← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉద్భిజ్జాః udbhijjāḥ

Original — తెలుగు
  1. “భూమి ముద్భిద్యజాతాని - లతవృక్షాదీని - వృక్షాదీనామపి పాపఫల భోగాయతన త్వేన శరీరత్వం” (వేదాంతపరిభాషా). - (శరీరజైః కర్మదోషైః యాతి స్థావరతాం నరః).

(భూమిని బ్రద్దలు చేసుకొని పుట్టు లతలు, చెట్లు మొదలగునవి - చెట్లుకూడా శరీరముతో చేయుకర్మల దోషములచేతనే శరీరము కలిగియుండుట - నరుడు శరీరముతో చేయు కర్మదోషములచేతనే లతలు, వృక్షములుగా పుట్టుట).

  1. బీజం భూమిం వా ఉద్భిద్య జాయమానాః వృక్షౌషధ వీరుదా దయః ఉద్భిజ్జాః -

(బీజము లేక, భూమిని భేదించుకొని పుట్టినవి - వృక్షములు, లతలు, తృణములు, ఓఉషధులు మొదలగునవి).

  1. “ఉద్భిజ్జాః స్థావరా స్సర్వే బీజకాండ ప్రరోహిణః”

(విత్తనముగాని, కొమ్మనుగాని పగిలించుకొని పుట్టినవి అన్నియు ఉద్భిజ్జములే).

  1. అండజములు, స్వేదజములు, ఉద్భిజ్జములు, జరాయుజములు అను నాలుగు విధముల సృష్టిలో నొకటి.
Transliteration
  1. “bhūmi mudbhidyajātāni - latavṛkṣādīni - vṛkṣādīnāmapi pāpaphala bhōgāyatana tvēna śarīratvaṃ” (vēdāṃtaparibhāṣā). - (śarīrajaiḥ karmadōṣaiḥ yāti sthāvaratāṃ naraḥ).

(bhūmini braddalu cēsukoni puṭṭu latalu, ceṭlu modalagunavi - ceṭlukūḍā śarīramutō cēyukarmala dōṣamulacētanē śarīramu kaligiyuṃḍuṭa - naruḍu śarīramutō cēyu karmadōṣamulacētanē latalu, vṛkṣamulugā puṭṭuṭa).

  1. bījaṃ bhūmiṃ vā udbhidya jāyamānāḥ vṛkṣauṣadha vīrudā dayaḥ udbhijjāḥ -

(bījamu lēka, bhūmini bhēdiṃcukoni puṭṭinavi - vṛkṣamulu, latalu, tṛṇamulu, ōuṣadhulu modalagunavi).

  1. “udbhijjāḥ sthāvarā ssarvē bījakāṃḍa prarōhiṇaḥ”

(vittanamugāni, kommanugāni pagiliṃcukoni puṭṭinavi anniyu udbhijjamulē).

  1. aṃḍajamulu, svēdajamulu, udbhijjamulu, jarāyujamulu anu nālugu vidhamula sṛṣṭilō nokaṭi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.