వేదములో ఒకభాగము - వేదాంగము.
71 మహాయుగములు కలిసి ఒక మన్వంతరము - మనువు యొక్క కాలము. 14 మన్వంతరములు కలిసి చతుర్ముఖ బ్రహ్మకు ఒకదినము - ఒక పగలు, ఒక రాత్ర్రి. ఈ దినములో పగటిపూట చతుర్ముఖ బ్రహ్మ సృష్టిచేయును, రాత్రి దానిని సంహరించును - అనగా సృష్టించినదానిని తిరిగి తనలోనికి తీసుకొనును, తనలో లీనము చేసుకొనును. ఇదియే కల్పము. కల్పించినదానిని - సృష్టించినదానిని - లయము చేయువరకు గలకాలము. దీని తర్వాత మఱియొక కల్పము ప్రారంభమగును - ఇప్పుడు జరుగుచున్నదిస్వేతవరాహ కల్పము -
“సర్వభూతాని కౌతేయ, ప్రకృతిం యాంతి మామికాం |
కల్పక్షయే, పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 7)
(కల్పాంతమందు భూతములన్నియు సూక్ష్మరూపములో ప్రకృతిలో కలియును. తర్వాత కల్పము ప్రారంభమైనపుడు నేను వాటిని తిరిగి ప్రకృతిలోనుండి పైకి నా శక్తితో స్థూలరూపమును పొందుటకు విరజిమ్ముదును - సృష్టించబడినట్లు చేయుచున్నాను. ఇచ్చట ప్రకృతియనగా చతుర్ముఖ బ్రహ్మ. భూతములను సృష్టించి అవి లయము పొందువరకుగల కాలము కల్పము).
ప్రవర్తతే స్వయందేవీ దైత్యానాం నాసనాయవై |
ప్రతికల్పం భవేద్రామో రావణాశ్చాపి రాక్షసః |
తధైవ జాయతే యుద్ధం తథాచ త్రిదస సంగమః |
ఏవం రామ సహస్రాణి రావణానాం సహస్ర సః |
భవితవ్యాని భూతాని తథా దేవీ ప్రవర్తతే ||“. (కాలికాపురాణము - 62 - 37)
(ఒక కల్పములో ఏ రీతిని జరిగినదో ప్రతికల్పమందు ఆ రీతిగనే జరుగును - ఈ ప్రకారముగా రాక్షసుల నాశము కొరకు దేవి ప్రవర్తింపచేయును. అట్లే, అందువననే ప్రతికల్పమందు రాముడు కలుగును, రాక్షసుడైన రావణుడును కలుగును, అప్పటి ప్రకారమే యుద్ధము కూడజరుగును, ఇట్లు వేలకొలది శ్రీరాములు, వేలకొలది రావణులు - భూతములు - కలుగుచుందురు. ఇట్లు దేవి ప్రవర్తించును - ప్రతికల్పమందు దుర్మార్గులు, వారిని శిక్షించుట పరబ్రహ్మయొక్క అవతారమూర్తి కలుగుచునే యుండును). (“ధాతా యథాపూర్వ మకల్పయత్”).
vēdamulō okabhāgamu - vēdāṃgamu.
71 mahāyugamulu kalisi oka manvaṃtaramu - manuvu yokka kālamu. 14 manvaṃtaramulu kalisi caturmukha brahmaku okadinamu - oka pagalu, oka rātrri. ī dinamulō pagaṭipūṭa caturmukha brahma sṛṣṭicēyunu, rātri dānini saṃhariṃcunu - anagā sṛṣṭiṃcinadānini tirigi tanalōniki tīsukonunu, tanalō līnamu cēsukonunu. idiyē kalpamu. kalpiṃcinadānini - sṛṣṭiṃcinadānini - layamu cēyuvaraku galakālamu. dīni tarvāta maṟiyoka kalpamu prāraṃbhamagunu - ippuḍu jarugucunnadisvētavarāha kalpamu -
“sarvabhūtāni kautēya, prakṛtiṃ yāṃti māmikāṃ |
kalpakṣayē, punastāni kalpādau visṛjāmyahaṃ ||“. (śrīmadbhagavadgīta - 9 - 7)
(kalpāṃtamaṃdu bhūtamulanniyu sūkṣmarūpamulō prakṛtilō kaliyunu. tarvāta kalpamu prāraṃbhamainapuḍu nēnu vāṭini tirigi prakṛtilōnuṃḍi paiki nā śaktitō sthūlarūpamunu poṃduṭaku virajimmudunu - sṛṣṭiṃcabaḍinaṭlu cēyucunnānu. iccaṭa prakṛtiyanagā caturmukha brahma. bhūtamulanu sṛṣṭiṃci avi layamu poṃduvarakugala kālamu kalpamu).
pravartatē svayaṃdēvī daityānāṃ nāsanāyavai |
pratikalpaṃ bhavēdrāmō rāvaṇāścāpi rākṣasaḥ |
tadhaiva jāyatē yuddhaṃ tathāca tridasa saṃgamaḥ |
ēvaṃ rāma sahasrāṇi rāvaṇānāṃ sahasra saḥ |
bhavitavyāni bhūtāni tathā dēvī pravartatē ||“. (kālikāpurāṇamu - 62 - 37)
(oka kalpamulō ē rītini jariginadō pratikalpamaṃdu ā rītiganē jarugunu - ī prakāramugā rākṣasula nāśamu koraku dēvi pravartiṃpacēyunu. aṭlē, aṃduvananē pratikalpamaṃdu rāmuḍu kalugunu, rākṣasuḍaina rāvaṇuḍunu kalugunu, appaṭi prakāramē yuddhamu kūḍajarugunu, iṭlu vēlakoladi śrīrāmulu, vēlakoladi rāvaṇulu - bhūtamulu - kalugucuṃduru. iṭlu dēvi pravartiṃcunu - pratikalpamaṃdu durmārgulu, vārini śikṣiṃcuṭa parabrahmayokka avatāramūrti kalugucunē yuṃḍunu). (“dhātā yathāpūrva makalpayat”).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.