శోభనగుణములు మంగళకరమైన గుణములు.
“స్వాభావిక, అనవధిక, అతిశయ జ్ఞానబలైశ్వర్య వీర్య శక్తి తేజస్సౌశీల్య వాత్సల్య మార్థవార్జవ, సౌహార్ద సామ్య కారుణ్య, మాధుర్య, గాంభీర్య, ఔదార్య, చాతుర్యస్థైర్య, ధైర్య, శౌర్య, పరాక్రమ, సత్యకామ, సత్యసంకల్ప, కృతత్వ, కృతజ్ఞతాది అసంఖ్యేయ కల్యాగుణాః”. (శరణాగత గద్యము - శ్రీరామానుజః)
(స్వాభావికసిద్ధమైనవి, హద్దులేని గొప్పతనముగలవి, అయిన జ్ఞానము, బలము, ఐశ్వర్యము (సామర్థ్యము), వీర్యము, శక్తి, తేజస్సు, సౌశీల్యము, వాత్సల్యము, మృదుత్వము, రుజుస్వభావము, (మనోవాక్కాయములు ఏకవిధముగ నుండుట), సౌహార్థము, సౌమ్యము (సమత్వము), కారుణ్యము, మాధుర్యము, గాంభీర్యము, ఔదార్యము, చాతుర్యము, స్థిరత్వము, ధీరత్వము, శూరత్వము, పరాక్రమము, సత్యకామము (అడ్డులేని కోరిక), సత్యసంకల్పము (అడ్డులేని మనో ధైర్యము), కృతార్థత్వము, కృతజ్ఞత మొదలగుగా గలిగిన, లెక్కించుటకు శక్యముకాని మంగళకరమైన గుణములు - ఇవి భగవంతుని కల్యాణగుణములు).
(తనకు ఇష్టమైనది (శరణాగత గద్యము), చింతించుటకు నలవికానిది, దివ్యమైన, అద్భుతమైన, నిత్యమైనధి, నిరవద్యము, నిరతిశయౌజ్జ్వల్యము, సౌందర్యము, సౌగంధ్యము, సౌకుమార్యము, లావణ్యము, యౌవనము మొదలగు అనంతగుణములు).
కర్తృత్వ, అకర్తృత్వ, అన్యధా కర్తృత్వ ద్రష్టృత్వ, అద్రష్టుత్వ, అన్యధా దర్ష్టృత్వ, సర్వజ్ఞత్వ, సర్వకర్తృత్వ, అనంతత్వ నిత్యత్వ, వ్యాపకత్వ, కలా విద్యారాగ, కాలనియతరూపత్వ, ఉత్పత్తిస్థితిలయ తిరోధాన, అనుగ్రహ అనాది ప్రభోదత్వ, అలుప్తశక్తిత్వాది కల్యాణగుణములు” (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 6)
“యథా పార్థివ పరమాణుగణనం అశక్యం తథా విష్ణోః గుణగణనం అపి అశక్యం”.
(ఇసుకరేణువులను పరమాణూవులను లెక్కపెట్ట అలవి కానట్లు విష్ణునియొక్క గుణములు లెక్కపెట్ట శక్యము కాదు).
భూరజములకైన లెక్క బుధులిడుదురు భూ
భరాన తీర్నకరుడగు
నీ రమ్యగుణంబులెన్న నేర రగణ్యా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. 555)
(శ్రీమదాంధ్రమహాభాగతవము - 1 - 18 - 414)
(అనంతకల్యాణగుణములు గలవాడు అని భావము).
śōbhanaguṇamulu maṃgaḷakaramaina guṇamulu.
“svābhāvika, anavadhika, atiśaya jñānabalaiśvarya vīrya śakti tējassauśīlya vātsalya mārthavārjava, sauhārda sāmya kāruṇya, mādhurya, gāṃbhīrya, audārya, cāturyasthairya, dhairya, śaurya, parākrama, satyakāma, satyasaṃkalpa, kṛtatva, kṛtajñatādi asaṃkhyēya kalyāguṇāḥ”. (śaraṇāgata gadyamu - śrīrāmānujaḥ)
(svābhāvikasiddhamainavi, haddulēni goppatanamugalavi, ayina jñānamu, balamu, aiśvaryamu (sāmarthyamu), vīryamu, śakti, tējassu, sauśīlyamu, vātsalyamu, mṛdutvamu, rujusvabhāvamu, (manōvākkāyamulu ēkavidhamuga nuṃḍuṭa), sauhārthamu, saumyamu (samatvamu), kāruṇyamu, mādhuryamu, gāṃbhīryamu, audāryamu, cāturyamu, sthiratvamu, dhīratvamu, śūratvamu, parākramamu, satyakāmamu (aḍḍulēni kōrika), satyasaṃkalpamu (aḍḍulēni manō dhairyamu), kṛtārthatvamu, kṛtajñata modalagugā galigina, lekkiṃcuṭaku śakyamukāni maṃgaḷakaramaina guṇamulu - ivi bhagavaṃtuni kalyāṇaguṇamulu).
(tanaku iṣṭamainadi (śaraṇāgata gadyamu), ciṃtiṃcuṭaku nalavikānidi, divyamaina, adbhutamaina, nityamainadhi, niravadyamu, niratiśayaujjvalyamu, sauṃdaryamu, saugaṃdhyamu, saukumāryamu, lāvaṇyamu, yauvanamu modalagu anaṃtaguṇamulu).
kartṛtva, akartṛtva, anyadhā kartṛtva draṣṭṛtva, adraṣṭutva, anyadhā darṣṭṛtva, sarvajñatva, sarvakartṛtva, anaṃtatva nityatva, vyāpakatva, kalā vidyārāga, kālaniyatarūpatva, utpattisthitilaya tirōdhāna, anugraha anādi prabhōdatva, aluptaśaktitvādi kalyāṇaguṇamulu” (brahmavidyāsudhārṇavamu - 6)
“yathā pārthiva paramāṇugaṇanaṃ aśakyaṃ tathā viṣṇōḥ guṇagaṇanaṃ api aśakyaṃ”.
(isukarēṇuvulanu paramāṇūvulanu lekkapeṭṭa alavi kānaṭlu viṣṇuniyokka guṇamulu lekkapeṭṭa śakyamu kādu).
bhūrajamulakaina lekka budhuliḍuduru bhū
bharāna tīrnakaruḍagu
nī ramyaguṇaṃbulenna nēra ragaṇyā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. 555)
(śrīmadāṃdhramahābhāgatavamu - 1 - 18 - 414)
(anaṃtakalyāṇaguṇamulu galavāḍu ani bhāvamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.