daya saṃpādiṃcinayaḍala aṭṭi bhagavattattvamunu telisinavāru upadēśiṃcedaru - iṭlu brahmajñānamunu saṃpādiṃpavalenu).

  1. “yēnā śrutaṃ śrutaṃ bhavatya mataṃ matama vijñātaṃ vijñātaṃ bhavati”. (chāṃdōgyōpaniṣat)

(dēnini telusukoninacō telusukonavalasinadaṃtayu telisinadagunu -)

“kasminnu bhavō vijñātē sarvamidaṃ vijñātaṃ bhavati” (muṃḍakōpaniṣat)

(dēnini telusukonina ī prapaṃcakamaṃtayu telisinaṭlagunu ?).

(paina ceppina reṃḍiṃṭiki samādhānamu ī kriṃdavidhamugānunnadi : -

“yathā mṛtpiṃḍē vijñātē sarva, mṛṇmayaṃ vijñātaṃ bhavati, ēvaṃ kasmiṃ ścitē vastuni vijñātē sarvaṃ kārya jātaṃ vijñātaṃ bhavati”.

(dēnini telusukonina ī prapaṃcamaṃtuyu telisinaṭlagunu anu ī reṃḍiṃṭiki uttaramu ī kriṃdavidhamugā ceppabaḍinadi : - oka maṭṭimuddanu telusukonina maṭṭitō tayārayina vastuvulanniyu teliyanagunaṭlu bhagavaṃtuni telusukonina atani nuṃḍi puṭṭinavastuvulanniyu - kāryavastuvulanniyu teliyanagunu - ī kāryavastuvulanniyu bhagavaṃtuḍē, bhagavaṃtuni rūpamulē yaguṭavalana).

  1. sāmānya jñānaṃ - sāmānyaiḥ sādhāraṇaiḥ puruṣaiḥ sāmānya viṣayaṃ tu jñānaṃ ityapi tu draṣṭavyaṃ -

(janasāmānyamucēta, sādhāraṇa puruṣulacēta teliyabaḍu sāmānya viṣayamu jñānamu).

  1. telivi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.