(ధర్మభూమి, ధర్మమునకు స్థానమైనది),
(ధర్మమునకు, దాని అభివృద్ధికి క్షేత్రమైనది, కారణమైనది కురుక్షేత్రమని చెప్పబడుచున్నది - అది ధర్మక్షేత్రము.
(మధుసూదనః)
(ఇదివరకు కనబడని ధర్మము ఉత్పాదించుటకు, ఉత్పత్తి అయిన ధర్మము వృద్ధిపొందుటకు కారణమైనది - సస్యమును ఉత్పత్తి చేయు పొలమువలె నుండునది - అన్ని శ్రుతులలోను చెప్పబడినది - కురుక్షేత్రము).
శ్రుతి స్మృతి ప్రసిద్ధే (అ)స్మిన్ కురుక్షేత్రే - - ||. (గీతాభావప్రకాశము - 1 - 88, 89)
(ధర్మమునుత్పాదించునది, ధర్మమును వృద్ధి చేయుట అను ఒకే కారణముకలది - శ్రుతులలోను, స్మృతులలోను, ప్రసిద్ధికెక్కినది ధర్మక్షేత్రము - పాండవులు, కౌరవులు యుద్ధము చేసిన క్షేత్రము - స్థలము - ఈ యుద్ధములో ధర్మము పాండవుల ప్రక్కనుండుటవలన పాండవులే జయించిరి. ఈ భూమిమీద ఏ యుద్ధముజరిగినను ధర్మమే జయించును. దీనికి కురుక్షేత్రమని పేరు –
“ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయు యుత్స్వః |
మామకాః పాండవాశ్చైవ కి మ కుర్వత సంజయ ||“. (శ్రీమద్భగవద్గీత - 1 - 1)
(ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమందు మావారైన కౌరవులు, పాండవులు యుద్ధముచేయు కోరికతో సిద్ధమై ఏమి చేసిరి? అని ధృతరాష్ట్రుడు సంజయుని అడిగెను, అతని ప్రశ్నలోనే అది ధర్మక్షేత్రమని చెప్పుటచేత రాబోవు ఫలితము అతని నోటి వెంటనే పలుకబడింది. ఇది ధర్మక్షేత్రముకనుక ధర్మమెవరిప్రక్కనుండునో వారికే విజయము కలుగునని ధ్వని).
అనుగ్రాహక భావేన క్షేత్రవత్ క్షేత్రముచ్యతే |
సర్వేషాంచైవ ధర్మాణాముత్పాదకతయా తథా |
ఆయంతం పరమో ధర్మో యద్యోగేనాత్మదర్శనం |
ఆత్మజ్ఞానమయో ధర్మః సాధ్యతే(అ)త్ర ముముక్షుభిః |
క్షయాత్ సమస్త ధర్మాణామప వర్గైక లాభతః |
త్రాణభూతం ముముక్షో స్తద్ధర్మక్షేత్రం శరీరకం |
క్షేత్రాణాం పరమం క్షేత్రం శరీరం క్షేత్రముచ్యతే ||” (గీతాభావప్రకాశము - 1 - 109 to 113)
క్షేత్రమనగా దేహము. దేహము సర్వ ధర్మములకును ఉత్పాదకము –
“శరీర మాద్యం ఖలుధర్మ సాధనం”
(ధర్మము సాధించుటకు శరీరము మొదటి సాధనము - ముఖ్యసాధనము - శరీరము కలిగియుండిననే యే ధర్మములనైనను సాధించ గలుగుదుము). అందుచేత దేహము ధర్మ క్షేత్రము - ఈ దేహములో ఆసురసంపత్తి, దైవసంపత్తికి సంబంధించిన గుణములున్నవి. ఈ రెండింటికి నిత్యము యుద్ధము జరుగుచునే యుండును. వాటిలోదైవసంపత్తికి సంబంధించినగుణములు ధర్మమునకు సంబంధించినవికనుక అవియే జయము పొందును).
