(శ్యామవర్ణము కలిగియుండుటచేత కృష్ణుడు - నల్లని రంగు గల శరీరము కలిగియుండుటచేత కృష్ణుడు).
(నీలమైన కాంతి గలవాడు - ఇంద్రనీలమణివలె ప్రకాశించువాడు).
(మహా భారతము - శాంతిపర్వము)
(నల్లనైన ఇనుముచే చేయబడు నాగలినై భూమిని దున్నుటవలనను నారంగు నల్లనిదగుటచేతను నేను కృష్ణుడను).
తయో రైక్యం పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభి ధీయతే ||“.
(ఇతి మహాభారతే ఉద్యోగపర్వే) ఇతి వ్యాస వచనాత్ సచ్చిదానందా త్మనః కృష్ణః” (శ్రీశంకరః)
(కృషి నగా భూమి, ణః అనుమాట నిర్వృతిని తెలియచేయును - మహానందము, బ్రహ్మానందము అగు మోక్షము - ఈ రెండింటి కలియక పరబ్రహ్మ కృష్ణ అని చెప్పబడుచున్నది అనిమహాభారతములో శ్రీ వ్యాస మహర్షి జెప్పినట్లు.కృష్ణ అనగా సచ్చిదానందము).
(కృష్ అనుమాటకు భూమియని అర్థము - భూలోకములోనున్న ప్రాణుల సుఖము కొరకు సస్యమును భూమిలోనుండి పండింపచేయుటవలన కృష్ణుడు అని చెప్పబడుచున్నాడు).
కృషి స్తద్భక్తి వచనో నశ్చత ద్దాస్య వాచకః |
భక్తి దాస్య ప్రదాతాయస్స చ కృషః ప్రకీర్తితః |
కృషిశ్చ సర్వ వచనా నకారో బీజ మేవ చ ||“. (దేవీ భాగవతము)
(కృష ధాతోః భజనవాచకాత్ భావే క్వి ప్రత్యయే కృష్ శబ్దః నిష్పన్నః; సః తద్భక్తి వచనః కృష్ణభక్తి వాచకః ఇత్యర్థః - కృష్యతే ఆ కృష్యతే కారణాత్ ఉత్పత్తి కాలే ఇతి కృట్. సర్వం జగత్ సయతి కార్యాత్మ తాం ప్రాపయతి సన్ బీజకారణం“).
(ఆ పరమాత్మ, పరబ్రహ్మయే కృష్ణుడని చెప్పబడుచున్నాడు. కృషి అనుమాట పరమాత్మ భక్తిని తెలియ చేయునది, ‘న’ అను మాట పరమాత్మ దాస్యమును తెలియచేయునది. భక్తిని, దాస్యమును ఇచ్చువాడగుట చేత కృష్ణుడని చెప్పబడుచున్నాడు. కృషి అనగా సర్వమునకు అర్థము - ‘న’ అనగా దానిని బీజము, కారణము - దానిని పుట్టించునది).
(కృష అను ధాతువు - (root word) - భజనమును చెప్పునది. దానివలన కృషలోని కృష్ అనునది భక్తివచనము, కృష్ణభక్తిని తెలియచేయునది. ఉత్పత్తికాలమందు కారణవస్తువునుండి కార్యవస్తువును ఆకర్షించునుది - అనగా, కారణరూపములో సూక్ష్మరూపములో కార్యవస్తువును ఉద్భవించునట్లు చేయునది, పుట్టించునది. సమస్త ప్రపంచము ఈ రీతిగా కార్యవస్తువుగా పరిణమింప చేయును. అందు చేత ఆ సర్వజగత్తునకు బీజమైనవాడు, కారణమైనవాడు కృష్ణుడు. ఈ జగత్తు అంతయు భగవంతునిలో నుండి, ఒకదానిలోనుండి ఒకటిగా, పుట్టినదే. అందుచేత సృష్టి ప్రారంభములోనే కాక ఇప్పటివరకు, ఇక ముందుకూడా ఒకవస్తువులోనుండి ఇంకొక వస్తువు పుట్టునట్లు - కారణవస్తువులో నుండికార్యము పుట్టునట్లు చేయువాడు. కారణవస్తువునుండి కార్యవస్తువు పుట్టుటకు, కాలము, స్వభావము, భగవంతుని శక్తి అవసరము - ఏ వస్తువులోనుండి అయినను ఇంకొక వస్తువు దానంతట అది పుట్టదు - భగవంతుని శక్తి కారణవస్తువులోనుండి దానిని ప్రేరేపించుటచేత కార్యవస్తువు కలుగుచున్నది) -
(చూడుము - ఆత్మ ).
