హేతువు.
కరోతీతి బీజభావః. (చేయునది, కార్యమును చేయునది; కార్యమును పుట్టించునది - బీజము వంటిది).
ఆకాసాదీని. (ఆకాశము మొదలగునవి కారణములు. “ఆకాశాద్వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః, అభ్యః పృధివీ”
(ఆకాశములోనుండి వాయువు, వాయువులోనుండి అగ్ని, అగ్నిలోనుండి నీరు, నీటిలోనుండి భూమి పుట్టినవి అని చెప్పినపుడు - ఆకాశము కారణము, దానిలోనుండి పుట్టినవాయువు కార్యము. వాయువులోనుండి అగ్ని పుట్టినది కనుక వాయువు కారణము - అగ్ని పుట్టుటకు కారణమినదికనుక. అగ్నిలోనుండి నీరు పుట్టినదికనుక అగ్ని కారణము, నీరు కార్యము - నీటిలోనుండి భూము పుట్టినది కనుక నీరు కారణము, భూమి కార్యము - ఈ ప్రకారముగా సృష్టిలోనున్న వస్తువులన్నియు ఒకదానిలో నుండి ఒకటి పుట్టినవి. ఒక వస్తువులోనుండి ఇంకొక వస్తువు పుట్టినపుడు మొదటివస్తువు కారణము, అందులోనుండి పుట్టినది కార్యము - విత్తనమునుండి చెట్టు పుట్టును - అందుచేత విత్తనము కారణము, అందులోనుండి పుట్టిన చెట్టు కార్యము -
కారణా జ్జాయతే కార్యం. (కారణవస్తువునుండి కార్యవస్తువు పుట్టుచున్నది).
కారణేన వినా కార్యం నకదాచన విద్యతే - (కారణము లేనిదే కార్యము లేదు).
“కారణం యస్య కార్యస్య భూమిపాలన విద్యతే |
విద్యతే నేహ తత్కార్యం తత్స విత్తిస్తు విభ్రమః |
అవిద్యమాన మేవ త్వం విద్ధి సర్వం భ్రమోదితం |
అకారనం హి యద్వస్తు తన్మిధ్యా రజ్జు సర్పవత్ ||“.
(ఏ కార్యవస్తువునకు కారణము కనబడదో ఆ కార్య వస్తువే లేదు. అది ఉన్నది యనుకొనుట భ్రమ యే. కనబడనిదంతయు భ్రమవలన కలిగినదే. చీకటిలో త్రాడును చూచి అది పాము అనుకొనినట్లే. కారణములేనివస్తువు భ్రమవలన కలిగినదే, వాస్తవముగా లేనిదే)
(కార్య వస్తువులందు కారణవస్తువు వ్యాపించియుండును. - పూర్తిగా నిండియుండును -)
(కార్యవస్తువులందు వాటి కార్యము వ్యాపించియుండును, నిండియుండును. కారణమే కార్యరూపముగా మారును. కారణములో కార్యోత్పాదన శక్తికలదు - అదియే ఆత్మ. కారణములోనుండి కార్యమును పుట్టింప చేయును. అందుచేత ఆ శక్తి - భగవచ్చక్తి - ఆత్మయని చెప్పబడుచున్నది. కారణములో కార్యము సూక్ష్మావవస్థలోనున్నది. విత్తనములో చెట్టుగా పెరగవలసిన లక్షణములన్నీ సూక్ష్మావస్థలో నుండును. విత్తనములోనుండి మొలకవచ్చి పెరిగినకొలది ఆ సూక్ష్మావస్థలోనున్న లక్షణములు చెట్టుగా స్థూలాకారము చెందును.
(ఈ ప్రపంచము ఏ కొంచెము మనకు అగపడుచున్నదో, లేక, ఇంకను ఉన్నదని తెలిసినవారు చెప్పగా వినుచున్నామో అదే కాక ప్రపంచమంతయు మొత్తము ఎంత ఉన్నదో దాని నంతటిలోపల పైన, పూర్తిగా వ్యాపించి నారాయణుడున్నాడు - లోపల బైట అని చెప్పుటవలన అణుమాత్రమైనను వదలకుండా అతనే ఆ ప్రపంచమంతా అయి ఉన్నాడు అని అర్థమగును - “తత్సృష్ట్వా తదేవాను ప్రావిసత్” (లోకములను సృష్టించి వాటిలో ప్రవేశించెను).
(మట్టికి వ్యతిరేకముగా ఘటము ఉండదు - ఘటము మట్టితో చేయబడినదే. అందుచేత కుండకు మట్టి కారణము - కారణములేనిదే కార్యముండదు -
(కారనము కార్యవస్తువుకన్న భిన్నమైనది, వేరైనది. కాని కారణముకన్న కార్యము భిన్న వస్తువుకాదు - అందుచేత కారణములేని కార్యముండదు. కనుక కారణమును తెలుసుకొనిన కార్యము తెలుసుకొనబడును).
(ఛాందోగ్యోపనిషత్ - 6 - 1 - 4)
(మట్టిముద్ధ ఒకదానిని తెలుసుకొనినచో మట్టితో చేయబడిన ఘటము మొదలగు వస్తువులన్నియు తెలియబడును).
“నామధేయం వికారో అయం వా చా కేవలముచ్యతే |
వస్తుతః కరణాద్భిన్నం నాస్తి, తస్మాత్ మృషైవస ||“.
మట్టితో తయారయిన కుండ, మూకుడు మొదలగునవి పేరులో మాత్రమే వేరుగానున్నవి. వాస్తవ స్థితిలో అవి అన్నియు మట్టియే, అందుచేత కారణమైన మట్టికన్న దాని కార్యములైన కుండ మొదలగునవి వేరుకావు - అవి మృషయే (అబద్దమే). వికారము అంతయు అసత్యము - కారణము సత్యము - మృద్వత్ బ్రహ్మైవ సత్యం వియదాది వికారో మృషా “ఇతి బ్రహ్మజ్ఞానే స్దతి జ్ఞేయం కించిన్నావ శిష్యతే”. మట్టిముద్ధ సత్యము, దానిలోనుండి పుట్టినకుండ, మూకుడు మొదలగునవి అసత్యము అయినట్లే బ్రహ్మసత్యము, దానిలోనుండి పుట్టిన ఆకాశము మొదలగునవి (కార్యములు) అబద్ధములు - అందుచేత కారణమైన బ్రహ్మను తెలుసుకొనిన బ్రహ్మలోనుండి పుట్టిన కార్యములైన వస్తువులన్నియు తెలియనగును.
