← Back to క · Booklets 11–20 (digitized file 2)

కూటస్థః kūṭasthaḥ

Original — తెలుగు
  1. కూటవత్ స్థితః ఇతి వ్యుత్పత్తేః నిర్వికారః కూటవత్ నిర్వికారతయా వర్తమానః.

(కూటము అనగా బంగారు పనివాడు ఆభరణములు చేయుటకు వాడుకొను ఇనుప దిమ్మ. దానివలె వికారములు - మార్పులు లేనివాడు) (చూడుము - కూటము).

  1. “కూటం ఖం వ్యోమం సంధి రాకాశ ఉచ్యతే. -” కూటే ఆకాశే స్థితా కూటస్థా. కూటే తిష్టతి ఇతి కూట స్థః.

( కూటమనగా ఆకాశము - ఆకాశమందున్నది).

  1. కూటశబ్దః నిర్వికారత్వవాచీ, సర్వాధిష్టానత్వ వాచీవా - కూటవత్ తిష్టతి ఇతి కూటస్థః -

(కూటము అనుమాట మార్పులేకుండుటను సూచించును, అన్నింటికి అధిష్టానమై యుండునది).

  1. “కూటోనామ అయోఘన విశేషః - అయస్కారాది ప్రసిద్ధః తద్వన్నిర్వికారతయా తిష్టతి. ఇతి కూతస్థః ఉచ్యతే - తత్ర అసంగతయా ఆస్తే ఇతి కూటస్థః - ఇష్యతే - అతః కూటస్థే కర్తృత్వా దయః న సంభవంతి. కింతు చిదాభాసస్య భ్రాంత్యాతే ధర్మాః కూటస్థే ప్రతీయంతే”.

(కూటమనగా ఇనుప దిమ్మ. దానిమీద ఎన్నిసార్లు సుత్తితో కొట్టినను అది వికారమును - మార్పును చెందదు - అట్టి కూటమువలె మార్పులేకయుండునవి కూటస్థము - లేక, మిధ్యి అయిన బుద్ధి, చిదాభాసుడు - ఎ రెండు కూటస్థుడు - అందుచేత కూటస్థునకు కర్తృత్వము మొదలగునవి సంభవింపవు. కాని చిదా భాసుడను భ్రాంతివలన ఆ కర్తృత్వాది ధర్మములు కూటస్థుని యందు కనబడుచున్నవి).

  1. కూటే మాయాప్రపంచే స్థితం, ఆధిష్ఠానత్వేన స్థితం కూటస్థం.

(మాయాప్రపంచములో ఉన్నది, అదిష్ఠానముగా ఉన్నది).

  1. “బ్రహ్మ పిపీలికాంత సర్వప్రాణి బుద్ధిషు అవిశిష్టతయా ఉపలభ్యమానః, సర్వప్రాణి బుద్ధి సాక్ష్యాధిష్ఠా నాత్మా అస్తి, భాసతే, స కూటస్థః.”

(చతుర్ముఖ బ్రహ్మ మొదలు పిపీలికము (చీమ) వరకు గల సమస్త ప్రాణులయొక్క బుద్ధిసాక్ష్యధిష్ఠానమై యుండువాడు కూటస్థుడు.)

  1. “యత్ మిథ్యాభూతం సత్యతయా ప్రతీయతే తిత్కూటం ఇతి లోకైః ఉచ్యతే - యథాకూటకార్షాపణః, కూట సాక్షిత్వం ఇత్యాదౌ. అజ్ఞానమపి మాయాఖ్యం సహ కార్య ప్రపంచేన మిథ్యాభూతమపి లౌకికైః సత్యతయా ప్రతీయమానం కూటం. తస్మిన్ అధ్యాని కేన సంబంధేన అధిష్ఠానతయా తిష్ఠతి ఇతి కూటస్థం. అజ్ఞాన తత్కార్యాధిష్ఠానం ఇత్యర్థః. అత ఏవ సర్వ వికారాణాం అవిద్యాకల్పితత్వాత్ తదధిష్ఠానం, సాక్షి చైతన్యం, నిర్వికారం”.

