← Back to క · Booklets 11–20 (digitized file 2)

కలిసంతరణము kalisaṃtaraṇamu

Original — తెలుగు
  1. భగవతః ఆది పురుషస్య నారాయణస్య నామోచ్ఛారణ మాత్రేణ నిర్ధూత కలిర్భవతి.

నారదః పునః పప్రచ్ఛ తన్నామ కిమితి. సహోవాచ హిరణ్యగర్భః –

“హరేరామ హరేరామ రామరామ హరేహరే |

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే|”

ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం, నాతః పరతరోవా యస్సర్వవేదేషు దృశ్యతే ఇతి నాన్య విధిరితి సర్వదా శుచిర శుచిర్వాపఠన్ బ్రహ్మణస్స లోకతాం, సమీపతాం, సరూపతాం, సాయుజ్య తామేతి“. (కలిసంతరణోపనిషత్)

“షోడశ కలావృతస్య జీవస్యావరణ వినాశనం |

తతః ప్రకాసతే పరంబ్రహ్మ మేఘాపాయే రవిరశ్మి మండలీతి” – ప్రాణాది నామాంత షోడశకళాభిః ఆవృతస్య జీవస్య ఏతత్ షోడశకం నామ జీవావరణ వినాశకం భవతి“.

(ప్రాణముమొదలు నామమువరకుగల పదియారుకళలచేతనుకప్పబడినవాడు జీవుడు - పై శ్లోకములో చెప్పబడిన భగవంతిని పదియారు నామములు జీవినియొక్క పదియారు ఆవరణములను నశింపచేయును. మేఘము తొలగిపోయిన తర్వాత రవికనుపించునట్లు ఈ పదియారు ఆవరణములు ఈ పదియారు నామములచేత తొలగిన తర్వాత పరబ్రహ్మ ప్రకాశించును - పరబ్రహ్మ సాక్షాత్కారమగును - అప్పుడు జీవుడు అనునది పరబ్రహ్మమే. జీవుని కప్పి ఉంచిన ఆవరణములు తొలగిపోవగానే లోనున్న జీవాత్మ - పరమాత్మ - ప్రకాశించును. ఇది భగవంతుని నామోచ్ఛారణ వలననే ఈ కలియుగములో కలుగును).

  1. “హరే కీశవగోవింద వాసుదేవ జగన్మయ |

ఇతీరయంతి యే నిత్యం నహి తాన్ బాధితే కలిః ||” (నారదపురాణము - పూర్వ - 41 - 100)

(హరీ, కేశవా, గోవిందా, వాసుదేవా జగన్మయ అని ఎల్లపుడు శ్రీమహావిష్ణువుని ఎవరు భజించెదరో వారిని కలి బాధ పెట్టదు).

  1. “రామేతి వర్ణద్వయ మాదరేణ సదాస్తువన్ ముక్తి ముపైతి జంతుః |

కలియుగే కల్మష మానుషాణామన్యత్ర ధర్మే ఖలునాది కారః ||“. (శ్రీరామకర్ణామృతం - 1 - 93)

(‘రామ’ అను రెండక్షరములను ఎల్లపుడు భక్తితో స్మరించువడు ముక్తిని పొందును - కలియుగములో కల్మషమైన మనసుగలవారికిదియే కలిదోషమును నశింపచేయునది - ఇదియే ధర్మము - ఇది ఇంకొక రీతిగా కుదరదు). (ఈ ధర్మము ఇంకొక యుగములో వర్తించదు).

Transliteration
  1. bhagavataḥ ādi puruṣasya nārāyaṇasya nāmōcchāraṇa mātrēṇa nirdhūta kalirbhavati.

nāradaḥ punaḥ papraccha tannāma kimiti. sahōvāca hiraṇyagarbhaḥ –

“harērāma harērāma rāmarāma harēharē |

harēkṛṣṇa harēkṛṣṇa kṛṣṇa kṛṣṇa harē harē|”

iti ṣōḍaśakaṃ nāmnāṃ kalikalmaṣanāśanaṃ, nātaḥ paratarōvā yassarvavēdēṣu dṛśyatē iti nānya vidhiriti sarvadā śucira śucirvāpaṭhan brahmaṇassa lōkatāṃ, samīpatāṃ, sarūpatāṃ, sāyujya tāmēti”. (kalisaṃtaraṇōpaniṣat)

“ṣōḍaśa kalāvṛtasya jīvasyāvaraṇa vināśanaṃ |

tataḥ prakāsatē paraṃbrahma mēghāpāyē raviraśmi maṃḍalīti” – prāṇādi nāmāṃta ṣōḍaśakaḷābhiḥ āvṛtasya jīvasya ētat ṣōḍaśakaṃ nāma jīvāvaraṇa vināśakaṃ bhavati”.

(prāṇamumodalu nāmamuvarakugala padiyārukaḷalacētanukappabaḍinavāḍu jīvuḍu - pai ślōkamulō ceppabaḍina bhagavaṃtini padiyāru nāmamulu jīviniyokka padiyāru āvaraṇamulanu naśiṃpacēyunu. mēghamu tolagipōyina tarvāta ravikanupiṃcunaṭlu ī padiyāru āvaraṇamulu ī padiyāru nāmamulacēta tolagina tarvāta parabrahma prakāśiṃcunu - parabrahma sākṣātkāramagunu - appuḍu jīvuḍu anunadi parabrahmamē. jīvuni kappi uṃcina āvaraṇamulu tolagipōvagānē lōnunna jīvātma - paramātma - prakāśiṃcunu. idi bhagavaṃtuni nāmōcchāraṇa valananē ī kaliyugamulō kalugunu).

  1. “harē kīśavagōviṃda vāsudēva jaganmaya |

itīrayaṃti yē nityaṃ nahi tān bādhitē kaliḥ ||” (nāradapurāṇamu - pūrva - 41 - 100)

(harī, kēśavā, gōviṃdā, vāsudēvā jaganmaya ani ellapuḍu śrīmahāviṣṇuvuni evaru bhajiṃcedarō vārini kali bādha peṭṭadu).

  1. “rāmēti varṇadvaya mādarēṇa sadāstuvan mukti mupaiti jaṃtuḥ |

kaliyugē kalmaṣa mānuṣāṇāmanyatra dharmē khalunādi kāraḥ ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 93)

(‘rāma’ anu reṃḍakṣaramulanu ellapuḍu bhaktitō smariṃcuvaḍu muktini poṃdunu - kaliyugamulō kalmaṣamaina manasugalavārikidiyē kalidōṣamunu naśiṃpacēyunadi - idiyē dharmamu - idi iṃkoka rītigā kudaradu). (ī dharmamu iṃkoka yugamulō vartiṃcadu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.