← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధర్మాధర్మములు dharmādharmamulu

Original — తెలుగు
  1. ” అయం ధర్మో అయం అధర్మోః ఇతి శాస్త్రమేవ విజ్ఞానకారణం అతీంద్రియత్వాత్, తయోర నియత దేశకాలనిమిత్తత్వాచ్చ యస్మిన్ దేశేకాలే నిమిత్తేచ యోధర్మో అనిష్టీయతా స ఏవ దేశకాల నిమిత్తాం తరేషు అధర్మోభవతి. తేన శాస్త్రాదౄతే ధర్మాధర్మ విషయం విజ్ఞానం కశ్చిదస్తి. శాస్త్రాచ్చ హింసానుగ్రహాద్యాత్మకో జ్యోతిష్టోమా ధర్మః ఇత్యవధారితః|సకథ మశుద్ధః ఇతి శక్యతే వక్తుం ?“. (శ్రీశంకరః - బ్రహ్మసూత్ర భాష్యే)

(ఇది ధర్మము, ఇది అధర్మము అనువిషయము మన ఇంద్రియశక్తులకుమించినది. అందుచేత దానిని తెలుసుకొనుట శాస్త్రజ్ఞానము వలననే. ఇది ధర్మము, ఇది అధర్మము అను విచక్షణకు దేశకాల కారణములు లేవు. ఈ కాలములో చేసినది, ఈ ప్రదేశమున చేసినది, ధర్మమని, మిగతా కాలములలో గాని, ప్రదేశములలోగాని, కారణములవలనగాని చేసిన పని అధర్మమని నిర్ణయించుటకు నియమములు లేవు. ఒక దేశమున. ఒక కాలమున, ఒక కారణామువలన చేసిన ధర్మము, మఱియొక దేశమున, మఱియొక కాలమున, మఱియొక నిమిత్తమున చేసినయెడల అది అధర్మమగును. ఇందువలన శాస్త్రము చెప్పినట్లుకాక ధర్మాధర్మ విషయముకలదు. పశుహింస చేసి జ్యోతిష్టోమయాగము చేయవలసినది అని శాస్త్రము చెప్పినప్పుడు ఆ ధర్మము అధర్మమెట్లగును? - “నను జ్యోతిష్టోమాదికం కర్మ పశుహింసాది యోగత్ అశుద్ధం, తత్కారిణామనుశాయినాం వ్రీహ్యాది స్థావరేషు దుఃఖానుభవార్థం ముఖ్యమేవ జన్మాస్తు ఇతి చేత్, న శబ్దాత్ విధి శాస్త్రాత్ అగ్నిష్టోమాదేర్ధర్మత్వేనా వగతత్వాత్ నదుఃఖ హేతుత్వ మిత్యర్థః”.

(జ్యోతిష్టొమము మొదలగు యజ్ఞకర్మలో పశుహింస చేయుట యున్నది కనుక అది అధర్మమే. అందువలన ఆ యజ్ఞ యాగాదులు చేయువారు దీని ఫలమను భవించుటకు వ్రీహియ వాదులుగా జన్మించవలసి యుండుననిన అట్లుకాదు. వేదములో ఈ అగ్నిష్టోమము మొదలగు కర్మ ధర్మమే యని చెప్పబడియుండుట వలన అది దుఃఖకారణముకాదు, దాని ఫలమనుభవించ నవసరములేదు).

  1. “శుచౌదేశే ప్రాతస్సాయంకాలే జీవనాది నిమిత్తకృత మగ్నిహోత్రం ధర్మోభవతి. స ఏవ అశుచిదేశే, మధ్యరాత్రే,మరణాది నిమిత్తే కృతస్సన్ అధర్మో భవతి ఇతి నిర్ణయః శాస్త్రైక సాధ్యః -”

(శుచియైన ప్రదేశమునందు, ప్రాతఃకాలమునందు, సాయంకాలమునందు జీవనము నిమిత్తము చేయు అగ్నిహోత్రము ధర్మమగుచున్నది. అదే అశుచియైన ప్రదేశమున మధ్యరాత్రి కాలమందు ఒకరిని చంపు నుద్దేశముతోచేయబడినయడల అధర్మమగుచున్నది. ఈ నిర్ణయము శాస్త్రమువలననే సాధ్యమగుచున్నది.)

