← Back to క · Booklets 11–20 (digitized file 2)

కుంభీ పులకన్యాయము kuṃbhī pulakanyāyamu

Original — తెలుగు

కుంభీ అన్నపచనపాత్రం, పులాకః ధాన్యకణః, తయోర్న్యాయః - ఏకకణ పచన జ్ఞానాత్ సర్వధాన్యపాకజ్ఞాన రూపః.

(కుంభము అనగా అన్నమువండుటకు ఉపయోగించు పాత్ర, పులాకమనగా బియ్యపుగింజ - ఈ రెండింటికి సంబంధించిన న్యాయము. ఉడుకుతున్న అన్నములోని ఒక గింజ తీసి చూచిన అది ఉడికనట్లుంటే కుంభ ములోని అన్నమంతయు - మెతుకులన్నీ - ఉడికినట్లే తెలియనగును - ప్రతిమెతుకు పరిశోధించి. చూడ నక్కరలేదు).

(సృష్టిలో ఏ వస్తువును పట్టి శోధించిచూచిన - దాని తత్వమును కనిపెట్టిన -, అటువంటి వస్తువు లన్నియు దానివలెనే ఉండును - వాటిని అన్నింటిని వేరు వేరుగా చూడనక్కరలేదు. “అహం బ్రహ్మాస్మి”,

“అయమాత్మా బ్రహ్మ” అను మహావాక్యముల ప్రకారము ఒక జీవతత్వము తెలుసుకొనినచో అటువంటి జీవులన్నింటి తత్వము తెలియును).

Transliteration

kuṃbhī annapacanapātraṃ, pulākaḥ dhānyakaṇaḥ, tayōrnyāyaḥ - ēkakaṇa pacana jñānāt sarvadhānyapākajñāna rūpaḥ.

(kuṃbhamu anagā annamuvaṃḍuṭaku upayōgiṃcu pātra, pulākamanagā biyyapugiṃja - ī reṃḍiṃṭiki saṃbaṃdhiṃcina nyāyamu. uḍukutunna annamulōni oka giṃja tīsi cūcina adi uḍikanaṭluṃṭē kuṃbha mulōni annamaṃtayu - metukulannī - uḍikinaṭlē teliyanagunu - pratimetuku pariśōdhiṃci. cūḍa nakkaralēdu).

(sṛṣṭilō ē vastuvunu paṭṭi śōdhiṃcicūcina - dāni tatvamunu kanipeṭṭina -, aṭuvaṃṭi vastuvu lanniyu dānivalenē uṃḍunu - vāṭini anniṃṭini vēru vērugā cūḍanakkaralēdu. “ahaṃ brahmāsmi”,

“ayamātmā brahma” anu mahāvākyamula prakāramu oka jīvatatvamu telusukoninacō aṭuvaṃṭi jīvulanniṃṭi tatvamu teliyunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.