← Back to క · Booklets 11–20 (digitized file 2)

కలియుగధర్మములు kaliyugadharmamulu

Original — తెలుగు
  1. నిర్వీర్యా పృధివీ నిరౌషధి లతా నీచా మహత్వం గతాః |

రాజానో అర్థపరాయనాః ప్రతిదినం పుత్రాః పితుర్దూషకాః |

భార్యా భర్తృషు బద్ధవైర హృదయాః శిష్యాః గురోర్దూషకాః |

ఇత్థం బాహుబలే కలే వసతి చేద్ధర్మం వనాంతః గతః ||“.

(ఈ భూమి అంతయు వీర్యము లేని దగును. లతలు మొదలగునవి ఔషధశక్తి లేకయుండును. నీచులు మహాత్ములగుదురు. రాజులు - పాలించువారు - కేవలము నాశించు వారగుదురు. కొడుకులు తండ్రులను దూషించెదరు. భార్యలు భర్తలయందు బద్ధవైరము గలవారగుదురు, శిష్యులు గురువులను దూషించెదరు. ఈ విధముగా కలి విజృంభించినపుడు ధర్మము నిర్జన ప్రదేశమైన అడవులకు పారిపోవును).

  1. “కుకర్మాచరనాత్సారః సర్వతో నిర్గతో (అ)ధునా |

పదార్థాః సంస్థితా భూమౌ బీజహీనాస్తుషా యథా |

విప్రైర్వాభగవ తీ వార్తా గేహే గేహే జనే జనే |

తారితా కన లోభేన కథాసారస్తతో గతః |

అత్యుగ్ర భూరి కర్మాణో నాస్తికా రౌరవా జనాః |

తరెపి తిష్టంతి తీర్థేషు తీర్థసారస్తతో గతః |

కామక్రోధ మహాలోభ త్రుష్ణా వ్యాకుల చేతసః |

తేపి తి తిష్ఠంతి తపసి తపస్సారస్తతో గతః |

మనసస్చా జయా ల్లోభాద్ధమంభాత్పాషండసంశ్రయాత్ |

శాస్త్రా న భ్యాస నా చ్చైవ ధ్యానయోగఫలం గతః |

పండితాస్తు కలత్రేన ర్మంతే మహిషా ఇవ |

పుత్రస్యోత్పాత్పాదనే దక్షా అదక్షా ముక్తి సాధనే |

నహి వైష్నవతా కుత్ర సంప్రదాయ పురస్సరా |

ఏవం ప్రలయతాం ప్రాప్తో వస్తుసారః స్థలే స్థలే ||

అయంతు యుగధర్మోహి వర్తతే కస్య దూషణం ||” (శ్రీపద్మపురాణము - భాగవతమాహాత్మ్యం - అ - 1 - 70 to 77)

(దుష్కర్మలు చేయుటవలన అన్నింటిలోను సారము పోయినది. భూమిలోనుండు వస్తువులు ఊకవలె బీజము లేకుండనుండును. విప్రులు భగవత్కధలు ఇంటింటికి వెళ్ళి ధనము నిమిత్తము చెప్పుచుందురు - జనులు నాస్తికులై ఘోరమైన కర్మలు చేయుచుందురు. అటువంటివారు తీర్థస్థలములలో నుండుటచేత తీర్థములసారము పోవును. కామక్రోధ లోభ తృష్ణలచేత వ్యాకులమైన మనస్సు గలవారు తపస్సు చేయుటవలన తపస్సుయొక్క సారము పోయినది. మనో జయము లేకుండుట వలన, లోభము వలన, దంభము వలన, పాషాండమతమవలంభించుట చేతను, శాస్త్రములనభ్యసింపకపోవుట చేతను ధ్యానయోగఫలము పోవును. పండితులగువారు భార్యలతో దున్నపోతులవలె రమించెదరు, సంతానమును కనుటయందు దక్షులైయుందురు - ముక్తిని సాధించలేనివారగుదురు. సాంప్రదాయము ప్రకారము వైష్ణవార్చనలు మొదలగునవి యుండవు. ఈ ప్రకారము (భూమిలోని) సమస్తవస్తువులలోను సారము క్షీణించి లేకుండును - ఇది యుగధర్మము – కలియుగ ధర్మము - కాని ఒకని తప్పుకాదు).

