← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధారణ dhāraṇa

Original — తెలుగు
  1. బ్రహ్మాతిరిక్తం నకించి దస్తీతి భావనా లక్షణా.

(పరబ్రహ్మకానిది ఏ కొంచెమైన వస్తువైనను లేదు అన్న భావన కలిగియుండుట).

  1. ప్రత్యగేవ బ్రహ్మేతి నిశ్చయో ధారణో భవతి. .

(ప్రత్యగాత్మయే - ప్రత్యక్చైతన్యమే - బ్రహ్మ అను నిశ్చయము కలిగియుండుటయే ధారణ).

  1. ” య కిం చి ద్విషయం బాహ్యమా భ్యంతరం వా అను సంథానస్య చిత్తైకాగ్ర్యం ధారణా” (యోగసారోపనిషత్)

(బాహ్య విషయమందుకాని అభ్యంతర విషయమందుగాని అను సంధానము చేయువానియొక్క చిత్తమును ఒకేదానియందు నిశ్చలముగా నుంచుట).

  1. ” విషయవ్యా వర్తన పూర్వకం చైతన్యే చేతస్థాపనం దారణం భవతి” (మండల బ్రాహ్మణోపనిషత్)

(విషయములనుండి మరలించి మనస్సును చైతన్యమందు నిలుపుట ధారణము -).

  1. దేశబంధశ్చిత్తస్య ధారణా” (పతంజలి - 3 - 1)

(చిత్తమును ఒకే దేశమందు - స్థానమందు - లేక వస్తువునందు కట్టిపెట్టి యుంచుట).

  1. నైరంతర్యేణ అంతఃకరణస్య ఏకాకారతా స్థితిః ధారణా -

(నిరంతరము - ఎల్లపుడు - అంతఃకరణమును ఒకే ఆకారమునందు - ఒకే వస్తువునందు - నిలుపుట ధారణ).

  1. అద్వితీయ వస్తుని అంతరింద్రియ ధారణం ధారణా -

(తనతప్ప వేరు వస్తువు మఱియొకటి లేనిదానియందు - అద్వితీయ పరబ్రహ్మమందు లోపలి ఇంద్రియమైన మనస్సును స్థిరమొనర్చుట ధారణ).

  1. ధారణేత్యుచ్యతే చేయం ధార్యతే యస్మనోతయా. (మనస్సు దేనిచేత ధరింపబడుచున్నదో అది ధారణ).

  2. యత్ర యత్రమనో యాతి బ్రహ్మణస్తత్ర తత్ర దర్శినం |

మనసో ధారణంబైవ ధారణా సాపరామతా ||“.

(ఎక్కడెక్కడికి మనస్సు వెళ్ళునో అక్కడక్కడ పరబ్రహ్మను చూచుట, మనస్సులో అతని రూపమునుఅచ్చటచ్చట చూచుట ధారణ).

  1. శ్రుతస్యా విస్మరణం - (వినిన దానిని - భగవంతునిగుఱించి వినిన విషయములగుఱించి - మరల మరల స్మరణకు తెచ్చుకొనుట).

  2. ” బుద్ధిమాన్ యోగీ సంకల్పాత్మకం మనః తద్వృత్తి జాతం సంక్షిప్య అధనిస్సం కల్పకం ధ్యాత్వా ఆత్మని నిర్వికల్పకే ప్రత్యక్ భావ పరిణతే మనసి తథావిధం పరమాత్మానం ధారయిత్వా యా ప్రత్యక్పరైవ స్థితః సేయం ధారణా.

(ధ్యానియగు యోగి సంకల్పాత్మకమైన మనస్సును దాని వృత్తినుండి మరలించి, సంకల్పము లేకుండునట్లు చేసి నిర్వికల్పకమైన ఆత్మయందు ప్రత్యక్ భావముగా మారిన మనస్సులో పరమాత్మను ధరించియుండి తానే ఆ ప్రత్యక్ పరమాత్మగా యుండుట ధారణ).

  1. చిత్తస్య వశీకరణార్థం మూలాధార స్వాధిష్ఠాన మణిపూరక అనాహత విశుద్ధాజ్ఞా చక్రాణాం అన్యతమే దేశే అవస్థాపనం ధారణా.

(మనస్సును తనవశములో నుంచుకొనుటకు మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము అను వాటికంటే వేరైన సహస్రార చక్రమునందు మనస్సును నిలుపుట).

