← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉపాదానము upādānamu

Original — తెలుగు
  1. యద్ధి యస్మాత్ ప్రభవతి, యస్మింశ్చ ప్రలీయతే తత్తస్యోపాదానం ప్రసిద్ధం - యథా వ్రీహియవాదీనాం పృధివీ.

(ఏది దేనినుండి పుట్టుచున్నదో, దేనియందు లయమైపోవుచున్నదో అది దానికి ఉపాదానము - వ్రీహియవలకు భూమి ఉపాదానమైనట్లు - ఈ ధాన్యములు భూమిలోనుండి పుట్టి భూమిలోనే లయమైపోవుచున్నవి).

  1. ఉపాదీయతే నిమిత్తతయా స్వీక్రియతే ఇత్యుపాదానం

(పుట్టుటకు కారణమై మరల తనలోనే కలిసిపోవునట్లు చేయునది ఉపాదానము).

  1. పుట్టినవస్తువునకు కారణమైనది ఉపాదానము.
Transliteration
  1. yaddhi yasmāt prabhavati, yasmiṃśca pralīyatē tattasyōpādānaṃ prasiddhaṃ - yathā vrīhiyavādīnāṃ pṛdhivī.

(ēdi dēninuṃḍi puṭṭucunnadō, dēniyaṃdu layamaipōvucunnadō adi dāniki upādānamu - vrīhiyavalaku bhūmi upādānamainaṭlu - ī dhānyamulu bhūmilōnuṃḍi puṭṭi bhūmilōnē layamaipōvucunnavi).

  1. upādīyatē nimittatayā svīkriyatē ityupādānaṃ

(puṭṭuṭaku kāraṇamai marala tanalōnē kalisipōvunaṭlu cēyunadi upādānamu).

  1. puṭṭinavastuvunaku kāraṇamainadi upādānamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.