“దేశకాలవయోవస్థా బుద్ధి శక్త్యను రూపతః |
ధర్మోపదేశో భైషజ్యం వక్తవ్యం ధర్మపారగైః ||“.
(ధర్మమును సమగ్రముగా నెఱింగినవారు దేశమునకు, పరిస్థితికి, బుద్ధికి, శక్తికి యోగ్యములైన ధర్మములను ఉపదేశింపవలయును).
(పూజలు, జపము, తపము, వ్రతము మొదలగునవి చేయుటవలన చిత్త శుద్ధి కలుగును. చిత్త శుద్ధి లేనిచో కామము, క్రోధము మొదలగునవి నశింపవు. కామక్రోధాదులు నశింపనిదే ఏకాగ్రచిత్తము కుదరదు. ఏకాగ్రత లేనిదే వైరాగ్యము కుదరదు - వైరాగ్యములేనిచో సాధన చుతుష్టయ సంపత్తిగాని సద్గురుని ఆశ్రయించుటగాని చేకూరదు -సద్గురుని ఆశ్రయింపనిచో బ్రహ్మజ్ఞానముకలుగదు బ్రహ్మజ్ఞానము కలుగకున్న సంసారము నశించదు, నిరతిశయ సుఖమైన మోక్షము లభింపదు - ఇందుచేత గురువులయినవారు వారి శిష్యుల చిత్త పరిపక్వదశననుసరించి, దానికి తగిన విధమున బోధింపవలయును. తత్వమును తెలుసుకోగలిగినవారికి జ్ఞానయోగము, అట్టి జ్ఞానము లేనివారికి కర్మ యోగము, భక్తియోగము ఉపదేశింపవలయును).
“dēśakālavayōvasthā buddhi śaktyanu rūpataḥ |
dharmōpadēśō bhaiṣajyaṃ vaktavyaṃ dharmapāragaiḥ ||“.
(dharmamunu samagramugā neṟiṃginavāru dēśamunaku, paristhitiki, buddhiki, śaktiki yōgyamulaina dharmamulanu upadēśiṃpavalayunu).
(pūjalu, japamu, tapamu, vratamu modalagunavi cēyuṭavalana citta śuddhi kalugunu. citta śuddhi lēnicō kāmamu, krōdhamu modalagunavi naśiṃpavu. kāmakrōdhādulu naśiṃpanidē ēkāgracittamu kudaradu. ēkāgrata lēnidē vairāgyamu kudaradu - vairāgyamulēnicō sādhana cutuṣṭaya saṃpattigāni sadguruni āśrayiṃcuṭagāni cēkūradu -sadguruni āśrayiṃpanicō brahmajñānamukalugadu brahmajñānamu kalugakunna saṃsāramu naśiṃcadu, niratiśaya sukhamaina mōkṣamu labhiṃpadu - iṃducēta guruvulayinavāru vāri śiṣyula citta paripakvadaśananusariṃci, dāniki tagina vidhamuna bōdhiṃpavalayunu. tatvamunu telusukōgaliginavāriki jñānayōgamu, aṭṭi jñānamu lēnivāriki karma yōgamu, bhaktiyōgamu upadēśiṃpavalayunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.