(పైన చెప్పిన చక్రముల అధి దేవతలను ఒక్కొక్కరిని ధ్యానించుచు, ఒకదాని తర్వాత ఒకటిలో ధ్యానము నిలుపుట).

  1. “అంగుష్ట గుల్భ జానూరు మూలాధార లింగనాదిషు |

హృద్గ్రీవాకంఠ దేశేషు లంబికాయాం తతోనసి |

భ్రూమధ్యే మస్తకే ముర్ధ్ని, ద్వాదశాంతే యథావిధి |

ధారణం ప్రాణమరుతో ధారణేతి నిగద్యతే || (దేవీ భాగవతం)

” అంగుష్టాద్యవ యదేషు యత్ప్రాణ వాయోర్ధారణం నిరోధః సాధారణా ఇత్యర్థః. ఏతాదృశో వాయుః స్వాధీనోపేక్షితః“.

(పాదాంగుష్టము మొదలు మూర్ధ్నము వఱకునుండు అంగములందు మనస్సుతోసహా ప్రాణవాయువును నిలుపుట ధారణయని చెప్పబడిచున్నది).

  1. “శ్లో||. కౌచిత్స్వ దేహం తర్హృదయావకాశే ప్రాదేశమాత్రం పురుషం వసంతం |

చతుర్భుజం, కంజరధాంగశంఖ గదాధరం ధారణయా స్మరంతి |

ప్రసన్నవక్తం నలినాయతేక్షణం కదంబు కిం జల్కపి శంగవాస సం |

ల్లసన్మహారత్న హిరణ్మయాం గదం| స్ఫురన్మహారత్న కిరీట కుండలం |

ఈ క్షేత చింతామయమేవ మశ్వరం యావన్మనోధారణ యా వతిష్టతే |

ఏకైకశోంగాని ధి యా నుభావయే త్పాదాతి య పద్దసితం గదాభృతం |

జితం జితం స్థానమపోహ్య ధారయేత్పారంపరం శుద్ధ్యతి ధీర్యథా యథా ||“. (విష్ణుపురాణము - 6 - 7)

(తమ దేహములో హృదయాకాశమునందు ప్రాదేశమాత్రుడుగా నివసించియుండు పురుషుని నాలుగు భుజములు గలవాడుగను, పద్మము, చక్రము, శంఖము, గద ధరించినవానిగను కొందఱు ధారణావశమున స్మరింతురు -ప్రసన్నమైన మొగము గలవానినిగను, పద్మరేకులవలె విశాలమై అందమైన కన్నులు గలవానినిగను, రత్నములతోను బంగారముతోను చేయబడిన కిరీటములు, కుండలములు, అంగదము గలవానినిగను మనస్సు ధారణ కలిగియున్నంతవఱకు మనస్సులో చిత్రించుకొని ధ్యానము చేయవలెను - అట్టి దివ్యమంగళవిగ్రహమును పాదములు మొదలుకొని ఒక్కొక్క అంగమును ధ్యానించుచు, ఒక్కొక్క దాని మీద ధారణ కుదిరిన తర్వాత పై అంగమును ధ్యానించుచు ఈ ప్రకారము చిత్తశుద్ధి క్రమేణ కలుగుచుండునట్లు ధారణ నవలంభించవలెను).

