శుద్ధం (ఏ విధమైన దోషములు లేకుండుటచేత కేవలమాత్మరూపుడై యుండువాడు).
నిరుపాధికః -
(ఉపాధి లేనివాడు - ఏ విధమైన ఉపాధితోను కలిసి ఉండని ఆత్మస్థితి; ప్రకృతిలోను, దాని వికృతుల తోను కలిసి ఉన్నప్పటికీ వాటి ప్రభావము తనమీద లేకయుండి, ఎక్కడున్నను, ఎట్లున్నను తన స్వస్వ భావములో మార్పులేనివాడు).
(ఏ కర్మవశములోను లేనివాడగుటచేత కేవలుడు) - కర్మఫలములు తనని అంటనివాడు).
కేవలః ఇతి పదేన ఫలాన్వయ రాహిత్యం వివక్షితం. (ఫలాన్వయ రహితుడు).
నివృత్తి ధర్మస్థః (ఏ విధములైన ధర్మములు లేనివాడు).
కేవల శబ్దః న ఏకాకి వచనః, కింతు నిష్క్రియత్వవాచీ.
(కేవలుడనగా ఏకాకి యని యర్థముకాదు - ఒకడే యని యర్థముకాదు - నిష్క్రియుడని యర్థము).
(తనను తప్పించి మిగిలిన సౄష్టిలో ఉన్న సమస్త వస్తువులను ప్రళయకాలమందు గ్రసించి తనలో లయ ముచేసుకొనగా మిగిలినవాడు పరమాత్మ ఒక్కడే - సత్పదార్థమగుటచేత - “సత్పదార్థమొకటే మిగిలి యుండును” అని శ్రుతివచనము - అందుచేతనే శేషుడు అనికూడచెప్పబడుచున్నాడు - సత్పదార్థము అనగా ఎల్లకాలమందుండువాడు) - “సృష్టిపూర్వమున జర్చింప నేనొకరుండ గలిగియుండుదు వీత కర్మినగుచు|సమధిక స్థూల సూక్ష్మ స్వరూపములు దత్కారణ ప్రకృతియు దగ మదంశ|మందు లీన మైన నద్వితీయుండనై|యుందు; నాకు నన్య మొకటి లేదు| సృష్టికాలమందు, సృష్టినాశంబున| జగము మత్స్వ రూపమగును, వత్స ! - -”
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 9 - 251)
ఆదిశేషుడు - (సృష్టికిముందు, సృష్టి లయించినతర్వాత శేషించియుండువాడు - అందుచేత కేవలుడు).
“అశేష విశేషా భావాత్ కేవలః”. (ఏ విధమైన విశేషములు లేనివాడగుటచేత కేవలుడు) - (నిర్విశేషుడు).
“కేవలో నిర్గుణశ్చ” ఇతి శ్రుతిః - (భగవంతుడు నిర్గుణుడు - సత్వరజస్తమోగుణములు లేనివాడు - అందుచేత కేవలుడు).
యదా ప్రకృతిగుణ వియుక్తో భవతి తదా జీవ ఏవ కేవల పరమాత్మా భవతి.
(జీవుడు సత్వరజస్తమములను త్రిగుణముల ప్రభావము లేనివాడు ఎప్పుడగునో అప్పుడే కేవలపరమాత్మ యే యగును.
జన్మ మృత్యుశ్చ కార్పణ్యం శోకస్తంద్రా క్షుథా తృషా |
తృష్ణా లజ్జా భయం దుఃఖం విషాదో హర్ష ఏవచ |
ఏభిర్దో షైర్వి నిర్ముక్తః సజీవః కేవలో మతః||“. (యోగతత్వోపనిషత్)
(కామము, క్రోధము, భయము. మోహము, లోభము, మదము, రజము, జనన మరణములు, కార్పణ్యము, శోకము, తంద్రత, క్షుథా, తృష్ణా, తృషా, లజ్జ, భయము, దుఃఖము, విషాదము, హర్షము - ఈ దోషములు లేని జీవుడు కేవలుడు అని చెప్పబడుచున్నాడు).
సర్వభూతేషు చాత్మానం బ్రహ్మ సం పద్యతే తదా |
యదా సర్వాణి భూతాని సమాథిస్థో న పశ్యతి |
ఏకీ భూతః పరేణాసౌ తదా భవతి కేవలః||“. (దర్శనోపనిషత్)
(ఎప్పుడు సమస్తభూతములను తనయందే చూచునో, వాటియందు తానున్నట్లు చూచునో, అప్పుడు అతను బ్రహ్మభావమును పొందినట్లే. తను సమాధిలోనుండి చుట్టునున్న భూతములను చూడడో, అవి తనకంటె వేరు అయినవి అని వాటిని చూడడో, పరమాత్మ తాను ఏకమైనట్లు భావించునో, అప్పుడు అతను కేవలుడగును - అట్టివాడు కేవలుడు).
