← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉభయ భ్రష్టః ubhaya bhraṣṭaḥ

Original — తెలుగు
  1. ఇతో భ్రష్టః తతో భ్రష్టః

(ఏదియు లభింపక చెడినవాడు - రెండింటికీ చెడిన రేవడి).

  1. కర్మ యోగాత్ యోగమార్గాత్ చ విభ్రష్టః (శ్రీశంకరః)

(కర్మయోగమునుండి, యోగాభ్యాసమునుండి చెడినవాడు).

  1. ప్రాకృత స్వర్గానుభోగానుభవం, బ్రహ్మానుభవం, తదుభయ పథాత్ భ్రష్టః -

(స్వర్గభోగములననుభవించుటకు, బ్రహ్మానందమును పొందుటకు - ఈ రెండిటికి - చెడినవాడు).

  1. “యథావస్థితం స్వర్గాది సాధనభూతం కర్మ ఫలాభి సంధిరహితస్య అస్య పురుషస్య స్వఫలసాధనత్వేన ప్రతిష్ఠాన భవతి ఇత్య ప్రతిష్ఠః వ్రక్రాంతే బ్రహ్మణః పథి విమూఢః. తసాత్ పథప్రచ్యుతః, అతః ఉభయ విభ్రష్టః -” (శ్రీరామానుజః)

(స్వర్గము మొదలగు పరలోకసుఖములు కలుగచేయు కర్మలను ఫలము కోరక చేయువాడు తాను చేయు కర్మ పరిపక్వము గాక యుండినవాడు - అనగా ఆ కర్మయోగములో ప్రతిష్ట పొందనివాడు అప్రతిష్టుడు. బ్రహ్మజ్ఞానము పొందుటలో - జ్ఞానయోగములో - మూఢుడై దానినుండి దిగజారిపోయినవాడు - ఇట్లు ఈ రెండింటికి చెడినవాడు ఉభయ భ్రష్టుడు).

  1. హఠాత్ కర్మేంద్రియాణి సం యమ్య అకర్మకృత్ భవిష్యతి ఇత్యా శంక్య యః తు అనాత్మజ్ఞః. అశుద్ధాంతః కరణః హఠాత్ కర్మేంద్రియాణి సం యమ్య విహితం కర్మ న కరోతి, ఔత్సుక్యాత్ సం న్యన్యతి, సః ఉభయతోభ్రష్టః -

(హఠయోగమున - ఒక్కమారుగ - కర్మేంద్రియములను జయించిన యడల ఏ కర్మలను చేయనివాడగునను ఆశతో ఆత్మజ్ఞానములేనివాడు - మనశ్శుద్ధిలేనివాడు హఠాత్తుగా కర్మేంద్రియములను అరికట్టి శాస్త్రములో చేయవలసినదని చెప్పిన కర్మ ఎవడు చేయడో, ఉత్సాహముతో సన్యసించునో అట్టివాడు ఉభయభ్రష్టుడు - అటు యోగాభ్యాసమునుండి, ఇటు కర్మసన్యాసయోగమునుండి భ్రష్టుడగును).

  1. శ్రీమద్భగవద్గీతలో ఉభయభ్రష్టునిగుఱించి ఈ క్రిందవిధముగా చెప్పబడినది: -

“అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః |

అప్రావ్య యోగ సంసిద్ధిం కాం గతిం, కృష్ణ ! గచ్ఛతి ||“. (శ్రీమద్భగవద్గీత - 6 - 37)

“శ్రీ భగవాన్ ఉవాచ” -

“పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే |

న హి కల్యాణకృత్కశ్చి ద్దుర్గతిం తాత గచ్ఛతి |

ప్రాప్య పుణ్య కృతాం లోకానుషిత్వా శశ్వతీః సమాః |

శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో (అ)భిజాయతే |

అధవా యోగినా మేవ కులే భవతి ధీమతాం |

ఏ తద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం |

తత్ర తం బుద్ధి సం యోగం లభతే పౌర్య దేహికం |

యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన |

పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశో(అ)పి సః |

జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మా భివర్తతే |

ప్రయత్నాద్యతమానస్తు యోగీ సం శుద్ధ కిల్బిషః |

అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం” ||. (శ్రీమద్భగవద్గీత - 6 - 40 to 45)

(ఉభయ భ్రష్టుడైనవానికి ఏ గతి పట్టును అని అర్జునుడు శ్రీకృష్ణభగవానుని అడిగెను - దానికి ఈ క్రిందవిధముగా శ్రీకృష్ణభగవానుడు ప్రత్యుత్తరమిచ్చెను: -

