← Back to క · Booklets 11–20 (digitized file 2)

కార్యోత్పత్తివినాశక్రమము kāryōtpattivināśakramamu

Original — తెలుగు
  1. ప్రకృతివలన కార్యోదయం బెట్లనిన - క్రమసృష్టియు, యుగపత్ సృష్టియు ననంబడు సృష్టులు ద్విప్రకారంబులు. అందు మూలప్రకృతి వలన మహత్తత్వంబును, తన్మాత్రపంచకం బులనియెడు సప్త ప్రకృతులు గలవు. అందువలన పంచభూతంబులును, అందువలన బ్రహ్మాండదేహ ఘటాది ప్రపంచోదయంబు క్రమసృష్టి యనంబడు. నిస్తరంగ సముద్రమందు ఏకకాలంబందు వాయువ శంబున విచిత్రఫేనతరంగ బుద్బుదాదులగు తెఱంగున సచ్చిదానందాత్మక బ్రహ్మంబందు మా యా మ య నామరూప పంచసరణి యుగపత్ సృష్టియనంబడు. ఈ రెండు విధంబులు శ్రుతి సిద్ధంబులగు టం జేసి అంగీకృతంబులు“..”మఱియు నిందు అతిరోహిత హ్మస్వరూపం బగుటం జేసి వికారంబు లేని ఈశ్వరునివలన జడప్రకృతియందు సకల కార్యోదయంబెట్లనిన - ఇచ్ఛాదికంబులు లేని సూర్యుని వలన యత్నాదికంబులులేని సూర్యకాంతంబందు వహ్ని యుజ్వలించిన కైవడి పరమశివునివలన ప్రకృతి యందు మహదాదికార్యంబు లుద్భవించుటకై విరోధంబులేదు“. (వివేకచింతామణి - పరమానందతీర్థ).

  2. “ఇదానీం కార్యరూప పృథివ్యాది చతుష్టయస్యోత్పత్తి వినాశ క్రమః కథ్యతే - ఈశ్వరస్య చి కీర్షా వశాత్ పరమాణుషు క్రియా జాయతే. తతః పరమాణుద్వయ సం యోగే ద్వ్యణకముత్పద్యతే. త్రిభిరేవ ద్వణుకై స్త్రణుక ముత్పద్యతే. ఏవం చతురుణకాది క్రమేణ మహతీ పృధివీ, మహత్యాపో, మహత్తేజో. మహాన్ మహాన్ వాయురు త్పద్యతే. ఏవముత్పన్నస్య కార్యస్య సంజి హీర్షావసాత్ క్రీయయా పరమాణు ద్వయ విభాగే ద్వణుకనాశః, ఇత్యేవం పృధివ్యాది నాశః. అసమ వాయకారణ నాశాత్ ద్వణుక నాశః, సమవాయి కారణనాశాత్ త్ర్యణుక నాశః ఇతి సంప్రదాయః. సర్వత్రా సమవాయి కారణనాశాత్ ద్రవ్య నాశాః ఇతి నవీనాః”(తర్కసంగ్రహ దీపికా).

(పృధివీ మొదలగువాటి పుట్టుక లయములు ఈ క్రింద చెప్పబడినవి -

ఈశ్వరునికి సృష్టి చేయు ఇచ్చ కలుగుటచేత పరమాణువులందు చైతన్యము కలిగినది, దాని వలన రెండు పరమాణువులు కలియుటవలన ద్విణుకము కలిగినది. మూడు పరమాణువులు కలియుటవలన త్ర్యణుకము కలిగినది. ఈ ప్రకారము నాలుగు అణువులు ఇంకా అధిక సంఖ్యలో అణువులు కలియుటవలన పృధివి కలిగినది, అనగా మహత్పృధివి - పృధివీ తన్మాత్ర, మహత్ జలం - జలతన్మాత్ర -, మహత్ అగ్ని, మహావాయువు పుట్టుచున్నది. ఇవి కార్యములు. ఈ కార్యవస్తువుల సంజి హర్ష వలన (disintegration వలన) పరమాణు వులు రెండు విడిపోవుటవలన ద్వణుకనాశము, ఈ ప్రకారముగా పృధివీ మొదలగువాటి నాశము కలుగు చున్నది. అసమవాయి కారణమువలన ద్వణుకనాశము, సమవాయి కారణనాశమువలన త్యణుకనాశము కలుగుచున్నది. అని దీని సాంప్రదాయము.- అంతట, అన్నింటి విషయములోను అసమవాయికారణ నాశము వలననే ద్రవ్య నాశము కలుగునని కొందఱి అభిప్రాయము).

