← Back to క · Booklets 11–20 (digitized file 2)

కుండలినీ శక్తి kuṃḍalinī śakti

Original — తెలుగు
  1. “శక్తిః కుండలినీ నామ చి సతంతు నిభా శుభా ||”. (వామకేశ్వరమహామంత్రము)

(కుండలినీ యని పేరు గలది, తామరతూడులోని దారమువలెనుండి కాంతివంతమైనది).

  1. “మూలాధారా దా బ్రహ్మ రంధ్ర పర్యంతం సుషుమ్నా సూర్యాభా. తన్మధ్యే తటిత్కోటి సమామృణాల తంతు సూక్ష్మా కుండలినీ”. (మండల బ్రాహ్మణోపనిషత్).

(మూలాధారచక్రము మొదలుకొని శిరస్సులోనున్న బ్రహ్మరంధ్రమువరకు సూర్యునికాంతివలె ప్రకా శించునది సుషుమ్నా. దాని మధ్యమందు కోటి విద్యులతలతో సమానమైనదిన్నీ, తామరతూడులోని దారమువలె సూక్ష్మముగా నుండునది కుండలినీ అను శక్తి, శక్తివంతమైన నాడి కలదు).

  1. కందోర్ధ్వే కుండలీ శక్తి రష్టధా కుండలాకృతిః |

బ్రహ్మద్వార ముఖేనిత్యం ముఖేనాచ్ఛాద్య తిష్టతి |

యేన ద్వారేణ గంతవ్యం బ్రహ్మద్వార మనామయం ||“, (యోగచూడామణ్యుపనిషత్)

(మూలకందమునకు మీదను కుండలినీ అను శక్తి ఎనిమిది విధములుగా చుట్టుకొని యుండు పాము వలె నున్నది, ఎల్లపుడు శిరస్సులోనున్న బ్రహ్మరంధ్రమును - బ్రహ్మ ద్వారమును - కప్పియుండును. ఈ బ్రహ్మరంధ్రముద్వారా ప్రాణము పోయిన బ్రహ్మలోకమునకు పోవుదురు - అట్టి బ్రహ్మరంధ్రమును ఈ కుండ లినీ శక్తి (నాడిలోనున్న శక్తి) అడ్డుకొనియుండును. అందుచేత బ్రహ్మలోకమునకు పోదలచువారు - ముక్తిని కోరువారు - ఈ కుండలినీ శక్తిని చలింపచేసి బ్రహ్మరంధ్రము తెఱచుకొని పోవుదురు).

  1. “దేహమధ్యే బ్రహ్మనాడీ సుషుమ్నా సూర్య రూపిణీ పూర్ణచంద్రా భావర్తతే. సాతు మూలాధారా దారభ్య బ్రహ్మరంధ్రగామినీ భవతి. తన్మధ్యే తటిత్కోటిసమాన కాంత్యా మృణాల సూత్రవత్ సూక్ష్మాంగీ కుండలినీతి ప్రసిద్దా అస్తి. తాం దృష్ట్వా మనసైవ నరః సర్వపాప వినాశద్వారా ముక్తో భవతి.”. (అద్వయతారకోపనిషత్)

(సూర్య రూపిణియు, పూర్ణచంద్రునివంటి కాంతి గలదియు అగు సుషుమ్న యను పేరుగల బ్రహ్మనాడి దేహమధ్యమందు కలదు - ఆ సుషుమ్న మూలాధారచక్రము మొదలుకొని శిరస్సులోనున్న బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించియున్నది. ఆ సుషుమ్న నాడి మధ్యలో కోటి విద్యత్ మెరుపుల కాంతితో సమానమైన కాంతితో తామరతూడు దారమువలె సూక్ష్మముగా నుండి కుండలినీ అని ప్రసిద్ధి పొందినది ఉన్నది. దానిని మనసులోనైనను చూచినవాడు, వాని పాపములు నాశనమైనందున, ముక్తిని పొందును).

  1. “తే.గీ.నాభి కందంబు క్రిందట, నలినగంధి

కుండలీ శక్తి దేవత యుండు నెలవు

కుండలీ శక్తి నాగ, జకోర నేత్ర

పాము చందాన నుండెడు ప్రధమ ధమని

ద. అది మూల ప్రకృతి; మహదారి ప్రకృతి వికారంబులేడును దాని మేని మలకలు; అప్పాప చేడియు యు సిషుమ్నా నాడి తోడం బెనంగొని యుండు.

క. గిట గిట నెనిమిది మలకలు

కుటిలీభావము భజించి కుండలి ప్రాకున్

నిటలాంతము దాకను గ్రిం

దటి మొగమై వ్రేలు నండ్రు తత్జ్ఞుల్ దానిన్ “. (కాశీఖండము - శ్రీనాధుడు)

