← Back to క · Booklets 11–20 (digitized file 2)

కామజయము kāmajayamu

Original — తెలుగు
  1. “యధా సవీర్యం క్షేత్రం ముహుః ఉప్యమానం నిర్వీర్యతాం శనైః భవతి, యథా చ ప్రజ్వలితో అగ్నిః సఘృత బిందుభిః శామ్యతి - మహతామృత పూరేన శామ్యతి - తద్వత్ కామాసయం చిత్తం కామానామతి సేవయా విరజ్యత. (ఉత్కటవాసనా నిశిష్టస్య సహసా ఏవ కామత్యాగా సంభవాత్ వేదోక్త నియమేన బహుశః కామాన్ భుంజా నస్యేవ నిత్య నైమిత్తికైః విశుద్ధ చేతసః తద్దోష దర్శనేన యయాతి సైభరి ప్రముఖానామివ శనైః విరాగో భవతి).”

(పై విషయము శ్రీమదాంధ్రమహాభాగవతములో చెప్పబడినది - చూడుము ‘కామజయము – 4’).

(ఉత్కటమైన వాసనలచేత విశిష్టుడైనవాడు శీఘ్రముగా కామములను వదలివేయలేడు - వేదములలో చెప్పబడిన నియమములను పాటించి నిత్య నైమిత్తిక కర్మలను చేయుతచేత చిత్తశుద్ధి కలిగి, కామములవలన కలుగు దోషములను తెలుసుకొనినవాడై, యయాతి మహారాజు, సౌభరి మొదలగువారివలె, మెల్లిగా క్రమముగా, విరాగియగును).

  1. “ఆపూర్యమాణ మచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ |

తద్వత్కామా యం ప్రవిశంతి సర్వే న శాంతిమాప్నోతి, నకామ కామీ ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 70)

“ఉక్తాధునా కామశాంతిః సదృష్టాంతా నిదర్శ్యతే |

ఆపూర్వమాణం సర్వాభిర్నదభిరపి సాగరం |

పృష్ట్యాది ప్రభావా ఆపః ప్రవిశంతి యథా ఖిలాః |

అనతిక్రాంతా మర్యాదం తిష్టనంతం నిర్వికారతః |

ధీరం తేన ప్రకారేణ స్థిత ప్రజ్ఞమవస్థితం |

నిర్వికారతయా నంతమ్న్ కామమానా అతీతరైః |

శబ్దాద్యా విషయా స్సర్వే యది ప్రారబ్ధ కర్మణా |

ప్రవిశంతి నతచ్చిత్తం వికర్తుం శక్నువంతితే |

స మహార్ణవ తుల్యో యః స్థిత ప్రజ్ఞో విచక్షణః |

సర్వే లౌకిక విక్షేప నివృత్తేః జ్ఞానతేజసా |

అవిద్యా కార్య మా భాసమపి త్యక్త్వా చ నైష్టికం |

శాంతి మాప్నోతి; మూఢస్తు కామ కామీ న శాంతిభాక్ |

కామాన్కామయితుం శీలం యస్య సంసారిణః స చ |

క్లేశార్న వే మగ్నొ భవతీత్యాశయో హరేః ||“. (గీతాభావప్రకాసము - 2 - 656 to 663)

(వర్షము మొదలగువాటి ప్రభావమువలన సమస్తమైన నదులు వాటి నీటితో సముద్రమును నింపివేయుచున్నను, సముద్రము వికారమును పొందక ఎప్పటి వలెనే శాంతిని పొంది, తన పరిమితిని దాటకయుండునట్లు ఆ ప్రకారముగా ప్రారబ్దకర్మ వశమున శబ్దము మొదలగు విషయములు ధీరుడు, వికారమును పొందనివాడు అగు స్థిత ప్రజ్ఞుని పొందినను, సముద్రమువలె వికారము చెందక యున్నవాని మనస్సును వికారమును పొందునట్లు చేయలేవు - అందుచేత అట్టివాడు సమస్తమైన లౌకిక విక్షేపములు లేనివాడై శాంతిని పొందును - మూఢుడు, కామములను కోరువాడు ఇట్లు శాంతిని పొందలేడు - కామములను సేవించుటవలన, హవిస్సుపోయుచున్న అగ్ని ప్రజ్వలించునే కాని శాంతించనట్లు శాంతిని పొందలేడు). (చూడుము - ‘కామజయము’).