  1. నను నహింస్యాత్ సర్వ భూతాని “ఇతి శాస్త్రమేవ భూతవిషయా హింసాం అధర్మః ఇత్యవగమయతి”

అగ్నిష్టో మయం పశుమాల భేత “ఇతి. తస్మాత్ వైదికం శిష్టైర నుష్టీయ మానత్వాత్ అనింద్యమాన త్వాచ్చ”

(“భూతములను వేటిని హింస చేయరాదు” అని చెప్పుటచేత శాస్త్రమే భూతములను హింసించుట అధర్మము అని చెప్పుచున్నది.” అగ్నిష్టోమ యజ్ఞముకొఱకు పశువును తేవలెను అని కూడ శాస్త్రమే చెప్పుచున్నది. అందువలనను, శిష్టులచే ఈ కర్మ ఆచరింపబడుచున్నందువలనను ఈ కర్మ నింద్యముకాదు, కనుక అది ధర్మముకాదు).

(జీవహింస చేయరాదు అనునది సాధారణ ధర్మము. యజ్ఞములందు పశుహింస చేసినను అధర్మము కాదు అనునది విశేష ధర్మము - జీవహింస చేయకూడదు అనునది సాధారణమైన ధర్మమైనను యజ్ఞయాగాదులందు పశుహింస చేయవచ్చును అనుట విశేషధర్మమైనట్లు. (exception) - (every rule has an exception). “సత్యము పలుకవలయును అనునది సాధారణ ధర్మమైనను, కొన్ని కొన్ని సమయములందు అసత్యముకూడ ధర్మమేయని తెలియుచున్నది. బలిచక్రవర్తి మూడడుగుల భూమిని వామనమూర్తికి దానమిత్తునని వాగ్దానము చేసెను. ఆ మూడడుగులతో వామనమూర్తి బలిచక్రవర్తియొక్క సర్వస్వమును ఆక్రమించునని తెలిపి శుక్రాచార్యుడు ఆ బలిచక్రవర్తి వాగ్దానమును ఉపసమ్హరించుకొనమని, అట్లు చేసిన అది అధర్మము కాదని చెప్పినప్పటికి -

(“వారిజాక్షులందు వైవాహికములందు

ప్రాణ విత్త మానభంగమందు

చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు

బొంకవచ్చు నఘము బొందడధిప”

అని చెప్పినప్పటికీ),

బలిచక్రవర్తి తన మాట నిలబెట్టుకొనెను - ఆడిన మాట తప్పుట అధర్మమని తలచెను - అట్లే – “ఆడినమాట తప్పుటనుచితంబనికదా దశరధేశుడు కాలధర్మమొందె” – సత్యహరిశ్చంద్రుడు విశ్వామిత్రునకు ఇచ్చెదనని చెప్పిన పైకము నిచ్చుటకు రాజ్యమును వదలి, తనను, తన భార్యను అమ్ముకొనెను, కాటికాపరిగా ప్రవర్తించెను - అంతేగాని, ఆ పైకము ఈయననిగాని, ఈయలేననిగాని పలుకలేదు - వీరు ధర్మమునే పాటించిరి - ” మాట తిరుగలేరు మానధనులు” అందుచేత ధర్మము, విశేషధర్మము అను రెండింటిలోను ధర్మమే బలీయమైనది).