  1. “శివా పరా నాడీ రూపా కుండలినీ శక్తిః సర్పసదృశ గతివశాత్ కుండలినీ సంజ్ఞాప్రాప్తిః మూలా ధారాది కమల షట్కం అస్యామేవ ఆధారత్వేన పుష్పమాలాం తర్గిత సూత్రవత్ పరా సుషుమ్నా నాడీ స్థితివశాత్ బ్రహ్మ రంధ్రాది మూలాధార పర్యంతం హంస యోః యాతా యాత గతివశాత్ ఏతన్నాడీమార్గేణ స్వాధిష్ఠానాగ్నేః సహస్రారాంతర్గత బిందుమండలస్య వేధ సంభవాత్ బ్రహ్మవిష్ణు రుద్రగ్రంధీనాం భేదనం భోక్తం స్వాధిష్ఠానాగ్ని వేధయా ఘనీభూత సుధామండలాస్రవ దమృతధారా ప్రవాహైః ద్వి సప్తతి సహస్ర నాడీ సంచయం స్నపతి. తదమృత సేవనేన సర్వేనాడ్యః తృప్తాః, తదా దేహినాం స్వస్థావస్థా. అగ్నేరుష్ణా ధిక్యం స్రవదమృ తధారాభిః శామ్యతి. అమృతధారా శైత్యాదికం తు స్వాధిష్ఠానాగ్ని జ్వాలాభిః శామ్యతి. తయోః యదా న్యూనాధికం భవతి తదా ప్రాణినాం వ్యాధిరూపేణ అస్వస్థతా సిద్ధిః. ఔషధసేవా ద్యుప చారైః లుప్త భాగస్య సహాయతా చ అధిక భాగస్య శాంతిః భవతి. తేన పునః స్వస్థావస్థా ప్రాప్తిః - ప్రలయే అగ్నిః శమయతి అతివృష్టిర్భవతి. తదా ప్రలయః - ఏవ ఆది శక్తేః సహజ నియమకం ఇతి సమయ మత సిద్ధాంతః ||’

(పరాదేవి శివుని పరాశక్తియైన దేవియే కుండలినీ శక్తి. సర్పమువంటి నడక (గతి) - వంకర నడక - కలిగియుండుటచేత కుండలినీ యని పేరు పొందినది. మూలాధారకమలము (చక్రము) మొదలగు ఆరు కమలములు ఈ సుషుమ్నా నాడి మీదనే ఆధారపడియుండుటచేత పుష్పమాలలోని - పువ్వులలో నుండుదారము వలె పరతత్వమై సుషుమ్నా నాడిలోనుండుటవలనను, బ్రహ్మరంధ్రము మొదలు, మూలా ధారపర్యంతము, మూలాధారము మొదలు బ్రహ్మరంధ్రమువఱకు ఈ ప్రకారము క్రినదకీ మీదకీ ప్రాణ వాయువు సంచారమువలన ఈ సుషుమ్నా నాడీమార్గముద్వారా స్వాధిష్ఠ్గానకమలములోనున్న అగ్ని (ఉష్ణము) వలన శిరస్సులోనున్న సహస్రారకమలములోనున్న బిందువునకు వేధ కలుగుటవలన మధ్యనున్న బ్రహ్మగ్రంధి, విష్ణుగ్రంధి, రుద్రగ్రంధి అను మూడింటినీ, సూర్యమండలరూపమగు అనాహత కమలమును భేదించును - (వాటి ద్వారా దారిని తెరచివయును). అక్కడ ముడివలెనుండు నాడీ సమూహమును శక్తివంతముగా చేయును. సహస్రారపద్మములోని ఘనీభూతమైన సుథామండలము స్వాధిష్ఠాన కమలమువలన కలుగు వేధవలన కరిగి అమృతధారవలె స్రవించి వేలకు పైగా నున్ననాడులను స్నానము చేసినట్లు చేయును - చల్లదనమును వాటిలో కలుగచేయును - అప్పుడు దేహికి స్వస్థావస్థ కలుగును - స్వస్థత కలుగును - (normal condition). శరీరములోని శీతోష్ణస్థితి శరీరమున కనుకూలముగా చేయును. అగ్నివలన కలుగు ఉష్ణము - ఉష్ణాధిక్యము - చంద్రమండలము నుండి స్రవించుచున్న అమృతధారవలన శమించును (తగ్గును). అమృతధారయొక్క శైత్యాధిక్యము - ఎక్కువ చల్లదనము స్వాధిష్ఠానములోనుండి కలుగు వేడిమి (అగ్ని) వలన శమించును - ఈ స్వాధి ష్టాన ఉష్ణము చంద్రమండలమునుండి వచ్చు చల్లదనము ఎప్పుడు హెచ్చు తక్కువలు అగునో అప్పుడు ప్రాణులకు వ్యాధిరూపముగా అశ్వస్థత కలుగును - ఔషధములు పుచ్చుకొనుటవలనను ఉష్ణ శైత్యముల హెచ్చు తగ్గులు సరిగా సర్దుకొనుటచేతను స్వస్థావస్థ సిద్ధించును - ఈ ప్రకారముగానే ప్రలయకాలమందవి తగ్గిపోయి అతివృష్టి కలుగును -)

  1. “కుండల్యేన భవేచ్ఛక్తిః తాంతు సంచారయేత్ బుధః| స్వస్థానాదా బ్రువోర్మధ్యం శక్తి చాలన ముచ్యతే| తత్సాధనే ద్వయం ముఖ్యం సరస్వత్యాస్తు చాలనం| ప్రాణరోదన మధాభ్యాసాత్ ఋజ్వీ కుండలినీ భవేత్||” (యోగకుండల్యుపనిషత్)

(కుండలి వలన శక్తి కలుగును - జ్ఞానియగువాడు దానిని సంచారించు దానినిగా చేయవలెను. దాని స్థానమైన స్వాధిష్ఠామునుండి ఆజ్ఞాచక్రమువరకు (కనుబొమలమధ్య వరకు) ఆ శక్తి ప్రసరించునట్లు చేయవలెను - ఈ సాధనలో రెండు ముఖ్యమైనవి - సరస్వతినాడిని చలింపచేయవలెను. ప్రాణాయామము చేయవలెను - దీనివలన కుండలిని పామువలె మెలికలు మాని తిన్నగా సంచరించును - క్రిందకు, మీదకు సంచరించును).