(నీటిలోని బుడగలు ఒక్క జలముచేతగాని, ఒక్కవాయువుచేతగాని పుట్టవు. నీరు, వాయువు కలియుటవలన పుట్టుచున్నవి. వాయువు చేత ప్రరేపింపబడిన జలములు వాయువుతో కలియుటవలన బుడగలు పుట్టుచున్నవి. అట్లే పురుషుని యొక్కనివలనగాని, ప్రకృతి ఒక్కదానివలన కాని స్రుష్టి జరుగుటలేదు; ప్రకృతి పురుష సంయోగమువలన అనేక రూపములతో నామములతో ప్రాణులు పుట్టుచున్నారు - దేవతులు, మనుష్యులు మొదలగు రూపములతో పుట్టుచున్నారు - జలములోని బుడగలకు గాలి నిమిత్తకారణము, జలము ఉపాదాన కారణము. ఈ ప్రకారముగానే ప్రపంచము పుట్టుటకు ప్రకృతి నిమిత్తకారణము, పురుషుడు - భగవంతుడు ఉపాదానకారణము).
(సముద్రము, దానిలోని ఉదకము ఒకటే అయినప్పటికీ, - అవి ఓకదానినుండి ఒకటి వేరుకానప్పటికీ - ఉదకములయొక్క వికారములైన బుడగలు, నురగ, కెరటములు మొదలగునవి ఒకదానికంటె ఒకటి వేరైనట్లు - వ్యవహరింపబడుచున్నవి, కాని అవి వేరుకావు. ఆ ప్రకారముగానే సముద్రమునకు, దాని లోని నీరునకును వేరు లేదు - - ఆ ప్రకారముగానే భోక్తకు భోగ్యవస్తువునకు అనన్యత్వములేదు - పరబ్రహ్మకు అతనిలోనుండి పుట్టిన ప్రపంచమునకు కారణమునకు కార్యమునకు అనన్యత్వము లేదు).
“తయోః కార్యకారణయో రనస్యత్వ మవ గమ్యతే - కార్యమాకాశాదికం బహు ప్రపంచం జగత్, కారనం బ్రహ్మ, తస్మాత్ కారణాత్ పరమార్థతో (అ)నన్య్త్వం వ్యతిరేకేణాభావః, కార్యవ్యావ గమయతే కుతః? ఆరంభణ శబ్దాదిభ్యః. ఆరంభణ శబ్దాస్తా వదేక విజ్ఞానేన సర్వ వొజ్ఞానం ప్రతిజ్ఞాయ దృష్టాంతాపే క్షాయాముచ్యతే -” యథా సోమ్యేకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యా ద్వాచారంభనం వికారో నామధేయం మృత్తి కేత్యేవ సత్యమితి. ఏకేన మృత్పిండేన పరమాథత్టో మృదాత్మనా విజ్ఞాతేన సర్వం మృణ్మయం - ఘత శరావోదం చ నాదికం మృదాత్మికా విశేషాత్ విజ్ఞానం భవేత్, యతో వాచారంభనం వికరో నామధేయం వాచా కేవల మస్తీత్యారభ్యతే, వికారో ఘటశ్శరావ ఉదం చనః చేతి. నతు వస్తు వృత్తేన వికారో నామ ఖశ్చిదస్తి, నామధేయ మాత్రం హ్యేత దనృతం మృత్తికా ఇత్యేవ సత్యం ఇతి“. (శ్రీ శంకరః - బ్రహ్మసూత్రభాష్యే - 2 - 1 - 14)
(కారణకార్యములకు అనన్యత్వము తెలియుచున్నది - రెండూ ఒకటే. కార్యము అనగా ఆకాశము మొదలగునవి - అనేక విధములుగా కనబడుచున్నవన్నియు - ఈ ప్రపంచమంతా - కార్యమే. కారణము పరబ్రహ్మ. అందుచేత పరమార్థ దృష్టిలో కారణమునుండి కార్యము వేరుకాదు. ఎందువలన అనగా - “ఆరంభణం వికారో నామధేయం” అను మొదలగు ఉపనిషద్వాక్యములవలన - ఒకదానిని తెలుసుకొనిన సర్వమును తెలుసుకొనవచ్చును - అనునది సర్వ విఞాన ప్రతిజ్ఞ. “ఒక్క మట్టిముద్దవలన మట్టితో చేయబడినవన్నియు తెలియనగును - మట్టి ఎన్ని రూపములుగా మారినను, ఎన్ని పేర్లతో వ్యవహరింపబడినను, అవి వాస్తవములో మట్టియే,. అదియే సత్యము –
(“ఆరంభణం వికారో నామ ధేయం” అను వాక్యము మొదలగునవి“ఈ ప్రపంచకమంతయు ఆత్మయే, ఆత్మమయమే”, “ఇదంతయు ఆత్మయే” “ఈ ప్రపంచకములో అనేక వస్తువులేవియు లేవు, అంతా ఒకటే”, ఈ వాక్యములన్నియు “ఆత్మ ఒకటే, అంతా ఆత్మయే” - “దీనిని తెలుసుకొనిన అన్నియు తెలుసుకొనినట్లే” అనుటకు ఉదాహరణములే. ఈ విధముగా కాక ఏక విజ్ఞాన ప్రతిజ్ఞ ఇంకొక విధముగా సమర్థింప బడలేదు. కుండ, మూకుడు మొదలగునవి. కుండ, మూకుడు, ఆకాశము మొదలగునవి మహాకాశము కంటె వేరు కాదని, ఒకటేయని తెలియచేయును. భోక్త, భోగ్యము మొదలుగ గల ఈ ప్రంచమంతయు బ్రహ్మమే, బ్రహ్మ కన్న వేరుకాదు - చెట్టు అనేక కొమ్మలు, ఆకులు కలిగియున్నను, అవన్నీ కలిసి చెట్టుగా వ్యవహరింపబడు చున్నది. చెట్లు ఆకులు అనేకముగా ఉన్నట్లు కనబడును - పరబ్రహ్మముకూడా అనేక విధములైన రూపములు గలవాడుగా కనబడును - ఈ ప్రకారముగా సముద్రము అంతా ఒకటిగాను, దానిలోను నీరు, నురగ, కెరటములు వేరు వేరుగా కనబడును. ఇట్లే మన్ను రూపములో ఒకటే అయినను దానితో చేయబడిన కుండ, మూకుడు మొదలగునవి వేరు వేరుగా కనబడును - అయినను అవి వాస్తవములో మట్టికంటె వేరుకావు - అట్లే భగవంతుడు ప్రపంచము వేరు కాదు.