అతో వదంతి మునయః కృష్ణం త్వాం బ్రహ్మవాదినః ||“.
(సమస్త ప్రపంచమును సృష్టించి, దాని పనిలో నియమించి, తనలోనకు తిరిగి ఆకర్షించి లయింప చేయువాడవు. అందుచేత బ్రహ్మజ్ఞానము కలవారు నిన్ను కృష్ణుడు అని చెప్పుచున్నారు).
(సృష్టి మొదలగువాటిని చేసి ప్రతివస్తువును, దాని పనిలో నియమించి, సమస్తలోకమును తనలోనికి ఆకర్షించుకొనువాడు, లయము చేయువాడు).
“కర్షతి సర్వాన్ స్వాభిముఖ్యేన, ఆకర్షతీతి”. (సమస్త ప్రపంచమును తనలోనికి ఆకర్షించువాడు).
కర్షతి సర్వాన్ స్వకుక్షౌ ప్రళయకాలే.
(ప్రళయకాలమందు అందఱినీ, అన్నింటినీ తనలోనికి ఆకర్షించువాడు). (చూడుము - ‘సంకర్షణుడు’).
(కృషి శబ్దము చే చెప్పబడు - భగవంతుడు - నిలనహా - సమస్త ప్రపంచమును, తానొక్కడే మిగులునట్లుగా గ్రసియించువాడు - తినువాడు, నశింపచేయువాడు).
(భక్తుల దుఃఖములను పాపములను పోగొట్టువాడు -).
(భక్తుల సంసారమును - జననమరణములను - పోగొట్టుట - మొదలగు కార్యములను చేయుటవలన కృష్ణుడు).
(భక్తులమగు మా మనస్సులను బలవంతముగా తనయందు లగ్నమై యుండునట్లు ఆకర్షించువాడు).
(సచ్చిదానంద రూపుడగుటవలన అనృతము, జడము, దుఃఖాత్మకము అగు పాపములను పోగొట్టువాడు).
సర్వం కరోతీతి కృష్ణః - (సమస్తమును చేయువాడు).
కర్షత్యరీన్ మహా ప్రభావశక్త్యా ఇతి కృష్ణః.
(మహాప్రభావముగల తన శక్తిచేత శత్రువులను నశింపచేయువాడు).
(కృషి శబ్దమునకు కలియని అర్థము - తనభక్తులు చేసిన పుణ్యములు స్మరించినంత మాత్రమున కలిని శేషములేకుండగ నశింపచేయు వాడు కనుక కృష్ణుడు).
(నువ్వు ( అర్జునుడు), నేను (కృష్ణుడు) నరనారాయణులని చెప్పబడుచున్నాము).
“సురలున్ బ్రాహ్మణ సం యమీంద్రులు మహర్షుల్ విష్ణు నంశాంశజుల్| హరికృష్ణుండు, బలానుజన్ముడెడ లేదా విష్ణుడౌ నేర్పడన్ ||”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 3 - 27)
బరతత్వమనంగ బరమపదమనగను, నీ
శ్వరుండన, కృష్ణుడన, జగ
ద్భరితుడు నారాయణుండు, దా వెలుగొందున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 51)
విదుః కృష్ణం బ్రాహణాస్త త్వతోయే తేషాం
రాజన్, సర్వయజ్ఞాస్సమాప్తాః||“.
(వేదములన్నియు, వేద్యములు, శాస్త్రములు, సమస్త యజ్ఞములు అన్నియు కృష్ణుడే. ఈ రీతిగా ఎవరు కృష్ణుని యదార్థముగా తెలియుదురో వారు పైన చెప్పినవన్నియు తెలిసినవారే, చేసినవారే; వారు చదువవలసినది కాని, వారు చేయవలసినదికాని ఏదియు మిగిలియుండదు).
“కృష్ణం ధర్మం సనాతనం”. (సనాతనమైన ధర్మమే కృష్ణుడు).