(యోగముద్వారా పరమాత్మసాక్షాత్కారము పొందుటే పరమ ధర్మము. ఆత్మ జ్ఞాన రూపమైన ధర్మము - మోక్షము - ఇది అట్టి మోక్షమును కోరువారిచే ఈ శరీరము ద్వారానే సాధించబడుచున్నది. మిగిలిన ధర్మములన్నింటినీ విడిచిపెట్టి మోక్షమును చేకూర్చునది కనుక శరీరము ధర్మ క్షేత్రము. సస్యములనుకాని, ఇతరములనుగాని పండించు క్షేత్రములన్నింటికన్న పరమము. ఉత్కృష్టమైన క్షేత్రము అని చెప్పబడుచున్నవి).
(భగవంతుడే ధర్మము, భగవంతుడెక్కడ ఉంటే అక్కడే ధర్మముండును - ధర్మమెక్కడ ఉండునో అక్కడే విజయము –
“యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |
“తత్రశ్రీర్విజయో భూతిర్ధృవానీతిర్మతిర్మమ ||”. (శ్రీమద్భగవద్గీత - 18 - 78)
“ఇత్యస్య చ ధర్మస్య క్షేత్రం సమస్తా ధర్మాణాం క్షయా దపవర్గపాప్త్యా త్రాణభూతం తదధికారి శరీరం సర్వ క్షేత్రాణాం అక్షాదేః హిం సార్థత్వాత్ పరస్పర బాధ్యబాధక భావేన వర్తమానా నాం రాగ వైరాగ్య క్రోధక్షమా ప్రభృతీనాం సమాగమో యత్ర తత్ధర్మ క్షేత్రం.” (అభినవ గుప్తాచార్యః)
(ఇంద్రియములకు క్షేత్రమైనది శరీరము. సంసారమునకు సంబంధించిన అన్ని ధర్మములకు ఉత్పత్తి స్థానము అయినది. “యోగము ద్వారా పరమాత్మసాక్షాత్కరము కలుగును కనుక ఇదియే పరమ ధర్మము” అని చెప్పుటచేత మిగిలిన శారీరక ధర్మములన్నింటిని క్షీణింపచేసి శారీరిక - యోగాధికారికి మోక్షప్రాప్తి చేకూర్చునది కనుక ధర్మక్షేత్రము శరీరము).
ధర్మమనగా పరమాత్మ, క్షేత్రమనగా వసించుచోటు - పరమాత్మ నివసించు స్థానము - ఒక క్షేత్రములో - భూమిలో - వేసిన ఒక బీజము మొలకెత్తి పెద్దదై ఫలమునిచ్చునట్లు ఈ శరీరమను క్షేత్రమందు ధర్మమను బీజము మొలకెత్తి పెద్దదై మోక్షమను ఫలమునిచ్చును. అందుచేత ఈ శరీరమే ధర్మక్షేత్రము.
ధర్మమనగా పుణ్యము - పుణ్యము కలుగచేయు క్షేత్రము - పుణ్యక్షేత్రము - అనేక యజ్ఞములు, యాగములు మొదలగువాటిని మహా ఋషులు ఇచ్చట చేసినదగుటచేత పుణ్యభూమి, ధర్మభూమి, ధర్మక్షేత్రము - మహాపురుషులు, సత్పురుషులు అయినవారి పాద ధూళిచేతను, పురానపఠనము, శ్రవణము మొదలగు సత్కాలక్షేపము చేతను, జపతపములచేతను పునీతమైనది కనుక పుణ్యక్షేత్రము, ధర్మక్షేత్రము.
“మ. వినుమే దేశములన్ దయాగుణ తపో విద్యాన్వితంబైన వి
ప్రనికాయంబు వసించు, నే స్థలములన్ భాగీరధీముఖ్య వా
హినులుండున్, హరిపూజలెయ్యడల భూయిష్ట ప్రకారంబులన్
దనరున్, భూవర| యట్టి చోటుల దగున్ ధర్మంబులన్ చేయగన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 14 - 449).