Transliteration
  1. prakṛtivalana kāryōdayaṃ beṭlanina - kramasṛṣṭiyu, yugapat sṛṣṭiyu nanaṃbaḍu sṛṣṭulu dviprakāraṃbulu. aṃdu mūlaprakṛti valana mahattatvaṃbunu, tanmātrapaṃcakaṃ bulaniyeḍu sapta prakṛtulu galavu. aṃduvalana paṃcabhūtaṃbulunu, aṃduvalana brahmāṃḍadēha ghaṭādi prapaṃcōdayaṃbu kramasṛṣṭi yanaṃbaḍu. nistaraṃga samudramaṃdu ēkakālaṃbaṃdu vāyuva śaṃbuna vicitraphēnataraṃga budbudādulagu teṟaṃguna saccidānaṃdātmaka brahmaṃbaṃdu mā yā ma ya nāmarūpa paṃcasaraṇi yugapat sṛṣṭiyanaṃbaḍu. ī reṃḍu vidhaṃbulu śruti siddhaṃbulagu ṭaṃ jēsi aṃgīkṛtaṃbulu”..”maṟiyu niṃdu atirōhita hmasvarūpaṃ baguṭaṃ jēsi vikāraṃbu lēni īśvarunivalana jaḍaprakṛtiyaṃdu sakala kāryōdayaṃbeṭlanina - icchādikaṃbulu lēni sūryuni valana yatnādikaṃbululēni sūryakāṃtaṃbaṃdu vahni yujvaliṃcina kaivaḍi paramaśivunivalana prakṛti yaṃdu mahadādikāryaṃbu ludbhaviṃcuṭakai virōdhaṃbulēdu”. (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha).

  2. “idānīṃ kāryarūpa pṛthivyādi catuṣṭayasyōtpatti vināśa kramaḥ kathyatē - īśvarasya ci kīrṣā vaśāt paramāṇuṣu kriyā jāyatē. tataḥ paramāṇudvaya saṃ yōgē dvyaṇakamutpadyatē. tribhirēva dvaṇukai straṇuka mutpadyatē. ēvaṃ caturuṇakādi kramēṇa mahatī pṛdhivī, mahatyāpō, mahattējō. mahān mahān vāyuru tpadyatē. ēvamutpannasya kāryasya saṃji hīrṣāvasāt krīyayā paramāṇu dvaya vibhāgē dvaṇukanāśaḥ, ityēvaṃ pṛdhivyādi nāśaḥ. asama vāyakāraṇa nāśāt dvaṇuka nāśaḥ, samavāyi kāraṇanāśāt tryaṇuka nāśaḥ iti saṃpradāyaḥ. sarvatrā samavāyi kāraṇanāśāt dravya nāśāḥ iti navīnāḥ”(tarkasaṃgraha dīpikā).

(pṛdhivī modalaguvāṭi puṭṭuka layamulu ī kriṃda ceppabaḍinavi -

īśvaruniki sṛṣṭi cēyu icca kaluguṭacēta paramāṇuvulaṃdu caitanyamu kaliginadi, dāni valana reṃḍu paramāṇuvulu kaliyuṭavalana dviṇukamu kaliginadi. mūḍu paramāṇuvulu kaliyuṭavalana tryaṇukamu kaliginadi. ī prakāramu nālugu aṇuvulu iṃkā adhika saṃkhyalō aṇuvulu kaliyuṭavalana pṛdhivi kaliginadi, anagā mahatpṛdhivi - pṛdhivī tanmātra, mahat jalaṃ - jalatanmātra -, mahat agni, mahāvāyuvu puṭṭucunnadi. ivi kāryamulu. ī kāryavastuvula saṃji harṣa valana (disintegration valana) paramāṇu vulu reṃḍu viḍipōvuṭavalana dvaṇukanāśamu, ī prakāramugā pṛdhivī modalaguvāṭi nāśamu kalugu cunnadi. asamavāyi kāraṇamuvalana dvaṇukanāśamu, samavāyi kāraṇanāśamuvalana tyaṇukanāśamu kalugucunnadi. ani dīni sāṃpradāyamu.- aṃtaṭa, anniṃṭi viṣayamulōnu asamavāyikāraṇa nāśamu valananē dravya nāśamu kalugunani koṃdaṟi abhiprāyamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.