  1. ఈ కుండలినీశక్తిని క్రిందనుండిమీదకు, మీదనుండిక్రిందకు ప్రసరింపచేయు క్రమము ఈ క్రింద చెప్పబడినది : -

“ప్రధమతః పూరకయోగేన బాహ్యవాయుమాకృష్య కుంభకం కృత్వా స్వమనో వాయుసహితం మూలాధారే యోజయేత్, నయేత్ ఇత్యర్ధః. అనంతరం గుదస్య మేఢ్రస్య లింగస్యాంతరే మధ్యే - మూలాధార చక్రే ఇత్యర్థః - విద్యమానాయాస్థితాయా శక్తిః కుండలినీ తాం ఆకుంచ్య మూలాధారగతవాయునా పీడయిత్వా ప్రభోధయేత్ - ఉత్థాపయేత్ ఇత్యర్థః. తాం ఉత్థాప్య లింగభేదక్రమేణ మూలాధార చక్రగత తత్తేజోమయ స్వయంభువాది లింగానాం భేదనం, - తన్మార్గేణ నయనం, తత్క్రమే ణైవతాం కుండలినీం శక్తిం బిందు చక్రం సహస్రారం ప్రాపయేత్. సహస్రారపద్మస్థితేన శంభునాతాం కుండలినీం ఏకీభూతాం సంగతాం విభావయేత్. తత్రశివశక్త్యోః సంగమే యదుత్థితం అమృతం ధృతలాక్షా సమాన వర్ణం తాం కుండలినీం పాయ యిత్వా, తేవ ఆనంద రసరూపేణ తాం తృప్తాం కృత్వా ఇత్యర్థః - షట్చక్ర స్థితా దేవతాలింగరూపాః అమృతధారయా శివశక్తి సమాగమోత్థానానంద రసరూపామృతవృష్ట్యా సంతర్ప్య, పునర్యేనైవ మార్గేణ మస్తకం నీతా కుండలినీ తేనైవ మార్గేణ మూలాధారాంతర కుండలినీం ఆనయేత్.”

(ప్రాణాయామ నియమము ప్రకారము మొదట పైనున్న వాయువును (గాలిని) పూరకము చేసి (ముక్కు లోనికి పీల్చుకొని) దానిని లోన కుంభకముచేసి (కుంభించి - పైకి వదలక అణచిపెట్టియుంచి) తన మనోవాయువుచేత మూలాధారచక్రమునకు దానిని (గాలిని) తీసుకొని వెళ్ళవలెను - వెళ్ళునట్లు చేయ వలయును. మనసులో ఆ వాయువు మూలాధారమునకు దిగవలెను అను ధృఢమైన సంకల్పముతో ప్రయత్న ము చేసిన ఆ వాయువు అక్కడకు వెళ్ళును - తరువాత గుదమునకు లింగమునకు మధ్యనున్న మూలా ధార చక్రమందున్న కుండలినీ యను శక్తిని మూలాధారమున నున్న వాయువుచేత పీడించి, అది మీదకు లేచినట్లు చేయవలెను - మూలాధారచక్రమందుండు తేజోమయమైన స్వయంభువాదిలింగమును భేదించుచు ఆ మార్గముద్వారా క్రమముగా ఆ కుండలినీ శక్తిని సహస్రార చక్రమందలి బిందువుతో పొందించవలెను సహస్రార పద్మములోనున్న శివునితో కుండలినీ శక్తి కలిసిపోయి ఏకమైనట్లు భావించవలెను - అఫ్ఫుడు అక్కడ శివుడు, శక్తి యీ యిద్దరిసంగమము (కూడుట) వలన పుట్టిన అమృతరసముచేత ఆ కుండలినీ శక్తిని తృప్తిపరచి ఆ మూలాధారచక్రములోనుండి సహస్రారమునకు వచ్చిన ఉష్ణమును చల్లార్చి - శాంతింపచేసి, క్రిందనున్న ఆరు చక్రములనధిష్టించియుండు దేవతా రూపములను శివ శక్తుల సమా గమముచే పుట్టిన ఆనందరసరూపమైన అమృతవర్షముచేత తర్పణముచేసి (స్నానము చేయించి) (తడిపి) (శాంతింపచేసి), యే మార్గముమీదుగా ఈ కుండలినీ శక్తిని శిరస్సునకు - సహస్రారచక్రమునకు - తీసుకువచ్చెనో ఆ మార్గముద్వారానే తిరిగి కుండలిని మూలాధారచక్రమును పొందునట్లు చేయవలెను).