  1. “సత్యం నాస్తి తపః శౌచం దయాదానం న విద్యతే |

ఉదయం భరిణో జీవాః వరాకాః కూటభాషిణః

మందాః సుమందమతయోమందభాగ్యా హ్యుపద్రుతాః |

పాషాండనిరతాః సంతో విరక్తాః సపరిగ్రహాః |

తరుణీ ప్రభృతాః గేహే శ్యాలకో బుద్ధి దాయకః |

కన్యా విక్రయిణో లోభాద్దంప తీనాంచ కల్కనం |

ఆశ్రమాః యవనై రుద్ధాస్తీర్థాని నంతస్తథా |

దేవతాయ తనాన్యత్ర దుష్టేర్నష్టా ని భూరిశః |

న యోగీనైన సిద్ధో నజ్ఞానీ సత్క్రియోనరః |

కలిదావానలే నాదాసాధనం భస్మతాం గతం ||“.

(శ్రీపద్మపురాణము - ఉత్తరఖండము - శ్రీమద్భగవద్గీతామహత్మ్యము - 8 - 1 - 31 to 35)

(కలియుగమందు సత్యము, తపస్సు, శౌచము, దయ, దానము అనునవి ఉండవు. జీవులు ఎవరి పొట్టవారు పోషించుకొందరు, అబద్దము చేప్పువారగుదురు. మందులు, మందమతులు, మందభాగ్యులు అయ్యెదరు, పాషండులు, నాస్తికులు అయ్యెదరు, ఇచ్చిన అన్నింటిని పుచ్చుకొనువారగుదురు - ఇంటిలో ఆడవారిదే పెత్తనము, బావగారు బుద్ధిచెప్పువారు - సలహాలు ఇచ్చువారు - ధనలోభముచేత కన్యలను అమ్ముకొనువారగుదురు, దంపతులు ఒకరితోనొకరు కలహించుకొందురు - ఆశ్రమములను యవనులు అనురోధించెదరు. దేవాలయములు, తీర్థములు, క్షేత్రములు ఆప్రకారమే యగును - యోగియగువాడుకాని, సిద్ధుడుకాని, బ్రహ్మజ్ఞానికాని, సత్కర్మచేయువాడుకాని ఉండడు).

  1. “క. దినదినమును ధర్మంబులు

ననయము ధరనడగిపోవు నాశ్చర్యముగా

విను వర్ణచతుష్కములో

నెనయగ ధనవంతుడైన నేలు ధరిత్రిన్.”

క. బలవంతుడైనవాడే

కులహీనుండైన దొడ్డ గుణవంతుడగున్

గలిమియు బలిమియు గలిగిన

నిలలోపల రాజతండె యేమనవచ్చున్“.

“వ. అట్లు గాన జనంబులు లోభులై జారత్వ చోరత్వాదులచేత ద్రవ్యహీనులై వన్యశాక మూలఫలంబుల భుజించుచు వనగిరి దుర్గంబులం గృశీభూతులై దుర్భిక్ష శీతవాతాతపక్షుధా తాపంబులచేత భయంపడి ధనహీనులై, అల్పాయుష్కులు నల్పతర శరీరులునై యుండ రాజులు చోరులై సంచరించుచు నధర్మ ప్రవర్తనులై వర్ణాశ్రమ ధర్మంబులు విడనాడి శూద్రప్రాయులైయుండెదరంత నోషధు లల్ప పహలదంబులు, మేఘంబులు జలశూన్యంబులు, సస్యంబులు నిస్సారంబులు నగు - - -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - 9, 10, 11)

  1. “న దేవా దేవత్వం కపట పట వస్తాపస జనాః |

జనో మిధ్యా వాదీ న సమయ వృష్టిర్జల ధరః |

ప్రసంగో నీచానామవని పతయో దుష్ట మనసః |

జనాభ్రష్టా నష్టా అహహ కలికాల ప్రభవతి ||“. (శివరహస్య ఖండే)

(దేవతలందు దేవత్వము లేకుండును, తాపసులు కపట వేషధారులు, జనులు అబద్ధమాడువారు, మేఘము సకాలమందు వర్షింపకుండును. నీచులు నీతి ప్రసంగము చేయుదురు - రాజులు - దేశమును పాలించువారు దుష్టమైన మనస్సు కలిగియుందురు. జనులు భ్రష్టులు,నష్టులుగా ఈ కలికాలములో అగుదురు).

