← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉపమానము upamānamu

Original — తెలుగు
  1. పోల్చ తగిన వస్తువు, ప్రమాణములలో నొకటి.

  2. “ఉపమితి కరణముపమానం - సంజ్ఞా సంజ్ఞి సంబంధజ్ఞానము పమితిః - తత్కరణం సాదృశ్యజ్ఞానం అతిదేశ వాక్యార్థ స్మరణం వ్యాపారః తథాహి కశ్చిద్గవయ శబ్దార్థమజానన్ కుతశ్చి దారణ్యక పురుషాత్ గో సదృశో గవయః ఇతి శృత్వా వనంగతో వాక్యార్థం స్మరన్ గోసదృశ పిండం పశ్యతి. తదనంతరమ యం గవయపదవాచ్యః ఇత్యుపమితి రుత్పద్యతే” (తర్కసంగ్రహే)

“సంజ్ఞా నామపదం; సంజ్ఞీ అర్థః; తయో స్సంబంధిః శక్తిః; తథాచ పదపదార్థజ్ఞాన సంబంధ జ్ఞానముపమితీత్యర్థః” (న్యాయ బోధిని)

(సంజ్ఞ అనగా పదము, సంజ్ఞీ అనగా అర్థము - ఈ రెండింటిసంబంధమును తెలుసుకొనుట- ఉపమితి - ఒక దానితో ఒకటి పోల్చుట. ఒకదానివలె ఇంకొకటి ఉన్నదనుకొను జ్ఞానము. ఒకానొకడు గవయశబ్దముయొక్క అర్థమును తెలియక ఒక అడవిమనుష్యుని వలన గోవువలె ఉండునవి గోవులు అని విని. అది స్మరించుచు అడవికిపోయి అచ్చట గోవువలెనున్న పిండమును చూచును - గోవువలెనున్నదనుట ఉపమానము -

  1. “గో సదృశో గవయః” అనెడి వాక్యశ్రవణాన ంతరంబున వనముచేరిన అతనికి తద్విషయ సదృశ దృష్టి ఉపమానప్రమాణంబనంబడు“.

(వివేకచింతామణి - పరమానందతీర్థ)

  1. ఉపమితకరణ ముపమానం. తచ్చ సాదృశ్య జ్ఞానాత్మకం.

(పోలికలుండుటచేత ఒకదానితో ఇంకొకదానిని పోల్చుట).

  1. ప్రసిద్ధ సాధర్మ్యాత్ సాధ్యసాధనం.

(ప్రసిద్ధమైన పోలికలు - ధర్మములు - ఉండుటవలన సాధించుటకు సాధనము).

  1. “అకారణే కారణతా యద్బోధా యోపమీయతే |

న తత్ర సర్వసాధర్మ్యం సంభవ త్యు సమాశ్రమైః |

ఉపమేయ స్యోపమానాదేకాం శేన సధర్మతా |

అంగీకార్యావబోధాయ ధీమతా నిర్వివాదినా |

అర్థావలోకనే దీపా దాభామాత్రాద్యుతే కిల |

నస్థాన తైలవర్త్యా ది కించిదప్యుప యుజ్యతే ||“. (యోగవాసిష్టము - 10 - 63 to 65)

(బంగారముతో చేయబడిన వివిధరూపములుగల ఆభరణములకు బంగారము కారణమైనట్లు పరబ్రహ్మఈ జగత్తునకు కారణము - ఇట్లు చెప్పుటలో బంగారము పరబ్రహ్మతో పోల్చబడినది; బంగారముతో చేయబడిన ఆభరణములు జగత్తుతో పోల్చబడినది. ఇట్లు పోల్చు ట ఉపమానం. ఇది బ్రహ్మ జగత్తునకు కారణమని బోధించుటకు ఉపయోగింపబడినవి. ఇట్లు చెప్పునపుడు బంగారము యొక్క ధర్మములన్నియు గ్రహింపబడలేదు. దానితో ఆభరణములు చేయుట యొక్కటే గ్రహింపబడినది. ఇది ఒక్కటే బంగారమునకు పరబ్రహ్మకు ఉన్న సమానధర్మము - బంగారముయొక్క మిగిలిన ధర్మములు వదలి వేయబడినవి. బుద్ధిమంతుడగువాడు, తత్వమునుగ్రహింప నుద్దేశమున్నవాడు, రెండింటిలోను ఉన్న సమాన ధర్మమునే గ్రహించును - అది వివాదమునకు తావునివ్వదుకనుక. చీకటిలోనున్న వస్తువులను గ్రహించుటకు వెలుగుచుండు దీపము ఒక్కటే సహాయపడును - ఆదీపము ఉన్న సెమ్మె, నూని, వత్తి మొదలగునవి సహాయపడవు. అందుచేత వాటిని వదలివేయవలసినదే)

Transliteration
  1. pōlca tagina vastuvu, pramāṇamulalō nokaṭi.