Transliteration
  1. “yadhā savīryaṃ kṣētraṃ muhuḥ upyamānaṃ nirvīryatāṃ śanaiḥ bhavati, yathā ca prajvalitō agniḥ saghṛta biṃdubhiḥ śāmyati - mahatāmṛta pūrēna śāmyati - tadvat kāmāsayaṃ cittaṃ kāmānāmati sēvayā virajyata. (utkaṭavāsanā niśiṣṭasya sahasā ēva kāmatyāgā saṃbhavāt vēdōkta niyamēna bahuśaḥ kāmān bhuṃjā nasyēva nitya naimittikaiḥ viśuddha cētasaḥ taddōṣa darśanēna yayāti saibhari pramukhānāmiva śanaiḥ virāgō bhavati).”

(pai viṣayamu śrīmadāṃdhramahābhāgavatamulō ceppabaḍinadi - cūḍumu ‘kāmajayamu – 4’).

(utkaṭamaina vāsanalacēta viśiṣṭuḍainavāḍu śīghramugā kāmamulanu vadalivēyalēḍu - vēdamulalō ceppabaḍina niyamamulanu pāṭiṃci nitya naimittika karmalanu cēyutacēta cittaśuddhi kaligi, kāmamulavalana kalugu dōṣamulanu telusukoninavāḍai, yayāti mahārāju, saubhari modalaguvārivale, melligā kramamugā, virāgiyagunu).

  1. “āpūryamāṇa macala pratiṣṭaṃ samudramāpaḥ praviśaṃti yadvat |

tadvatkāmā yaṃ praviśaṃti sarvē na śāṃtimāpnōti, nakāma kāmī ||“. (śrīmadbhagavadgīta - 2 - 70)

“uktādhunā kāmaśāṃtiḥ sadṛṣṭāṃtā nidarśyatē |

āpūrvamāṇaṃ sarvābhirnadabhirapi sāgaraṃ |

pṛṣṭyādi prabhāvā āpaḥ praviśaṃti yathā khilāḥ |

anatikrāṃtā maryādaṃ tiṣṭanaṃtaṃ nirvikārataḥ |

dhīraṃ tēna prakārēṇa sthita prajñamavasthitaṃ |

nirvikāratayā naṃtamn kāmamānā atītaraiḥ |

śabdādyā viṣayā ssarvē yadi prārabdha karmaṇā |

praviśaṃti nataccittaṃ vikartuṃ śaknuvaṃtitē |

sa mahārṇava tulyō yaḥ sthita prajñō vicakṣaṇaḥ |

sarvē laukika vikṣēpa nivṛttēḥ jñānatējasā |

avidyā kārya mā bhāsamapi tyaktvā ca naiṣṭikaṃ |

śāṃti māpnōti; mūḍhastu kāma kāmī na śāṃtibhāk |

kāmānkāmayituṃ śīlaṃ yasya saṃsāriṇaḥ sa ca |

klēśārna vē magno bhavatītyāśayō harēḥ ||“. (gītābhāvaprakāsamu - 2 - 656 to 663)

(varṣamu modalaguvāṭi prabhāvamuvalana samastamaina nadulu vāṭi nīṭitō samudramunu niṃpivēyucunnanu, samudramu vikāramunu poṃdaka eppaṭi valenē śāṃtini poṃdi, tana parimitini dāṭakayuṃḍunaṭlu ā prakāramugā prārabdakarma vaśamuna śabdamu modalagu viṣayamulu dhīruḍu, vikāramunu poṃdanivāḍu agu sthita prajñuni poṃdinanu, samudramuvale vikāramu ceṃdaka yunnavāni manassunu vikāramunu poṃdunaṭlu cēyalēvu - aṃducēta aṭṭivāḍu samastamaina laukika vikṣēpamulu lēnivāḍai śāṃtini poṃdunu - mūḍhuḍu, kāmamulanu kōruvāḍu iṭlu śāṃtini poṃdalēḍu - kāmamulanu sēviṃcuṭavalana, havissupōyucunna agni prajvaliṃcunē kāni śāṃtiṃcanaṭlu śāṃtini poṃdalēḍu). (cūḍumu - ‘kāmajayamu’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.