(జగత్తునకు కారణమైన పరబ్రహ్మ మూడుకాలములందును సత్వము కలిగియుండును - సత్వము కలిగియుండకపోవుటలేదు - ఆ ప్రకారముగానే కార్యమైన జగత్తుకూడా సత్వము కలిగియుండును - కారణమందును, కార్యమందును ఉన్నసత్వము ఒకటే అందుచేత కారణము కన్న కార్యము వేరుకాదు - రెండు ఏకమే. “సృష్టికి పూర్వము బ్రహ్మము ఒకటే యుండెను” అను శ్రుతి వాక్యమువలన సృష్టికూడా అంతా బ్రహ్మమే - అందుచేత కారణమైన బ్రహ్మకు అతని కార్యమైన ప్రపంచమునకు వేరు లేదు - రెండూ ఒకటే - కారణముకన్న కార్యము వేరుకాదు).
(ప్రకృతిని ప్రవర్తింపచేయు అనంతశక్తి విజ్ఞానములకు నిధియగుటవలన ప్రపంచమునకు ఈశ్వరుడు కారణము).
(కారణమునుండి కార్యము వేరుగాకుండుట - రెండింటికి అనన్యత్వము ఎట్లనగా - కారణ వస్తువు పుట్టకముందు అది దాని కారణములోనే లీనమై యుండెను పుట్టిన తర్వాత ఇంకొక కార్యవస్తువునకు కారణమై తన సత్తాను దానికిచ్చుచున్నది. ఈ కనబడు ప్రపంచమంతయు సృష్టికి ముందు ఒక్క ఆత్మగానే యుండెను, అనిన్నీ “ఈ కనబడు ప్రపంచమంతయు సృష్టికి పూర్వము ఒక్క సత్పదార్థముగానే యుండెను -” అనిన్నీ శ్రుతి చెప్పుచున్నదున ఆత్మవలన పుట్టిన - సత్పదార్థమువలన పుట్టిన కార్యమైన ప్రపంచమునకు కారణమైన ఆత్మ కంటె వేరుకాదు - రెండింటికి అనన్యత్వమే - తిలలో తైలము తైలముగా పుట్టక ముందే ఉన్నది. అట్లే ప్రపంచము పుట్టకముందు ఆత్మలోనే ఉన్నది - అందుచేత రెండింటికి భేదము లేదు - అనన్యత్వమే ఉన్నది. ఆ రెండు పుట్టకముందు ఒకటే. తర్వాతకూడ ఒకటే. అందుచేత కారణకార్యములకు అనన్యత్వము).
(కార్యమునకు, కారణమునకు సత్వములో భేదములేదు - రెండూ ఒకటే. (దధి, ఘటము మొదలగువాటిని చేయగోరువారు పాలు, మట్టి మొదలగువాటిని ఉపాదానముగా చేయుదురు. దధికావలసినవారు మట్టిని ఉపాదానముగా తీసుకొనరు. ఘటము చేయదలచినపాలు ఉపాదానముగా తీసుకొనరు. ఎందుచేతననగా క్షీరములోనుండి పెరుగు ఉత్పత్తియగును, మట్టినుండికాదు. మట్టితోనే ఘటము తయారగును, క్షీరమునుండికాదు. అందుచేత క్షీరము కారణము, దధికార్యము. మట్టి కారణము ఘటము కార్యము. ఈ ప్రకారముగానే కారణమునుండి కార్యముపుట్టుచున్నది కాని ఎప్పుడైనను కారణమునుండి మఱియొకవిధమైన కార్యము పుట్టుటలేదు).
(ఘటమునకు ఉపాదానకారణమైన మట్టి యుక్క గుణములు కార్యమగు ఘటమందు కనబడును. ఈ ప్రకారమే కారణమైన ఆకాశముయొక్క గుణమగు శబ్దము ఆకాశముయొక్క కార్యమగు వాయువులోనున్నది. అందుచేత వాయువునకు తన అసాధారణగుణమైన స్పర్శతోపాటు శబ్దగుణముకూడ కలిగియున్నది).వాయువులోనుండి పుట్టిన అగ్నికితన అసాధారణగుణమైన రూపమే కాక దానికి కారణములైన ఆకాశముయొక్కయు, వాయువుయొక్కయు గుణములగు శబ్ద స్పర్శములు కూడ కలిగియున్నది - ఈ ప్రకారముగానే మిగిలిన రెండు భూతములకు అన్వయించుకోవలెను.
(అన్ని చిదచిద్వస్తువుల శరీరము తానే యగుటచేతను పరబ్రహ్మ సర్వాత్మ యగుటచేతను ఒకప్పుడు విభక్తమైన నామరూపములుగలవాడుగను, ఒకప్పుడు విభక్తముకాని నామరూపములు గలవాడుగను ఉండును - విభక్తమైన - అనగా వేరు వేరుగా విడిపోయిన - నామరూపములు గలవాడుగా నున్నపుడు తానే అనేక కార్యవస్తువులుగ చెప్పబడును. విభక్తములుకాని - అన్నియు కలిసి సూక్ధ్మదశలో ఒకటిగానే ఉన్నపుడు అవన్నీ తానొకడే యని వాటి అన్నింటికీ తానే కారణమని, అతనుకాని మఱియొకటి లేదని, అటువంటిదైన కారణము తానేయని చెప్పబడుచున్నాడు “కారణకార్య హేతువగు కంజదళాక్షుని కంటె నన్యులెవ్వరు లేరు తండ్రి - - !”
(శ్రీమదాంధ్రమహాభాగవతము - - - )
“కార్యరూపంబగు చేతనా చేతనాత్మక ప్రపంచంబునకు గారణుండవైన నీచేత సమస్త భువనంబులను సృజియింపబడియె”
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 15 - 501)
(కారణము, కార్యము అయినటువంటిన్నీ, కారణ వస్తువునకు కూడా కారణమైనవాడు, కార్యమునకు కార్యమైనవాడు అగు శ్రీహరి నాకు ప్రసన్నుడగుగాక).. (ఈ సృష్టిలో ప్రతివస్తువు ఇంకొక వస్తువులోనుండి పుట్టినదే - పక్షి ఇంకొక పక్షిలోనుండి, చెట్టు ఇంకొక చెట్టునుండి, పశువు ఇంకొక పశువులోనుండి, మనిషి ఇంకొకమనిషిలోనుండి - ఈ ప్రకారము సృష్టి జరుగుచున్నది. పుట్టిన వస్తువు కార్యము, అది ఎందులోనుండి పుట్టినదో అది దానికి కారణము - ఈ ప్రతివస్తువు కార్యము, కారణము కూడ అగుచున్నది. ఈ విషయము గుఱించి వెనక్కి వెనక్కి వెళ్ళీచూడగా భగవతుడిలోనుండి మొదట ఒక వస్తువు పుట్టినదే - ప్రకృతి - దానిలోనుండి మిగిలినవస్తువులన్నియు ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టినవి. అందుచేత ప్రతివస్తువు దానిముందు వస్తువుయొక్క కార్యము, దానిలోనుండి పుట్టినదానికి కారణము అగుచున్నది. మొ దట - సృష్టి మొదట ఉన్న భగవతుడు సృష్టికి - దానిలో నున్న వస్తువులకు కారణము - సృష్టిలోనున్న వస్తువులన్నియు తనరూపములే కనుక వాటికి - వాటిలో ప్రతిదానికి తానేకారణము, కార్యముకూడ అయి ఉన్నాడు).
