(జ్ఞానమే యోగము. జ్ఞానము కలిగియుండుటయే యోగము).
జ్ఞానాత్మికా నిష్ఠా జ్ఞాన యోగః. (జ్ఞానమే నిష్ఠగా గలది జ్ఞానయోగము).
జ్ఞానమేవ యుజ్యతే బ్రహ్మణా అనేన ఇతి వ్యుత్పత్యా యోగః.
(పరబ్రహ్మతో కలుపునది యోగము. జ్ఞానము పరబ్రహ్మతో కలుపునది కనుక జ్ఞానమే యోగము).
(జ్ఞానార్థము - జ్ఞానము కొఱకు - యోగముగా చేయబడుచున్నది గనుక జ్ఞానయోగము. వేదాంత శ్రవణము, మననము, నిధిధ్యాసనము - ఇవి జ్ఞానమునకు సాధనములు - వాటిని యోగముగా అనుష్ఠించుట జ్ఞాన యోగము).
(శ్రవణ మనన నిధిధ్యాసములచేత మనస్సు పరిపక్వమైన తర్వాత దానివలన కలిగిన జ్ఞానముద్వారా పరమాత్మతో కలుపునది జ్ఞానయోగము).
(ప్రకృతితోను, దాని వికారములతో గాని ఏ విధమైన సంబంధములేని, కేవలమాత్మగాని ఆత్మ స్వస్వరూపమును ఆత్మ యధార్థ్యమును వివేకముతో తెలుసుకొనుటకు చేసిన నిష్ఠ).
(జ్ఞానమే ఉపాయముగా గలది - జ్ఞానమే పరబ్రహ్మతో కలుపుటకు సాధనముగా గలది జ్ఞాన యోగము).
(అతి కష్టముమీద, అనేక బాధముపడిన తర్వాత ఆలస్యముగా ఫలమునిచ్చునది జ్ఞానయోగము).
(శాస్త్రమువలనను, ఆచార్యునివలనను ఆత్మ మొదలగు పదార్థములను అవగాహనము చేసుకొనుట జ్ఞానము - అట్లు అవగాహనము చేసుకొని ఇంద్రియములను విషయముల పట్లపోనీయక తన స్వాధీనము లో నుంచుకొని, ఏకాగ్రత కలిగిన - ఒకే దానియందు ధ్యానము కలిగిన - మనస్సుతో ఆత్మధ్యానము చేయుట యోగము. ఈ జ్ఞానయోగములు రెండింటియందును నిష్ఠకలిగియుండుట జ్ఞానయోగము).
తత్వ జ్ఞాన రూపయోగః. (పరమాత్మ తత్వమెఱుంగుటే రూపముగా గల యోగము).
యుజ్యతే ఆపాద్యతే బ్రహ్మణా తాదాత్మ్యమనేన ఇతి యోగః - జ్ఞానమేవ యోగః.
(జీవాత్మకు పరమాత్మతో తాదాత్మ్యమును ఆపాదించునది, పొందింపచేయునది యోగము - జ్ఞానమట్లు చేయునది, చేయుటకు సాధనమైనది, కనుక జ్ఞానమే యోగము).
“బ్రహ్మవిద్ బ్రహ్మణా యుజ్యతే ఏకీ క్రియతే అనేనేతి యోగః, జ్ఞానమేవ యోగః జ్ఞాన యోగః”.
(బ్రహ్మజ్ఞానము కలవాడు ఈ జ్ఞానముచే బ్రహ్మను కలియును, అట్టి కలియిక యోగము - జ్ఞానముచే కలియు యోగము కనుక జ్ఞానయోగము).
“స్వ స్వరూప పరస్వరూప విరోధిస్వరూప ప్రభృతి విషయకంబైన యథా బోధంబు జ్ఞానయోగంబనంబడు, నట్టిది నారదాది మహామునులందు విశ్రుతం బగుచుండు”. (కులశేఖరమహీపాల చరిత్ర - 2 - 122)
“వ. సర్వయోగ సంప్రాప్యుండగు నిర్గుణుండు భగవంతుడని చెప్పిన జ్ఞానయోగంబును, మదీయ భక్తియోగంబును నను రెండును నొక్కటియు ఇంద్రియంబులు భిన్న రూపంబులు గావున నేకరూపంబయిన యర్థంబనేక విధముబులగునట్లు ఏకంబగు భ్రహ్మంబనేక విధంబులుగ దోచు ||”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 32 - 1022)
(jñānamē yōgamu. jñānamu kaligiyuṃḍuṭayē yōgamu).
jñānātmikā niṣṭhā jñāna yōgaḥ. (jñānamē niṣṭhagā galadi jñānayōgamu).
jñānamēva yujyatē brahmaṇā anēna iti vyutpatyā yōgaḥ.