  1. ” వర్తమాన వసంతాదికాలంబు భూత భావి వసంతాది కాలయోగ్యంబైన పుష్ప ఫలాదులు తత్కాల జ్ఞాపకంబు నెట్లుసేయు నట్లు భూత భావి జన్మంబులకు ధర్మా ధర్మంబులు నిదర్శనంబులు సేయుచుండు“. (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 6 - 21 -)

  2. “ధర్మాధర్మే సుఖం దుఃఖం మానసాని, నతే విభో |”. (అష్టావక్రగీత - 1 - 6)

(ధర్మము, అధర్మము, సుఖము, దుఃఖము అనునవి మనస్సునకు సంబంధించినవి - నీవికావు. నీకు (భగవంతునికి) సంబంధించినవికావు).

Transliteration
  1. ” ayaṃ dharmō ayaṃ adharmōḥ iti śāstramēva vijñānakāraṇaṃ atīṃdriyatvāt, tayōra niyata dēśakālanimittatvācca yasmin dēśēkālē nimittēca yōdharmō aniṣṭīyatā sa ēva dēśakāla nimittāṃ tarēṣu adharmōbhavati. tēna śāstrādṝtē dharmādharma viṣayaṃ vijñānaṃ kaścidasti. śāstrācca hiṃsānugrahādyātmakō jyōtiṣṭōmā dharmaḥ ityavadhāritaḥ|sakatha maśuddhaḥ iti śakyatē vaktuṃ ?“. (śrīśaṃkaraḥ - brahmasūtra bhāṣyē)

(idi dharmamu, idi adharmamu anuviṣayamu mana iṃdriyaśaktulakumiṃcinadi. aṃducēta dānini telusukonuṭa śāstrajñānamu valananē. idi dharmamu, idi adharmamu anu vicakṣaṇaku dēśakāla kāraṇamulu lēvu. ī kālamulō cēsinadi, ī pradēśamuna cēsinadi, dharmamani, migatā kālamulalō gāni, pradēśamulalōgāni, kāraṇamulavalanagāni cēsina pani adharmamani nirṇayiṃcuṭaku niyamamulu lēvu. oka dēśamuna. oka kālamuna, oka kāraṇāmuvalana cēsina dharmamu, maṟiyoka dēśamuna, maṟiyoka kālamuna, maṟiyoka nimittamuna cēsinayeḍala adi adharmamagunu. iṃduvalana śāstramu ceppinaṭlukāka dharmādharma viṣayamukaladu. paśuhiṃsa cēsi jyōtiṣṭōmayāgamu cēyavalasinadi ani śāstramu ceppinappuḍu ā dharmamu adharmameṭlagunu? - “nanu jyōtiṣṭōmādikaṃ karma paśuhiṃsādi yōgat aśuddhaṃ, tatkāriṇāmanuśāyināṃ vrīhyādi sthāvarēṣu duḥkhānubhavārthaṃ mukhyamēva janmāstu iti cēt, na śabdāt vidhi śāstrāt agniṣṭōmādērdharmatvēnā vagatatvāt naduḥkha hētutva mityarthaḥ”.

(jyōtiṣṭomamu modalagu yajñakarmalō paśuhiṃsa cēyuṭa yunnadi kanuka adi adharmamē. aṃduvalana ā yajña yāgādulu cēyuvāru dīni phalamanu bhaviṃcuṭaku vrīhiya vādulugā janmiṃcavalasi yuṃḍunanina aṭlukādu. vēdamulō ī agniṣṭōmamu modalagu karma dharmamē yani ceppabaḍiyuṃḍuṭa valana adi duḥkhakāraṇamukādu, dāni phalamanubhaviṃca navasaramulēdu).

  1. “śucaudēśē prātassāyaṃkālē jīvanādi nimittakṛta magnihōtraṃ dharmōbhavati. sa ēva aśucidēśē, madhyarātrē,maraṇādi nimittē kṛtassan adharmō bhavati iti nirṇayaḥ śāstraika sādhyaḥ -”

(śuciyaina pradēśamunaṃdu, prātaḥkālamunaṃdu, sāyaṃkālamunaṃdu jīvanamu nimittamu cēyu agnihōtramu dharmamagucunnadi. adē aśuciyaina pradēśamuna madhyarātri kālamaṃdu okarini caṃpu nuddēśamutōcēyabaḍinayaḍala adharmamagucunnadi. ī nirṇayamu śāstramuvalananē sādhyamagucunnadi.)