  1. (విజ్ఞాన సంపన్నులై యున్న ప్రపన్నులెంతేని నాపన్నులుగాక విన్నాణంబునం దమ తమ హృదయాంరాళంబుం బ్రాదేశ మాత్ర దివ్య దేహుండును దిగి భరాజశుండాదండనం కాశ దీర్ఘ చతుర్బాహుండును,గందర్పకోటి సమాన సుందరుండును, ధృతమందరుండును, రాకా విరాజమాన రాజమండల సన్నిభవదనుండును, సౌభాగ్య సదనుండును, బ్రభాతకాల భాసమాన భాస్కర బింబ ప్రతిమాన విరాజిత పద్మరాగరత్న రాజీ విరాజమాన కిరీటకుండలుండును, శ్రీవత్స లక్షణ లక్షిత వక్షో మండలుండును,రమణీయ కౌస్తుభ రత్నఖచిత కంఠి కాలంక్రుత కంధరుండును, నిరంతర పరిమళ మిళిత వనమూలికా బంధురుండును, నానా విధగంభీర హారకేయూర కటక కంకణ మే ఖలాంగుళీయక విభూషణ వ్రాత సముజ్వలుండును, నిటలతట విలంబమాన విమలస్నిగ్థ నీల కుంచిత కుంతలుండును, ధరుణ చంద్ర చంద్రికా ధవళమందహాసుండును, బరిపూర్ణ కరుణావలోకన భ్రూభంగ సంసూచిత నుభగ సంతతానుగ్రహ లీలా విలాసుండును, మహా యోగిరాజ విలసిత హృదయ కమలకర్ణికా మధ్య స్థాపిత విలసిత చరణ కిసలయుండును, సతతానందమయుండును, సహస్రకోటి సూర్య సంఘాత సన్నిభుండును, విభుండును నైన పరమేశ్వరుని మనోధారణా వసంబున నిలిపికొని, తదీయ గుల్భ చరణ జాను జంఘాద్యవయంబులం గ్రమంబున నొక్కొక్కటిని బ్రతి క్షణంబును ధ్యానంబు సేయుచు నెంతకాలంబునకు బరిపూర్ణ నిశ్చల భక్తియోగంబు సిద్ధించు నంతకాలంబునుం దదీయ చింతా తత్పరులై యుందురు.” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 26)

  2. ” థారణా నియమంబున సుఖాత్మకంబగు విషయంబు నవలోకించు యోగికి భక్తి లక్షణంబైన యోగంబున వేగంబ మోక్షంబు సిద్ధించు”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 -14)

  1. “ధారణాత్రి విధః - ఆత్మని మనోధారణం, దహరానాశే బాహ్యాకాశ ధారణం, పృధివ్యప్తేజో వాయ్వాకాశేషు పంచమూర్తి ధారణం”

(శాండిల్యోపనిషత్)

(ధారణ మూడు విధములు - ఆత్మయందు మనసును నిలుపుట, హృదయాకాశమునందు పైన ఉన్న ఆకాశమును -బహిరాకాశమును - ఉంచుట, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూతములందు పంచమూర్తులను - పంచ బ్రహ్మలను భావము నిలకడ చేయుట).

Transliteration
  1. brahmātiriktaṃ nakiṃci dastīti bhāvanā lakṣaṇā.

(parabrahmakānidi ē koṃcemaina vastuvainanu lēdu anna bhāvana kaligiyuṃḍuṭa).

  1. pratyagēva brahmēti niścayō dhāraṇō bhavati. .

(pratyagātmayē - pratyakcaitanyamē - brahma anu niścayamu kaligiyuṃḍuṭayē dhāraṇa).

  1. ” ya kiṃ ci dviṣayaṃ bāhyamā bhyaṃtaraṃ vā anu saṃthānasya cittaikāgryaṃ dhāraṇā” (yōgasārōpaniṣat)

(bāhya viṣayamaṃdukāni abhyaṃtara viṣayamaṃdugāni anu saṃdhānamu cēyuvāniyokka cittamunu okēdāniyaṃdu niścalamugā nuṃcuṭa).

  1. ” viṣayavyā vartana pūrvakaṃ caitanyē cētasthāpanaṃ dāraṇaṃ bhavati” (maṃḍala brāhmaṇōpaniṣat)

(viṣayamulanuṃḍi maraliṃci manassunu caitanyamaṃdu nilupuṭa dhāraṇamu -).

  1. dēśabaṃdhaścittasya dhāraṇā” (pataṃjali - 3 - 1)

(cittamunu okē dēśamaṃdu - sthānamaṃdu - lēka vastuvunaṃdu kaṭṭipeṭṭi yuṃcuṭa).

  1. nairaṃtaryēṇa aṃtaḥkaraṇasya ēkākāratā sthitiḥ dhāraṇā -

(niraṃtaramu - ellapuḍu - aṃtaḥkaraṇamunu okē ākāramunaṃdu - okē vastuvunaṃdu - nilupuṭa dhāraṇa).

  1. advitīya vastuni aṃtariṃdriya dhāraṇaṃ dhāraṇā -

(tanatappa vēru vastuvu maṟiyokaṭi lēnidāniyaṃdu - advitīya parabrahmamaṃdu lōpali iṃdriyamaina manassunu sthiramonarcuṭa dhāraṇa).

  1. dhāraṇētyucyatē cēyaṃ dhāryatē yasmanōtayā. (manassu dēnicēta dhariṃpabaḍucunnadō adi dhāraṇa).