  1. ప్రాకృత ప్రలయే గ్రస్త సమస్తవ్యస్త ప్రపంచం మాయా స్వప్రతిష్ఠే నిష్కలే లీనా యావత్కర్మ పరిపాకం వర్తతే. ప్రాణికర్మభిశ్చ తస్యాం మాయాయాం విలీనైరేవ క్రమేణ ప్రాప్త పరిపాకైః స్వఫలదానాయ పరమేశ్వ రస్య సిసృక్షాత్మికా మాయా వృత్తిర్జన్యతే. సైషా మాయావస్థా ఈక్షణ, కామ, తపో, విచి కార్షాది శబ్దైరభి ధయతే - “విచి కుర్షుర్ఘనీ భూతా క్వచి దభ్యేతి బిందుతాం” - ‘స అకాయ యత’ ఇత్యాది. అపరిపక్వ కర్మ విభాగాత్ ఘనీ భావః. తదర్థ వ్యాపారో విచికీర్షా పరిపక్వ కర్మాకార పరిణత మాయా విశిష్టం బిందుః. తదిదమ విభాగావస్థమవ్యక్త ముచ్యతే.”తస్మా దవ్యక్త ముత్పన్నం త్రిగుణం” స ఏష జగదం కురా కారః అధ్యాత్మమంచా ధారా దానాభి వ్యంజ్య మానః కుండల్యాది శబ్దై రుచ్యతే. - శక్తిః కుండలి నీతి విశ్వజనన వ్యాపారబద్ధో ద్యమాం జ్ఞాత్వా “-” కుండలినీ సర్వథాజ్ఞేయా సుషుమ్నానుగ తైవసా” -

(ప్రాకృత ప్రలయ సమయమందు సమస్తమైన ప్రపంచము మాయ యను ప్రకృతిలో లయమైపోయి, ఆ మాయ దానికి ఆధారమైన నిష్కలుడైన పరబ్రహ్మయందు లీనమై, జీవులు చేసిన కర్మ పరిపక్వమై కర్మఫలమను భవించుటకు తిరిగి జన్మించుటకు ఉన్ముఖమగునంతవరకు ఉండును. అట్టి మాయయందు (ప్రకృతియందు) ఏ ప్రకారముగా లయమైపోయినవో ఆ ప్రకారముగానే కర్మపరిపాకమును చెందిన జీవులకు వారి వారికి తగిన ఫలము నిచ్చుటకు పరమేశ్వరునకు సృష్టి చేయవలెనను ‘ఇచ్చ’ అని చెప్పబడు మాయావృత్తి - మాయ యొక్క వృత్తి, గుణము, ప్రకృతిలో కలుగు పరిణామము - కలుగును - (అనగా సృష్టి ప్రారంభ మగుననుట). మాయ (ప్రకృతి) యొక్క అట్టి అవస్థా విశేషమే గ్రంధములలో, పరమేశ్వరుని యొక్క “ఈక్షణమని” - ‘సైక్షత’ అని, కామము (కోరిక) - “స అకామయత” అని ‘తపస్సు’ (‘అతప్యత’) అని, ‘విచికీర్షా’ యని మొదలగుమాటలచేత చెప్పబడినది. ఆమాటల అర్థము ఇదియే. అప్పటి ప్రకృతి స్థితిలో సృష్టి ప్రారంభము అగుటకు పరిపక్వముగాని స్థితిలో ప్రకృతి ఘనీభూతము (#చొంచెంత్రతెద్#) అని చెప్పబడినది. అదియే ‘బిందువు’ యగును. ఫలమునిచ్చుటకు పరిపక్వమైన కర్మాకారముగా మారిన మాయ ‘బిందువు’. ఇది సమష్టి అవస్థ, దీనినే అవ్యక్తమందురు - వ్యక్తముగాని వేరు వేరు రూపములతో వ్యక్తముగాక, అన్నీ కలిసి ఒకే రూపములోనున్న ప్రకృతి. ఇదియే జగత్తునకు అంకురము. దీనినుండియే జగత్తు అంతయు చిలువలు పలువలుగా వ్యాపించి పెద్దదైనది, అధ్యాత్మము, ఆధారము - జగత్తునకు ఆధారమైనది, కుండలియని కూడ చెప్పబడుచున్నది - “శక్తిః కుండలినీతి విశ్వ జననవ్యాపార బద్ధోద్యమాం జ్ఞాత్వా” -“కుండలీ సర్వధా జ్ఞేయా సుషుమ్నాను గతైవసా” - (ప్రపంచమును పుట్టించు వ్యాపారమను ఉద్యమముగలదిగా (ప్రకృతిని) తెలుసుకొనవలెను - అదియే కుండలి, సుషుమ్నను అనుసరించియుండును).

