“బుద్ధీంద్రియాణి శ్రవణం త్వగక్షి ఘ్రాణంచ జిహ్వ విషయావ బోధనాత్”. (శ్రీశంకరః). (వివేకచూడామణి)
“స (బ్రహ్మ) తేషాం (పంచభూతానాం) సత్వాంశం చతుర్థకృత్వా జగత్రయ సమష్టితః కరణమసృజత్. సతేషాం సత్వ తురీయ భాగేన జ్ఞానేంద్రియాణ్య సృజత్”. (పైంగలోపనిషత్)
(పరబ్రహ్మ పంచభూతముల యొక్క సత్వాంశమును నాలుగు భాగములుగా చేసి జగత్తులకు సమష్టి ఇంద్రియములను సృష్టించెను, వాటి సత్వ తురీయభాగముచేత జ్ఞానేంద్రియములను సృష్టించెను.)
(పంచీకృతముకాని పంచభూతములలో ఒక్కొక్క దాని యొక్క సత్వగుణాంశమువలన ఒక్కొక్క జ్ఞానేంద్రియము పుట్టినది. ఇది ఎట్లంటే - ఆకాశము యొక్క సత్వగుణాంశమువలన శ్రోత్రము (చెవి), వాయువు యొక్క సత్వగుణాంశమువలన త్వక్ (చర్మము), తేజస్సు (అగ్ని) యొక్క సత్వగుణాంశమువలన నేత్రము (కన్ను), జలము యొక్క సత్వగుణాంశమువలన రసనము (నాలుక), పృధివియొక్క సత్వగుణాంశమువలన ఘ్రాణము (ముక్కు) పుట్టినవి. ఈ అయిదు ఇంద్రియములు భూతముల యొక్క సత్వగుణమువలన పుట్టుచున్నవి. శ్రోత్రేంద్రియము ఆకాశము యొక్క గుణమైన శబ్దమును గ్రహించును - అనగా అది ఆకాశము యొక్క సత్వగుణము యొక్క కార్యము. ఈ ప్రకారముగానే ఏ ఇంద్రియము ఏ భూతము యొక్క గుణమును గ్రహించునో అది ఆ భూతము యొక్క సత్వగుణము యొక్క క్క కార్యము అని తెలుసుకోతగినది).
“buddhīṃdriyāṇi śravaṇaṃ tvagakṣi ghrāṇaṃca jihva viṣayāva bōdhanāt”. (śrīśaṃkaraḥ). (vivēkacūḍāmaṇi)
“sa (brahma) tēṣāṃ (paṃcabhūtānāṃ) satvāṃśaṃ caturthakṛtvā jagatraya samaṣṭitaḥ karaṇamasṛjat. satēṣāṃ satva turīya bhāgēna jñānēṃdriyāṇya sṛjat”. (paiṃgalōpaniṣat)
(parabrahma paṃcabhūtamula yokka satvāṃśamunu nālugu bhāgamulugā cēsi jagattulaku samaṣṭi iṃdriyamulanu sṛṣṭiṃcenu, vāṭi satva turīyabhāgamucēta jñānēṃdriyamulanu sṛṣṭiṃcenu.)
(paṃcīkṛtamukāni paṃcabhūtamulalō okkokka dāni yokka satvaguṇāṃśamuvalana okkokka jñānēṃdriyamu puṭṭinadi. idi eṭlaṃṭē - ākāśamu yokka satvaguṇāṃśamuvalana śrōtramu (cevi), vāyuvu yokka satvaguṇāṃśamuvalana tvak (carmamu), tējassu (agni) yokka satvaguṇāṃśamuvalana nētramu (kannu), jalamu yokka satvaguṇāṃśamuvalana rasanamu (nāluka), pṛdhiviyokka satvaguṇāṃśamuvalana ghrāṇamu (mukku) puṭṭinavi. ī ayidu iṃdriyamulu bhūtamula yokka satvaguṇamuvalana puṭṭucunnavi. śrōtrēṃdriyamu ākāśamu yokka guṇamaina śabdamunu grahiṃcunu - anagā adi ākāśamu yokka satvaguṇamu yokka kāryamu. ī prakāramugānē ē iṃdriyamu ē bhūtamu yokka guṇamunu grahiṃcunō adi ā bhūtamu yokka satvaguṇamu yokka kka kāryamu ani telusukōtaginadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.