(ఉభయ భ్రష్టుడైనవాడు ఈ లోకములోకాని, పరలోకములోకాని నాశము చెందడు. గురువు భోధించు వేదాంత వాక్యములందు నమ్మకము కలిగి నిరక్తుడై యోగాభ్యాసము చేయుట మొదలు పెట్టినవాడు యోగాభ్యాసము పూర్తికాకమునుపే దురదృష్టవశమున ప్రయత్నము కొనసాగకమునుపే ప్రయత్నము భగ్నమైనయడల, లేక ఆ యోగాభ్యాస ప్రయత్నము భగ్నమైనయడల సిద్ధిని పొందకుండా - యోగసిద్ధిని పొందకుండగనే - మృతి చెందినవాడు - నాశము చెందడు. శాస్త్రోక్తముగా ప్రవర్తించినందున ఈ లోకములో నిష్టులవలన నింద పొందడు. మిగిలిన అజ్ఞానులవలె పరలోకమందు అనిష్టమైనగతి ఉండదు. యోగమార్గమందు మధ్యలో దురదృష్టవశాత్తు చనిపోయిన యడల వాడు అశ్వమేధ యాగములు చేసినవారు పోయిన లోకములకు పోయి, కొన్ని కోట్ల సంవత్సరములు అక్కడ నివసించి, ఆ ఫలము క్షీణించగా సత్పురుషులు, ధనవంతులు అయినవారి ఇంట్లో పుట్టును. పూర్వజన్మలో చేసిన కర్మయోగముల, ధ్యానయోగముల వాసనవలన - అల్ప వైరాగ్యమువలన జనకుడు మొదలగువారివలె రాజగృహమందు జన్మించును. వైరాగ్యగుణము అధికముగానున్న యడల యీ యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పోయిన త్రోవకు పోక బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి బ్రాహ్మణుల కులములోగాని యోగులకులములోగాని పుట్టును. రాజగృహమందు పుట్టుట అధిక పుణ్యము చేయుటవలన కలుగును కనుక అది లభించుట కష్టము. దానికన్న యోగుల గృహమందు పుట్టుట కష్టతరము - అట్టివారి కులములో పుట్టి పూర్వజన్మలో కలిగిన సంస్కారమువలన యోగసిద్ధిని పొందుటకు యిదివరకు జన్మలోకన్న ఎక్కువ ప్రయత్నము చేయును. బ్రహ్మజ్ఞానము కలుగుటచేత సంసారబంధమునుండి విడివడును. పుణ్యాతిశయమున సాధనాతిశయమువలన సిద్ధుడైనవాడు ఆఖరి జన్మ పొంది పరమాత్మను సాక్షాత్కరించుకొని ముక్తుడగును - కొన్ని జన్మలనెత్తి క్రమేణ ముక్తిని చెందును కాని చెడిపోడు).

Transliteration
  1. itō bhraṣṭaḥ tatō bhraṣṭaḥ

(ēdiyu labhiṃpaka ceḍinavāḍu - reṃḍiṃṭikī ceḍina rēvaḍi).

  1. karma yōgāt yōgamārgāt ca vibhraṣṭaḥ (śrīśaṃkaraḥ)

(karmayōgamunuṃḍi, yōgābhyāsamunuṃḍi ceḍinavāḍu).

  1. prākṛta svargānubhōgānubhavaṃ, brahmānubhavaṃ, tadubhaya pathāt bhraṣṭaḥ -

(svargabhōgamulananubhaviṃcuṭaku, brahmānaṃdamunu poṃduṭaku - ī reṃḍiṭiki - ceḍinavāḍu).

  1. “yathāvasthitaṃ svargādi sādhanabhūtaṃ karma phalābhi saṃdhirahitasya asya puruṣasya svaphalasādhanatvēna pratiṣṭhāna bhavati itya pratiṣṭhaḥ vrakrāṃtē brahmaṇaḥ pathi vimūḍhaḥ. tasāt pathapracyutaḥ, ataḥ ubhaya vibhraṣṭaḥ -” (śrīrāmānujaḥ)

(svargamu modalagu paralōkasukhamulu kalugacēyu karmalanu phalamu kōraka cēyuvāḍu tānu cēyu karma paripakvamu gāka yuṃḍinavāḍu - anagā ā karmayōgamulō pratiṣṭa poṃdanivāḍu apratiṣṭuḍu. brahmajñānamu poṃduṭalō - jñānayōgamulō - mūḍhuḍai dāninuṃḍi digajāripōyinavāḍu - iṭlu ī reṃḍiṃṭiki ceḍinavāḍu ubhaya bhraṣṭuḍu).

  1. haṭhāt karmēṃdriyāṇi saṃ yamya akarmakṛt bhaviṣyati ityā śaṃkya yaḥ tu anātmajñaḥ. aśuddhāṃtaḥ karaṇaḥ haṭhāt karmēṃdriyāṇi saṃ yamya vihitaṃ karma na karōti, autsukyāt saṃ nyanyati, saḥ ubhayatōbhraṣṭaḥ -

(haṭhayōgamuna - okkamāruga - karmēṃdriyamulanu jayiṃcina yaḍala ē karmalanu cēyanivāḍagunanu āśatō ātmajñānamulēnivāḍu - manaśśuddhilēnivāḍu haṭhāttugā karmēṃdriyamulanu arikaṭṭi śāstramulō cēyavalasinadani ceppina karma evaḍu cēyaḍō, utsāhamutō sanyasiṃcunō aṭṭivāḍu ubhayabhraṣṭuḍu - aṭu yōgābhyāsamunuṃḍi, iṭu karmasanyāsayōgamunuṃḍi bhraṣṭuḍagunu).