(కుండలము అనగా గుండ్రముగ చుట్టుకొనియున్నపాము - కుండలమువలె చుట్టుకొని యున్నట్లు భావింప బడిన శక్తి స్వరూపము - మేరుదండి అను పేరుగల వెన్నెముకలో గల సుషుమ్నానాడిని ఆశ్రయించి యున్న పరాశక్తి - (భగవచ్ఛక్తి). పైన చెప్పబడిన ప్రకృతి - ప్రపంచమునకు అంకురము అని చెప్పబడిన ప్రకృతి లేక మాయాశక్తి సృష్టి అయిన తర్వాత మానవుల (జీవుల) వెన్నెముకలోనున్న సుషుమ్నానాడిని ఎట్లు ఆశ్రయించియుండుట తటస్థించినదో ఈ క్రింద చెప్పబడినది : - పైన చెప్పబడిన స్తితిలోనున్న ప్రకృతి దానిలోనున్నవి ఒకదానినొకటి ఆకర్షించి, ఘనీభూతమై ఒకే వస్తువుగానుండి, బ్రహ్మాండము - (అండా కారముగనున్న బ్రహ్మ) రూపము దాల్చి, దానిలో కలిగిన ఉష్ణమువలన ఆ అండము బ్రద్దలై చెల్లా చెదురై విరజిమ్ముకుపోయినపుడు అందులోనున్న శక్తి విరజిమ్ముకుపోయిన ప్రతివస్తువులోను లోపల పైనా ప్రవేశించి వ్యాపించును - అట్లు వ్యాపించిన శక్తి జీవులలో మాలాధారము నాశ్రయించి కుండలినీ అని పేరు కలిగియున్నది).

Transliteration
  1. “śaktiḥ kuṃḍalinī nāma ci sataṃtu nibhā śubhā ||”. (vāmakēśvaramahāmaṃtramu)

(kuṃḍalinī yani pēru galadi, tāmaratūḍulōni dāramuvalenuṃḍi kāṃtivaṃtamainadi).

  1. “mūlādhārā dā brahma raṃdhra paryaṃtaṃ suṣumnā sūryābhā. tanmadhyē taṭitkōṭi samāmṛṇāla taṃtu sūkṣmā kuṃḍalinī”. (maṃḍala brāhmaṇōpaniṣat).

(mūlādhāracakramu modalukoni śirassulōnunna brahmaraṃdhramuvaraku sūryunikāṃtivale prakā śiṃcunadi suṣumnā. dāni madhyamaṃdu kōṭi vidyulatalatō samānamainadinnī, tāmaratūḍulōni dāramuvale sūkṣmamugā nuṃḍunadi kuṃḍalinī anu śakti, śaktivaṃtamaina nāḍi kaladu).

  1. kaṃdōrdhvē kuṃḍalī śakti raṣṭadhā kuṃḍalākṛtiḥ |

brahmadvāra mukhēnityaṃ mukhēnācchādya tiṣṭati |

yēna dvārēṇa gaṃtavyaṃ brahmadvāra manāmayaṃ ||“, (yōgacūḍāmaṇyupaniṣat)

(mūlakaṃdamunaku mīdanu kuṃḍalinī anu śakti enimidi vidhamulugā cuṭṭukoni yuṃḍu pāmu vale nunnadi, ellapuḍu śirassulōnunna brahmaraṃdhramunu - brahma dvāramunu - kappiyuṃḍunu. ī brahmaraṃdhramudvārā prāṇamu pōyina brahmalōkamunaku pōvuduru - aṭṭi brahmaraṃdhramunu ī kuṃḍa linī śakti (nāḍilōnunna śakti) aḍḍukoniyuṃḍunu. aṃducēta brahmalōkamunaku pōdalacuvāru - muktini kōruvāru - ī kuṃḍalinī śaktini caliṃpacēsi brahmaraṃdhramu teṟacukoni pōvuduru).

  1. “dēhamadhyē brahmanāḍī suṣumnā sūrya rūpiṇī pūrṇacaṃdrā bhāvartatē. sātu mūlādhārā dārabhya brahmaraṃdhragāminī bhavati. tanmadhyē taṭitkōṭisamāna kāṃtyā mṛṇāla sūtravat sūkṣmāṃgī kuṃḍalinīti prasiddā asti. tāṃ dṛṣṭvā manasaiva naraḥ sarvapāpa vināśadvārā muktō bhavati.”. (advayatārakōpaniṣat)

(sūrya rūpiṇiyu, pūrṇacaṃdrunivaṃṭi kāṃti galadiyu agu suṣumna yanu pērugala brahmanāḍi dēhamadhyamaṃdu kaladu - ā suṣumna mūlādhāracakramu modalukoni śirassulōnunna brahmaraṃdhramu varaku vyāpiṃciyunnadi. ā suṣumna nāḍi madhyalō kōṭi vidyat merupula kāṃtitō samānamaina kāṃtitō tāmaratūḍu dāramuvale sūkṣmamugā nuṃḍi kuṃḍalinī ani prasiddhi poṃdinadi unnadi. dānini manasulōnainanu cūcinavāḍu, vāni pāpamulu nāśanamainaṃduna, muktini poṃdunu).

  1. “tē.gī.nābhi kaṃdaṃbu kriṃdaṭa, nalinagaṃdhi

kuṃḍalī śakti dēvata yuṃḍu nelavu

kuṃḍalī śakti nāga, jakōra nētra

pāmu caṃdāna nuṃḍeḍu pradhama dhamani

da. adi mūla prakṛti; mahadāri prakṛti vikāraṃbulēḍunu dāni mēni malakalu; appāpa cēḍiyu yu siṣumnā nāḍi tōḍaṃ benaṃgoni yuṃḍu.

ka. giṭa giṭa nenimidi malakalu

kuṭilībhāvamu bhajiṃci kuṃḍali prākun

niṭalāṃtamu dākanu griṃ

daṭi mogamai vrēlu naṃḍru tatjñul dānin “. (kāśīkhaṃḍamu - śrīnādhuḍu)

