← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్తృత్వము kartṛtvamu

Original — తెలుగు
  1. ప్రయత్నాది రూపం, కర్మాణి, శరీరేంద్రియాది చేష్టాః -

(శరీరము, ఇంద్రియములు మొదలగువాటిచేష్ట; ప్రయత్నము మొదలగునవి చేయుట).

  1. “జ్ఞానేచ్ఛా ప్రత్యయ యోగః” (శ్రీ జయతీర్థ మునిః)

(జ్ఞానముతో కూడిన కోరికగలిగి యుండుట).

  1. దేశకాలావస్థాది నియత విషయ జ్ఞాన చికీర్షా ప్రయత్నాశ్రయత్వ లక్షణం కర్తృత్వం.

(దేశము, కాలము, అవస్థా - ఈ మూడింటి నియమములననుసరించి కోరి ప్రయత్నించుట).

  1. శరీరాధిష్ఠాన ప్రయత్న హేతుత్వమేవ హి పురుషస్య కర్తృత్వం.

(శరీరమునధిష్ఠించియున్న ఆత్మ ప్రయత్నమునకు కారణమగుటయే పురుషుని కర్తృత్వము).

  1. కర్మణి కర్తృత్వం స్వకీయతా బుద్ధిరాది శబ్దేన సం గృహ్యతే.

(కర్మలయందు కర్తృత్వమనగా అది తనదే యను బుద్ధి కలిగియుండుట).

  1. “అనాదికాలప్రవృత్త పూర్వ పూర్వ కర్మ జనిత దేవాద్యాకార ప్రకృతి సంసర్గకృత తత్తదాత్మాభిమాన జనిత వాసనాకృతం కర్తృత్వం”

(శ్రీరామానుజః)

(అనాదికాలమునుండి వచ్చుచున్న అనేక జన్మల చేసిన కర్మలవలన కలిగిన శరీరమునకు ప్రకృతి సంసర్గమువలన కలిగిన అభిమానము వాసనారూపముగా మారినదానివలన పని చేయుటయే కర్తృత్వము).

  1. నను చేతనస్య ఆత్మనః కర్తృత్వాదికం నాస్తి. అచేతనాయాస్తు వాసనా యాః చేతన గుణమాత్ర భూతాయాః కర్తృత్వాదికం ఇతి కథం ఇదం జ్ఞాయతే. యది ఆత్మనః స్వతశ్శుద్ధస్య న కర్తృత్వం, తర్హి వాసనాపి కుతస్సమాగతా యది న కుతశ్చిత్ హేతోః తదా తస్యాపి స్వాభావికత్వే పూర్వ దోషః; ఔపాధికత్వేతు అకర్తుః ఆత్మనః తదాగ మోపి కుతః? యది వాసనయా తర్హి అన్యోన్యాశ్రయణం; యదన్యస్మాత్ కుతశ్చిత్ తత్రాపి తధైవ.

(చేతనుడైన ఆత్మకు కర్తృత్వములేదు - అచేతనమైన వాసనకు కర్తృత్వమెట్లు కలిగును? స్వతశ్శుద్ధుడు అయిన ఆత్మకు కర్తృత్వము లేనప్పుడు, వాసనకు మట్టుకు ఎట్లు వచ్చును. కర్తగాని ఆత్మకు ఉపాదిలో ఉన్నప్పటికీ కర్తృత్వము ఎట్లు వచ్చును - ఏ విధముగా చూచినను ఆత్మకు కర్తృత్వములేదు)

  1. పరమాత్మనా దత్తైః తదధారశ్చ కరణ కలేబరాదిభిః తదాహిత శక్తిః స్వయంచ జీవాత్మా తదారాధః తదాహిత శక్తిః సన్ కర్మనిష్పత్తయే స్వేచ్చయా కరణాద్యధిష్ఠానాకారం ప్రయత్నంచ ఆరభతే. తదంతరవస్థితః పరమాత్మా స్వానుమిత దానేనతం ప్రవర్తయతి ఇతి జీవస్యాపి స్వ బుద్ధ్యైవ ప్రవృత్తి హేతుత్వమస్తి (శ్రీరామానుజః)

