← Back to క · Booklets 11–20 (digitized file 2)

కవచము kavacamu

Original — తెలుగు
  1. శరీరమును రక్షించునది. యుద్ధములో శత్రువుల ఆయుధములవల్ల శరీరమునకు గాయపడకుండ కాచు లోహమయమైన తొడుగు. దుర్మార్గశక్తులు కొన్ని మనకంటికి అగుపడకుండ మనలను బాధించును - అందుచేత మంత్రముచేత తయారుచేయబడి కంటికి కనబడని కవచము - దైవ శక్తి మనలను ఆవరించి రక్షించునట్లు చేయునది - నారాయణకవచము, శివకవచము.

  2. భూర్జ పత్రే విలిఖ్య స్వర్ణపేటికాయాం స్థాపయిత్వా కంఠేయద్ధృతం తత్ ఇత్యర్థః -

(భూర్జపత్రమందు మంత్రమును వ్రాసి దానిని బంగారముతొ చేసిన ఒకచిన్నపెట్టివంటిదానిలో భద్రముచేసి కంఠమందు వ్రేలాడకట్టునది - తావేజువంటిది).

  1. నారాయణకవచము - అంగన్యాస కరన్యాసములలో తన శరీరములోని అంగములను ఒక్కొక్కదానిని “ఓం నమోనారాయాణాయ” అను మంత్రములోని ఒక్కొక్క అక్షరముచేతను సత్వయుక్తముగా చేయుటచేత శరీరమును నారాయణమయముగా చేసి అన్నింటినుండి రక్షించునట్లుగా చేయుట. తనచుట్టునున్న ఆవరణము క్రూరశక్తులకు అభేద్యముగా చేయుట.

(చూడుము - నారాయణకవచము - శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 8 - )

Transliteration
  1. śarīramunu rakṣiṃcunadi. yuddhamulō śatruvula āyudhamulavalla śarīramunaku gāyapaḍakuṃḍa kācu lōhamayamaina toḍugu. durmārgaśaktulu konni manakaṃṭiki agupaḍakuṃḍa manalanu bādhiṃcunu - aṃducēta maṃtramucēta tayārucēyabaḍi kaṃṭiki kanabaḍani kavacamu - daiva śakti manalanu āvariṃci rakṣiṃcunaṭlu cēyunadi - nārāyaṇakavacamu, śivakavacamu.

  2. bhūrja patrē vilikhya svarṇapēṭikāyāṃ sthāpayitvā kaṃṭhēyaddhṛtaṃ tat ityarthaḥ -

(bhūrjapatramaṃdu maṃtramunu vrāsi dānini baṃgāramuto cēsina okacinnapeṭṭivaṃṭidānilō bhadramucēsi kaṃṭhamaṃdu vrēlāḍakaṭṭunadi - tāvējuvaṃṭidi).

  1. nārāyaṇakavacamu - aṃganyāsa karanyāsamulalō tana śarīramulōni aṃgamulanu okkokkadānini “ōṃ namōnārāyāṇāya” anu maṃtramulōni okkokka akṣaramucētanu satvayuktamugā cēyuṭacēta śarīramunu nārāyaṇamayamugā cēsi anniṃṭinuṃḍi rakṣiṃcunaṭlugā cēyuṭa. tanacuṭṭununna āvaraṇamu krūraśaktulaku abhēdyamugā cēyuṭa.

(cūḍumu - nārāyaṇakavacamu - śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 8 - )

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.