  1. “śivā parā nāḍī rūpā kuṃḍalinī śaktiḥ sarpasadṛśa gativaśāt kuṃḍalinī saṃjñāprāptiḥ mūlā dhārādi kamala ṣaṭkaṃ asyāmēva ādhāratvēna puṣpamālāṃ targita sūtravat parā suṣumnā nāḍī sthitivaśāt brahma raṃdhrādi mūlādhāra paryaṃtaṃ haṃsa yōḥ yātā yāta gativaśāt ētannāḍīmārgēṇa svādhiṣṭhānāgnēḥ sahasrārāṃtargata biṃdumaṃḍalasya vēdha saṃbhavāt brahmaviṣṇu rudragraṃdhīnāṃ bhēdanaṃ bhōktaṃ svādhiṣṭhānāgni vēdhayā ghanībhūta sudhāmaṃḍalāsrava damṛtadhārā pravāhaiḥ dvi saptati sahasra nāḍī saṃcayaṃ snapati. tadamṛta sēvanēna sarvēnāḍyaḥ tṛptāḥ, tadā dēhināṃ svasthāvasthā. agnēruṣṇā dhikyaṃ sravadamṛ tadhārābhiḥ śāmyati. amṛtadhārā śaityādikaṃ tu svādhiṣṭhānāgni jvālābhiḥ śāmyati. tayōḥ yadā nyūnādhikaṃ bhavati tadā prāṇināṃ vyādhirūpēṇa asvasthatā siddhiḥ. auṣadhasēvā dyupa cāraiḥ lupta bhāgasya sahāyatā ca adhika bhāgasya śāṃtiḥ bhavati. tēna punaḥ svasthāvasthā prāptiḥ - pralayē agniḥ śamayati ativṛṣṭirbhavati. tadā pralayaḥ - ēva ādi śaktēḥ sahaja niyamakaṃ iti samaya mata siddhāṃtaḥ ||’

(parādēvi śivuni parāśaktiyaina dēviyē kuṃḍalinī śakti. sarpamuvaṃṭi naḍaka (gati) - vaṃkara naḍaka - kaligiyuṃḍuṭacēta kuṃḍalinī yani pēru poṃdinadi. mūlādhārakamalamu (cakramu) modalagu āru kamalamulu ī suṣumnā nāḍi mīdanē ādhārapaḍiyuṃḍuṭacēta puṣpamālalōni - puvvulalō nuṃḍudāramu vale paratatvamai suṣumnā nāḍilōnuṃḍuṭavalananu, brahmaraṃdhramu modalu, mūlā dhāraparyaṃtamu, mūlādhāramu modalu brahmaraṃdhramuvaṟaku ī prakāramu krinadakī mīdakī prāṇa vāyuvu saṃcāramuvalana ī suṣumnā nāḍīmārgamudvārā svādhiṣṭhgānakamalamulōnunna agni (uṣṇamu) valana śirassulōnunna sahasrārakamalamulōnunna biṃduvunaku vēdha kaluguṭavalana madhyanunna brahmagraṃdhi, viṣṇugraṃdhi, rudragraṃdhi anu mūḍiṃṭinī, sūryamaṃḍalarūpamagu anāhata kamalamunu bhēdiṃcunu - (vāṭi dvārā dārini teracivayunu). akkaḍa muḍivalenuṃḍu nāḍī samūhamunu śaktivaṃtamugā cēyunu. sahasrārapadmamulōni ghanībhūtamaina suthāmaṃḍalamu svādhiṣṭhāna kamalamuvalana kalugu vēdhavalana karigi amṛtadhāravale sraviṃci vēlaku paigā nunnanāḍulanu snānamu cēsinaṭlu cēyunu - calladanamunu vāṭilō kalugacēyunu - appuḍu dēhiki svasthāvastha kalugunu - svasthata kalugunu - (normal condition). śarīramulōni śītōṣṇasthiti śarīramuna kanukūlamugā cēyunu. agnivalana kalugu uṣṇamu - uṣṇādhikyamu - caṃdramaṃḍalamu nuṃḍi sraviṃcucunna amṛtadhāravalana śamiṃcunu (taggunu). amṛtadhārayokka śaityādhikyamu - ekkuva calladanamu svādhiṣṭhānamulōnuṃḍi kalugu vēḍimi (agni) valana śamiṃcunu - ī svādhi ṣṭāna uṣṇamu caṃdramaṃḍalamunuṃḍi vaccu calladanamu eppuḍu heccu takkuvalu agunō appuḍu prāṇulaku vyādhirūpamugā aśvasthata kalugunu - auṣadhamulu puccukonuṭavalananu uṣṇa śaityamula heccu taggulu sarigā sardukonuṭacētanu svasthāvastha siddhiṃcunu - ī prakāramugānē pralayakālamaṃdavi taggipōyi ativṛṣṭi kalugunu -)

  1. “kuṃḍalyēna bhavēcchaktiḥ tāṃtu saṃcārayēt budhaḥ| svasthānādā bruvōrmadhyaṃ śakti cālana mucyatē| tatsādhanē dvayaṃ mukhyaṃ sarasvatyāstu cālanaṃ| prāṇarōdana madhābhyāsāt ṛjvī kuṃḍalinī bhavēt||” (yōgakuṃḍalyupaniṣat)

(kuṃḍali valana śakti kalugunu - jñāniyaguvāḍu dānini saṃcāriṃcu dāninigā cēyavalenu. dāni sthānamaina svādhiṣṭhāmunuṃḍi ājñācakramuvaraku (kanubomalamadhya varaku) ā śakti prasariṃcunaṭlu cēyavalenu - ī sādhanalō reṃḍu mukhyamainavi - sarasvatināḍini caliṃpacēyavalenu. prāṇāyāmamu cēyavalenu - dīnivalana kuṃḍalini pāmuvale melikalu māni tinnagā saṃcariṃcunu - kriṃdaku, mīdaku saṃcariṃcunu).

