← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మనిర్మూలనము karmanirmūlanamu

Original — తెలుగు
  1. “కర్మ నిర్మూలనే భక్తిః, సాచోక్తా ద్వివిధా సతీ |

నిర్వానరూపా భక్తిశ్చ బ్రహ్మణః ప్రకృతేరిహ ||“. (దేవీభాగవతము)

(ఏకా నిర్గుణా భక్తిః, ద్వితీయా వ్రహ్మణః, ప్రకృతేః మాయావిశిష్ట బ్రహ్మరూపిణ్యాః మూల ప్రకృతేః ఇత్యర్థః. ఉభయోరపి భక్తిః కర్మనిర్మూలనే - కర్మ నాశనే - క్షమా ఇత్యర్థః).

(కర్మను నిర్మూలించు శక్తిగలది భక్తి. అది రెండు విధములు. మొదటిది నిర్వాణరూపమైనది - నిర్గుణ పరమాత్మయందు గలభక్తి, రెండవది మాయతో కూడిన బ్రహ్మరూపిణి యందు భక్తి).

  1. “యత్ర కుత్రవా వసన్ పాణి పాత్రేన భిక్షాన్నం భుక్త్వా దిగంబరః ఉర్వీశయనః నిస్సంగ పరిణత చిత్తేన సంతుష్టస్సన్, త్యక్తదైవ వ్యతికర నికరః ధన్యః ధారావాహిక జన్మ పరంపరా ప్రదం కర్మ నిర్మూలయతి”.

(ఎక్కడో ఒకచో నుండుచూ, చేతిలో భిక్షాపాత్ర పట్టుకొని భిక్షాన్నము తినుచూ, దిగంబరుడై నేలను పడుకొనుచు, దేనియందును ఆశలేని చిత్తము గలిగి సంతుష్టుడై, దైవమునకు వ్యతిరేకమైన వాటిని విడిచిపెట్టిన ధన్యుడు ధారవలె ఎడతెరిపిలేని జన్మ పరంపరలు గలుగునట్లు చేయు కర్మను నిర్మూలము చేసుకొనును).

  1. “కర్మ నిర్మూలన హేతువులైన కమలలోచన కథలందెవ్వడు రతిసేయు, విననిచ్చగించు వానికి నితరంబు లెవ్వియు రుచి పుట్టింపనేరవు, పుణ్యశ్రవణ కీర్తనుండైన కృష్ణుండు తన కథలు వినువారి హృదయంబులందు నిలిచి శుభంబులాచరించు, అశుభంబులు పరిహరించు. అశుభంబులు నష్టంబులైన భాగవత సేవా విశేషంబున నిశ్చలభక్తి నిశ్చల భక్తియుదయించు - భక్తి గలుగ రజస్తమోగుణ ప్రభూతంబులయిన కామలోభాదులకు వశంబుగాక చిత్తంబు సత్వగునంబున ప్రసన్నంబగు, ప్రసన్నమనస్కుండైన ముక్తసంగుండగు - ముక్తసంగుండైన ఈశ్వర తత్వ జ్ఞానంబు సిద్ధించు - ఈశ్వరుండు గానంబడిన జిజ్జగడగ్రథనరూపంబైన యహంకారంబు భిన్నంబగు. అహంకారము భిన్నంబైన నసంభావనాది రూపంబులగు సంసయంబులు విచ్ఛిన్నంబులగు. సంశయ విచ్ఛేదంబైన అనారబ్ధ ఫలంబులైన కర్మంబులు నిశ్శేషంబులై నశించు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 21)
Transliteration
  1. “karma nirmūlanē bhaktiḥ, sācōktā dvividhā satī |

nirvānarūpā bhaktiśca brahmaṇaḥ prakṛtēriha ||“. (dēvībhāgavatamu)

(ēkā nirguṇā bhaktiḥ, dvitīyā vrahmaṇaḥ, prakṛtēḥ māyāviśiṣṭa brahmarūpiṇyāḥ mūla prakṛtēḥ ityarthaḥ. ubhayōrapi bhaktiḥ karmanirmūlanē - karma nāśanē - kṣamā ityarthaḥ).

(karmanu nirmūliṃcu śaktigaladi bhakti. adi reṃḍu vidhamulu. modaṭidi nirvāṇarūpamainadi - nirguṇa paramātmayaṃdu galabhakti, reṃḍavadi māyatō kūḍina brahmarūpiṇi yaṃdu bhakti).

  1. “yatra kutravā vasan pāṇi pātrēna bhikṣānnaṃ bhuktvā digaṃbaraḥ urvīśayanaḥ nissaṃga pariṇata cittēna saṃtuṣṭassan, tyaktadaiva vyatikara nikaraḥ dhanyaḥ dhārāvāhika janma paraṃparā pradaṃ karma nirmūlayati”.

(ekkaḍō okacō nuṃḍucū, cētilō bhikṣāpātra paṭṭukoni bhikṣānnamu tinucū, digaṃbaruḍai nēlanu paḍukonucu, dēniyaṃdunu āśalēni cittamu galigi saṃtuṣṭuḍai, daivamunaku vyatirēkamaina vāṭini viḍicipeṭṭina dhanyuḍu dhāravale eḍateripilēni janma paraṃparalu galugunaṭlu cēyu karmanu nirmūlamu cēsukonunu).

  1. “karma nirmūlana hētuvulaina kamalalōcana kathalaṃdevvaḍu ratisēyu, vinaniccagiṃcu vāniki nitaraṃbu levviyu ruci puṭṭiṃpanēravu, puṇyaśravaṇa kīrtanuṃḍaina kṛṣṇuṃḍu tana kathalu vinuvāri hṛdayaṃbulaṃdu nilici śubhaṃbulācariṃcu, aśubhaṃbulu parihariṃcu. aśubhaṃbulu naṣṭaṃbulaina bhāgavata sēvā viśēṣaṃbuna niścalabhakti niścala bhaktiyudayiṃcu - bhakti galuga rajastamōguṇa prabhūtaṃbulayina kāmalōbhādulaku vaśaṃbugāka cittaṃbu satvagunaṃbuna prasannaṃbagu, prasannamanaskuṃḍaina muktasaṃguṃḍagu - muktasaṃguṃḍaina īśvara tatva jñānaṃbu siddhiṃcu - īśvaruṃḍu gānaṃbaḍina jijjagaḍagrathanarūpaṃbaina yahaṃkāraṃbu bhinnaṃbagu. ahaṃkāramu bhinnaṃbaina nasaṃbhāvanādi rūpaṃbulagu saṃsayaṃbulu vicchinnaṃbulagu. saṃśaya vicchēdaṃbaina anārabdha phalaṃbulaina karmaṃbulu niśśēṣaṃbulai naśiṃcu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 21)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.