(పరమాత్మవలన పొందబడి అతనియందే ఆధారపడియున్న శరీరము, చేతులు మొదలగు కరణములచేత వాటికి అతనివలన కలిగిన శక్తులచేత ఆశక్తి గలవాడై జీవుడు పనులను చేయుటకు ప్రయత్నించును. జీవునిలోనున్న పరమాత్మ తనశక్తిని అతనికి ఇచ్చి వాటిని చేయించును. అందుచేత జీవునికి తన బుద్ధియే ప్రవృత్తికి (కర్మలుచేయుటకు) కారణము).

  1. న స్వతః కీవస్య కర్తృత్వాది సిద్ధిః, కింతు, పరాత్ పరస్మాత్ ఈశ్వరాత్ కర్మాధ్యక్షాత్ అవిద్యా తిమి రాంధస్య కర్తఋత్వాది సంసార సిద్ధిః, తదనుగ్రహేతు విజ్ఞానేన మోక్ష సిద్ధిర్బవిష్యతి.

(జీవునకు స్వతః కర్తృత్వము మొదలగునవి సిద్ధించవు. కాని పరాత్పరుడు, కర్మాధ్యక్షుడు అయిన ఈశ్వరుని వలన - తానే పరమాత్మయని అత్మయని తెలియకపోవుటవలన - జీవునకు కర్తృత్వము మొదలగునవి కల సంసారము సిద్ధించుచున్నది. భగవంతుని అనుగ్రహము కలిగి, ఆత్మజ్ఞానముకలిగిన యడల మోక్షము సిద్ధించును).

  1. “ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః |

యః పశ్యతి తథాత్మాన మకర్తారం స పశ్యతి -“. (శ్రీమద్భగవద్గీత - 13 - 29)

(సృష్టిలోని వస్తువులన్నింటిని రూపింపచేయు ప్రకృతియే అన్ని విధములకర్మలను చేయుచున్నది. అందుచేత తను ఆ కర్మలకు కర్తకాడు అని తెలుసుకొనినవాడు యదార్థమును గ్రహించినవాడు).

  1. జీవుడు పరమాత్మ అంశయే కనుక నిర్విశేషు - విశేషములు లేనివాడు - అవయవములు లేనివాడు - జీవునికి ఉపాధి ప్రకృతివలన కల్పించడమైనది. ఆ ఉపాధిలో ఉండుటవలన దానికి అనువైన ప్రవృత్తి కలిగియుండును. అందుచేత జీవునికి ఉపాధివలననే కర్తృత్వము చెప్పబడినది –

“నిర్విలారతయా త్యంత శుద్ధత్వాచ్ఛి ద్ఘనో (అ)వ్యయః |

నకర్తా ప్రేరకో నాయం కుత్రాపి పరమార్థతః |

దేహాధ్యధ్యాసతః పుంసో భ్రాంత్యా కర్తృత్వ భోక్తృతౌ ||“.

(చిద్ఘనుడు, అవ్యయిడు అయిన ఆత్మ వికారములు లేనివాడు అగుటవల్లను, అత్యంత నిర్మలుడు అగుటచేతను, దేనికి అయినను కర్తకాడు, కర్మ చేయుటలో ప్రేరేపించువాడుకాడు - మానవునకు దేహము మొదలగువాటియందు అధ్యాసవలన నేనే కర్తను భోక్తను అనుకొనుచున్నాడు).

  1. ఆత్మనః ప్రాచీనకర్మమూలదేహ సంబంధ ప్రయుక్తం ఇదం కర్మణాం కర్తృత్వం, న స్వరూపయుక్తం.

(ఆత్మకు కర్మలందు కర్తృత్వము ప్రాచీన కర్మకారణముగా కలిగిన దేహముతో సంబంధమువలననే చెప్పబడినది. ఆత్మ స్వరూపముతో సంబంధముకలదికాదు).

