← Back to క · Booklets 11–20 (digitized file 2)

కాష్టా kāṣṭā

Original — తెలుగు
  1. అవధి; ఉత్కర్షః ; సర్వస్యా వధిః.

(మేర, అన్నింటికంటె హెచ్చైనది; దానిని మించినది మఱిలేనిదు).

  1. పర్యవసాన భూమిత్వాత్ కాష్ఠా.

(ఆఖరి మెట్టు, అన్నింటికంటె పైన ఉన్నది - యోగభూమికలలో ఆఖరిది).

  1. తత్వం ; స్వరూపం. (పరతత్వము, పరమాత్మ తత్వము) (చూడుము - ‘తత్వం’).

  2. వేదాంత వాక్యార్థ నిర్ణయము –

(ఉన్నదంతా ఒకే భగవంతుడు - జీవాత్మలకు భేదము లేదు - అన్నింటిలోను ఉన్న తత్వము ఒకటే అని సిద్ధాంతీకరించిన ఉపనిషదర్థము -)

  1. ప్రతీతం, అప్రతీతం వా సదసచ్చ పరశ్శివః |

ఇతి వేదాంత వాక్యానాం నిష్ఠా కష్ఠేతి కథ్యతే ||“.

(ప్రతీతము, అప్రతీతము, సత్తు, అసత్తు అంతా పరమ శివుడే అని వేదాంతవాక్యములు బోధించు సిద్ధాంతమే కాష్ఠా).

  1. “యస్మాన్నాస్తి పురుషాత్ చిన్మమాత్రి ఘనాత్ పరం కించిదపి వస్త్వం తరం తస్మాత్ సూక్ష్మత్వ, మహత్వ ప్రత్యగాత్మానాం సా కాష్ఠా నిష్ఠా పర్యవసానం సర్వ ప్రత్యగ్రూపం”. (శ్రీశంకరః)

(చైతన్య ఘనుడు, చైతన్యమాత్రుడు అయిన పరమాత్మకన్న ఉత్కృష్టమైనది అయిన ఇంకొకటి దానికన్న సూక్ష్మమైనది కాని వస్తువు ఇంకొకటి - దానికన్న సూక్ష్మమైనదికాని, మహత్తు కలదికాని ప్రత్యగాత్మకాని లేదు - - అందుచేత అది అన్నింటికన్న మిన్న అయినది. అందుచేత అదియే కాష్ఠ, అన్నింటికన్న ఉత్తమమైన గతి ).

  1. “ఇంద్రియేభ్యః పరాహ్యర్థాః, అర్థేభ్యశ్చ పరం మనః |

మనసః పరమవ్యక్తం అవ్యక్తా త్పురుషః పరః |

పురుషాన్న పరం కించిత్ స కాష్ఠా స పరాగతిః ||“. (కఠోపనిసహత్)

(ఇంద్రియములకన్న అర్థములు ఉత్కృష్టమైనవి, అర్థములకన్న మనస్సు ఉత్కృష్టమైనది, మనస్సుకన్న అవ్యక్తము, అవ్యక్తముకన్న పురుషుడు - పరమాత్మ ఉత్కృష్టమైనవాడు - అతనే కాష్ఠ, అతనే పరాగతి (పరమగతి)).

“తస్మా ద్రవ్యక్తాత్పరః సూక్ష్మతరః, సర్వకారణ భూత ప్రత్యగాత్మా, అత ఏవ పురుషః. సర్వ కార్య ప్రపంచస్య స్వస్వరూపేణ పూరయితా. యద్వా, సర్వాసు పూర్షు శేతే ఇతి పురుషః, సర్వాంత రత్వాత్, తతో (అ)న్యస్య సూక్ష్మస్య ప్రసంగాయ వా యన్నాహ పురుషాది తి. పురుషాత్ సర్వాంతరాత్ చిద్ఘన రూపాత్ ప్రత్యగాత్మనః పరం కించిదపి వస్తు నాస్తి. ఏవం సూక్ష్మత్వ, మహత్వ ప్రత్యగాత్మ త్వానాం తత్త్రైవ పరిసమాపనాత్ సైవ పరమా కాష్ఠా పర్యవసాన భూమిః -

(పరమాత్మ అవ్యక్తముకన్న సూక్ష్మమైనవాడు, అనియు పుట్టుటకు కారణమైనవాడు; కార్యమైన సర్వ ప్రపంచములోను తన రూపముతో, శక్తితో పూర్తిగా నిండియున్నవాడు, సమస్త వస్తువులలోను లోపల ఉండుటవలన పురుషుడు అని చెప్పబడుచున్నవాడు, అందువలన తనకంటె సూక్ష్మతరమైన మఱి యొకటి లేనివాడు, చైతన్యమాత్రుడు, ఇటివంటి పరమాత్మకన్న పరమైన వస్తువు - ఉత్కృష్టమైన వస్తువు ఇంకొకటి లేదు. పైన చెప్పిన ప్రకారము సూక్ష్మాతి సూక్ష్ముడగుటవలననూ, మహత్తత్త్వము కన్న పెద్దది యగుటవలననూ, ఆ త్మను మించినది లేకపోవుటవలనను అతనే పరాకాష్ఠ, అన్నింటికి సమాప్తి అతనే).

