← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధ్రువం dhruvaṃ

Original — తెలుగు
  1. “నిత్యః; అవినాశిత్వాత్ ధ్రువః” (శ్రీశంకరః)

(నిత్యమైనది; ఎల్లపుడు ఉండునది; నశింపనిది కనుక ధ్రువము).

  1. అచలం; అవిచాల్యం;కూటస్థః.

(చలింపనిది,చలింపచేయుటకువీలుకానిది,కూటమువలె నిలకడగానుండునది).

  1. ఆత్మవన్నిత్యం. (ఆత్మవలె నిత్యమైనది, ఎల్లపుడు ఉండునది).

  2. శాశ్వతత్వాత్ ధ్రువః. (శాశ్వతముగా నుండునది కనుక ధ్రువము).

  3. తేనైవ రూపేణ స్థితః. (మార్పులేక అదేరూపముతో నుండువాడు).

  4. అపరిణామి - (మార్పు లేనిది, మార్పు చెందనిది).

  5. సదా ఏక రసమితి యావత్. (ఎల్లపుడు ఒక రసముగా - చైతన్యరసముగా - ఒకే రీతిగా నుండువాడు).

  6. జన్మ నిధన రహితః (జనన మరణములు లేనిది).

  7. వృద్ధ్యాది రహితం (వృద్ధి - పెరుగుట - మొదలగునవి లేనిది).

  8. అప్రచ్యుత స్వరూపం, అక్షరం ఇత్యర్థః (అప్రచ్యుత స్వరూపముగలది, క్షీణింపనిది, నశింపనిది).

  9. నిశ్చితం; అపరిహార్యం ; ఆవశ్యకం.(నిశ్చయము చేయబడినది; పరిహరింపవీలుకానిది, ఆవశ్యకమైనది).

  10. అధ్రువ మాయా పాయాత్. (అధ్రువమగు మాయను పోగొట్టునది కనుక ధ్రువము).

  11. “అతో మాయావి కారాణామధిష్ఠాన తయా (అ)చలం |

అత ఏవ ధ్రువం నిత్యం పరిణామ వివర్జితం |”

“తత్పరిత్యాగ పూర్వకం ప్రత్యగభిన్నః శివ ఏవ సాక్షాత్కార పర్యంతం ధ్యేయః ఇతి భావః”- (చూడుము - 5).

(ధ్యానము వలన కలిగిన సాక్షాత్కార వృత్తియందు ఆరూఢుడై అజ్ఞానము దాని కార్యముయొక్క నివృత్తి ద్వారా పరమానందమును కలిగించువాడున్నూ, తానే పరమానందరూప ప్రత్యగాత్మ యగుటవలన, ఆత్మజ్యోతిని తప్పించి ఇతరమంతా అనాత్మయగుట వలన మిధ్య యగుటవలన దానిని పరిత్యాగపూర్వకముగా ప్రత్యక్ కంటె వేరుగాని శివుడు సాక్షాత్కారమగువరకు ధ్యానించ తగినవాడు).

  1. కారణం త ధ్యే యః.

(కారణతత్వమునే - అనగా కారణకార్యములకు ఆదికారణము, మూలకారణము, కారణములకు కారణము అయిన భగవత్తత్వమే ధ్యానించతగినది - దానినే ధ్యానించవలెను).

  1. “ధ్యేయాయ ధ్యానరూపాయ ధ్యాను యిత్రే నమోనమః”. (పద్మపురాణము)

(ధ్యానము చేయతగినవాడు, ధ్యానరూపుడైనవాడు, ధ్యానము చేయబడువానికి నమస్కరించుచున్నాను).

Transliteration
  1. “nityaḥ; avināśitvāt dhruvaḥ” (śrīśaṃkaraḥ)

(nityamainadi; ellapuḍu uṃḍunadi; naśiṃpanidi kanuka dhruvamu).

  1. acalaṃ; avicālyaṃ;kūṭasthaḥ.

(caliṃpanidi,caliṃpacēyuṭakuvīlukānidi,kūṭamuvale nilakaḍagānuṃḍunadi).

  1. ātmavannityaṃ. (ātmavale nityamainadi, ellapuḍu uṃḍunadi).

  2. śāśvatatvāt dhruvaḥ. (śāśvatamugā nuṃḍunadi kanuka dhruvamu).

  3. tēnaiva rūpēṇa sthitaḥ. (mārpulēka adērūpamutō nuṃḍuvāḍu).

  4. apariṇāmi - (mārpu lēnidi, mārpu ceṃdanidi).

  5. sadā ēka rasamiti yāvat. (ellapuḍu oka rasamugā - caitanyarasamugā - okē rītigā nuṃḍuvāḍu).

  6. janma nidhana rahitaḥ (janana maraṇamulu lēnidi).

  7. vṛddhyādi rahitaṃ (vṛddhi - peruguṭa - modalagunavi lēnidi).

  8. apracyuta svarūpaṃ, akṣaraṃ ityarthaḥ (apracyuta svarūpamugaladi, kṣīṇiṃpanidi, naśiṃpanidi).

  9. niścitaṃ; aparihāryaṃ ; āvaśyakaṃ.(niścayamu cēyabaḍinadi; parihariṃpavīlukānidi, āvaśyakamainadi).

  10. adhruva māyā pāyāt. (adhruvamagu māyanu pōgoṭṭunadi kanuka dhruvamu).

  11. “atō māyāvi kārāṇāmadhiṣṭhāna tayā (a)calaṃ |

ata ēva dhruvaṃ nityaṃ pariṇāma vivarjitaṃ |”

“tatparityāga pūrvakaṃ pratyagabhinnaḥ śiva ēva sākṣātkāra paryaṃtaṃ dhyēyaḥ iti bhāvaḥ”- (cūḍumu - 5).

(dhyānamu valana kaligina sākṣātkāra vṛttiyaṃdu ārūḍhuḍai ajñānamu dāni kāryamuyokka nivṛtti dvārā paramānaṃdamunu kaligiṃcuvāḍunnū, tānē paramānaṃdarūpa pratyagātma yaguṭavalana, ātmajyōtini tappiṃci itaramaṃtā anātmayaguṭa valana midhya yaguṭavalana dānini parityāgapūrvakamugā pratyak kaṃṭe vērugāni śivuḍu sākṣātkāramaguvaraku dhyāniṃca taginavāḍu).

  1. kāraṇaṃ ta dhyē yaḥ.

(kāraṇatatvamunē - anagā kāraṇakāryamulaku ādikāraṇamu, mūlakāraṇamu, kāraṇamulaku kāraṇamu ayina bhagavattatvamē dhyāniṃcataginadi - dāninē dhyāniṃcavalenu).

  1. “dhyēyāya dhyānarūpāya dhyānu yitrē namōnamaḥ”. (padmapurāṇamu)

(dhyānamu cēyataginavāḍu, dhyānarūpuḍainavāḍu, dhyānamu cēyabaḍuvāniki namaskariṃcucunnānu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.