అట్టి దేశములు - ప్రదేశములు ధర్మక్షేత్రములు.
(dharmabhūmi, dharmamunaku sthānamainadi),
(dharmamunaku, dāni abhivṛddhiki kṣētramainadi, kāraṇamainadi kurukṣētramani ceppabaḍucunnadi - adi dharmakṣētramu.
(madhusūdanaḥ)
(idivaraku kanabaḍani dharmamu utpādiṃcuṭaku, utpatti ayina dharmamu vṛddhipoṃduṭaku kāraṇamainadi - sasyamunu utpatti cēyu polamuvale nuṃḍunadi - anni śrutulalōnu ceppabaḍinadi - kurukṣētramu).
śruti smṛti prasiddhē (a)smin kurukṣētrē - - ||. (gītābhāvaprakāśamu - 1 - 88, 89)
(dharmamunutpādiṃcunadi, dharmamunu vṛddhi cēyuṭa anu okē kāraṇamukaladi - śrutulalōnu, smṛtulalōnu, prasiddhikekkinadi dharmakṣētramu - pāṃḍavulu, kauravulu yuddhamu cēsina kṣētramu - sthalamu - ī yuddhamulō dharmamu pāṃḍavula prakkanuṃḍuṭavalana pāṃḍavulē jayiṃciri. ī bhūmimīda ē yuddhamujariginanu dharmamē jayiṃcunu. dīniki kurukṣētramani pēru –
“dharmakṣētrē kurukṣētrē samavētāyu yutsvaḥ |
māmakāḥ pāṃḍavāścaiva ki ma kurvata saṃjaya ||“. (śrīmadbhagavadgīta - 1 - 1)
(dharmakṣētramaina kurukṣētramaṃdu māvāraina kauravulu, pāṃḍavulu yuddhamucēyu kōrikatō siddhamai ēmi cēsiri? ani dhṛtarāṣṭruḍu saṃjayuni aḍigenu, atani praśnalōnē adi dharmakṣētramani ceppuṭacēta rābōvu phalitamu atani nōṭi veṃṭanē palukabaḍiṃdi. idi dharmakṣētramukanuka dharmamevariprakkanuṃḍunō vārikē vijayamu kalugunani dhvani).
anugrāhaka bhāvēna kṣētravat kṣētramucyatē |
sarvēṣāṃcaiva dharmāṇāmutpādakatayā tathā |
āyaṃtaṃ paramō dharmō yadyōgēnātmadarśanaṃ |
ātmajñānamayō dharmaḥ sādhyatē(a)tra mumukṣubhiḥ |
kṣayāt samasta dharmāṇāmapa vargaika lābhataḥ |
trāṇabhūtaṃ mumukṣō staddharmakṣētraṃ śarīrakaṃ |
kṣētrāṇāṃ paramaṃ kṣētraṃ śarīraṃ kṣētramucyatē ||” (gītābhāvaprakāśamu - 1 - 109 to 113)
kṣētramanagā dēhamu. dēhamu sarva dharmamulakunu utpādakamu –
“śarīra mādyaṃ khaludharma sādhanaṃ”
(dharmamu sādhiṃcuṭaku śarīramu modaṭi sādhanamu - mukhyasādhanamu - śarīramu kaligiyuṃḍinanē yē dharmamulanainanu sādhiṃca galugudumu). aṃducēta dēhamu dharma kṣētramu - ī dēhamulō āsurasaṃpatti, daivasaṃpattiki saṃbaṃdhiṃcina guṇamulunnavi. ī reṃḍiṃṭiki nityamu yuddhamu jarugucunē yuṃḍunu. vāṭilōdaivasaṃpattiki saṃbaṃdhiṃcinaguṇamulu dharmamunaku saṃbaṃdhiṃcinavikanuka aviyē jayamu poṃdunu).