నమో నమస్తే దేవేశ సర్వకారణకారనం ||“. (స్కాందే)
(దేవతులకు ఈశ్వరుడైనవాడా! నీనుండే అన్నియు పుట్టినవి, నీయందే అన్నియు ఉన్నవి, నీవే అన్ని వస్తువులు. సమస్త కారణ వస్తువులకు కారణమైన నీకు నమస్కారము చేయుచున్నాను).
ద్వితీయకం నా భావాత్ వేధసో(అ)స్తిన కారణం ||“.
“సర్గాదౌ కేవలమద్వితీయం బ్రహ్మైవాస్తి, తత్తు న కారణ నిర్వికారత్వాత్, అన్యదపి జగత్కారణ భూతం వస్తునాస్తి - ద్వితీయకలనా భవాత్, ద్వితీయస్య భ్రహ్మవ్యతిరిక్తస్య వస్తునః ప్రతీత్యభావాత్ వేధసః కారణం నాస్తి.”
(సృష్టికిముందు కేవలుడగు పరబ్రహ్మ ఒక్కడే యుండెను. పరబ్రహ్మతప్ప మరియొక రెండవ వస్తువు లేకుండెను. అందువలన బ్రహ్మకు కారణమనునదిలేదు. పరబ్రహ్మ నిర్వికారుడగుటవలన అతనికి కారణములేదు. జగత్తునకు కారణమైన అ వస్తువు మరియొకటిలేదు - కారణమనగా జన్మ. బ్రహ్మ కారణము లేనివాడు, జన్మ లేనివాడు కనుక అజుడు (నజాయతే ఇత్యజః). అనాది (అస్య ఆదిః కారణం నవిద్యతే ఇత్యనాదిః) (ఆది - కారణము, జన్మలేనివాడు) అని చెప్పబడుచున్నాడు).
కారణములు మూడు విధములు - సమవాయి కారణము, ఉపాదానకారణము, నిమిత్తకారణము (వివర్తకారణము, ఉపాదానకారణము, నిమిత్తకారణము). కుండ చేయుటకు మట్టికావలెను. మట్టిలేనిదే కుండ అవదు - అందుచేత కుండకు మట్టి ఉపాదానకారణము. మట్టియున్నను దానిని కుండగా చేయు కుమ్మరి యుండవలెను. అందుచేత కుమ్మరి కుండకు నిమిత్తకారణము - ఆ ప్రకారముగానే బంగారు ఆభరణములకు బంగారము ఉపాదానకారణము, స్వర్ణకారుడు నిమిత్తకారణము - సాలెపురుగు తనగూడు కట్టుకొనుటకు తనలోనుండి దారము తీసుకొని కట్టుకొనును. అందుచేత దాని గూడుకు సాలెపురుగు ఉపాదానకరణము నిమిత్తకారణముకూడా అగుచున్నది. సాలెపురుగువలెనే భగవంతుడు ప్రపంచమునకు ఉపాదానకారణము, నిమిత్తకారణముకూడా - ఎట్లంటే - భగవంతుడు తనలోనుండి ప్రకృతిని పుట్టించి దానితో ప్రపంచమంతయు సృష్టించుచున్నాడు. అందుచేత అతను ప్రపంచ సృష్టికి ఉపాదాన కారణము, నిమిత్తకారణము కూడ అయియున్నాడు -
శక్తిద్వయ వదజ్ఞానోపహితం చైతన్యం స్వప్రథానతయా నిమిత్త, స్వోపాధి ప్రధానతయా ఉపాదానంచ భవతి.
(ఆవరణ విక్షేప శక్తులతో కూడిన చైతన్యము (భగవంతుడు) ఈ జగత్తునకు నిరుపాధిక ఆత్మ దృష్ట్యా నిమిత్తకారణము.
“యథాలూతా తంతుకార్యం ప్రతి స్వప్రధానతయా నిమిత్తం, స్వ శరీర ప్రథానతయా ఉపాదానం చ భవతి”
(సాలెపురుగు తాను కట్టు గూడునకు సాలెపురుగు దృష్ట్యా - తానే గూడు కట్టునుకనుక – నిమిత్తకారణమున్నూ తన శరీరమునుండియే దారము తీసుకొనుటవలన ఉపాదానకారణము అగుచున్నది).
జాతాచ్చ జాయమానస్య న వ్యవస్థా ప్రపజ్యతే ||“.
(ప్రపంచములో దేనిలోనుండి అయినను పుట్టినదానినుండి - కారణమునుండి - ఇంకొకటి పుట్టియుండుటకానరాదు. కార్యము కానటువంటి కారణమునుండి కార్యవస్తువు పుట్టుటలేదు. ఇట్టి స్థితిలో కార్యము కార్యముకానటువంటి కార్యమునుండి కార్యవస్తువు పుట్టినదనుట న్యాయసమ్మతము కాదు. భగవంతునిలోనుండి అతని కార్యవస్తువులైన ప్రపంచమంతా పుట్టుచున్నది. భగవంతునికి కారణమైన వస్తువేది ? దీనికి సమాధానము కనబడదు - భగవంతునకు కారణములేదు, జన్మలేదు, - అందుచేత కార్యవస్తువుకాడు. న్యాయశాస్త్ర ప్రకారము ప్రతి వస్తువునకు కారణముండవలెను. ఒక వస్తువునకు కారణముండిన ఆ కారణవస్తువెట్లు కలిగినది, దానికి కారణముండవలెనుకదా ! దానికి కారణముండిన, ఆ కారణమునకు కారణముండవలెను - ఈ ప్రకారము ప్రతి వస్తువునకు ముందు కారణము వెదకవలసియుండును - దీనికి అంతముండదు - దీనినే అనవస్థాదోషమందురు - ఈ కారణకార్యములు ఎప్పటినుండి ప్రారంభమైనవో తెలియదు - ఒక కారణమునుండి ఇంకొక కారణమునకు, దానినుండి దాని కారణమునకు, ఇట్టు వెనుకకు వెనుకకు ఎంతదూరము వెళ్ళినను ఆ మొదటికారణమెట్లు కలిగినదో తెలియదు. దీనిని సమర్థింపజాలక జ్ఞానులు మొదటి కారణమని చెప్పబడుచున్న భగవంతినికి కారణము లేదని, అతను ఏ వస్తువునకు కార్యము కాడని సిద్ధాంతము చేసిరి. బీజమునుండి అంకురము పుట్టుట, అంకురము చెట్టై దానినుండి బీజము పుట్టుట అను బీజాంకురన్యాయము - (theory of cause and effect) భగవంతుని యడల వర్తించదు - (Every rule has an exception)..”
hētuvu.
karōtīti bījabhāvaḥ. (cēyunadi, kāryamunu cēyunadi; kāryamunu puṭṭiṃcunadi - bījamu vaṃṭidi).