(అసత్యమైనప్పటికీ సత్యమువలె ప్రకాశించునది కూటము అని లోకములో చెప్పబడుచున్నది - అబద్ధపు సాక్ష్యము మొదలగునవి, మాయయని చెప్పుబడు అజ్ఞానము కార్యమైన ప్రపంచము మిధ్య అయినప్పటికీ సత్య మైనట్లు కనబడుట కూటము - అట్టి కూటమందు అధ్యాసచేత అధిష్ఠానముగా నున్నది కూటస్థము - అజ్ఞానకారణమువలన కలిగిన అధిష్ఠానము - సమస్త వికారములు అవిద్యవలన కల్పితములగుటచేత వాటిని అధిష్ఠానమైన సాక్షి చైతన్యము నిర్వికారము - వికారమును చెందనిది, అందుచేత కూటస్థము).

  1. దృశ్యమాన గుణకం అంతర్దోషం వస్తు కూటం కూటరూపం - “కూటసాక్ష్యం” ఇత్యాదౌ కూటశబ్దో ప్రసిద్ధః లోకే తథా చ అవిద్యా ద్యనేక సంసార బీజం దోషవన్మయా అవ్యాకృతాది శబ్దవాచ్యతయా -

“మాయాంతు ప్రకృతిం విద్యాన్మాయినం తుమహేశ్వరం” “మమ మాయా దురత్యయా” ఇత్యాది ప్రసిద్ధం యత్ తత్కూటం. తస్మిన్ కూటేస్థితం కూటస్థం, అత ఏవ అచలం. యస్మాద చలం తస్మాత్ ధ్రువం నిత్యం.

(పైకి మంచివలె కనబడుచు లోపల దోష యుక్తమైనటువంటిది కూటము - కూటరూపము - కూట సాక్ష్యము అను మాట లోకమందు ప్రసిద్ధమై యున్నది. ఆ ప్రకారముగానే అవిద్య మొదలగు అనేక జన్మ లకు బీజము వలెనుండు - సంసారమునకు బీజమువలెనుండు - అవ్యాకృతమైన మాయ - “మాయ యనగా ప్రకృతి, మాయ కలవాడు మహేశ్వరుడు” అనిన్నీ, “దాట శక్యముకానిది నా మాయ” అని శ్రీమద్భగవద్గీత లో చ్చెప్పబడినటువంటి మాయయే కూటము. ఆ కూటరూపమైన మాయ యందు - ప్రకృతియందున్నవాడు కూటస్థుడు, దానికి అధ్యక్షుడుగా నున్నవాడు, లేక - కూటమనగా రాశి. రాశివలెనున్నవాడు కూటస్థుడు. అందుచేతనే ‘అచలం’ (చలించనివాడు),

‘ధ్రువం’ (స్థిరముగా నుండువాడు) అని చెప్పబడినవాడు కూటస్థుడు. అవ్యాకౄతమైన ప్రకృతిని ఆవేశించి పూర్తిగానిండియున్నవాడు - పరమాత్ముడు).

  1. “వస్తుతః అసత్ అపి సత్ ఇవ అవభాసమానం కూటం - యథా కూట కార్షాపణం, కూట, తులేతి - తద్వత్ కూటః - అహంకారః ప్రతీచ్య భేదేన భాసమానత్వేసతి కదా చిత్కత్వాత్ యో యద భేదేన కదాచిత్ భాతి సతత్ర మిధ్యా కల్పితో - యథా రజ్జూ రగః. తథా చ అయం హంకారః మిధ్యాత్వాత్ కూటసంజ్ఞః, తత్ర తిష్ఠతి, తద్భాసకత్వేన ఇతి కూటస్థం. చైతన్యం అహం అనుభవేహి అహంకారో దృశ్యతయాభాతి. తద్భాసకం చ చైతన్యం తతః అస్యత్. యథా ఘట భాసకో అర్కః ఘటాత్ అన్యః, తద్వత్. ఏతేన నిత్యా పరోక్షత్వం బ్రహ్మణః సాధితం”.

(అసద్వస్తువు సద్వస్తువు వలె ప్రకాశుంచుట - కనబడుట - కూటము అని చెప్పబడుచున్నది - తప్పు తునకాలు మొదలగునవి అహంకారము మిధ్యాకల్పితము కూడ కూటమే. అట్టి అహంకారమందుండు వాడు, దానిలోనుండి దానిచే పనిచేయించువాడు అహంకారములోనుండు చైతన్యము. అది అహంకారము కన్న వేరైనది; ఘటమును ప్రకాశింపచేయు సూర్యుడు ఘటముకన్న వేరైనట్లు అహంకారమును ప్రకా శింపచేయు చైతన్యమాత్రుడు అహంకారముకన్న వేరై దానిలోనుండువాడు కనుక కూటస్థుడు. దీనిని బట్టి పరబ్రహ్మ అపరోక్షముగానున్నట్లు - ఎక్కడ పడితే అక్కడ ఉండుట - స్పష్టము చేయబడినది).