  2. “upamiti karaṇamupamānaṃ - saṃjñā saṃjñi saṃbaṃdhajñānamu pamitiḥ - tatkaraṇaṃ sādṛśyajñānaṃ atidēśa vākyārtha smaraṇaṃ vyāpāraḥ tathāhi kaścidgavaya śabdārthamajānan kutaści dāraṇyaka puruṣāt gō sadṛśō gavayaḥ iti śṛtvā vanaṃgatō vākyārthaṃ smaran gōsadṛśa piṃḍaṃ paśyati. tadanaṃtarama yaṃ gavayapadavācyaḥ ityupamiti rutpadyatē” (tarkasaṃgrahē)

“saṃjñā nāmapadaṃ; saṃjñī arthaḥ; tayō ssaṃbaṃdhiḥ śaktiḥ; tathāca padapadārthajñāna saṃbaṃdha jñānamupamitītyarthaḥ” (nyāya bōdhini)

(saṃjña anagā padamu, saṃjñī anagā arthamu - ī reṃḍiṃṭisaṃbaṃdhamunu telusukonuṭa- upamiti - oka dānitō okaṭi pōlcuṭa. okadānivale iṃkokaṭi unnadanukonu jñānamu. okānokaḍu gavayaśabdamuyokka arthamunu teliyaka oka aḍavimanuṣyuni valana gōvuvale uṃḍunavi gōvulu ani vini. adi smariṃcucu aḍavikipōyi accaṭa gōvuvalenunna piṃḍamunu cūcunu - gōvuvalenunnadanuṭa upamānamu -

  1. “gō sadṛśō gavayaḥ” aneḍi vākyaśravaṇāna ṃtaraṃbuna vanamucērina ataniki tadviṣaya sadṛśa dṛṣṭi upamānapramāṇaṃbanaṃbaḍu”.

(vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)

  1. upamitakaraṇa mupamānaṃ. tacca sādṛśya jñānātmakaṃ.

(pōlikaluṃḍuṭacēta okadānitō iṃkokadānini pōlcuṭa).

  1. prasiddha sādharmyāt sādhyasādhanaṃ.

(prasiddhamaina pōlikalu - dharmamulu - uṃḍuṭavalana sādhiṃcuṭaku sādhanamu).

  1. “akāraṇē kāraṇatā yadbōdhā yōpamīyatē |

na tatra sarvasādharmyaṃ saṃbhava tyu samāśramaiḥ |

upamēya syōpamānādēkāṃ śēna sadharmatā |

aṃgīkāryāvabōdhāya dhīmatā nirvivādinā |

arthāvalōkanē dīpā dābhāmātrādyutē kila |

nasthāna tailavartyā di kiṃcidapyupa yujyatē ||“. (yōgavāsiṣṭamu - 10 - 63 to 65)

(baṃgāramutō cēyabaḍina vividharūpamulugala ābharaṇamulaku baṃgāramu kāraṇamainaṭlu parabrahmaī jagattunaku kāraṇamu - iṭlu ceppuṭalō baṃgāramu parabrahmatō pōlcabaḍinadi; baṃgāramutō cēyabaḍina ābharaṇamulu jagattutō pōlcabaḍinadi. iṭlu pōlcu ṭa upamānaṃ. idi brahma jagattunaku kāraṇamani bōdhiṃcuṭaku upayōgiṃpabaḍinavi. iṭlu ceppunapuḍu baṃgāramu yokka dharmamulanniyu grahiṃpabaḍalēdu. dānitō ābharaṇamulu cēyuṭa yokkaṭē grahiṃpabaḍinadi. idi okkaṭē baṃgāramunaku parabrahmaku unna samānadharmamu - baṃgāramuyokka migilina dharmamulu vadali vēyabaḍinavi. buddhimaṃtuḍaguvāḍu, tatvamunugrahiṃpa nuddēśamunnavāḍu, reṃḍiṃṭilōnu unna samāna dharmamunē grahiṃcunu - adi vivādamunaku tāvunivvadukanuka. cīkaṭilōnunna vastuvulanu grahiṃcuṭaku velugucuṃḍu dīpamu okkaṭē sahāyapaḍunu - ādīpamu unna semme, nūni, vatti modalagunavi sahāyapaḍavu. aṃducēta vāṭini vadalivēyavalasinadē)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.