ākāsādīni. (ākāśamu modalagunavi kāraṇamulu. “ākāśādvāyuḥ, vāyōragniḥ, agnērāpaḥ, abhyaḥ pṛdhivī”
(ākāśamulōnuṃḍi vāyuvu, vāyuvulōnuṃḍi agni, agnilōnuṃḍi nīru, nīṭilōnuṃḍi bhūmi puṭṭinavi ani ceppinapuḍu - ākāśamu kāraṇamu, dānilōnuṃḍi puṭṭinavāyuvu kāryamu. vāyuvulōnuṃḍi agni puṭṭinadi kanuka vāyuvu kāraṇamu - agni puṭṭuṭaku kāraṇaminadikanuka. agnilōnuṃḍi nīru puṭṭinadikanuka agni kāraṇamu, nīru kāryamu - nīṭilōnuṃḍi bhūmu puṭṭinadi kanuka nīru kāraṇamu, bhūmi kāryamu - ī prakāramugā sṛṣṭilōnunna vastuvulanniyu okadānilō nuṃḍi okaṭi puṭṭinavi. oka vastuvulōnuṃḍi iṃkoka vastuvu puṭṭinapuḍu modaṭivastuvu kāraṇamu, aṃdulōnuṃḍi puṭṭinadi kāryamu - vittanamunuṃḍi ceṭṭu puṭṭunu - aṃducēta vittanamu kāraṇamu, aṃdulōnuṃḍi puṭṭina ceṭṭu kāryamu -
kāraṇā jjāyatē kāryaṃ. (kāraṇavastuvunuṃḍi kāryavastuvu puṭṭucunnadi).
kāraṇēna vinā kāryaṃ nakadācana vidyatē - (kāraṇamu lēnidē kāryamu lēdu).
“kāraṇaṃ yasya kāryasya bhūmipālana vidyatē |
vidyatē nēha tatkāryaṃ tatsa vittistu vibhramaḥ |
avidyamāna mēva tvaṃ viddhi sarvaṃ bhramōditaṃ |
akāranaṃ hi yadvastu tanmidhyā rajju sarpavat ||“.
(ē kāryavastuvunaku kāraṇamu kanabaḍadō ā kārya vastuvē lēdu. adi unnadi yanukonuṭa bhrama yē. kanabaḍanidaṃtayu bhramavalana kaliginadē. cīkaṭilō trāḍunu cūci adi pāmu anukoninaṭlē. kāraṇamulēnivastuvu bhramavalana kaliginadē, vāstavamugā lēnidē)
(kārya vastuvulaṃdu kāraṇavastuvu vyāpiṃciyuṃḍunu. - pūrtigā niṃḍiyuṃḍunu -)
(kāryavastuvulaṃdu vāṭi kāryamu vyāpiṃciyuṃḍunu, niṃḍiyuṃḍunu. kāraṇamē kāryarūpamugā mārunu. kāraṇamulō kāryōtpādana śaktikaladu - adiyē ātma. kāraṇamulōnuṃḍi kāryamunu puṭṭiṃpa cēyunu. aṃducēta ā śakti - bhagavaccakti - ātmayani ceppabaḍucunnadi. kāraṇamulō kāryamu sūkṣmāvavasthalōnunnadi. vittanamulō ceṭṭugā peragavalasina lakṣaṇamulannī sūkṣmāvasthalō nuṃḍunu. vittanamulōnuṃḍi molakavacci periginakoladi ā sūkṣmāvasthalōnunna lakṣaṇamulu ceṭṭugā sthūlākāramu ceṃdunu.
(ī prapaṃcamu ē koṃcemu manaku agapaḍucunnadō, lēka, iṃkanu unnadani telisinavāru ceppagā vinucunnāmō adē kāka prapaṃcamaṃtayu mottamu eṃta unnadō dāni naṃtaṭilōpala paina, pūrtigā vyāpiṃci nārāyaṇuḍunnāḍu - lōpala baiṭa ani ceppuṭavalana aṇumātramainanu vadalakuṃḍā atanē ā prapaṃcamaṃtā ayi unnāḍu ani arthamagunu - “tatsṛṣṭvā tadēvānu prāvisat” (lōkamulanu sṛṣṭiṃci vāṭilō pravēśiṃcenu).
(maṭṭiki vyatirēkamugā ghaṭamu uṃḍadu - ghaṭamu maṭṭitō cēyabaḍinadē. aṃducēta kuṃḍaku maṭṭi kāraṇamu - kāraṇamulēnidē kāryamuṃḍadu -
(kāranamu kāryavastuvukanna bhinnamainadi, vērainadi. kāni kāraṇamukanna kāryamu bhinna vastuvukādu - aṃducēta kāraṇamulēni kāryamuṃḍadu. kanuka kāraṇamunu telusukonina kāryamu telusukonabaḍunu).
(chāṃdōgyōpaniṣat - 6 - 1 - 4)
(maṭṭimuddha okadānini telusukoninacō maṭṭitō cēyabaḍina ghaṭamu modalagu vastuvulanniyu teliyabaḍunu).
“nāmadhēyaṃ vikārō ayaṃ vā cā kēvalamucyatē |
vastutaḥ karaṇādbhinnaṃ nāsti, tasmāt mṛṣaivasa ||“.
maṭṭitō tayārayina kuṃḍa, mūkuḍu modalagunavi pērulō mātramē vērugānunnavi. vāstava sthitilō avi anniyu maṭṭiyē, aṃducēta kāraṇamaina maṭṭikanna dāni kāryamulaina kuṃḍa modalagunavi vērukāvu - avi mṛṣayē (abaddamē). vikāramu aṃtayu asatyamu - kāraṇamu satyamu - mṛdvat brahmaiva satyaṃ viyadādi vikārō mṛṣā “iti brahmajñānē sdati jñēyaṃ kiṃcinnāva śiṣyatē”. maṭṭimuddha satyamu, dānilōnuṃḍi puṭṭinakuṃḍa, mūkuḍu modalagunavi asatyamu ayinaṭlē brahmasatyamu, dānilōnuṃḍi puṭṭina ākāśamu modalagunavi (kāryamulu) abaddhamulu - aṃducēta kāraṇamaina brahmanu telusukonina brahmalōnuṃḍi puṭṭina kāryamulaina vastuvulanniyu teliyanagunu.