  1. అచేతనమగు ప్రకృతికి స్వతః కర్తృత్వములేదు - అవికారియగు పురుషునకు భోక్తృత్వములేదు. అయినను పురుష సాన్నిధ్యమువలన ప్రకృతికి కర్తృత్వము, ప్రకృతి సాన్నిధ్యమువలన పురుషునకు భోక్తృత్వమును చెప్పబడుచున్నది).
Transliteration
  1. prayatnādi rūpaṃ, karmāṇi, śarīrēṃdriyādi cēṣṭāḥ -

(śarīramu, iṃdriyamulu modalaguvāṭicēṣṭa; prayatnamu modalagunavi cēyuṭa).

  1. “jñānēcchā pratyaya yōgaḥ” (śrī jayatīrtha muniḥ)

(jñānamutō kūḍina kōrikagaligi yuṃḍuṭa).

  1. dēśakālāvasthādi niyata viṣaya jñāna cikīrṣā prayatnāśrayatva lakṣaṇaṃ kartṛtvaṃ.

(dēśamu, kālamu, avasthā - ī mūḍiṃṭi niyamamulananusariṃci kōri prayatniṃcuṭa).

  1. śarīrādhiṣṭhāna prayatna hētutvamēva hi puruṣasya kartṛtvaṃ.

(śarīramunadhiṣṭhiṃciyunna ātma prayatnamunaku kāraṇamaguṭayē puruṣuni kartṛtvamu).

  1. karmaṇi kartṛtvaṃ svakīyatā buddhirādi śabdēna saṃ gṛhyatē.

(karmalayaṃdu kartṛtvamanagā adi tanadē yanu buddhi kaligiyuṃḍuṭa).

  1. “anādikālapravṛtta pūrva pūrva karma janita dēvādyākāra prakṛti saṃsargakṛta tattadātmābhimāna janita vāsanākṛtaṃ kartṛtvaṃ”

(śrīrāmānujaḥ)

(anādikālamunuṃḍi vaccucunna anēka janmala cēsina karmalavalana kaligina śarīramunaku prakṛti saṃsargamuvalana kaligina abhimānamu vāsanārūpamugā mārinadānivalana pani cēyuṭayē kartṛtvamu).

  1. nanu cētanasya ātmanaḥ kartṛtvādikaṃ nāsti. acētanāyāstu vāsanā yāḥ cētana guṇamātra bhūtāyāḥ kartṛtvādikaṃ iti kathaṃ idaṃ jñāyatē. yadi ātmanaḥ svataśśuddhasya na kartṛtvaṃ, tarhi vāsanāpi kutassamāgatā yadi na kutaścit hētōḥ tadā tasyāpi svābhāvikatvē pūrva dōṣaḥ; aupādhikatvētu akartuḥ ātmanaḥ tadāga mōpi kutaḥ? yadi vāsanayā tarhi anyōnyāśrayaṇaṃ; yadanyasmāt kutaścit tatrāpi tadhaiva.

(cētanuḍaina ātmaku kartṛtvamulēdu - acētanamaina vāsanaku kartṛtvameṭlu kaligunu? svataśśuddhuḍu ayina ātmaku kartṛtvamu lēnappuḍu, vāsanaku maṭṭuku eṭlu vaccunu. kartagāni ātmaku upādilō unnappaṭikī kartṛtvamu eṭlu vaccunu - ē vidhamugā cūcinanu ātmaku kartṛtvamulēdu)

  1. paramātmanā dattaiḥ tadadhāraśca karaṇa kalēbarādibhiḥ tadāhita śaktiḥ svayaṃca jīvātmā tadārādhaḥ tadāhita śaktiḥ san karmaniṣpattayē svēccayā karaṇādyadhiṣṭhānākāraṃ prayatnaṃca ārabhatē. tadaṃtaravasthitaḥ paramātmā svānumita dānēnataṃ pravartayati iti jīvasyāpi sva buddhyaiva pravṛtti hētutvamasti (śrīrāmānujaḥ)

(paramātmavalana poṃdabaḍi ataniyaṃdē ādhārapaḍiyunna śarīramu, cētulu modalagu karaṇamulacēta vāṭiki atanivalana kaligina śaktulacēta āśakti galavāḍai jīvuḍu panulanu cēyuṭaku prayatniṃcunu. jīvunilōnunna paramātma tanaśaktini ataniki icci vāṭini cēyiṃcunu. aṃducēta jīvuniki tana buddhiyē pravṛttiki (karmalucēyuṭaku) kāraṇamu).