śuddhaṃ (ē vidhamaina dōṣamulu lēkuṃḍuṭacēta kēvalamātmarūpuḍai yuṃḍuvāḍu).
nirupādhikaḥ -
(upādhi lēnivāḍu - ē vidhamaina upādhitōnu kalisi uṃḍani ātmasthiti; prakṛtilōnu, dāni vikṛtula tōnu kalisi unnappaṭikī vāṭi prabhāvamu tanamīda lēkayuṃḍi, ekkaḍunnanu, eṭlunnanu tana svasva bhāvamulō mārpulēnivāḍu).
(ē karmavaśamulōnu lēnivāḍaguṭacēta kēvaluḍu) - karmaphalamulu tanani aṃṭanivāḍu).
kēvalaḥ iti padēna phalānvaya rāhityaṃ vivakṣitaṃ. (phalānvaya rahituḍu).
nivṛtti dharmasthaḥ (ē vidhamulaina dharmamulu lēnivāḍu).
kēvala śabdaḥ na ēkāki vacanaḥ, kiṃtu niṣkriyatvavācī.
(kēvaluḍanagā ēkāki yani yarthamukādu - okaḍē yani yarthamukādu - niṣkriyuḍani yarthamu).
(tananu tappiṃci migilina sṝṣṭilō unna samasta vastuvulanu praḷayakālamaṃdu grasiṃci tanalō laya mucēsukonagā migilinavāḍu paramātma okkaḍē - satpadārthamaguṭacēta - “satpadārthamokaṭē migili yuṃḍunu” ani śrutivacanamu - aṃducētanē śēṣuḍu anikūḍaceppabaḍucunnāḍu - satpadārthamu anagā ellakālamaṃduṃḍuvāḍu) - “sṛṣṭipūrvamuna jarciṃpa nēnokaruṃḍa galigiyuṃḍudu vīta karminagucu|samadhika sthūla sūkṣma svarūpamulu datkāraṇa prakṛtiyu daga madaṃśa|maṃdu līna maina nadvitīyuṃḍanai|yuṃdu; nāku nanya mokaṭi lēdu| sṛṣṭikālamaṃdu, sṛṣṭināśaṃbuna| jagamu matsva rūpamagunu, vatsa ! - -”
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 9 - 251)
ādiśēṣuḍu - (sṛṣṭikimuṃdu, sṛṣṭi layiṃcinatarvāta śēṣiṃciyuṃḍuvāḍu - aṃducēta kēvaluḍu).
“aśēṣa viśēṣā bhāvāt kēvalaḥ”. (ē vidhamaina viśēṣamulu lēnivāḍaguṭacēta kēvaluḍu) - (nirviśēṣuḍu).
“kēvalō nirguṇaśca” iti śrutiḥ - (bhagavaṃtuḍu nirguṇuḍu - satvarajastamōguṇamulu lēnivāḍu - aṃducēta kēvaluḍu).
yadā prakṛtiguṇa viyuktō bhavati tadā jīva ēva kēvala paramātmā bhavati.
(jīvuḍu satvarajastamamulanu triguṇamula prabhāvamu lēnivāḍu eppuḍagunō appuḍē kēvalaparamātma yē yagunu.
janma mṛtyuśca kārpaṇyaṃ śōkastaṃdrā kṣuthā tṛṣā |
tṛṣṇā lajjā bhayaṃ duḥkhaṃ viṣādō harṣa ēvaca |
ēbhirdō ṣairvi nirmuktaḥ sajīvaḥ kēvalō mataḥ||“. (yōgatatvōpaniṣat)
(kāmamu, krōdhamu, bhayamu. mōhamu, lōbhamu, madamu, rajamu, janana maraṇamulu, kārpaṇyamu, śōkamu, taṃdrata, kṣuthā, tṛṣṇā, tṛṣā, lajja, bhayamu, duḥkhamu, viṣādamu, harṣamu - ī dōṣamulu lēni jīvuḍu kēvaluḍu ani ceppabaḍucunnāḍu).
sarvabhūtēṣu cātmānaṃ brahma saṃ padyatē tadā |
yadā sarvāṇi bhūtāni samāthisthō na paśyati |
ēkī bhūtaḥ parēṇāsau tadā bhavati kēvalaḥ||“. (darśanōpaniṣat)
(eppuḍu samastabhūtamulanu tanayaṃdē cūcunō, vāṭiyaṃdu tānunnaṭlu cūcunō, appuḍu atanu brahmabhāvamunu poṃdinaṭlē. tanu samādhilōnuṃḍi cuṭṭununna bhūtamulanu cūḍaḍō, avi tanakaṃṭe vēru ayinavi ani vāṭini cūḍaḍō, paramātma tānu ēkamainaṭlu bhāviṃcunō, appuḍu atanu kēvaluḍagunu - aṭṭivāḍu kēvaluḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.