(nīṭilōni buḍagalu okka jalamucētagāni, okkavāyuvucētagāni puṭṭavu. nīru, vāyuvu kaliyuṭavalana puṭṭucunnavi. vāyuvu cēta prarēpiṃpabaḍina jalamulu vāyuvutō kaliyuṭavalana buḍagalu puṭṭucunnavi. aṭlē puruṣuni yokkanivalanagāni, prakṛti okkadānivalana kāni sruṣṭi jaruguṭalēdu; prakṛti puruṣa saṃyōgamuvalana anēka rūpamulatō nāmamulatō prāṇulu puṭṭucunnāru - dēvatulu, manuṣyulu modalagu rūpamulatō puṭṭucunnāru - jalamulōni buḍagalaku gāli nimittakāraṇamu, jalamu upādāna kāraṇamu. ī prakāramugānē prapaṃcamu puṭṭuṭaku prakṛti nimittakāraṇamu, puruṣuḍu - bhagavaṃtuḍu upādānakāraṇamu).
(samudramu, dānilōni udakamu okaṭē ayinappaṭikī, - avi ōkadāninuṃḍi okaṭi vērukānappaṭikī - udakamulayokka vikāramulaina buḍagalu, nuraga, keraṭamulu modalagunavi okadānikaṃṭe okaṭi vērainaṭlu - vyavahariṃpabaḍucunnavi, kāni avi vērukāvu. ā prakāramugānē samudramunaku, dāni lōni nīrunakunu vēru lēdu - - ā prakāramugānē bhōktaku bhōgyavastuvunaku ananyatvamulēdu - parabrahmaku atanilōnuṃḍi puṭṭina prapaṃcamunaku kāraṇamunaku kāryamunaku ananyatvamu lēdu).
“tayōḥ kāryakāraṇayō ranasyatva mava gamyatē - kāryamākāśādikaṃ bahu prapaṃcaṃ jagat, kāranaṃ brahma, tasmāt kāraṇāt paramārthatō (a)nanytvaṃ vyatirēkēṇābhāvaḥ, kāryavyāva gamayatē kutaḥ? āraṃbhaṇa śabdādibhyaḥ. āraṃbhaṇa śabdāstā vadēka vijñānēna sarva vojñānaṃ pratijñāya dṛṣṭāṃtāpē kṣāyāmucyatē -” yathā sōmyēkēna mṛtpiṃḍēna sarvaṃ mṛṇmayaṃ vijñātaṃ syā dvācāraṃbhanaṃ vikārō nāmadhēyaṃ mṛtti kētyēva satyamiti. ēkēna mṛtpiṃḍēna paramāthatṭō mṛdātmanā vijñātēna sarvaṃ mṛṇmayaṃ - ghata śarāvōdaṃ ca nādikaṃ mṛdātmikā viśēṣāt vijñānaṃ bhavēt, yatō vācāraṃbhanaṃ vikarō nāmadhēyaṃ vācā kēvala mastītyārabhyatē, vikārō ghaṭaśśarāva udaṃ canaḥ cēti. natu vastu vṛttēna vikārō nāma khaścidasti, nāmadhēya mātraṃ hyēta danṛtaṃ mṛttikā ityēva satyaṃ iti”. (śrī śaṃkaraḥ - brahmasūtrabhāṣyē - 2 - 1 - 14)
(kāraṇakāryamulaku ananyatvamu teliyucunnadi - reṃḍū okaṭē. kāryamu anagā ākāśamu modalagunavi - anēka vidhamulugā kanabaḍucunnavanniyu - ī prapaṃcamaṃtā - kāryamē. kāraṇamu parabrahma. aṃducēta paramārtha dṛṣṭilō kāraṇamunuṃḍi kāryamu vērukādu. eṃduvalana anagā - “āraṃbhaṇaṃ vikārō nāmadhēyaṃ” anu modalagu upaniṣadvākyamulavalana - okadānini telusukonina sarvamunu telusukonavaccunu - anunadi sarva viñāna pratijña. “okka maṭṭimuddavalana maṭṭitō cēyabaḍinavanniyu teliyanagunu - maṭṭi enni rūpamulugā mārinanu, enni pērlatō vyavahariṃpabaḍinanu, avi vāstavamulō maṭṭiyē,. adiyē satyamu –
(“āraṃbhaṇaṃ vikārō nāma dhēyaṃ” anu vākyamu modalagunavi”ī prapaṃcakamaṃtayu ātmayē, ātmamayamē”, “idaṃtayu ātmayē” “ī prapaṃcakamulō anēka vastuvulēviyu lēvu, aṃtā okaṭē”, ī vākyamulanniyu “ātma okaṭē, aṃtā ātmayē” - “dīnini telusukonina anniyu telusukoninaṭlē” anuṭaku udāharaṇamulē. ī vidhamugā kāka ēka vijñāna pratijña iṃkoka vidhamugā samarthiṃpa baḍalēdu. kuṃḍa, mūkuḍu modalagunavi. kuṃḍa, mūkuḍu, ākāśamu modalagunavi mahākāśamu kaṃṭe vēru kādani, okaṭēyani teliyacēyunu. bhōkta, bhōgyamu modaluga gala ī praṃcamaṃtayu brahmamē, brahma kanna vērukādu - ceṭṭu anēka kommalu, ākulu kaligiyunnanu, avannī kalisi ceṭṭugā vyavahariṃpabaḍu cunnadi. ceṭlu ākulu anēkamugā unnaṭlu kanabaḍunu - parabrahmamukūḍā anēka vidhamulaina rūpamulu galavāḍugā kanabaḍunu - ī prakāramugā samudramu aṃtā okaṭigānu, dānilōnu nīru, nuraga, keraṭamulu vēru vērugā kanabaḍunu. iṭlē mannu rūpamulō okaṭē ayinanu dānitō cēyabaḍina kuṃḍa, mūkuḍu modalagunavi vēru vērugā kanabaḍunu - ayinanu avi vāstavamulō maṭṭikaṃṭe vērukāvu - aṭlē bhagavaṃtuḍu prapaṃcamu vēru kādu.
(jagattunaku kāraṇamaina parabrahma mūḍukālamulaṃdunu satvamu kaligiyuṃḍunu - satvamu kaligiyuṃḍakapōvuṭalēdu - ā prakāramugānē kāryamaina jagattukūḍā satvamu kaligiyuṃḍunu - kāraṇamaṃdunu, kāryamaṃdunu unnasatvamu okaṭē aṃducēta kāraṇamu kanna kāryamu vērukādu - reṃḍu ēkamē. “sṛṣṭiki pūrvamu brahmamu okaṭē yuṃḍenu” anu śruti vākyamuvalana sṛṣṭikūḍā aṃtā brahmamē - aṃducēta kāraṇamaina brahmaku atani kāryamaina prapaṃcamunaku vēru lēdu - reṃḍū okaṭē - kāraṇamukanna kāryamu vērukādu).
