కోపము.
చిత్త క్షోభః (మనస్సు క్షోభ పడుట).
“పరపీడ ఫల చిత్త వికారః” (శ్రీరామనుజః)
(ఇతరులను పీడించుటయే ఫలముగా గలది).
(క్రోధమనగా కామమే - కామము వలన కలిగినది కనుక).
(కామము - కోరిక - విఫలమగుటవలన క్రోధముగా మారును. అందుచేత క్రోధము రజోగుణమువలన కలిగినది).
(తనకు ప్రతికూలములైనవి, తనకు దుఃఖము కలిగించునవియు అగు, కనబడునవి, వినబడునవి, స్మరించతగినవి యగు విషయములందు కలుగు ద్వేషము).
(తనకు అనురాగము కలిగినటువంటి విషయముయొక్క నాశమును నివారించుటకు - తప్పించుటకు - తనకు సామర్థ్యము - శక్తి - లేకపోయినదని మనసులో తెలుసుకొనునపుడు రగులుచున్న చిత్తముయొక్క ఒకానొక వృత్తి విశేషము).
కాంక్షిత విషయా లాభజః క్రోధః. (కోరిన విషయము లభించనప్పుడు కలుగునది క్రోధము).
“పైశున్యం,సాహసం, ద్రోహ ఈర్షాసూయార్థ దూషణం |
వాగ్దండ జంచపారుష్యం క్రోథజోపి గుణాష్టకః ||“.
(పిసినారితనము, సాహసము, ద్రోహము, ఈర్ష, అసూయ, అర్థదూషణము, పరుషముగా మాట్లాడుట - ఈ ఎనిమిది క్రోధమువలన కలుగు గుణములు).
kōpamu.
citta kṣōbhaḥ (manassu kṣōbha paḍuṭa).
“parapīḍa phala citta vikāraḥ” (śrīrāmanujaḥ)
(itarulanu pīḍiṃcuṭayē phalamugā galadi).
(krōdhamanagā kāmamē - kāmamu valana kaliginadi kanuka).
(kāmamu - kōrika - viphalamaguṭavalana krōdhamugā mārunu. aṃducēta krōdhamu rajōguṇamuvalana kaliginadi).
(tanaku pratikūlamulainavi, tanaku duḥkhamu kaligiṃcunaviyu agu, kanabaḍunavi, vinabaḍunavi, smariṃcataginavi yagu viṣayamulaṃdu kalugu dvēṣamu).
(tanaku anurāgamu kaliginaṭuvaṃṭi viṣayamuyokka nāśamunu nivāriṃcuṭaku - tappiṃcuṭaku - tanaku sāmarthyamu - śakti - lēkapōyinadani manasulō telusukonunapuḍu ragulucunna cittamuyokka okānoka vṛtti viśēṣamu).
kāṃkṣita viṣayā lābhajaḥ krōdhaḥ. (kōrina viṣayamu labhiṃcanappuḍu kalugunadi krōdhamu).
“paiśunyaṃ,sāhasaṃ, drōha īrṣāsūyārtha dūṣaṇaṃ |
vāgdaṃḍa jaṃcapāruṣyaṃ krōthajōpi guṇāṣṭakaḥ ||“.
(pisināritanamu, sāhasamu, drōhamu, īrṣa, asūya, arthadūṣaṇamu, paruṣamugā māṭlāḍuṭa - ī enimidi krōdhamuvalana kalugu guṇamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.