  1. śrīmadbhagavadgītalō ubhayabhraṣṭuniguṟiṃci ī kriṃdavidhamugā ceppabaḍinadi: -

“ayatiḥ śraddhayōpētō yōgāccalitamānasaḥ |

aprāvya yōga saṃsiddhiṃ kāṃ gatiṃ, kṛṣṇa ! gacchati ||“. (śrīmadbhagavadgīta - 6 - 37)

“śrī bhagavān uvāca” -

“pārtha naivēha nāmutra vināśastasya vidyatē |

na hi kalyāṇakṛtkaści ddurgatiṃ tāta gacchati |

prāpya puṇya kṛtāṃ lōkānuṣitvā śaśvatīḥ samāḥ |

śucīnāṃ śrīmatāṃ gēhē yōgabhraṣṭō (a)bhijāyatē |

adhavā yōginā mēva kulē bhavati dhīmatāṃ |

ē taddhi durlabhataraṃ lōkē janma yadīdṛśaṃ |

tatra taṃ buddhi saṃ yōgaṃ labhatē paurya dēhikaṃ |

yatatē ca tatō bhūyaḥ saṃsiddhau kurunaṃdana |

pūrvābhyāsēna tēnaiva hriyatē hyavaśō(a)pi saḥ |

jijñāsurapi yōgasya śabda brahmā bhivartatē |

prayatnādyatamānastu yōgī saṃ śuddha kilbiṣaḥ |

anēka janma saṃsiddhaḥ tatō yāti parāṃ gatiṃ” ||. (śrīmadbhagavadgīta - 6 - 40 to 45)

(ubhaya bhraṣṭuḍainavāniki ē gati paṭṭunu ani arjunuḍu śrīkṛṣṇabhagavānuni aḍigenu - dāniki ī kriṃdavidhamugā śrīkṛṣṇabhagavānuḍu pratyuttaramiccenu: -

(ubhaya bhraṣṭuḍainavāḍu ī lōkamulōkāni, paralōkamulōkāni nāśamu ceṃdaḍu. guruvu bhōdhiṃcu vēdāṃta vākyamulaṃdu nammakamu kaligi niraktuḍai yōgābhyāsamu cēyuṭa modalu peṭṭinavāḍu yōgābhyāsamu pūrtikākamunupē duradṛṣṭavaśamuna prayatnamu konasāgakamunupē prayatnamu bhagnamainayaḍala, lēka ā yōgābhyāsa prayatnamu bhagnamainayaḍala siddhini poṃdakuṃḍā - yōgasiddhini poṃdakuṃḍaganē - mṛti ceṃdinavāḍu - nāśamu ceṃdaḍu. śāstrōktamugā pravartiṃcinaṃduna ī lōkamulō niṣṭulavalana niṃda poṃdaḍu. migilina ajñānulavale paralōkamaṃdu aniṣṭamainagati uṃḍadu. yōgamārgamaṃdu madhyalō duradṛṣṭavaśāttu canipōyina yaḍala vāḍu aśvamēdha yāgamulu cēsinavāru pōyina lōkamulaku pōyi, konni kōṭla saṃvatsaramulu akkaḍa nivasiṃci, ā phalamu kṣīṇiṃcagā satpuruṣulu, dhanavaṃtulu ayinavāri iṃṭlō puṭṭunu. pūrvajanmalō cēsina karmayōgamula, dhyānayōgamula vāsanavalana - alpa vairāgyamuvalana janakuḍu modalaguvārivale rājagṛhamaṃdu janmiṃcunu. vairāgyaguṇamu adhikamugānunna yaḍala yī yōgabhraṣṭuḍu puṇyātmulu pōyina trōvaku pōka brahmajñānamu kaliginaṭuvaṃṭi brāhmaṇula kulamulōgāni yōgulakulamulōgāni puṭṭunu. rājagṛhamaṃdu puṭṭuṭa adhika puṇyamu cēyuṭavalana kalugunu kanuka adi labhiṃcuṭa kaṣṭamu. dānikanna yōgula gṛhamaṃdu puṭṭuṭa kaṣṭataramu - aṭṭivāri kulamulō puṭṭi pūrvajanmalō kaligina saṃskāramuvalana yōgasiddhini poṃduṭaku yidivaraku janmalōkanna ekkuva prayatnamu cēyunu. brahmajñānamu kaluguṭacēta saṃsārabaṃdhamunuṃḍi viḍivaḍunu. puṇyātiśayamuna sādhanātiśayamuvalana siddhuḍainavāḍu ākhari janma poṃdi paramātmanu sākṣātkariṃcukoni muktuḍagunu - konni janmalanetti kramēṇa muktini ceṃdunu kāni ceḍipōḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.