← Back to క · Booklets 11–20 (digitized file 2)

కాయకామీ kāyakāmī

Original — తెలుగు
  1. కామ్యంతే ఇతి కామాః, విషయాః, తాన్ కామ యితుం శీలం అస్య సకామకామీ - విషయార్థీ.

(కోరబడుచున్నవి కనుక కామములు, విషయములు - వాటిని కోరే స్వభావముగలవాడు కామకామీ - విషయములను కోరువాడు).

  1. భోగకామన శీలః (భోగములను కోరు స్వభావము గలవాడు).

  2. “త్రై విద్యా మాం సోమపాః పూత పాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రాప్తయంతే |

తే పుణ్య మాసాద్య సురేంద్రలోక మశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ |

తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |

ఏవం త్రయీ ధర్మ మను ప్రసన్నా గతా గతం కామ కామాః లభంతే ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 20, 21)

(దేవత్రయములో చెప్పిన ప్రకారము కర్మానుష్ఠానము చేయువారు యజ్ఞములు చేసి, సోమపానము చేసి స్వర్గభోగములు కోరుదురు, వారు దీనివలన పుణ్యము సంపాదించి, దేవేంద్రలోకమునకు వెళ్ళి అక్కడ ఆ లోకముల భోగములను అనిభవించి, పుణ్యము క్షీణింపగా తిరిగి మానవ లోకములో పుట్టుదురు. ఈ ప్రకారము కామ కాముకులు (కోరికలు గలవారు). - విషయభోగములను కోరి కర్మలు చేయువారు - పుట్టుచూ, చనిపోవుచునుందురు, మోక్షమును పొందలేరు).

Transliteration
  1. kāmyaṃtē iti kāmāḥ, viṣayāḥ, tān kāma yituṃ śīlaṃ asya sakāmakāmī - viṣayārthī.

(kōrabaḍucunnavi kanuka kāmamulu, viṣayamulu - vāṭini kōrē svabhāvamugalavāḍu kāmakāmī - viṣayamulanu kōruvāḍu).

  1. bhōgakāmana śīlaḥ (bhōgamulanu kōru svabhāvamu galavāḍu).

  2. “trai vidyā māṃ sōmapāḥ pūta pāpāḥ yajñairiṣṭvā svargatiṃ prāptayaṃtē |

tē puṇya māsādya surēṃdralōka maśnaṃti divyān divi dēvabhōgān |

tētaṃ bhuktvā svargalōkaṃ viśālaṃ kṣīṇē puṇyē martyalōkaṃ viśaṃti |

ēvaṃ trayī dharma manu prasannā gatā gataṃ kāma kāmāḥ labhaṃtē ||“. (śrīmadbhagavadgīta - 9 - 20, 21)

(dēvatrayamulō ceppina prakāramu karmānuṣṭhānamu cēyuvāru yajñamulu cēsi, sōmapānamu cēsi svargabhōgamulu kōruduru, vāru dīnivalana puṇyamu saṃpādiṃci, dēvēṃdralōkamunaku veḷḷi akkaḍa ā lōkamula bhōgamulanu anibhaviṃci, puṇyamu kṣīṇiṃpagā tirigi mānava lōkamulō puṭṭuduru. ī prakāramu kāma kāmukulu (kōrikalu galavāru). - viṣayabhōgamulanu kōri karmalu cēyuvāru - puṭṭucū, canipōvucunuṃduru, mōkṣamunu poṃdalēru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.