← Back to క · Booklets 11–20 (digitized file 2)

కరణము karaṇamu

Original — తెలుగు
  1. “క్రియతే అనేన ఇతి, బాహ్యం శ్రోత్రాది, అంతస్థం బుద్ధ్యాది” (శ్రీశంకరః)

(దీనిచే పనిచేయబడుచున్నది కనుక ఇది కరణము - బాహ్య కరణములు శ్రోత్రాది - చెవి మొదలగునవి; అంతఃకరణములు బుద్ధి మొదలగునవి - జ్ఞానేంద్రియములు అయిదు, కర్మేంద్రియములు అయిదు - ఇవి పది జ్ఞానమునకు సాధనములగుటచేత కరణములనబడుచున్నవి - బాహ్యకరణములు, అంతఃకరణములు.

  1. “సాధనభూతం ద్రవ్యాదికం” (శ్రీరమానుజః)

(పనిచేయుటకు సాధనమైనవి - ద్రవ్యములు)

  1. శరీరము; కారణము.

  2. అసాధారణకారణం కరణం.

(కార్యములకు కారణమైనది సాధారణ కారణము - ధర్మా ధర్మములు మొదలగునవి - అన్నికార్యములకు కాక, కొన్ని కార్యములకే కారనమైనది అసాధారణకారణము. కుండలు చేయుటలో కుమ్మరివాడు కారణము - చక్రము, దండము, ఆ కుండకు అసాధారణకారణము - కరణము).

  1. “శ్లో||. జిహ్వే కీర్తయ కేశవం, ముర రిపుం చేతో భజశ్రీ ధరం |

పాణి ద్వంద్వ సమర్చ యాచ్యుత కథా శ్శ్రోత్ర ద్వయత్వంశృణు |

కృష్ణం లోకయ లోచన ద్వయ, హరేర్గచ్ఛాంఘ్రియుగ్మాలయం |

జిఘ్ర ఘ్రాణముకుందపాద తులసీం మూర్థన మాధోక్షజం ||” (ముకుందమాల - 10)

“సీ||. చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద, పలుకులు హరిగుణపఠనమంద

కరములు విష్ణుమందిరమార్జనములంద శ్రవములు మాధవ శ్రవణమంద

చూపులు గోవింద రూప వీక్షణమంద, శిరము కేశవ నమస్కృతులయంద

పదములీశ్వర గేహ పరిసర్సణములంద, కామంబు చక్రి కైంకర్యమంద

- - - ఆ రాజచంద్రమునకు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 4 - 82)

Transliteration
  1. “kriyatē anēna iti, bāhyaṃ śrōtrādi, aṃtasthaṃ buddhyādi” (śrīśaṃkaraḥ)

(dīnicē panicēyabaḍucunnadi kanuka idi karaṇamu - bāhya karaṇamulu śrōtrādi - cevi modalagunavi; aṃtaḥkaraṇamulu buddhi modalagunavi - jñānēṃdriyamulu ayidu, karmēṃdriyamulu ayidu - ivi padi jñānamunaku sādhanamulaguṭacēta karaṇamulanabaḍucunnavi - bāhyakaraṇamulu, aṃtaḥkaraṇamulu.

  1. “sādhanabhūtaṃ dravyādikaṃ” (śrīramānujaḥ)

(panicēyuṭaku sādhanamainavi - dravyamulu)

  1. śarīramu; kāraṇamu.

  2. asādhāraṇakāraṇaṃ karaṇaṃ.

(kāryamulaku kāraṇamainadi sādhāraṇa kāraṇamu - dharmā dharmamulu modalagunavi - annikāryamulaku kāka, konni kāryamulakē kāranamainadi asādhāraṇakāraṇamu. kuṃḍalu cēyuṭalō kummarivāḍu kāraṇamu - cakramu, daṃḍamu, ā kuṃḍaku asādhāraṇakāraṇamu - karaṇamu).

  1. “ślō||. jihvē kīrtaya kēśavaṃ, mura ripuṃ cētō bhajaśrī dharaṃ |

pāṇi dvaṃdva samarca yācyuta kathā śśrōtra dvayatvaṃśṛṇu |

kṛṣṇaṃ lōkaya lōcana dvaya, harērgacchāṃghriyugmālayaṃ |

jighra ghrāṇamukuṃdapāda tulasīṃ mūrthana mādhōkṣajaṃ ||” (mukuṃdamāla - 10)

“sī||. cittaṃbu madhuripu śrīpādamulayaṃda, palukulu hariguṇapaṭhanamaṃda

karamulu viṣṇumaṃdiramārjanamulaṃda śravamulu mādhava śravaṇamaṃda

cūpulu gōviṃda rūpa vīkṣaṇamaṃda, śiramu kēśava namaskṛtulayaṃda

padamulīśvara gēha parisarsaṇamulaṃda, kāmaṃbu cakri kaiṃkaryamaṃda

- - - ā rājacaṃdramunaku”. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 4 - 82)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.