  1. “ఉపాధికృత వికారా భావాత్ నిర్వికారః, అవిక్రియః - చిత్తస్యైక రూపత్వాత్”.

(ఉపాధిలో ఉండుటవలన కలుగు వికారములు లేకపోవుటవలన నిర్వికారుడు, అవిక్రియుడు).

  1. కూట శబ్దశ్చ పరిశుద్ధాత్మని ఔపచారికః. కూటస్య హ్యగంతక వినశ్వరాయః పిండాది సంశ్లేష విశ్లేష రూపావస్థా ప్రవాహే వర్తమానే అపి స్వస్వరూపేన శైధిల్యాది రూపో వికారః, తద్వ దత్రాపి దేవాది శరీర సంశ్లేష విశ్లేష రూపావస్థా ప్రవాహే అపి “న జాయతే మ్రియతే” ఇత్యాది నోక్త ప్రకరేణ నిర్వికారత్వం సిద్ధం. ఇతి కూటశబ్దేన ఉపచారో యుజ్యతే. ఇత్యభిప్రాయః” ( వేదాంత దేశికః)

( కూటము అను పదము పరిశుద్ధమైన ఆత్మయందు ఔపచారికము. కూటము అను ఇనుప దిమ్మ దాని మీదకు వచ్చి, సుత్తి దెబ్బలుతిని, రూపుమారి వెళ్ళిపోవుచుండెడి ఇనుపముక్కల వేరు వేరు రూపము లతో సంబంధములేక, తాను తన స్వస్వరూపమును ఏమాత్రమును విడువక వాటి ప్రభావము తనమీద ఏ మాత్రముంచుకొనకనిశ్చలముగా నెట్లుండునో అట్లే దేవతులు మొదలగు శరీరములు ఎన్ని ఎత్తినను - ఎన్ని రూపములుగల ఉపాదులలో ఉండినను ’నజాయతే, మ్రియతేవా” (పుట్టుటలేదు, మరణించుటలేదు) అని శ్రీమద్భగవద్గీతలో చెప్పీనట్లు పరమాత్మ - ఆత్మ - ఏ వికారములేక స్వస్వ రూపములో చెదురు మదురు లేక యుండును - అందుచేత ఆత్మ కూటస్థుడు).

  1. యథా చంద్రస్య స్వతః నిర్వికారతయా సదైక రూపత్వేపి తిధి పక్షాభ్యాం చంద్రస్య కలానామేవ వృద్ధి క్షయాధికం భవతి, యథావా సదా వృక్షస్యైక రూపత్వేపి తత్ఫలాదీనామేవ జన్మాది వికారో జాయతే, తథా స్వయం నిర్వి కారే అపి కూటస్థ చిన్మాత్రే ప్రత్యగాత్మని దేహా. దీనామేవ జన్మాది షడ్వికారరూప పరిణామో జాయతే. యది కూటస్థ ఏవ పరిణమేత్ తర్హి సజడః స్యాత్. తస్మాత్ కోటస్థస్య వికారో న కదంచన ఉప పద్యతే.

(చంద్రుడు స్వతః వికారములు లేని వాడగుటచేత ఎల్లపుడు ఒకే రూపముతో నుండు. అయినప్పటికీ తిధులవలన పక్షములు వలన చంద్రుని కళలో వృద్ధి క్షయములు కలుగుచున్నవి. కాని ఆమార్పులు చంద్రునిలో కలుగుచుండుటలేదు. చెట్టు అంతా ఒకే రూపమైనప్పటికీ దాని ఫలములు మొదలైనవాటికి పుట్టుట మొదలగు ఆరు వికారములు - మార్పులు - కలుగుచున్నవో ఆ ప్రకారముగానే ప్రత్యగాత్మ అయిన

కూటస్థ చిన్మాత్రుడు స్వతః వికారములు లేనివాడైనను దేహాదులకు జననము మొదలగు ఆరు విధము లైన వికారములు కలుగుచున్నవి. కూటస్థుడగు ప్రత్యగాత్మయే మార్పులు చెందునెడల అతను జడమై యుండును. అందుచేత కూటస్థునకు ఎప్పుడును వికారమనునది కలుగనేరదు).

