← Back to క · Booklets 11–20 (digitized file 2)

కౌస్తుభము kaustubhamu

Original — తెలుగు
  1. కుస్తు భో జలధిః, తత్రభవః. (కుస్తుభః అనగా సముద్రము - సముద్రములో పుట్టినది - మణి).

  2. కౌస్తుభః ఇత్యాఖ్యామణిః, అపాం సాముద్రిణాం సారః అమ్మయః మణిః.

(కౌస్తుభము అని పేరుగల మణి, సముద్రజలములసారము, నీటిమయమైన మణి, నీటిసారముతో గడ్డకట్టి మణి ఆకారముగా గట్టి పడినది).

  1. “యేన సూర్యాగ్ని వాక్చంద్ర తేజసా స్వస్వరూపిణా| వర్తతే కౌస్తుభాఖ్యం మణిం వదంతీశమానినః ||” (గోపాలతాపిన్యుపనిషత్).

(సూర్యుడు, అగ్ని, చంద్రుడు - వీటి తేజస్సు దేనియొక్క స్వస్వరూపముగలదాని చేత వెలుగుచున్నదో దానిని కౌస్తుభమణి అని అందురు).

  1. విష్ణు వక్షస్థలమందుండు మణి - “కస్తూరీ తిలకం లాలాట ఫలకే, వక్షస్థలే కౌస్తుభం - - - ||”.

  2. సూర్యాదయః పరతంత్ర తయా యేన స్వస్వరూపిణా తేజసా ప్రవర్తంతే తే తత్ చిత్స్వరూప మహేశ మానినః ఈశ్వరారాధకాః కౌస్తు భాఖ్యం మణి ప్రవదంతి -

(సూర్యుడు మొదలగు వారు స్వస్వరూపుడైన దేని తేజస్సుచేత వెలుగుచున్నారో దానిని కౌస్తుభమణి యని ఈశ్వరుని ఆరాధించువారు - ఈశ్వరోపాసకులు - చెప్పుచున్నారు).

Transliteration
  1. kustu bhō jaladhiḥ, tatrabhavaḥ. (kustubhaḥ anagā samudramu - samudramulō puṭṭinadi - maṇi).

  2. kaustubhaḥ ityākhyāmaṇiḥ, apāṃ sāmudriṇāṃ sāraḥ ammayaḥ maṇiḥ.

(kaustubhamu ani pērugala maṇi, samudrajalamulasāramu, nīṭimayamaina maṇi, nīṭisāramutō gaḍḍakaṭṭi maṇi ākāramugā gaṭṭi paḍinadi).

  1. “yēna sūryāgni vākcaṃdra tējasā svasvarūpiṇā| vartatē kaustubhākhyaṃ maṇiṃ vadaṃtīśamāninaḥ ||” (gōpālatāpinyupaniṣat).

(sūryuḍu, agni, caṃdruḍu - vīṭi tējassu dēniyokka svasvarūpamugaladāni cēta velugucunnadō dānini kaustubhamaṇi ani aṃduru).

  1. viṣṇu vakṣasthalamaṃduṃḍu maṇi - “kastūrī tilakaṃ lālāṭa phalakē, vakṣasthalē kaustubhaṃ - - - ||”.

  2. sūryādayaḥ parataṃtra tayā yēna svasvarūpiṇā tējasā pravartaṃtē tē tat citsvarūpa mahēśa māninaḥ īśvarārādhakāḥ kaustu bhākhyaṃ maṇi pravadaṃti -

(sūryuḍu modalagu vāru svasvarūpuḍaina dēni tējassucēta velugucunnārō dānini kaustubhamaṇi yani īśvaruni ārādhiṃcuvāru - īśvarōpāsakulu - ceppucunnāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.