ధనేషణ, దారేషణ, పుత్రేషణ అను ఈషణత్రయములలో ఒకటి - ధనము నందత్యాశ - దీనివల్ల బ్రతుకంతా దుఃఖమే - అది యెట్లనగా -
(ధనమును సంపాదించుటలోను, దానిని వృద్ధిపొందించుటలోను చాల దుఃఖము కలుగును - సంపాదించినదానిని రక్షించుకొనుట చాలదుఃఖము - ఆ ధనము ఖర్చు అయిపోయినను, దానిని అనుభవించినను గొప్ప దుఃఖము కలుగును - ధనము నశించిన చిత్త భ్రాంతి కలుగును - ధనుమును సంపాదించుటలో దొంగతనము మొదలగు ఆరు అనర్థములు, దానిని సంపాదించిన స్మయము మొదలగు ఆరు అనర్థములు ప్రాప్తించును - జూదము, త్రాగుడు, స్త్రీసంభోగము అను మూడు అనర్థములు కలుగును - ఇవన్నియు కలిసి తొమ్మిది యనర్థములు - అందుచేత అర్థము ఒకటే అయినను పన్నెండు అనర్థములు కలుగ చేయునదగును).
(భార్యా పుత్రులు మొదలగువాటిని వదలి ధనమునే కోరువానికి గొప్ప దుఃఖము కలుగును. ధనమును సంపాదించుటలోను, దానిని ఖర్చు పెట్టుటలోను, దానిని రక్షించుటలోను, అది పోయినను దుఃఖము కలుగును. మితిలేని ధనమునార్జించువాడు లెక్కలేనన్ని పాపములను చేయును, అనేకమైన అనర్థములైన అనర్థములను అనుభవించువాడగును - ధనమును సంపాదించుటలో ఆసక్తి గలవాడు జాతి ధర్మములను కులధర్మములను వదలివేయును - ధనమునార్జించుటలో అనేకమైన ఘోరపాపములను చేసినను పూర్వ జన్మలో చేసిన పుణ్యకర్మవలననే ధనము లభించును. ఆ కర్మవలన ఎంత ధనము లభించవలెనో అంతే ధనము లభించును, అంతకన్న హెచ్చు ధనము లభించదు. ఖర్చు అయినపుడు అయ్యో ధనము తగ్గిపోవుచున్నది అను భయముచేత తనస్వంతమునకైనను కొంచెమైనను ధనము ఖర్చు చేయడు. అంతేగాని గొప్ప బాధలు పడుచున్నను, అనేక దుష్కర్మలు చేయుచునే ధనమును వృద్ధిపొందించుచునే యుండిమరణించును. తాను అనుభవించుట వలనగాని, ఇతరులకుపకారము చేయుటవలనగాని ఆధనము నశించునని అనంతమైన దుఃఖసముద్రములో మునిగిపోవును. ఈ ప్రకారము ధనము అంతములేని దుఃఖమునకు కారణమగును).
(ధనమును గుఱించి ఆలోచించుటవలన లోభము కలుగును - ఏ క్షణమునందు మనసులో ధనలోభము కలుగునో ఆ క్షణమందే ఇది న్యాయము, ఇది అన్యాయము అను విచక్షణ చేయు బుద్ధి లోపించును. ఆ ప్రకారముగా మనుష్యుడు సన్మార్గమును వదలి అన్యాయమార్గమందు ప్రవర్తించును).
dhanēṣaṇa, dārēṣaṇa, putrēṣaṇa anu īṣaṇatrayamulalō okaṭi - dhanamu naṃdatyāśa - dīnivalla bratukaṃtā duḥkhamē - adi yeṭlanagā -
(dhanamunu saṃpādiṃcuṭalōnu, dānini vṛddhipoṃdiṃcuṭalōnu cāla duḥkhamu kalugunu - saṃpādiṃcinadānini rakṣiṃcukonuṭa cāladuḥkhamu - ā dhanamu kharcu ayipōyinanu, dānini anubhaviṃcinanu goppa duḥkhamu kalugunu - dhanamu naśiṃcina citta bhrāṃti kalugunu - dhanumunu saṃpādiṃcuṭalō doṃgatanamu modalagu āru anarthamulu, dānini saṃpādiṃcina smayamu modalagu āru anarthamulu prāptiṃcunu - jūdamu, trāguḍu, strīsaṃbhōgamu anu mūḍu anarthamulu kalugunu - ivanniyu kalisi tommidi yanarthamulu - aṃducēta arthamu okaṭē ayinanu panneṃḍu anarthamulu kaluga cēyunadagunu).
(bhāryā putrulu modalaguvāṭini vadali dhanamunē kōruvāniki goppa duḥkhamu kalugunu. dhanamunu saṃpādiṃcuṭalōnu, dānini kharcu peṭṭuṭalōnu, dānini rakṣiṃcuṭalōnu, adi pōyinanu duḥkhamu kalugunu. mitilēni dhanamunārjiṃcuvāḍu lekkalēnanni pāpamulanu cēyunu, anēkamaina anarthamulaina anarthamulanu anubhaviṃcuvāḍagunu - dhanamunu saṃpādiṃcuṭalō āsakti galavāḍu jāti dharmamulanu kuladharmamulanu vadalivēyunu - dhanamunārjiṃcuṭalō anēkamaina ghōrapāpamulanu cēsinanu pūrva janmalō cēsina puṇyakarmavalananē dhanamu labhiṃcunu. ā karmavalana eṃta dhanamu labhiṃcavalenō aṃtē dhanamu labhiṃcunu, aṃtakanna heccu dhanamu labhiṃcadu. kharcu ayinapuḍu ayyō dhanamu taggipōvucunnadi anu bhayamucēta tanasvaṃtamunakainanu koṃcemainanu dhanamu kharcu cēyaḍu. aṃtēgāni goppa bādhalu paḍucunnanu, anēka duṣkarmalu cēyucunē dhanamunu vṛddhipoṃdiṃcucunē yuṃḍimaraṇiṃcunu. tānu anubhaviṃcuṭa valanagāni, itarulakupakāramu cēyuṭavalanagāni ādhanamu naśiṃcunani anaṃtamaina duḥkhasamudramulō munigipōvunu. ī prakāramu dhanamu aṃtamulēni duḥkhamunaku kāraṇamagunu).
(dhanamunu guṟiṃci ālōciṃcuṭavalana lōbhamu kalugunu - ē kṣaṇamunaṃdu manasulō dhanalōbhamu kalugunō ā kṣaṇamaṃdē idi nyāyamu, idi anyāyamu anu vicakṣaṇa cēyu buddhi lōpiṃcunu. ā prakāramugā manuṣyuḍu sanmārgamunu vadali anyāyamārgamaṃdu pravartiṃcunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.