  1. ప్రత్యగాత్మయనియు, క్షేత్రజ్ఞుడనియు, అంతర్యామి అనియు, కూటస్థచైతన్యమనియు, సాక్షి అనియు, ద్రష్ట అనియు, తురీయుడనియు చెప్పబడునదే కూటస్థుడు.
Transliteration
  1. kūṭavat sthitaḥ iti vyutpattēḥ nirvikāraḥ kūṭavat nirvikāratayā vartamānaḥ.

(kūṭamu anagā baṃgāru panivāḍu ābharaṇamulu cēyuṭaku vāḍukonu inupa dimma. dānivale vikāramulu - mārpulu lēnivāḍu) (cūḍumu - kūṭamu).

  1. “kūṭaṃ khaṃ vyōmaṃ saṃdhi rākāśa ucyatē. -” kūṭē ākāśē sthitā kūṭasthā. kūṭē tiṣṭati iti kūṭa sthaḥ.

( kūṭamanagā ākāśamu - ākāśamaṃdunnadi).

  1. kūṭaśabdaḥ nirvikāratvavācī, sarvādhiṣṭānatva vācīvā - kūṭavat tiṣṭati iti kūṭasthaḥ -

(kūṭamu anumāṭa mārpulēkuṃḍuṭanu sūciṃcunu, anniṃṭiki adhiṣṭānamai yuṃḍunadi).

  1. “kūṭōnāma ayōghana viśēṣaḥ - ayaskārādi prasiddhaḥ tadvannirvikāratayā tiṣṭati. iti kūtasthaḥ ucyatē - tatra asaṃgatayā āstē iti kūṭasthaḥ - iṣyatē - ataḥ kūṭasthē kartṛtvā dayaḥ na saṃbhavaṃti. kiṃtu cidābhāsasya bhrāṃtyātē dharmāḥ kūṭasthē pratīyaṃtē”.

(kūṭamanagā inupa dimma. dānimīda ennisārlu suttitō koṭṭinanu adi vikāramunu - mārpunu ceṃdadu - aṭṭi kūṭamuvale mārpulēkayuṃḍunavi kūṭasthamu - lēka, midhyi ayina buddhi, cidābhāsuḍu - e reṃḍu kūṭasthuḍu - aṃducēta kūṭasthunaku kartṛtvamu modalagunavi saṃbhaviṃpavu. kāni cidā bhāsuḍanu bhrāṃtivalana ā kartṛtvādi dharmamulu kūṭasthuni yaṃdu kanabaḍucunnavi).

  1. kūṭē māyāprapaṃcē sthitaṃ, ādhiṣṭhānatvēna sthitaṃ kūṭasthaṃ.

(māyāprapaṃcamulō unnadi, adiṣṭhānamugā unnadi).

  1. “brahma pipīlikāṃta sarvaprāṇi buddhiṣu aviśiṣṭatayā upalabhyamānaḥ, sarvaprāṇi buddhi sākṣyādhiṣṭhā nātmā asti, bhāsatē, sa kūṭasthaḥ.”

(caturmukha brahma modalu pipīlikamu (cīma) varaku gala samasta prāṇulayokka buddhisākṣyadhiṣṭhānamai yuṃḍuvāḍu kūṭasthuḍu.)

  1. “yat mithyābhūtaṃ satyatayā pratīyatē titkūṭaṃ iti lōkaiḥ ucyatē - yathākūṭakārṣāpaṇaḥ, kūṭa sākṣitvaṃ ityādau. ajñānamapi māyākhyaṃ saha kārya prapaṃcēna mithyābhūtamapi laukikaiḥ satyatayā pratīyamānaṃ kūṭaṃ. tasmin adhyāni kēna saṃbaṃdhēna adhiṣṭhānatayā tiṣṭhati iti kūṭasthaṃ. ajñāna tatkāryādhiṣṭhānaṃ ityarthaḥ. ata ēva sarva vikārāṇāṃ avidyākalpitatvāt tadadhiṣṭhānaṃ, sākṣi caitanyaṃ, nirvikāraṃ”.