(parabrahmatō kalupunadi yōgamu. jñānamu parabrahmatō kalupunadi kanuka jñānamē yōgamu).
(jñānārthamu - jñānamu koṟaku - yōgamugā cēyabaḍucunnadi ganuka jñānayōgamu. vēdāṃta śravaṇamu, mananamu, nidhidhyāsanamu - ivi jñānamunaku sādhanamulu - vāṭini yōgamugā anuṣṭhiṃcuṭa jñāna yōgamu).
(śravaṇa manana nidhidhyāsamulacēta manassu paripakvamaina tarvāta dānivalana kaligina jñānamudvārā paramātmatō kalupunadi jñānayōgamu).
(prakṛtitōnu, dāni vikāramulatō gāni ē vidhamaina saṃbaṃdhamulēni, kēvalamātmagāni ātma svasvarūpamunu ātma yadhārthyamunu vivēkamutō telusukonuṭaku cēsina niṣṭha).
(jñānamē upāyamugā galadi - jñānamē parabrahmatō kalupuṭaku sādhanamugā galadi jñāna yōgamu).
(ati kaṣṭamumīda, anēka bādhamupaḍina tarvāta ālasyamugā phalamuniccunadi jñānayōgamu).
(śāstramuvalananu, ācāryunivalananu ātma modalagu padārthamulanu avagāhanamu cēsukonuṭa jñānamu - aṭlu avagāhanamu cēsukoni iṃdriyamulanu viṣayamula paṭlapōnīyaka tana svādhīnamu lō nuṃcukoni, ēkāgrata kaligina - okē dāniyaṃdu dhyānamu kaligina - manassutō ātmadhyānamu cēyuṭa yōgamu. ī jñānayōgamulu reṃḍiṃṭiyaṃdunu niṣṭhakaligiyuṃḍuṭa jñānayōgamu).
tatva jñāna rūpayōgaḥ. (paramātma tatvameṟuṃguṭē rūpamugā gala yōgamu).
yujyatē āpādyatē brahmaṇā tādātmyamanēna iti yōgaḥ - jñānamēva yōgaḥ.
(jīvātmaku paramātmatō tādātmyamunu āpādiṃcunadi, poṃdiṃpacēyunadi yōgamu - jñānamaṭlu cēyunadi, cēyuṭaku sādhanamainadi, kanuka jñānamē yōgamu).
“brahmavid brahmaṇā yujyatē ēkī kriyatē anēnēti yōgaḥ, jñānamēva yōgaḥ jñāna yōgaḥ”.
(brahmajñānamu kalavāḍu ī jñānamucē brahmanu kaliyunu, aṭṭi kaliyika yōgamu - jñānamucē kaliyu yōgamu kanuka jñānayōgamu).
“sva svarūpa parasvarūpa virōdhisvarūpa prabhṛti viṣayakaṃbaina yathā bōdhaṃbu jñānayōgaṃbanaṃbaḍu, naṭṭidi nāradādi mahāmunulaṃdu viśrutaṃ bagucuṃḍu”. (kulaśēkharamahīpāla caritra - 2 - 122)
“va. sarvayōga saṃprāpyuṃḍagu nirguṇuṃḍu bhagavaṃtuḍani ceppina jñānayōgaṃbunu, madīya bhaktiyōgaṃbunu nanu reṃḍunu nokkaṭiyu iṃdriyaṃbulu bhinna rūpaṃbulu gāvuna nēkarūpaṃbayina yarthaṃbanēka vidhamubulagunaṭlu ēkaṃbagu bhrahmaṃbanēka vidhaṃbuluga dōcu ||”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 32 - 1022)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.