  1. ī kuṃḍalinīśaktini kriṃdanuṃḍimīdaku, mīdanuṃḍikriṃdaku prasariṃpacēyu kramamu ī kriṃda ceppabaḍinadi : -

“pradhamataḥ pūrakayōgēna bāhyavāyumākṛṣya kuṃbhakaṃ kṛtvā svamanō vāyusahitaṃ mūlādhārē yōjayēt, nayēt ityardhaḥ. anaṃtaraṃ gudasya mēḍhrasya liṃgasyāṃtarē madhyē - mūlādhāra cakrē ityarthaḥ - vidyamānāyāsthitāyā śaktiḥ kuṃḍalinī tāṃ ākuṃcya mūlādhāragatavāyunā pīḍayitvā prabhōdhayēt - utthāpayēt ityarthaḥ. tāṃ utthāpya liṃgabhēdakramēṇa mūlādhāra cakragata tattējōmaya svayaṃbhuvādi liṃgānāṃ bhēdanaṃ, - tanmārgēṇa nayanaṃ, tatkramē ṇaivatāṃ kuṃḍalinīṃ śaktiṃ biṃdu cakraṃ sahasrāraṃ prāpayēt. sahasrārapadmasthitēna śaṃbhunātāṃ kuṃḍalinīṃ ēkībhūtāṃ saṃgatāṃ vibhāvayēt. tatraśivaśaktyōḥ saṃgamē yadutthitaṃ amṛtaṃ dhṛtalākṣā samāna varṇaṃ tāṃ kuṃḍalinīṃ pāya yitvā, tēva ānaṃda rasarūpēṇa tāṃ tṛptāṃ kṛtvā ityarthaḥ - ṣaṭcakra sthitā dēvatāliṃgarūpāḥ amṛtadhārayā śivaśakti samāgamōtthānānaṃda rasarūpāmṛtavṛṣṭyā saṃtarpya, punaryēnaiva mārgēṇa mastakaṃ nītā kuṃḍalinī tēnaiva mārgēṇa mūlādhārāṃtara kuṃḍalinīṃ ānayēt.”

(prāṇāyāma niyamamu prakāramu modaṭa painunna vāyuvunu (gālini) pūrakamu cēsi (mukku lōniki pīlcukoni) dānini lōna kuṃbhakamucēsi (kuṃbhiṃci - paiki vadalaka aṇacipeṭṭiyuṃci) tana manōvāyuvucēta mūlādhāracakramunaku dānini (gālini) tīsukoni veḷḷavalenu - veḷḷunaṭlu cēya valayunu. manasulō ā vāyuvu mūlādhāramunaku digavalenu anu dhṛḍhamaina saṃkalpamutō prayatna mu cēsina ā vāyuvu akkaḍaku veḷḷunu - taruvāta gudamunaku liṃgamunaku madhyanunna mūlā dhāra cakramaṃdunna kuṃḍalinī yanu śaktini mūlādhāramuna nunna vāyuvucēta pīḍiṃci, adi mīdaku lēcinaṭlu cēyavalenu - mūlādhāracakramaṃduṃḍu tējōmayamaina svayaṃbhuvādiliṃgamunu bhēdiṃcucu ā mārgamudvārā kramamugā ā kuṃḍalinī śaktini sahasrāra cakramaṃdali biṃduvutō poṃdiṃcavalenu sahasrāra padmamulōnunna śivunitō kuṃḍalinī śakti kalisipōyi ēkamainaṭlu bhāviṃcavalenu - aphphuḍu akkaḍa śivuḍu, śakti yī yiddarisaṃgamamu (kūḍuṭa) valana puṭṭina amṛtarasamucēta ā kuṃḍalinī śaktini tṛptiparaci ā mūlādhāracakramulōnuṃḍi sahasrāramunaku vaccina uṣṇamunu callārci - śāṃtiṃpacēsi, kriṃdanunna āru cakramulanadhiṣṭiṃciyuṃḍu dēvatā rūpamulanu śiva śaktula samā gamamucē puṭṭina ānaṃdarasarūpamaina amṛtavarṣamucēta tarpaṇamucēsi (snānamu cēyiṃci) (taḍipi) (śāṃtiṃpacēsi), yē mārgamumīdugā ī kuṃḍalinī śaktini śirassunaku - sahasrāracakramunaku - tīsukuvaccenō ā mārgamudvārānē tirigi kuṃḍalini mūlādhāracakramunu poṃdunaṭlu cēyavalenu).