  2. yatra yatramanō yāti brahmaṇastatra tatra darśinaṃ |

manasō dhāraṇaṃbaiva dhāraṇā sāparāmatā ||“.

(ekkaḍekkaḍiki manassu veḷḷunō akkaḍakkaḍa parabrahmanu cūcuṭa, manassulō atani rūpamunuaccaṭaccaṭa cūcuṭa dhāraṇa).

  1. śrutasyā vismaraṇaṃ - (vinina dānini - bhagavaṃtuniguṟiṃci vinina viṣayamulaguṟiṃci - marala marala smaraṇaku teccukonuṭa).

  2. ” buddhimān yōgī saṃkalpātmakaṃ manaḥ tadvṛtti jātaṃ saṃkṣipya adhanissaṃ kalpakaṃ dhyātvā ātmani nirvikalpakē pratyak bhāva pariṇatē manasi tathāvidhaṃ paramātmānaṃ dhārayitvā yā pratyakparaiva sthitaḥ sēyaṃ dhāraṇā.

(dhyāniyagu yōgi saṃkalpātmakamaina manassunu dāni vṛttinuṃḍi maraliṃci, saṃkalpamu lēkuṃḍunaṭlu cēsi nirvikalpakamaina ātmayaṃdu pratyak bhāvamugā mārina manassulō paramātmanu dhariṃciyuṃḍi tānē ā pratyak paramātmagā yuṃḍuṭa dhāraṇa).

  1. cittasya vaśīkaraṇārthaṃ mūlādhāra svādhiṣṭhāna maṇipūraka anāhata viśuddhājñā cakrāṇāṃ anyatamē dēśē avasthāpanaṃ dhāraṇā.

(manassunu tanavaśamulō nuṃcukonuṭaku mūlādhāramu, svādhiṣṭānamu, maṇipūrakamu, anāhatamu, viśuddhamu, ājñācakramu anu vāṭikaṃṭē vēraina sahasrāra cakramunaṃdu manassunu nilupuṭa).

(paina ceppina cakramula adhi dēvatalanu okkokkarini dhyāniṃcucu, okadāni tarvāta okaṭilō dhyānamu nilupuṭa).

  1. “aṃguṣṭa gulbha jānūru mūlādhāra liṃganādiṣu |

hṛdgrīvākaṃṭha dēśēṣu laṃbikāyāṃ tatōnasi |

bhrūmadhyē mastakē murdhni, dvādaśāṃtē yathāvidhi |

dhāraṇaṃ prāṇamarutō dhāraṇēti nigadyatē || (dēvī bhāgavataṃ)

” aṃguṣṭādyava yadēṣu yatprāṇa vāyōrdhāraṇaṃ nirōdhaḥ sādhāraṇā ityarthaḥ. ētādṛśō vāyuḥ svādhīnōpēkṣitaḥ”.

(pādāṃguṣṭamu modalu mūrdhnamu vaṟakunuṃḍu aṃgamulaṃdu manassutōsahā prāṇavāyuvunu nilupuṭa dhāraṇayani ceppabaḍicunnadi).

  1. “ślō||. kaucitsva dēhaṃ tarhṛdayāvakāśē prādēśamātraṃ puruṣaṃ vasaṃtaṃ |

caturbhujaṃ, kaṃjaradhāṃgaśaṃkha gadādharaṃ dhāraṇayā smaraṃti |

prasannavaktaṃ nalināyatēkṣaṇaṃ kadaṃbu kiṃ jalkapi śaṃgavāsa saṃ |

llasanmahāratna hiraṇmayāṃ gadaṃ| sphuranmahāratna kirīṭa kuṃḍalaṃ |

ī kṣēta ciṃtāmayamēva maśvaraṃ yāvanmanōdhāraṇa yā vatiṣṭatē |

ēkaikaśōṃgāni dhi yā nubhāvayē tpādāti ya paddasitaṃ gadābhṛtaṃ |

jitaṃ jitaṃ sthānamapōhya dhārayētpāraṃparaṃ śuddhyati dhīryathā yathā ||“. (viṣṇupurāṇamu - 6 - 7)

