← Back to జ్ఞ · Booklets 11–20 (digitized file 2)

జ్ఞానయజ్ఞము jñānayajñamu

Original — తెలుగు
  1. “జ్ఞానం శాస్త్రార్థ పరిజ్ఞానం యజ్ఞం”

(జ్ఞానమనగా శాస్త్రములలోని అర్థమును తెలుసుకొనుట. అదియే యజ్ఞము).

  1. జ్ఞానం స్వాధ్యాయార్థస్య పూర్వోత్తర మీమాంసా విచారః - స ఏవ యజ్ఞః”

(జ్ఞానమనగా వేదాధ్యయనము కొఱకు పూర్వ మీమాంస ఉత్తరమీమాంస విచారించుట, తాత్పర్య మును అవగాహన చేసుకొనుట. అదియే యజ్ఞము - జ్ఞానయజ్ఞము).

  1. జ్ఞానం ఏవ భగవద్విషయం యజ్ఞః - (జ్ఞానమే - బ్రహ్మజ్ఞానమే - భగవంతుని విషయమైన యజ్ఞము).

  2. “సత్యం జ్ఞానమనంతం యన్నిర్విశేషం నిరంజనం |

తత్పదార్థః పరంబ్రహ్మతదేవాగ్ని ర్హుతాశ్రయః |

తస్మిన్నగ్నౌ చిదాత్మానం త్వం పదార్థం ముముక్షవః |

వస్తుతో బ్రహ్మనంతం తం యజ్ఞం బుద్ధ్యాది సం యుతం |

ఆహుతీ రూపమధ్యస్తం బ్రహ్మత్వే నైవ జుహ్వతి |

సర్వోపాధి పరిత్యగాత్ బ్రహ్మాత్మ్యైకమఖండితం |

పశ్యంతి బ్రహ నిష్టాస్తే భేదం సమ్యఙ్ని రస్యచ |

యజ్ఞత్వేనైవ సంపాద్య బ్రహ్మాత్మా భేద దర్శనం | - (గీతాభావప్రకాశము - 4 - 172 to 175)

(సత్యం, జ్ఞానము, అనంతము, నిర్విశేషము, నిరంజనము అయిన పరబ్రహ్మ తత్ పదార్థము. ఆ తత్పదార్థమే అగ్నిహోత్రము - హోమము చేయుటకు అయిన అగ్ని. దానిలో మోక్షము కోరువారు జీవుడుఅయిన ‘త్వం’ పదార్థమును జీవేశ్వరైక్యమను జ్ఞానము కలవారై ఆహుతి చేయుదురు - ఇదియే జ్ఞానయజ్ఞము - ద్రవ్య యజ్ఞముకంటె జ్ఞానయజ్ఞము శ్రేష్టము - సమస్తమైన ఉపాధులను విడిచిపెట్టుట వలనబ్రహ్మ నిష్ఠులు బ్రహ్మ జీవుడు ఏకము అని తెలుసుకొని ఈ ప్రకారము చేయునది జ్ఞానయజ్ఞము).

  1. “జ్ఞాన యజ్ఞే వేదోక్తాహం గ్రహోపాసనేన చ |

త్వం వా హమస్మి భగవో దేవతే(అ)హమితిరితే |

జ్ఞానం తదేవ గోవింద యజనం తేన తత్పరాః |

ఉపాస్తోపాసకా భేదచింతా రూపేణ నిస్పృహాః |

మామేవ భేదవ్యా వృత్యా చింతయుత్యుత్త మాజనాః ||.”.

(భగవంతుడా ! నేవే నేను, నేను నీవాడను - నీకు సంబంధించిన వాడను - అని ఇట్లు ‘నేనే నీవు’ అని జ్ఞానము కలిగియుండుట వేదములో చెప్పబడిన ’అహం గ్రహోపాసన - ఇట్టి భగవంతుని రూపమైన జ్ఞానము - జ్ఞానయజ్ఞము - బ్రహ్మ అని అగ్నియందు జీవాత్మ అను హవిస్సును హోమము చేయుట. పరమాత్మలో జీవాత్మను ఐక్యముచేయుటయే జ్ఞానయజ్ఞము)

  1. “శ్రీయాన్ ద్రవ్యమయాన్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరం తప |

సర్వం కర్మాఖిలం, పార్థ, జ్ఞానే పరి సమాప్యతే ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 33)

“ఉక్తై ర్బహువిధైర్య జ్ఞైర్జ్ఞానాఖ్యః స్తూయతే అధ్వరః |

ద్రవ్యసాధన సాధ్యాచ్చసర్వస్మాత్ జ్ఞానవర్జితాత్ |

సమస్తం వైదికం కర్మాఖిలం స్మార్తముపాసనం |

బ్రహ్మాత్మై క్యావ బోధేతత్పర్య వస్యతి సర్వధా |

ప్రతిబంధ క్షయ ద్వారాది జ్ఞాన యజ్ఞస్తతో వరః ||“. (గీతాభావప్రకాశము - 4 - 205 to 207)

(జ్ఞానయజ్ఞము కాక మిగిలిన యజ్ఞములన్నియు అనేక విధములైన ద్రవములచే, ద్రవ్య రూపములోనున్న సాధనములచే చేయబడుచున్నవి. వాటిలో జ్ఞానముతోసంబంధములేదు. అట్టి యజ్ఞములకన్న జ్ఞానయజ్ఞము అధికము, ఉత్తమమైనటువంటిది. సమస్తమైన కర్మలు - వైదిక కర్మలుగాని, స్మార్త కర్మలుగాని జీవబ్రహ్మల ఐక్యమునందే పర్యవసానము పొందుచున్నవి. అందుచేత జ్ఞానయజ్ఞము అన్ని యజ్ఞములకన్న శ్రేష్టమైనది).

