← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉపాయాః upāyāḥ

Original — తెలుగు
  1. ఉపసమీపే ఫలలాభో యేషాంతాని ఉపయాని, పాదనాని.

(సమీపమందే, అనగా దగ్గరగనే, కాలాతీతము కాకుండగనే, వెంటనే ఫలమునిచ్చునవి ఉపాయములు).

(ఉప = సమీపమందు, అయః = ఫలలాభము కలుగచేయునది - ఉపాయము)..

  1. “అవశ్యం కరణీయం మే భవతాం హితమాత్మనా |

బుద్ధ్యా బలేన చార్థేన యేనకే న చలేనవా |

ఉపాయాః ఖలు చత్వారః కథితాః తత్వ దర్శిభిః |

సామాదయః సుహృత్సేవ దుర్హృదేషు విశేషతః ||“. (దేవీ భాగవతం)

(ఏదో ఉపాయముచేత మీకు హితము చేయవలయును - బుద్ధి చేతగాని, బలముచేతగాని, ఇంకను ఇతర యుక్తిచేతగాని - మంచి హృదయముగలవారికి - స్నేహితులకు, విశేషముగా దుర్మార్గులకు హితము చెప్పుటలో తత్వమును తెలిసినవారిచే నాలుగు ఉపాయములు చెప్పబడినవి - సామము మొదలగునవి - సామము, దానము, భేదము, దండము).

  1. “సామ దాన భేద దండాః యథా యోగ్యం. కించిత్సుహృత్సు, కేచిత్ దుర్హృదేషు విశేషతః -

(మంచి హృదయముగలవారియడల కొంచెము కొంచెము గాను, చెడ్డమనస్సుగలవారి యడల విశేషముగాను, ఎవరికి తగినట్లు వారికి సామ, దాన, భేద, దండములు అను నాలుగు విధములైన ఉపాయములను ఉపయోగించవలెను).

Transliteration
  1. upasamīpē phalalābhō yēṣāṃtāni upayāni, pādanāni.

(samīpamaṃdē, anagā daggaraganē, kālātītamu kākuṃḍaganē, veṃṭanē phalamuniccunavi upāyamulu).

(upa = samīpamaṃdu, ayaḥ = phalalābhamu kalugacēyunadi - upāyamu)..

  1. “avaśyaṃ karaṇīyaṃ mē bhavatāṃ hitamātmanā |

buddhyā balēna cārthēna yēnakē na calēnavā |

upāyāḥ khalu catvāraḥ kathitāḥ tatva darśibhiḥ |

sāmādayaḥ suhṛtsēva durhṛdēṣu viśēṣataḥ ||“. (dēvī bhāgavataṃ)

(ēdō upāyamucēta mīku hitamu cēyavalayunu - buddhi cētagāni, balamucētagāni, iṃkanu itara yukticētagāni - maṃci hṛdayamugalavāriki - snēhitulaku, viśēṣamugā durmārgulaku hitamu ceppuṭalō tatvamunu telisinavāricē nālugu upāyamulu ceppabaḍinavi - sāmamu modalagunavi - sāmamu, dānamu, bhēdamu, daṃḍamu).

  1. “sāma dāna bhēda daṃḍāḥ yathā yōgyaṃ. kiṃcitsuhṛtsu, kēcit durhṛdēṣu viśēṣataḥ -

(maṃci hṛdayamugalavāriyaḍala koṃcemu koṃcemu gānu, ceḍḍamanassugalavāri yaḍala viśēṣamugānu, evariki taginaṭlu vāriki sāma, dāna, bhēda, daṃḍamulu anu nālugu vidhamulaina upāyamulanu upayōgiṃcavalenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.