  1. prākṛta pralayē grasta samastavyasta prapaṃcaṃ māyā svapratiṣṭhē niṣkalē līnā yāvatkarma paripākaṃ vartatē. prāṇikarmabhiśca tasyāṃ māyāyāṃ vilīnairēva kramēṇa prāpta paripākaiḥ svaphaladānāya paramēśva rasya sisṛkṣātmikā māyā vṛttirjanyatē. saiṣā māyāvasthā īkṣaṇa, kāma, tapō, vici kārṣādi śabdairabhi dhayatē - “vici kurṣurghanī bhūtā kvaci dabhyēti biṃdutāṃ” - ‘sa akāya yata’ ityādi. aparipakva karma vibhāgāt ghanī bhāvaḥ. tadartha vyāpārō vicikīrṣā paripakva karmākāra pariṇata māyā viśiṣṭaṃ biṃduḥ. tadidama vibhāgāvasthamavyakta mucyatē.”tasmā davyakta mutpannaṃ triguṇaṃ” sa ēṣa jagadaṃ kurā kāraḥ adhyātmamaṃcā dhārā dānābhi vyaṃjya mānaḥ kuṃḍalyādi śabdai rucyatē. - śaktiḥ kuṃḍali nīti viśvajanana vyāpārabaddhō dyamāṃ jñātvā “-” kuṃḍalinī sarvathājñēyā suṣumnānuga taivasā” -

(prākṛta pralaya samayamaṃdu samastamaina prapaṃcamu māya yanu prakṛtilō layamaipōyi, ā māya dāniki ādhāramaina niṣkaluḍaina parabrahmayaṃdu līnamai, jīvulu cēsina karma paripakvamai karmaphalamanu bhaviṃcuṭaku tirigi janmiṃcuṭaku unmukhamagunaṃtavaraku uṃḍunu. aṭṭi māyayaṃdu (prakṛtiyaṃdu) ē prakāramugā layamaipōyinavō ā prakāramugānē karmaparipākamunu ceṃdina jīvulaku vāri vāriki tagina phalamu niccuṭaku paramēśvarunaku sṛṣṭi cēyavalenanu ‘icca’ ani ceppabaḍu māyāvṛtti - māya yokka vṛtti, guṇamu, prakṛtilō kalugu pariṇāmamu - kalugunu - (anagā sṛṣṭi prāraṃbha magunanuṭa). māya (prakṛti) yokka aṭṭi avasthā viśēṣamē graṃdhamulalō, paramēśvaruni yokka “īkṣaṇamani” - ‘saikṣata’ ani, kāmamu (kōrika) - “sa akāmayata” ani ‘tapassu’ (‘atapyata’) ani, ‘vicikīrṣā’ yani modalagumāṭalacēta ceppabaḍinadi. āmāṭala arthamu idiyē. appaṭi prakṛti sthitilō sṛṣṭi prāraṃbhamu aguṭaku paripakvamugāni sthitilō prakṛti ghanībhūtamu (#coṃceṃtrated#) ani ceppabaḍinadi. adiyē ‘biṃduvu’ yagunu. phalamuniccuṭaku paripakvamaina karmākāramugā mārina māya ‘biṃduvu’. idi samaṣṭi avastha, dīninē avyaktamaṃduru - vyaktamugāni vēru vēru rūpamulatō vyaktamugāka, annī kalisi okē rūpamulōnunna prakṛti. idiyē jagattunaku aṃkuramu. dīninuṃḍiyē jagattu aṃtayu ciluvalu paluvalugā vyāpiṃci peddadainadi, adhyātmamu, ādhāramu - jagattunaku ādhāramainadi, kuṃḍaliyani kūḍa ceppabaḍucunnadi - “śaktiḥ kuṃḍalinīti viśva jananavyāpāra baddhōdyamāṃ jñātvā” -“kuṃḍalī sarvadhā jñēyā suṣumnānu gataivasā” - (prapaṃcamunu puṭṭiṃcu vyāpāramanu udyamamugaladigā (prakṛtini) telusukonavalenu - adiyē kuṃḍali, suṣumnanu anusariṃciyuṃḍunu).

(kuṃḍalamu anagā guṃḍramuga cuṭṭukoniyunnapāmu - kuṃḍalamuvale cuṭṭukoni yunnaṭlu bhāviṃpa baḍina śakti svarūpamu - mērudaṃḍi anu pērugala vennemukalō gala suṣumnānāḍini āśrayiṃci yunna parāśakti - (bhagavacchakti). paina ceppabaḍina prakṛti - prapaṃcamunaku aṃkuramu ani ceppabaḍina prakṛti lēka māyāśakti sṛṣṭi ayina tarvāta mānavula (jīvula) vennemukalōnunna suṣumnānāḍini eṭlu āśrayiṃciyuṃḍuṭa taṭasthiṃcinadō ī kriṃda ceppabaḍinadi : - paina ceppabaḍina stitilōnunna prakṛti dānilōnunnavi okadāninokaṭi ākarṣiṃci, ghanībhūtamai okē vastuvugānuṃḍi, brahmāṃḍamu - (aṃḍā kāramuganunna brahma) rūpamu dālci, dānilō kaligina uṣṇamuvalana ā aṃḍamu braddalai cellā cedurai virajimmukupōyinapuḍu aṃdulōnunna śakti virajimmukupōyina prativastuvulōnu lōpala painā pravēśiṃci vyāpiṃcunu - aṭlu vyāpiṃcina śakti jīvulalō mālādhāramu nāśrayiṃci kuṃḍalinī ani pēru kaligiyunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.