  1. “ముచికుందుడు గుహవెడలి సూక్ష్మ ప్రమాణ దేహంబులతోనున్న మనుష్య పశు వృక్ష లతాదులంగని కలియుగంబు ప్రాప్తంబగునని తలంచి - - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 1668)

  2. “అత్యంత దుష్టస్య కలే రయమేరో మహాన్ గుణః |

కీర్తనాదేవ కృష్ణస్య ముక్త బందః పరం వ్రజేత్ ||“. (శ్రీవిష్ణుపురాణము - 6 - 2 - 40)

(పైన చెప్పిన ప్రకారము కలియుగము - కలికాలము - ఎంత దుష్టమైనదైనను దానియందు ఒకమంచి సుగుణమున్నది. ఈ కలియుగములో శ్రీకృష్ణుని కీర్తన చేసినంతమాత్రమున బంధమును వదలించుకొని పరమపదవిని పొందును).

  1. “కలేర్ధోష నిధేశ్చైవ శ్రుణి చైకం మహాగునం |

యదల్పేనతు కాలేన సిద్ధిం గచ్చంతి మానవాః ||’.

(అనేక దోషములకు నిధియైనను కలికి - కలికాలమునకు ఒక గొప్ప మంచిగుణమున్నది - ఈ కాలములో అతిస్వల్పకాలములోనే మానవులు సిద్ధిని పొందెదరు).

  1. “యత్కృతే దశభిర్వ ర్షై స్త్రెతేయాం హాయనేన తత్ |

ద్వాపరే తచ్చ మాసేన హ్యహో రాత్రేణ తత్కలౌ |

తపసో బ్రహ్మచర్యస్య జపాదేశ్చ ఫలం ద్విజాః |

ప్రాప్నోతిపురుషస్తేన కలిః సాద్వితి భాషితం ||“. (విష్ణుపురాణము - 6 - 2 - 15, 16)

(తపస్సు అయినను, బ్రహ్మచర్యమైనను, జపమైనను - ఈ మొదలగునవి ఏవి అయినను త్రేతాయుగములో ఒకసంవత్సరముగాని, ద్వాపరయుగములో - ఒక మాసముగాని, దాని ఫలమును ఈ కలియుగములో ఒక్కరోజునచేసిన నరుడు పొందును - అందుచేత కలియుగము మంచిదేయని చెప్పబడుచున్నది).

“ధర్మోత్కర్షమతీవాత్ర ప్రాప్నోతి పురుషః కలౌ |

అల్పాయాసేన ధర్మజ్ఞాస్తేన తుష్టో(అ)స్మ్యహం కలే ||” (విష్ణుపురాణము - 6 - 2 - 18)

(కలికాలమందు పురుషుడు స్వల్పాయాసముతో హెచ్చు ఫలముననుభవించుటే దీని ధర్మము).

  1. “ఉ. చేసినగాని పాపములు సెందవు చేయదలంచినంతటన్

చేసెదనన్నమాత్రమున జెందుగదా కలివేళ పుణ్యముల్

--- (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 18 - 406)

Transliteration
  1. nirvīryā pṛdhivī nirauṣadhi latā nīcā mahatvaṃ gatāḥ |

rājānō arthaparāyanāḥ pratidinaṃ putrāḥ piturdūṣakāḥ |

bhāryā bhartṛṣu baddhavaira hṛdayāḥ śiṣyāḥ gurōrdūṣakāḥ |

itthaṃ bāhubalē kalē vasati cēddharmaṃ vanāṃtaḥ gataḥ ||“.

(ī bhūmi aṃtayu vīryamu lēni dagunu. latalu modalagunavi auṣadhaśakti lēkayuṃḍunu. nīculu mahātmulaguduru. rājulu - pāliṃcuvāru - kēvalamu nāśiṃcu vāraguduru. koḍukulu taṃḍrulanu dūṣiṃcedaru. bhāryalu bhartalayaṃdu baddhavairamu galavāraguduru, śiṣyulu guruvulanu dūṣiṃcedaru. ī vidhamugā kali vijṛṃbhiṃcinapuḍu dharmamu nirjana pradēśamaina aḍavulaku pāripōvunu).

  1. “kukarmācaranātsāraḥ sarvatō nirgatō (a)dhunā |

padārthāḥ saṃsthitā bhūmau bījahīnāstuṣā yathā |

viprairvābhagava tī vārtā gēhē gēhē janē janē |

tāritā kana lōbhēna kathāsārastatō gataḥ |

atyugra bhūri karmāṇō nāstikā rauravā janāḥ |

tarepi tiṣṭaṃti tīrthēṣu tīrthasārastatō gataḥ |

kāmakrōdha mahālōbha truṣṇā vyākula cētasaḥ |

tēpi ti tiṣṭhaṃti tapasi tapassārastatō gataḥ |

manasascā jayā llōbhāddhamaṃbhātpāṣaṃḍasaṃśrayāt |

śāstrā na bhyāsa nā ccaiva dhyānayōgaphalaṃ gataḥ |

paṃḍitāstu kalatrēna rmaṃtē mahiṣā iva |

putrasyōtpātpādanē dakṣā adakṣā mukti sādhanē |

nahi vaiṣnavatā kutra saṃpradāya purassarā |

ēvaṃ pralayatāṃ prāptō vastusāraḥ sthalē sthalē ||

ayaṃtu yugadharmōhi vartatē kasya dūṣaṇaṃ ||” (śrīpadmapurāṇamu - bhāgavatamāhātmyaṃ - a - 1 - 70 to 77)