  1. nanu nahiṃsyāt sarva bhūtāni “iti śāstramēva bhūtaviṣayā hiṃsāṃ adharmaḥ ityavagamayati”

agniṣṭō mayaṃ paśumāla bhēta “iti. tasmāt vaidikaṃ śiṣṭaira nuṣṭīya mānatvāt aniṃdyamāna tvācca”

(“bhūtamulanu vēṭini hiṃsa cēyarādu” ani ceppuṭacēta śāstramē bhūtamulanu hiṃsiṃcuṭa adharmamu ani ceppucunnadi.” agniṣṭōma yajñamukoṟaku paśuvunu tēvalenu ani kūḍa śāstramē ceppucunnadi. aṃduvalananu, śiṣṭulacē ī karma ācariṃpabaḍucunnaṃduvalananu ī karma niṃdyamukādu, kanuka adi dharmamukādu).

(jīvahiṃsa cēyarādu anunadi sādhāraṇa dharmamu. yajñamulaṃdu paśuhiṃsa cēsinanu adharmamu kādu anunadi viśēṣa dharmamu - jīvahiṃsa cēyakūḍadu anunadi sādhāraṇamaina dharmamainanu yajñayāgādulaṃdu paśuhiṃsa cēyavaccunu anuṭa viśēṣadharmamainaṭlu. (exception) - (every rule has an exception). “satyamu palukavalayunu anunadi sādhāraṇa dharmamainanu, konni konni samayamulaṃdu asatyamukūḍa dharmamēyani teliyucunnadi. balicakravarti mūḍaḍugula bhūmini vāmanamūrtiki dānamittunani vāgdānamu cēsenu. ā mūḍaḍugulatō vāmanamūrti balicakravartiyokka sarvasvamunu ākramiṃcunani telipi śukrācāryuḍu ā balicakravarti vāgdānamunu upasamhariṃcukonamani, aṭlu cēsina adi adharmamu kādani ceppinappaṭiki -

(“vārijākṣulaṃdu vaivāhikamulaṃdu

prāṇa vitta mānabhaṃgamaṃdu

cakita gōkulāgra janma rakṣaṇamaṃdu

boṃkavaccu naghamu boṃdaḍadhipa”

ani ceppinappaṭikī),

balicakravarti tana māṭa nilabeṭṭukonenu - āḍina māṭa tappuṭa adharmamani talacenu - aṭlē – “āḍinamāṭa tappuṭanucitaṃbanikadā daśaradhēśuḍu kāladharmamoṃde” – satyahariścaṃdruḍu viśvāmitrunaku iccedanani ceppina paikamu niccuṭaku rājyamunu vadali, tananu, tana bhāryanu ammukonenu, kāṭikāparigā pravartiṃcenu - aṃtēgāni, ā paikamu īyananigāni, īyalēnanigāni palukalēdu - vīru dharmamunē pāṭiṃciri - ” māṭa tirugalēru mānadhanulu” aṃducēta dharmamu, viśēṣadharmamu anu reṃḍiṃṭilōnu dharmamē balīyamainadi).

  1. ” vartamāna vasaṃtādikālaṃbu bhūta bhāvi vasaṃtādi kālayōgyaṃbaina puṣpa phalādulu tatkāla jñāpakaṃbu neṭlusēyu naṭlu bhūta bhāvi janmaṃbulaku dharmā dharmaṃbulu nidarśanaṃbulu sēyucuṃḍu”. (śrīmadāṃdhra mahābhāgavatamu - 6 - 21 -)

  2. “dharmādharmē sukhaṃ duḥkhaṃ mānasāni, natē vibhō |”. (aṣṭāvakragīta - 1 - 6)

(dharmamu, adharmamu, sukhamu, duḥkhamu anunavi manassunaku saṃbaṃdhiṃcinavi - nīvikāvu. nīku (bhagavaṃtuniki) saṃbaṃdhiṃcinavikāvu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.