Transliteration
  1. “jñānaṃ śāstrārtha parijñānaṃ yajñaṃ”

(jñānamanagā śāstramulalōni arthamunu telusukonuṭa. adiyē yajñamu).

  1. jñānaṃ svādhyāyārthasya pūrvōttara mīmāṃsā vicāraḥ - sa ēva yajñaḥ”

(jñānamanagā vēdādhyayanamu koṟaku pūrva mīmāṃsa uttaramīmāṃsa vicāriṃcuṭa, tātparya munu avagāhana cēsukonuṭa. adiyē yajñamu - jñānayajñamu).

  1. jñānaṃ ēva bhagavadviṣayaṃ yajñaḥ - (jñānamē - brahmajñānamē - bhagavaṃtuni viṣayamaina yajñamu).

  2. “satyaṃ jñānamanaṃtaṃ yannirviśēṣaṃ niraṃjanaṃ |

tatpadārthaḥ paraṃbrahmatadēvāgni rhutāśrayaḥ |

tasminnagnau cidātmānaṃ tvaṃ padārthaṃ mumukṣavaḥ |

vastutō brahmanaṃtaṃ taṃ yajñaṃ buddhyādi saṃ yutaṃ |

āhutī rūpamadhyastaṃ brahmatvē naiva juhvati |

sarvōpādhi parityagāt brahmātmyaikamakhaṃḍitaṃ |

paśyaṃti braha niṣṭāstē bhēdaṃ samyaṅni rasyaca |

yajñatvēnaiva saṃpādya brahmātmā bhēda darśanaṃ | - (gītābhāvaprakāśamu - 4 - 172 to 175)

(satyaṃ, jñānamu, anaṃtamu, nirviśēṣamu, niraṃjanamu ayina parabrahma tat padārthamu. ā tatpadārthamē agnihōtramu - hōmamu cēyuṭaku ayina agni. dānilō mōkṣamu kōruvāru jīvuḍuayina ‘tvaṃ’ padārthamunu jīvēśvaraikyamanu jñānamu kalavārai āhuti cēyuduru - idiyē jñānayajñamu - dravya yajñamukaṃṭe jñānayajñamu śrēṣṭamu - samastamaina upādhulanu viḍicipeṭṭuṭa valanabrahma niṣṭhulu brahma jīvuḍu ēkamu ani telusukoni ī prakāramu cēyunadi jñānayajñamu).

  1. “jñāna yajñē vēdōktāhaṃ grahōpāsanēna ca |

tvaṃ vā hamasmi bhagavō dēvatē(a)hamitiritē |

jñānaṃ tadēva gōviṃda yajanaṃ tēna tatparāḥ |

upāstōpāsakā bhēdaciṃtā rūpēṇa nispṛhāḥ |

māmēva bhēdavyā vṛtyā ciṃtayutyutta mājanāḥ ||.”.

(bhagavaṃtuḍā ! nēvē nēnu, nēnu nīvāḍanu - nīku saṃbaṃdhiṃcina vāḍanu - ani iṭlu ‘nēnē nīvu’ ani jñānamu kaligiyuṃḍuṭa vēdamulō ceppabaḍina ’ahaṃ grahōpāsana - iṭṭi bhagavaṃtuni rūpamaina jñānamu - jñānayajñamu - brahma ani agniyaṃdu jīvātma anu havissunu hōmamu cēyuṭa. paramātmalō jīvātmanu aikyamucēyuṭayē jñānayajñamu)

  1. “śrīyān dravyamayān yajñāt jñānayajñaḥ paraṃ tapa |

sarvaṃ karmākhilaṃ, pārtha, jñānē pari samāpyatē ||“. (śrīmadbhagavadgīta - 4 - 33)

“uktai rbahuvidhairya jñairjñānākhyaḥ stūyatē adhvaraḥ |

dravyasādhana sādhyāccasarvasmāt jñānavarjitāt |

samastaṃ vaidikaṃ karmākhilaṃ smārtamupāsanaṃ |

brahmātmai kyāva bōdhētatparya vasyati sarvadhā |

pratibaṃdha kṣaya dvārādi jñāna yajñastatō varaḥ ||“. (gītābhāvaprakāśamu - 4 - 205 to 207)

(jñānayajñamu kāka migilina yajñamulanniyu anēka vidhamulaina dravamulacē, dravya rūpamulōnunna sādhanamulacē cēyabaḍucunnavi. vāṭilō jñānamutōsaṃbaṃdhamulēdu. aṭṭi yajñamulakanna jñānayajñamu adhikamu, uttamamainaṭuvaṃṭidi. samastamaina karmalu - vaidika karmalugāni, smārta karmalugāni jīvabrahmala aikyamunaṃdē paryavasānamu poṃducunnavi. aṃducēta jñānayajñamu anni yajñamulakanna śrēṣṭamainadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.