(duṣkarmalu cēyuṭavalana anniṃṭilōnu sāramu pōyinadi. bhūmilōnuṃḍu vastuvulu ūkavale bījamu lēkuṃḍanuṃḍunu. viprulu bhagavatkadhalu iṃṭiṃṭiki veḷḷi dhanamu nimittamu ceppucuṃduru - janulu nāstikulai ghōramaina karmalu cēyucuṃduru. aṭuvaṃṭivāru tīrthasthalamulalō nuṃḍuṭacēta tīrthamulasāramu pōvunu. kāmakrōdha lōbha tṛṣṇalacēta vyākulamaina manassu galavāru tapassu cēyuṭavalana tapassuyokka sāramu pōyinadi. manō jayamu lēkuṃḍuṭa valana, lōbhamu valana, daṃbhamu valana, pāṣāṃḍamatamavalaṃbhiṃcuṭa cētanu, śāstramulanabhyasiṃpakapōvuṭa cētanu dhyānayōgaphalamu pōvunu. paṃḍitulaguvāru bhāryalatō dunnapōtulavale ramiṃcedaru, saṃtānamunu kanuṭayaṃdu dakṣulaiyuṃduru - muktini sādhiṃcalēnivāraguduru. sāṃpradāyamu prakāramu vaiṣṇavārcanalu modalagunavi yuṃḍavu. ī prakāramu (bhūmilōni) samastavastuvulalōnu sāramu kṣīṇiṃci lēkuṃḍunu - idi yugadharmamu – kaliyuga dharmamu - kāni okani tappukādu).

  1. “satyaṃ nāsti tapaḥ śaucaṃ dayādānaṃ na vidyatē |

udayaṃ bhariṇō jīvāḥ varākāḥ kūṭabhāṣiṇaḥ

maṃdāḥ sumaṃdamatayōmaṃdabhāgyā hyupadrutāḥ |

pāṣāṃḍaniratāḥ saṃtō viraktāḥ saparigrahāḥ |

taruṇī prabhṛtāḥ gēhē śyālakō buddhi dāyakaḥ |

kanyā vikrayiṇō lōbhāddaṃpa tīnāṃca kalkanaṃ |

āśramāḥ yavanai ruddhāstīrthāni naṃtastathā |

dēvatāya tanānyatra duṣṭērnaṣṭā ni bhūriśaḥ |

na yōgīnaina siddhō najñānī satkriyōnaraḥ |

kalidāvānalē nādāsādhanaṃ bhasmatāṃ gataṃ ||“.

(śrīpadmapurāṇamu - uttarakhaṃḍamu - śrīmadbhagavadgītāmahatmyamu - 8 - 1 - 31 to 35)

(kaliyugamaṃdu satyamu, tapassu, śaucamu, daya, dānamu anunavi uṃḍavu. jīvulu evari poṭṭavāru pōṣiṃcukoṃdaru, abaddamu cēppuvāraguduru. maṃdulu, maṃdamatulu, maṃdabhāgyulu ayyedaru, pāṣaṃḍulu, nāstikulu ayyedaru, iccina anniṃṭini puccukonuvāraguduru - iṃṭilō āḍavāridē pettanamu, bāvagāru buddhiceppuvāru - salahālu iccuvāru - dhanalōbhamucēta kanyalanu ammukonuvāraguduru, daṃpatulu okaritōnokaru kalahiṃcukoṃduru - āśramamulanu yavanulu anurōdhiṃcedaru. dēvālayamulu, tīrthamulu, kṣētramulu āprakāramē yagunu - yōgiyaguvāḍukāni, siddhuḍukāni, brahmajñānikāni, satkarmacēyuvāḍukāni uṃḍaḍu).

  1. “ka. dinadinamunu dharmaṃbulu

nanayamu dharanaḍagipōvu nāścaryamugā

vinu varṇacatuṣkamulō

nenayaga dhanavaṃtuḍaina nēlu dharitrin.”

ka. balavaṃtuḍainavāḍē

kulahīnuṃḍaina doḍḍa guṇavaṃtuḍagun

galimiyu balimiyu galigina

nilalōpala rājataṃḍe yēmanavaccun”.