(yōgamudvārā paramātmasākṣātkāramu poṃduṭē parama dharmamu. ātma jñāna rūpamaina dharmamu - mōkṣamu - idi aṭṭi mōkṣamunu kōruvāricē ī śarīramu dvārānē sādhiṃcabaḍucunnadi. migilina dharmamulanniṃṭinī viḍicipeṭṭi mōkṣamunu cēkūrcunadi kanuka śarīramu dharma kṣētramu. sasyamulanukāni, itaramulanugāni paṃḍiṃcu kṣētramulanniṃṭikanna paramamu. utkṛṣṭamaina kṣētramu ani ceppabaḍucunnavi).
(bhagavaṃtuḍē dharmamu, bhagavaṃtuḍekkaḍa uṃṭē akkaḍē dharmamuṃḍunu - dharmamekkaḍa uṃḍunō akkaḍē vijayamu –
“yatra yōgēśvaraḥ kṛṣṇō yatra pārthō dhanurdharaḥ |
“tatraśrīrvijayō bhūtirdhṛvānītirmatirmama ||”. (śrīmadbhagavadgīta - 18 - 78)
“ityasya ca dharmasya kṣētraṃ samastā dharmāṇāṃ kṣayā dapavargapāptyā trāṇabhūtaṃ tadadhikāri śarīraṃ sarva kṣētrāṇāṃ akṣādēḥ hiṃ sārthatvāt paraspara bādhyabādhaka bhāvēna vartamānā nāṃ rāga vairāgya krōdhakṣamā prabhṛtīnāṃ samāgamō yatra tatdharma kṣētraṃ.” (abhinava guptācāryaḥ)
(iṃdriyamulaku kṣētramainadi śarīramu. saṃsāramunaku saṃbaṃdhiṃcina anni dharmamulaku utpatti sthānamu ayinadi. “yōgamu dvārā paramātmasākṣātkaramu kalugunu kanuka idiyē parama dharmamu” ani ceppuṭacēta migilina śārīraka dharmamulanniṃṭini kṣīṇiṃpacēsi śārīrika - yōgādhikāriki mōkṣaprāpti cēkūrcunadi kanuka dharmakṣētramu śarīramu).
dharmamanagā paramātma, kṣētramanagā vasiṃcucōṭu - paramātma nivasiṃcu sthānamu - oka kṣētramulō - bhūmilō - vēsina oka bījamu molaketti peddadai phalamuniccunaṭlu ī śarīramanu kṣētramaṃdu dharmamanu bījamu molaketti peddadai mōkṣamanu phalamuniccunu. aṃducēta ī śarīramē dharmakṣētramu.
dharmamanagā puṇyamu - puṇyamu kalugacēyu kṣētramu - puṇyakṣētramu - anēka yajñamulu, yāgamulu modalaguvāṭini mahā ṛṣulu iccaṭa cēsinadaguṭacēta puṇyabhūmi, dharmabhūmi, dharmakṣētramu - mahāpuruṣulu, satpuruṣulu ayinavāri pāda dhūḷicētanu, purānapaṭhanamu, śravaṇamu modalagu satkālakṣēpamu cētanu, japatapamulacētanu punītamainadi kanuka puṇyakṣētramu, dharmakṣētramu.
“ma. vinumē dēśamulan dayāguṇa tapō vidyānvitaṃbaina vi
pranikāyaṃbu vasiṃcu, nē sthalamulan bhāgīradhīmukhya vā
hinuluṃḍun, haripūjaleyyaḍala bhūyiṣṭa prakāraṃbulan
danarun, bhūvara| yaṭṭi cōṭula dagun dharmaṃbulan cēyagan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 14 - 449).
aṭṭi dēśamulu - pradēśamulu dharmakṣētramulu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.