(asatyamainappaṭikī satyamuvale prakāśiṃcunadi kūṭamu ani lōkamulō ceppabaḍucunnadi - abaddhapu sākṣyamu modalagunavi, māyayani ceppubaḍu ajñānamu kāryamaina prapaṃcamu midhya ayinappaṭikī satya mainaṭlu kanabaḍuṭa kūṭamu - aṭṭi kūṭamaṃdu adhyāsacēta adhiṣṭhānamugā nunnadi kūṭasthamu - ajñānakāraṇamuvalana kaligina adhiṣṭhānamu - samasta vikāramulu avidyavalana kalpitamulaguṭacēta vāṭini adhiṣṭhānamaina sākṣi caitanyamu nirvikāramu - vikāramunu ceṃdanidi, aṃducēta kūṭasthamu).

  1. dṛśyamāna guṇakaṃ aṃtardōṣaṃ vastu kūṭaṃ kūṭarūpaṃ - “kūṭasākṣyaṃ” ityādau kūṭaśabdō prasiddhaḥ lōkē tathā ca avidyā dyanēka saṃsāra bījaṃ dōṣavanmayā avyākṛtādi śabdavācyatayā -

“māyāṃtu prakṛtiṃ vidyānmāyinaṃ tumahēśvaraṃ” “mama māyā duratyayā” ityādi prasiddhaṃ yat tatkūṭaṃ. tasmin kūṭēsthitaṃ kūṭasthaṃ, ata ēva acalaṃ. yasmāda calaṃ tasmāt dhruvaṃ nityaṃ.

(paiki maṃcivale kanabaḍucu lōpala dōṣa yuktamainaṭuvaṃṭidi kūṭamu - kūṭarūpamu - kūṭa sākṣyamu anu māṭa lōkamaṃdu prasiddhamai yunnadi. ā prakāramugānē avidya modalagu anēka janma laku bījamu valenuṃḍu - saṃsāramunaku bījamuvalenuṃḍu - avyākṛtamaina māya - “māya yanagā prakṛti, māya kalavāḍu mahēśvaruḍu” aninnī, “dāṭa śakyamukānidi nā māya” ani śrīmadbhagavadgīta lō cceppabaḍinaṭuvaṃṭi māyayē kūṭamu. ā kūṭarūpamaina māya yaṃdu - prakṛtiyaṃdunnavāḍu kūṭasthuḍu, dāniki adhyakṣuḍugā nunnavāḍu, lēka - kūṭamanagā rāśi. rāśivalenunnavāḍu kūṭasthuḍu. aṃducētanē ‘acalaṃ’ (caliṃcanivāḍu),

‘dhruvaṃ’ (sthiramugā nuṃḍuvāḍu) ani ceppabaḍinavāḍu kūṭasthuḍu. avyākṝtamaina prakṛtini āvēśiṃci pūrtigāniṃḍiyunnavāḍu - paramātmuḍu).

  1. “vastutaḥ asat api sat iva avabhāsamānaṃ kūṭaṃ - yathā kūṭa kārṣāpaṇaṃ, kūṭa, tulēti - tadvat kūṭaḥ - ahaṃkāraḥ pratīcya bhēdēna bhāsamānatvēsati kadā citkatvāt yō yada bhēdēna kadācit bhāti satatra midhyā kalpitō - yathā rajjū ragaḥ. tathā ca ayaṃ haṃkāraḥ midhyātvāt kūṭasaṃjñaḥ, tatra tiṣṭhati, tadbhāsakatvēna iti kūṭasthaṃ. caitanyaṃ ahaṃ anubhavēhi ahaṃkārō dṛśyatayābhāti. tadbhāsakaṃ ca caitanyaṃ tataḥ asyat. yathā ghaṭa bhāsakō arkaḥ ghaṭāt anyaḥ, tadvat. ētēna nityā parōkṣatvaṃ brahmaṇaḥ sādhitaṃ”.

(asadvastuvu sadvastuvu vale prakāśuṃcuṭa - kanabaḍuṭa - kūṭamu ani ceppabaḍucunnadi - tappu tunakālu modalagunavi ahaṃkāramu midhyākalpitamu kūḍa kūṭamē. aṭṭi ahaṃkāramaṃduṃḍu vāḍu, dānilōnuṃḍi dānicē panicēyiṃcuvāḍu ahaṃkāramulōnuṃḍu caitanyamu. adi ahaṃkāramu kanna vērainadi; ghaṭamunu prakāśiṃpacēyu sūryuḍu ghaṭamukanna vērainaṭlu ahaṃkāramunu prakā śiṃpacēyu caitanyamātruḍu ahaṃkāramukanna vērai dānilōnuṃḍuvāḍu kanuka kūṭasthuḍu. dīnini baṭṭi parabrahma aparōkṣamugānunnaṭlu - ekkaḍa paḍitē akkaḍa uṃḍuṭa - spaṣṭamu cēyabaḍinadi).