  1. na svataḥ kīvasya kartṛtvādi siddhiḥ, kiṃtu, parāt parasmāt īśvarāt karmādhyakṣāt avidyā timi rāṃdhasya kartaṛtvādi saṃsāra siddhiḥ, tadanugrahētu vijñānēna mōkṣa siddhirbaviṣyati.

(jīvunaku svataḥ kartṛtvamu modalagunavi siddhiṃcavu. kāni parātparuḍu, karmādhyakṣuḍu ayina īśvaruni valana - tānē paramātmayani atmayani teliyakapōvuṭavalana - jīvunaku kartṛtvamu modalagunavi kala saṃsāramu siddhiṃcucunnadi. bhagavaṃtuni anugrahamu kaligi, ātmajñānamukaligina yaḍala mōkṣamu siddhiṃcunu).

  1. “prakṛtyaiva ca karmāṇi kriyamāṇāni sarvaśaḥ |

yaḥ paśyati tathātmāna makartāraṃ sa paśyati -“. (śrīmadbhagavadgīta - 13 - 29)

(sṛṣṭilōni vastuvulanniṃṭini rūpiṃpacēyu prakṛtiyē anni vidhamulakarmalanu cēyucunnadi. aṃducēta tanu ā karmalaku kartakāḍu ani telusukoninavāḍu yadārthamunu grahiṃcinavāḍu).

  1. jīvuḍu paramātma aṃśayē kanuka nirviśēṣu - viśēṣamulu lēnivāḍu - avayavamulu lēnivāḍu - jīvuniki upādhi prakṛtivalana kalpiṃcaḍamainadi. ā upādhilō uṃḍuṭavalana dāniki anuvaina pravṛtti kaligiyuṃḍunu. aṃducēta jīvuniki upādhivalananē kartṛtvamu ceppabaḍinadi –

“nirvilāratayā tyaṃta śuddhatvācchi dghanō (a)vyayaḥ |

nakartā prērakō nāyaṃ kutrāpi paramārthataḥ |

dēhādhyadhyāsataḥ puṃsō bhrāṃtyā kartṛtva bhōktṛtau ||“.

(cidghanuḍu, avyayiḍu ayina ātma vikāramulu lēnivāḍu aguṭavallanu, atyaṃta nirmaluḍu aguṭacētanu, dēniki ayinanu kartakāḍu, karma cēyuṭalō prērēpiṃcuvāḍukāḍu - mānavunaku dēhamu modalaguvāṭiyaṃdu adhyāsavalana nēnē kartanu bhōktanu anukonucunnāḍu).

  1. ātmanaḥ prācīnakarmamūladēha saṃbaṃdha prayuktaṃ idaṃ karmaṇāṃ kartṛtvaṃ, na svarūpayuktaṃ.

(ātmaku karmalaṃdu kartṛtvamu prācīna karmakāraṇamugā kaligina dēhamutō saṃbaṃdhamuvalananē ceppabaḍinadi. ātma svarūpamutō saṃbaṃdhamukaladikādu).

  1. acētanamagu prakṛtiki svataḥ kartṛtvamulēdu - avikāriyagu puruṣunaku bhōktṛtvamulēdu. ayinanu puruṣa sānnidhyamuvalana prakṛtiki kartṛtvamu, prakṛti sānnidhyamuvalana puruṣunaku bhōktṛtvamunu ceppabaḍucunnadi).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.