(tama dēhamulō hṛdayākāśamunaṃdu prādēśamātruḍugā nivasiṃciyuṃḍu puruṣuni nālugu bhujamulu galavāḍuganu, padmamu, cakramu, śaṃkhamu, gada dhariṃcinavāniganu koṃdaṟu dhāraṇāvaśamuna smariṃturu -prasannamaina mogamu galavāniniganu, padmarēkulavale viśālamai aṃdamaina kannulu galavāniniganu, ratnamulatōnu baṃgāramutōnu cēyabaḍina kirīṭamulu, kuṃḍalamulu, aṃgadamu galavāniniganu manassu dhāraṇa kaligiyunnaṃtavaṟaku manassulō citriṃcukoni dhyānamu cēyavalenu - aṭṭi divyamaṃgaḷavigrahamunu pādamulu modalukoni okkokka aṃgamunu dhyāniṃcucu, okkokka dāni mīda dhāraṇa kudirina tarvāta pai aṃgamunu dhyāniṃcucu ī prakāramu cittaśuddhi kramēṇa kalugucuṃḍunaṭlu dhāraṇa navalaṃbhiṃcavalenu).

  1. (vijñāna saṃpannulai yunna prapannuleṃtēni nāpannulugāka vinnāṇaṃbunaṃ dama tama hṛdayāṃrāḷaṃbuṃ brādēśa mātra divya dēhuṃḍunu digi bharājaśuṃḍādaṃḍanaṃ kāśa dīrgha caturbāhuṃḍunu,gaṃdarpakōṭi samāna suṃdaruṃḍunu, dhṛtamaṃdaruṃḍunu, rākā virājamāna rājamaṃḍala sannibhavadanuṃḍunu, saubhāgya sadanuṃḍunu, brabhātakāla bhāsamāna bhāskara biṃba pratimāna virājita padmarāgaratna rājī virājamāna kirīṭakuṃḍaluṃḍunu, śrīvatsa lakṣaṇa lakṣita vakṣō maṃḍaluṃḍunu,ramaṇīya kaustubha ratnakhacita kaṃṭhi kālaṃkruta kaṃdharuṃḍunu, niraṃtara parimaḷa miḷita vanamūlikā baṃdhuruṃḍunu, nānā vidhagaṃbhīra hārakēyūra kaṭaka kaṃkaṇa mē khalāṃguḷīyaka vibhūṣaṇa vrāta samujvaluṃḍunu, niṭalataṭa vilaṃbamāna vimalasnigtha nīla kuṃcita kuṃtaluṃḍunu, dharuṇa caṃdra caṃdrikā dhavaḷamaṃdahāsuṃḍunu, baripūrṇa karuṇāvalōkana bhrūbhaṃga saṃsūcita nubhaga saṃtatānugraha līlā vilāsuṃḍunu, mahā yōgirāja vilasita hṛdaya kamalakarṇikā madhya sthāpita vilasita caraṇa kisalayuṃḍunu, satatānaṃdamayuṃḍunu, sahasrakōṭi sūrya saṃghāta sannibhuṃḍunu, vibhuṃḍunu naina paramēśvaruni manōdhāraṇā vasaṃbuna nilipikoni, tadīya gulbha caraṇa jānu jaṃghādyavayaṃbulaṃ gramaṃbuna nokkokkaṭini brati kṣaṇaṃbunu dhyānaṃbu sēyucu neṃtakālaṃbunaku baripūrṇa niścala bhaktiyōgaṃbu siddhiṃcu naṃtakālaṃbunuṃ dadīya ciṃtā tatparulai yuṃduru.” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 26)

  2. ” thāraṇā niyamaṃbuna sukhātmakaṃbagu viṣayaṃbu navalōkiṃcu yōgiki bhakti lakṣaṇaṃbaina yōgaṃbuna vēgaṃba mōkṣaṃbu siddhiṃcu”

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 -14)

  1. “dhāraṇātri vidhaḥ - ātmani manōdhāraṇaṃ, daharānāśē bāhyākāśa dhāraṇaṃ, pṛdhivyaptējō vāyvākāśēṣu paṃcamūrti dhāraṇaṃ”

(śāṃḍilyōpaniṣat)

(dhāraṇa mūḍu vidhamulu - ātmayaṃdu manasunu nilupuṭa, hṛdayākāśamunaṃdu paina unna ākāśamunu -bahirākāśamunu - uṃcuṭa, bhūmi, jalamu, agni, vāyuvu, ākāśamu anu paṃcabhūtamulaṃdu paṃcamūrtulanu - paṃca brahmalanu bhāvamu nilakaḍa cēyuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.