(prakṛtini pravartiṃpacēyu anaṃtaśakti vijñānamulaku nidhiyaguṭavalana prapaṃcamunaku īśvaruḍu kāraṇamu).
(kāraṇamunuṃḍi kāryamu vērugākuṃḍuṭa - reṃḍiṃṭiki ananyatvamu eṭlanagā - kāraṇa vastuvu puṭṭakamuṃdu adi dāni kāraṇamulōnē līnamai yuṃḍenu puṭṭina tarvāta iṃkoka kāryavastuvunaku kāraṇamai tana sattānu dānikiccucunnadi. ī kanabaḍu prapaṃcamaṃtayu sṛṣṭiki muṃdu okka ātmagānē yuṃḍenu, aninnī “ī kanabaḍu prapaṃcamaṃtayu sṛṣṭiki pūrvamu okka satpadārthamugānē yuṃḍenu -” aninnī śruti ceppucunnaduna ātmavalana puṭṭina - satpadārthamuvalana puṭṭina kāryamaina prapaṃcamunaku kāraṇamaina ātma kaṃṭe vērukādu - reṃḍiṃṭiki ananyatvamē - tilalō tailamu tailamugā puṭṭaka muṃdē unnadi. aṭlē prapaṃcamu puṭṭakamuṃdu ātmalōnē unnadi - aṃducēta reṃḍiṃṭiki bhēdamu lēdu - ananyatvamē unnadi. ā reṃḍu puṭṭakamuṃdu okaṭē. tarvātakūḍa okaṭē. aṃducēta kāraṇakāryamulaku ananyatvamu).
(kāryamunaku, kāraṇamunaku satvamulō bhēdamulēdu - reṃḍū okaṭē. (dadhi, ghaṭamu modalaguvāṭini cēyagōruvāru pālu, maṭṭi modalaguvāṭini upādānamugā cēyuduru. dadhikāvalasinavāru maṭṭini upādānamugā tīsukonaru. ghaṭamu cēyadalacinapālu upādānamugā tīsukonaru. eṃducētananagā kṣīramulōnuṃḍi perugu utpattiyagunu, maṭṭinuṃḍikādu. maṭṭitōnē ghaṭamu tayāragunu, kṣīramunuṃḍikādu. aṃducēta kṣīramu kāraṇamu, dadhikāryamu. maṭṭi kāraṇamu ghaṭamu kāryamu. ī prakāramugānē kāraṇamunuṃḍi kāryamupuṭṭucunnadi kāni eppuḍainanu kāraṇamunuṃḍi maṟiyokavidhamaina kāryamu puṭṭuṭalēdu).
(ghaṭamunaku upādānakāraṇamaina maṭṭi yukka guṇamulu kāryamagu ghaṭamaṃdu kanabaḍunu. ī prakāramē kāraṇamaina ākāśamuyokka guṇamagu śabdamu ākāśamuyokka kāryamagu vāyuvulōnunnadi. aṃducēta vāyuvunaku tana asādhāraṇaguṇamaina sparśatōpāṭu śabdaguṇamukūḍa kaligiyunnadi).vāyuvulōnuṃḍi puṭṭina agnikitana asādhāraṇaguṇamaina rūpamē kāka dāniki kāraṇamulaina ākāśamuyokkayu, vāyuvuyokkayu guṇamulagu śabda sparśamulu kūḍa kaligiyunnadi - ī prakāramugānē migilina reṃḍu bhūtamulaku anvayiṃcukōvalenu.
(anni cidacidvastuvula śarīramu tānē yaguṭacētanu parabrahma sarvātma yaguṭacētanu okappuḍu vibhaktamaina nāmarūpamulugalavāḍuganu, okappuḍu vibhaktamukāni nāmarūpamulu galavāḍuganu uṃḍunu - vibhaktamaina - anagā vēru vērugā viḍipōyina - nāmarūpamulu galavāḍugā nunnapuḍu tānē anēka kāryavastuvuluga ceppabaḍunu. vibhaktamulukāni - anniyu kalisi sūkdhmadaśalō okaṭigānē unnapuḍu avannī tānokaḍē yani vāṭi anniṃṭikī tānē kāraṇamani, atanukāni maṟiyokaṭi lēdani, aṭuvaṃṭidaina kāraṇamu tānēyani ceppabaḍucunnāḍu “kāraṇakārya hētuvagu kaṃjadaḷākṣuni kaṃṭe nanyulevvaru lēru taṃḍri - - !”
(śrīmadāṃdhramahābhāgavatamu - - - )
“kāryarūpaṃbagu cētanā cētanātmaka prapaṃcaṃbunaku gāraṇuṃḍavaina nīcēta samasta bhuvanaṃbulanu sṛjiyiṃpabaḍiye”
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 15 - 501)
(kāraṇamu, kāryamu ayinaṭuvaṃṭinnī, kāraṇa vastuvunaku kūḍā kāraṇamainavāḍu, kāryamunaku kāryamainavāḍu agu śrīhari nāku prasannuḍagugāka).. (ī sṛṣṭilō prativastuvu iṃkoka vastuvulōnuṃḍi puṭṭinadē - pakṣi iṃkoka pakṣilōnuṃḍi, ceṭṭu iṃkoka ceṭṭunuṃḍi, paśuvu iṃkoka paśuvulōnuṃḍi, maniṣi iṃkokamaniṣilōnuṃḍi - ī prakāramu sṛṣṭi jarugucunnadi. puṭṭina vastuvu kāryamu, adi eṃdulōnuṃḍi puṭṭinadō adi dāniki kāraṇamu - ī prativastuvu kāryamu, kāraṇamu kūḍa agucunnadi. ī viṣayamu guṟiṃci venakki venakki veḷḷīcūḍagā bhagavatuḍilōnuṃḍi modaṭa oka vastuvu puṭṭinadē - prakṛti - dānilōnuṃḍi migilinavastuvulanniyu okadānilōnuṃḍi okaṭigā puṭṭinavi. aṃducēta prativastuvu dānimuṃdu vastuvuyokka kāryamu, dānilōnuṃḍi puṭṭinadāniki kāraṇamu agucunnadi. mo daṭa - sṛṣṭi modaṭa unna bhagavatuḍu sṛṣṭiki - dānilō nunna vastuvulaku kāraṇamu - sṛṣṭilōnunna vastuvulanniyu tanarūpamulē kanuka vāṭiki - vāṭilō pratidāniki tānēkāraṇamu, kāryamukūḍa ayi unnāḍu).
namō namastē dēvēśa sarvakāraṇakāranaṃ ||“. (skāṃdē)
(dēvatulaku īśvaruḍainavāḍā! nīnuṃḍē anniyu puṭṭinavi, nīyaṃdē anniyu unnavi, nīvē anni vastuvulu. samasta kāraṇa vastuvulaku kāraṇamaina nīku namaskāramu cēyucunnānu).
dvitīyakaṃ nā bhāvāt vēdhasō(a)stina kāraṇaṃ ||“.