“తొల్లి ఈ శిశువు ధవళారుణ పీతవర్ణుండై యిప్పుడు నల్లనైనకతంబున గృష్ణుండయ్యె”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 288)
(śyāmavarṇamu kaligiyuṃḍuṭacēta kṛṣṇuḍu - nallani raṃgu gala śarīramu kaligiyuṃḍuṭacēta kṛṣṇuḍu).
(nīlamaina kāṃti galavāḍu - iṃdranīlamaṇivale prakāśiṃcuvāḍu).
(mahā bhāratamu - śāṃtiparvamu)
(nallanaina inumucē cēyabaḍu nāgalinai bhūmini dunnuṭavalananu nāraṃgu nallanidaguṭacētanu nēnu kṛṣṇuḍanu).
tayō raikyaṃ paraṃ brahma kṛṣṇa ityabhi dhīyatē ||“.
(iti mahābhāratē udyōgaparvē) iti vyāsa vacanāt saccidānaṃdā tmanaḥ kṛṣṇaḥ” (śrīśaṃkaraḥ)
(kṛṣi nagā bhūmi, ṇaḥ anumāṭa nirvṛtini teliyacēyunu - mahānaṃdamu, brahmānaṃdamu agu mōkṣamu - ī reṃḍiṃṭi kaliyaka parabrahma kṛṣṇa ani ceppabaḍucunnadi animahābhāratamulō śrī vyāsa maharṣi jeppinaṭlu.kṛṣṇa anagā saccidānaṃdamu).
(kṛṣ anumāṭaku bhūmiyani arthamu - bhūlōkamulōnunna prāṇula sukhamu koraku sasyamunu bhūmilōnuṃḍi paṃḍiṃpacēyuṭavalana kṛṣṇuḍu ani ceppabaḍucunnāḍu).
kṛṣi stadbhakti vacanō naścata ddāsya vācakaḥ |
bhakti dāsya pradātāyassa ca kṛṣaḥ prakīrtitaḥ |
kṛṣiśca sarva vacanā nakārō bīja mēva ca ||“. (dēvī bhāgavatamu)
(kṛṣa dhātōḥ bhajanavācakāt bhāvē kvi pratyayē kṛṣ śabdaḥ niṣpannaḥ; saḥ tadbhakti vacanaḥ kṛṣṇabhakti vācakaḥ ityarthaḥ - kṛṣyatē ā kṛṣyatē kāraṇāt utpatti kālē iti kṛṭ. sarvaṃ jagat sayati kāryātma tāṃ prāpayati san bījakāraṇaṃ”).
(ā paramātma, parabrahmayē kṛṣṇuḍani ceppabaḍucunnāḍu. kṛṣi anumāṭa paramātma bhaktini teliya cēyunadi, ‘na’ anu māṭa paramātma dāsyamunu teliyacēyunadi. bhaktini, dāsyamunu iccuvāḍaguṭa cēta kṛṣṇuḍani ceppabaḍucunnāḍu. kṛṣi anagā sarvamunaku arthamu - ‘na’ anagā dānini bījamu, kāraṇamu - dānini puṭṭiṃcunadi).
(kṛṣa anu dhātuvu - (root word) - bhajanamunu ceppunadi. dānivalana kṛṣalōni kṛṣ anunadi bhaktivacanamu, kṛṣṇabhaktini teliyacēyunadi. utpattikālamaṃdu kāraṇavastuvunuṃḍi kāryavastuvunu ākarṣiṃcunudi - anagā, kāraṇarūpamulō sūkṣmarūpamulō kāryavastuvunu udbhaviṃcunaṭlu cēyunadi, puṭṭiṃcunadi. samasta prapaṃcamu ī rītigā kāryavastuvugā pariṇamiṃpa cēyunu. aṃdu cēta ā sarvajagattunaku bījamainavāḍu, kāraṇamainavāḍu kṛṣṇuḍu. ī jagattu aṃtayu bhagavaṃtunilō nuṃḍi, okadānilōnuṃḍi okaṭigā, puṭṭinadē. aṃducēta sṛṣṭi prāraṃbhamulōnē kāka ippaṭivaraku, ika muṃdukūḍā okavastuvulōnuṃḍi iṃkoka vastuvu puṭṭunaṭlu - kāraṇavastuvulō nuṃḍikāryamu puṭṭunaṭlu cēyuvāḍu. kāraṇavastuvunuṃḍi kāryavastuvu puṭṭuṭaku, kālamu, svabhāvamu, bhagavaṃtuni śakti avasaramu - ē vastuvulōnuṃḍi ayinanu iṃkoka vastuvu dānaṃtaṭa adi puṭṭadu - bhagavaṃtuni śakti kāraṇavastuvulōnuṃḍi dānini prērēpiṃcuṭacēta kāryavastuvu kalugucunnadi) -
(cūḍumu - ātma ).
atō vadaṃti munayaḥ kṛṣṇaṃ tvāṃ brahmavādinaḥ ||“.