  1. కాలమానములో కాష్టయనగా పదునెనిమిది రెప్పపాట్ల కాలము - “క్షణ పంచకం బొక్క కష్ట యనం దగు -”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 10 - 34)

- (చూడుము - ‘కాలమానము’).

Transliteration
  1. avadhi; utkarṣaḥ ; sarvasyā vadhiḥ.

(mēra, anniṃṭikaṃṭe heccainadi; dānini miṃcinadi maṟilēnidu).

  1. paryavasāna bhūmitvāt kāṣṭhā.

(ākhari meṭṭu, anniṃṭikaṃṭe paina unnadi - yōgabhūmikalalō ākharidi).

  1. tatvaṃ ; svarūpaṃ. (paratatvamu, paramātma tatvamu) (cūḍumu - ‘tatvaṃ’).

  2. vēdāṃta vākyārtha nirṇayamu –

(unnadaṃtā okē bhagavaṃtuḍu - jīvātmalaku bhēdamu lēdu - anniṃṭilōnu unna tatvamu okaṭē ani siddhāṃtīkariṃcina upaniṣadarthamu -)

  1. pratītaṃ, apratītaṃ vā sadasacca paraśśivaḥ |

iti vēdāṃta vākyānāṃ niṣṭhā kaṣṭhēti kathyatē ||“.

(pratītamu, apratītamu, sattu, asattu aṃtā parama śivuḍē ani vēdāṃtavākyamulu bōdhiṃcu siddhāṃtamē kāṣṭhā).

  1. “yasmānnāsti puruṣāt cinmamātri ghanāt paraṃ kiṃcidapi vastvaṃ taraṃ tasmāt sūkṣmatva, mahatva pratyagātmānāṃ sā kāṣṭhā niṣṭhā paryavasānaṃ sarva pratyagrūpaṃ”. (śrīśaṃkaraḥ)

(caitanya ghanuḍu, caitanyamātruḍu ayina paramātmakanna utkṛṣṭamainadi ayina iṃkokaṭi dānikanna sūkṣmamainadi kāni vastuvu iṃkokaṭi - dānikanna sūkṣmamainadikāni, mahattu kaladikāni pratyagātmakāni lēdu - - aṃducēta adi anniṃṭikanna minna ayinadi. aṃducēta adiyē kāṣṭha, anniṃṭikanna uttamamaina gati ).

  1. “iṃdriyēbhyaḥ parāhyarthāḥ, arthēbhyaśca paraṃ manaḥ |

manasaḥ paramavyaktaṃ avyaktā tpuruṣaḥ paraḥ |

puruṣānna paraṃ kiṃcit sa kāṣṭhā sa parāgatiḥ ||“. (kaṭhōpanisahat)

(iṃdriyamulakanna arthamulu utkṛṣṭamainavi, arthamulakanna manassu utkṛṣṭamainadi, manassukanna avyaktamu, avyaktamukanna puruṣuḍu - paramātma utkṛṣṭamainavāḍu - atanē kāṣṭha, atanē parāgati (paramagati)).

“tasmā dravyaktātparaḥ sūkṣmataraḥ, sarvakāraṇa bhūta pratyagātmā, ata ēva puruṣaḥ. sarva kārya prapaṃcasya svasvarūpēṇa pūrayitā. yadvā, sarvāsu pūrṣu śētē iti puruṣaḥ, sarvāṃta ratvāt, tatō (a)nyasya sūkṣmasya prasaṃgāya vā yannāha puruṣādi ti. puruṣāt sarvāṃtarāt cidghana rūpāt pratyagātmanaḥ paraṃ kiṃcidapi vastu nāsti. ēvaṃ sūkṣmatva, mahatva pratyagātma tvānāṃ tattraiva parisamāpanāt saiva paramā kāṣṭhā paryavasāna bhūmiḥ -

(paramātma avyaktamukanna sūkṣmamainavāḍu, aniyu puṭṭuṭaku kāraṇamainavāḍu; kāryamaina sarva prapaṃcamulōnu tana rūpamutō, śaktitō pūrtigā niṃḍiyunnavāḍu, samasta vastuvulalōnu lōpala uṃḍuṭavalana puruṣuḍu ani ceppabaḍucunnavāḍu, aṃduvalana tanakaṃṭe sūkṣmataramaina maṟi yokaṭi lēnivāḍu, caitanyamātruḍu, iṭivaṃṭi paramātmakanna paramaina vastuvu - utkṛṣṭamaina vastuvu iṃkokaṭi lēdu. paina ceppina prakāramu sūkṣmāti sūkṣmuḍaguṭavalananū, mahattattvamu kanna peddadi yaguṭavalananū, ā tmanu miṃcinadi lēkapōvuṭavalananu atanē parākāṣṭha, anniṃṭiki samāpti atanē).

  1. kālamānamulō kāṣṭayanagā padunenimidi reppapāṭla kālamu - “kṣaṇa paṃcakaṃ bokka kaṣṭa yanaṃ dagu -”

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 10 - 34)

- (cūḍumu - ‘kālamānamu’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.