“va. aṭlu gāna janaṃbulu lōbhulai jāratva cōratvādulacēta dravyahīnulai vanyaśāka mūlaphalaṃbula bhujiṃcucu vanagiri durgaṃbulaṃ gṛśībhūtulai durbhikṣa śītavātātapakṣudhā tāpaṃbulacēta bhayaṃpaḍi dhanahīnulai, alpāyuṣkulu nalpatara śarīrulunai yuṃḍa rājulu cōrulai saṃcariṃcucu nadharma pravartanulai varṇāśrama dharmaṃbulu viḍanāḍi śūdraprāyulaiyuṃḍedaraṃta nōṣadhu lalpa pahaladaṃbulu, mēghaṃbulu jalaśūnyaṃbulu, sasyaṃbulu nissāraṃbulu nagu - - -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - 9, 10, 11)

  1. “na dēvā dēvatvaṃ kapaṭa paṭa vastāpasa janāḥ |

janō midhyā vādī na samaya vṛṣṭirjala dharaḥ |

prasaṃgō nīcānāmavani patayō duṣṭa manasaḥ |

janābhraṣṭā naṣṭā ahaha kalikāla prabhavati ||“. (śivarahasya khaṃḍē)

(dēvatalaṃdu dēvatvamu lēkuṃḍunu, tāpasulu kapaṭa vēṣadhārulu, janulu abaddhamāḍuvāru, mēghamu sakālamaṃdu varṣiṃpakuṃḍunu. nīculu nīti prasaṃgamu cēyuduru - rājulu - dēśamunu pāliṃcuvāru duṣṭamaina manassu kaligiyuṃduru. janulu bhraṣṭulu,naṣṭulugā ī kalikālamulō aguduru).

  1. “mucikuṃduḍu guhaveḍali sūkṣma pramāṇa dēhaṃbulatōnunna manuṣya paśu vṛkṣa latādulaṃgani kaliyugaṃbu prāptaṃbagunani talaṃci - - (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 1668)

  2. “atyaṃta duṣṭasya kalē rayamērō mahān guṇaḥ |

kīrtanādēva kṛṣṇasya mukta baṃdaḥ paraṃ vrajēt ||“. (śrīviṣṇupurāṇamu - 6 - 2 - 40)

(paina ceppina prakāramu kaliyugamu - kalikālamu - eṃta duṣṭamainadainanu dāniyaṃdu okamaṃci suguṇamunnadi. ī kaliyugamulō śrīkṛṣṇuni kīrtana cēsinaṃtamātramuna baṃdhamunu vadaliṃcukoni paramapadavini poṃdunu).

  1. “kalērdhōṣa nidhēścaiva śruṇi caikaṃ mahāgunaṃ |

yadalpēnatu kālēna siddhiṃ gaccaṃti mānavāḥ ||’.

(anēka dōṣamulaku nidhiyainanu kaliki - kalikālamunaku oka goppa maṃciguṇamunnadi - ī kālamulō atisvalpakālamulōnē mānavulu siddhini poṃdedaru).

  1. “yatkṛtē daśabhirva rṣai stretēyāṃ hāyanēna tat |

dvāparē tacca māsēna hyahō rātrēṇa tatkalau |

tapasō brahmacaryasya japādēśca phalaṃ dvijāḥ |

prāpnōtipuruṣastēna kaliḥ sādviti bhāṣitaṃ ||“. (viṣṇupurāṇamu - 6 - 2 - 15, 16)

(tapassu ayinanu, brahmacaryamainanu, japamainanu - ī modalagunavi ēvi ayinanu trētāyugamulō okasaṃvatsaramugāni, dvāparayugamulō - oka māsamugāni, dāni phalamunu ī kaliyugamulō okkarōjunacēsina naruḍu poṃdunu - aṃducēta kaliyugamu maṃcidēyani ceppabaḍucunnadi).

“dharmōtkarṣamatīvātra prāpnōti puruṣaḥ kalau |

alpāyāsēna dharmajñāstēna tuṣṭō(a)smyahaṃ kalē ||” (viṣṇupurāṇamu - 6 - 2 - 18)

(kalikālamaṃdu puruṣuḍu svalpāyāsamutō heccu phalamunanubhaviṃcuṭē dīni dharmamu).

  1. “u. cēsinagāni pāpamulu seṃdavu cēyadalaṃcinaṃtaṭan

cēsedanannamātramuna jeṃdugadā kalivēḷa puṇyamul

--- (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 18 - 406)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.