(samasta prapaṃcamunu sṛṣṭiṃci, dāni panilō niyamiṃci, tanalōnaku tirigi ākarṣiṃci layiṃpa cēyuvāḍavu. aṃducēta brahmajñānamu kalavāru ninnu kṛṣṇuḍu ani ceppucunnāru).
(sṛṣṭi modalaguvāṭini cēsi prativastuvunu, dāni panilō niyamiṃci, samastalōkamunu tanalōniki ākarṣiṃcukonuvāḍu, layamu cēyuvāḍu).
“karṣati sarvān svābhimukhyēna, ākarṣatīti”. (samasta prapaṃcamunu tanalōniki ākarṣiṃcuvāḍu).
karṣati sarvān svakukṣau praḷayakālē.
(praḷayakālamaṃdu aṃdaṟinī, anniṃṭinī tanalōniki ākarṣiṃcuvāḍu). (cūḍumu - ‘saṃkarṣaṇuḍu’).
(kṛṣi śabdamu cē ceppabaḍu - bhagavaṃtuḍu - nilanahā - samasta prapaṃcamunu, tānokkaḍē migulunaṭlugā grasiyiṃcuvāḍu - tinuvāḍu, naśiṃpacēyuvāḍu).
(bhaktula duḥkhamulanu pāpamulanu pōgoṭṭuvāḍu -).
(bhaktula saṃsāramunu - jananamaraṇamulanu - pōgoṭṭuṭa - modalagu kāryamulanu cēyuṭavalana kṛṣṇuḍu).
(bhaktulamagu mā manassulanu balavaṃtamugā tanayaṃdu lagnamai yuṃḍunaṭlu ākarṣiṃcuvāḍu).
(saccidānaṃda rūpuḍaguṭavalana anṛtamu, jaḍamu, duḥkhātmakamu agu pāpamulanu pōgoṭṭuvāḍu).
sarvaṃ karōtīti kṛṣṇaḥ - (samastamunu cēyuvāḍu).
karṣatyarīn mahā prabhāvaśaktyā iti kṛṣṇaḥ.
(mahāprabhāvamugala tana śakticēta śatruvulanu naśiṃpacēyuvāḍu).
(kṛṣi śabdamunaku kaliyani arthamu - tanabhaktulu cēsina puṇyamulu smariṃcinaṃta mātramuna kalini śēṣamulēkuṃḍaga naśiṃpacēyu vāḍu kanuka kṛṣṇuḍu).
(nuvvu ( arjunuḍu), nēnu (kṛṣṇuḍu) naranārāyaṇulani ceppabaḍucunnāmu).
“suralun brāhmaṇa saṃ yamīṃdrulu maharṣul viṣṇu naṃśāṃśajul| harikṛṣṇuṃḍu, balānujanmuḍeḍa lēdā viṣṇuḍau nērpaḍan ||”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 3 - 27)
baratatvamanaṃga baramapadamanaganu, nī
śvaruṃḍana, kṛṣṇuḍana, jaga
dbharituḍu nārāyaṇuṃḍu, dā velugoṃdun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 51)
viduḥ kṛṣṇaṃ brāhaṇāsta tvatōyē tēṣāṃ
rājan, sarvayajñāssamāptāḥ||“.
(vēdamulanniyu, vēdyamulu, śāstramulu, samasta yajñamulu anniyu kṛṣṇuḍē. ī rītigā evaru kṛṣṇuni yadārthamugā teliyudurō vāru paina ceppinavanniyu telisinavārē, cēsinavārē; vāru caduvavalasinadi kāni, vāru cēyavalasinadikāni ēdiyu migiliyuṃḍadu).
“kṛṣṇaṃ dharmaṃ sanātanaṃ”. (sanātanamaina dharmamē kṛṣṇuḍu).
“tolli ī śiśuvu dhavaḷāruṇa pītavarṇuṃḍai yippuḍu nallanainakataṃbuna gṛṣṇuṃḍayye”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 288)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.