“sargādau kēvalamadvitīyaṃ brahmaivāsti, tattu na kāraṇa nirvikāratvāt, anyadapi jagatkāraṇa bhūtaṃ vastunāsti - dvitīyakalanā bhavāt, dvitīyasya bhrahmavyatiriktasya vastunaḥ pratītyabhāvāt vēdhasaḥ kāraṇaṃ nāsti.”
(sṛṣṭikimuṃdu kēvaluḍagu parabrahma okkaḍē yuṃḍenu. parabrahmatappa mariyoka reṃḍava vastuvu lēkuṃḍenu. aṃduvalana brahmaku kāraṇamanunadilēdu. parabrahma nirvikāruḍaguṭavalana ataniki kāraṇamulēdu. jagattunaku kāraṇamaina a vastuvu mariyokaṭilēdu - kāraṇamanagā janma. brahma kāraṇamu lēnivāḍu, janma lēnivāḍu kanuka ajuḍu (najāyatē ityajaḥ). anādi (asya ādiḥ kāraṇaṃ navidyatē ityanādiḥ) (ādi - kāraṇamu, janmalēnivāḍu) ani ceppabaḍucunnāḍu).
kāraṇamulu mūḍu vidhamulu - samavāyi kāraṇamu, upādānakāraṇamu, nimittakāraṇamu (vivartakāraṇamu, upādānakāraṇamu, nimittakāraṇamu). kuṃḍa cēyuṭaku maṭṭikāvalenu. maṭṭilēnidē kuṃḍa avadu - aṃducēta kuṃḍaku maṭṭi upādānakāraṇamu. maṭṭiyunnanu dānini kuṃḍagā cēyu kummari yuṃḍavalenu. aṃducēta kummari kuṃḍaku nimittakāraṇamu - ā prakāramugānē baṃgāru ābharaṇamulaku baṃgāramu upādānakāraṇamu, svarṇakāruḍu nimittakāraṇamu - sālepurugu tanagūḍu kaṭṭukonuṭaku tanalōnuṃḍi dāramu tīsukoni kaṭṭukonunu. aṃducēta dāni gūḍuku sālepurugu upādānakaraṇamu nimittakāraṇamukūḍā agucunnadi. sālepuruguvalenē bhagavaṃtuḍu prapaṃcamunaku upādānakāraṇamu, nimittakāraṇamukūḍā - eṭlaṃṭē - bhagavaṃtuḍu tanalōnuṃḍi prakṛtini puṭṭiṃci dānitō prapaṃcamaṃtayu sṛṣṭiṃcucunnāḍu. aṃducēta atanu prapaṃca sṛṣṭiki upādāna kāraṇamu, nimittakāraṇamu kūḍa ayiyunnāḍu -
śaktidvaya vadajñānōpahitaṃ caitanyaṃ svaprathānatayā nimitta, svōpādhi pradhānatayā upādānaṃca bhavati.
(āvaraṇa vikṣēpa śaktulatō kūḍina caitanyamu (bhagavaṃtuḍu) ī jagattunaku nirupādhika ātma dṛṣṭyā nimittakāraṇamu.
“yathālūtā taṃtukāryaṃ prati svapradhānatayā nimittaṃ, sva śarīra prathānatayā upādānaṃ ca bhavati”
(sālepurugu tānu kaṭṭu gūḍunaku sālepurugu dṛṣṭyā - tānē gūḍu kaṭṭunukanuka – nimittakāraṇamunnū tana śarīramunuṃḍiyē dāramu tīsukonuṭavalana upādānakāraṇamu agucunnadi).
jātācca jāyamānasya na vyavasthā prapajyatē ||“.
(prapaṃcamulō dēnilōnuṃḍi ayinanu puṭṭinadāninuṃḍi - kāraṇamunuṃḍi - iṃkokaṭi puṭṭiyuṃḍuṭakānarādu. kāryamu kānaṭuvaṃṭi kāraṇamunuṃḍi kāryavastuvu puṭṭuṭalēdu. iṭṭi sthitilō kāryamu kāryamukānaṭuvaṃṭi kāryamunuṃḍi kāryavastuvu puṭṭinadanuṭa nyāyasammatamu kādu. bhagavaṃtunilōnuṃḍi atani kāryavastuvulaina prapaṃcamaṃtā puṭṭucunnadi. bhagavaṃtuniki kāraṇamaina vastuvēdi ? dīniki samādhānamu kanabaḍadu - bhagavaṃtunaku kāraṇamulēdu, janmalēdu, - aṃducēta kāryavastuvukāḍu. nyāyaśāstra prakāramu prati vastuvunaku kāraṇamuṃḍavalenu. oka vastuvunaku kāraṇamuṃḍina ā kāraṇavastuveṭlu kaliginadi, dāniki kāraṇamuṃḍavalenukadā ! dāniki kāraṇamuṃḍina, ā kāraṇamunaku kāraṇamuṃḍavalenu - ī prakāramu prati vastuvunaku muṃdu kāraṇamu vedakavalasiyuṃḍunu - dīniki aṃtamuṃḍadu - dīninē anavasthādōṣamaṃduru - ī kāraṇakāryamulu eppaṭinuṃḍi prāraṃbhamainavō teliyadu - oka kāraṇamunuṃḍi iṃkoka kāraṇamunaku, dāninuṃḍi dāni kāraṇamunaku, iṭṭu venukaku venukaku eṃtadūramu veḷḷinanu ā modaṭikāraṇameṭlu kaliginadō teliyadu. dīnini samarthiṃpajālaka jñānulu modaṭi kāraṇamani ceppabaḍucunna bhagavaṃtiniki kāraṇamu lēdani, atanu ē vastuvunaku kāryamu kāḍani siddhāṃtamu cēsiri. bījamunuṃḍi aṃkuramu puṭṭuṭa, aṃkuramu ceṭṭai dāninuṃḍi bījamu puṭṭuṭa anu bījāṃkuranyāyamu - (theory of cause and effect) bhagavaṃtuni yaḍala vartiṃcadu - (Every rule has an exception)..”
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.