  1. “upādhikṛta vikārā bhāvāt nirvikāraḥ, avikriyaḥ - cittasyaika rūpatvāt”.

(upādhilō uṃḍuṭavalana kalugu vikāramulu lēkapōvuṭavalana nirvikāruḍu, avikriyuḍu).

  1. kūṭa śabdaśca pariśuddhātmani aupacārikaḥ. kūṭasya hyagaṃtaka vinaśvarāyaḥ piṃḍādi saṃślēṣa viślēṣa rūpāvasthā pravāhē vartamānē api svasvarūpēna śaidhilyādi rūpō vikāraḥ, tadva datrāpi dēvādi śarīra saṃślēṣa viślēṣa rūpāvasthā pravāhē api “na jāyatē mriyatē” ityādi nōkta prakarēṇa nirvikāratvaṃ siddhaṃ. iti kūṭaśabdēna upacārō yujyatē. ityabhiprāyaḥ” ( vēdāṃta dēśikaḥ)

( kūṭamu anu padamu pariśuddhamaina ātmayaṃdu aupacārikamu. kūṭamu anu inupa dimma dāni mīdaku vacci, sutti debbalutini, rūpumāri veḷḷipōvucuṃḍeḍi inupamukkala vēru vēru rūpamu latō saṃbaṃdhamulēka, tānu tana svasvarūpamunu ēmātramunu viḍuvaka vāṭi prabhāvamu tanamīda ē mātramuṃcukonakaniścalamugā neṭluṃḍunō aṭlē dēvatulu modalagu śarīramulu enni ettinanu - enni rūpamulugala upādulalō uṃḍinanu ’najāyatē, mriyatēvā” (puṭṭuṭalēdu, maraṇiṃcuṭalēdu) ani śrīmadbhagavadgītalō ceppīnaṭlu paramātma - ātma - ē vikāramulēka svasva rūpamulō ceduru maduru lēka yuṃḍunu - aṃducēta ātma kūṭasthuḍu).

  1. yathā caṃdrasya svataḥ nirvikāratayā sadaika rūpatvēpi tidhi pakṣābhyāṃ caṃdrasya kalānāmēva vṛddhi kṣayādhikaṃ bhavati, yathāvā sadā vṛkṣasyaika rūpatvēpi tatphalādīnāmēva janmādi vikārō jāyatē, tathā svayaṃ nirvi kārē api kūṭastha cinmātrē pratyagātmani dēhā. dīnāmēva janmādi ṣaḍvikārarūpa pariṇāmō jāyatē. yadi kūṭastha ēva pariṇamēt tarhi sajaḍaḥ syāt. tasmāt kōṭasthasya vikārō na kadaṃcana upa padyatē.

(caṃdruḍu svataḥ vikāramulu lēni vāḍaguṭacēta ellapuḍu okē rūpamutō nuṃḍu. ayinappaṭikī tidhulavalana pakṣamulu valana caṃdruni kaḷalō vṛddhi kṣayamulu kalugucunnavi. kāni āmārpulu caṃdrunilō kalugucuṃḍuṭalēdu. ceṭṭu aṃtā okē rūpamainappaṭikī dāni phalamulu modalainavāṭiki puṭṭuṭa modalagu āru vikāramulu - mārpulu - kalugucunnavō ā prakāramugānē pratyagātma ayina

kūṭastha cinmātruḍu svataḥ vikāramulu lēnivāḍainanu dēhādulaku jananamu modalagu āru vidhamu laina vikāramulu kalugucunnavi. kūṭasthuḍagu pratyagātmayē mārpulu ceṃduneḍala atanu jaḍamai yuṃḍunu. aṃducēta kūṭasthunaku eppuḍunu vikāramanunadi kaluganēradu).

  1. pratyagātmayaniyu, kṣētrajñuḍaniyu, aṃtaryāmi aniyu, kūṭasthacaitanyamaniyu, sākṣi aniyu, draṣṭa aniyu, turīyuḍaniyu ceppabaḍunadē kūṭasthuḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.