అనన్యమనసా చింతనం. (ఒకే విషయమును గుఱించి మనస్సులో ఆలోచించుట).
తైలధారవద విచ్ఛిన్నస్మృతి సంతాన రూపం. (నూనె ధార తెగకుండునుండునట్లు స్మరణ చేయుట).
మనసః ధ్యేయైక రూపతా - (మనసులో ఒకే ధ్యాయము కలిగియుండిట).
మానసికవిధమైన అర్చన - మనసులో ఇష్టదైవమును అర్చించుట).
చాంచల్యములేక భగవంతుని మనసులో ధ్యానించుట. ధ్యానింపతగిన వస్తువునందు బుద్ధి నిలిపి దానిని మరువకుండుట.
” తత్ర ప్రత్యైక తానతా ధ్యానం” (పతంజలి యోగసూత్రములు)
(ధారణకొఱకు నియమించుకొనిన వస్తువునే, లేక, భగవంతుని సుగుణరూపమునే తైలధారవలె ఎడతెగకుండునట్లు చిత్తములో నుంచుకొనుట).
(శ్రవణము భగవంతుని దర్శనము మొదలగువాటి వలన కలిగిన వాసనా మయమైన వస్తువును మనసులో చూచుట ధ్యానము).
ఆత్మ స్వరూపచితనం - (పరమాత్మయొక్క యదార్థరూపమగుఱించి చింతించుట).
నిరాలంబ బ్రహ్మభావనం. (ఇంకొకదానియందు ఆలంబనము లేక బ్రహ్మమందే భావన కలిగియుండుట).
నిరంతర భగవచ్చింతనం. (ఎల్లపుడు తెరిపి లేకుండా భగవంతుని చింతించుట).
ఏకార్థ గోచరాత్మ ధారణం ధ్యానం.
ఒకే విషయముగా ఆత్మనుగుఱించి అయిన ధారణ ధ్యానము -
స్వరూప ప్రత్యయ తయా చిత్తస్యైక తానతా. (భగవంతుని స్వస్వరూపముతో చిత్తమును ఐక్యముచేయుట).
“సర్వ శరీరేషు చైతస్యైక తానతా ధ్యానం” (మండల బ్రాహ్మణోపనిషత్)
(అన్నిశరీరములందును - అన్ని వస్తువులందును - ఉన్న చైతన్యశక్తి ఒక్కటేయని ధ్యానించుట).
(నేను బ్రహ్మను అయితిని అను ధృఢమైన భావన ధ్యానము).
ధ్యాన శబ్దేన విఖ్యాతా పరమానంద దాయినీ ||“.
(నేను బ్రహ్మమే అయితిని అని ధృఢముగా ఇతరాలంబనము లేక యుండుస్థితి).
(అద్వితీయమైన - తనుకాక రెండవ వస్తువు లేనివాడైన - బ్రహ్మ వస్తువునందు అప్పుడప్పుడు తెగిపోవుచుండు చిత్తవృత్తిని ప్రవాహరూపముగా నుంచుట).
(అనేక మూకుళ్ళు, కుండలు మొదలగు వాటిలో వేరు వేరుగానున్నప్పటికీ ఆకాశము ముక్కలుగా లేక అంతా ఒకటే అయి యున్నట్లు భగవంతుడు అన్ని వస్తువులలోనున్నప్పటికీ, అవి ముక్కలు ముక్కలుగా కాక అంతా ఏకమే అని దృఢమైన భావన కలిగియుండుట).
(శబ్దము మొదలగు విషయములనుండి శ్రోత్రము మొదలగు నింద్రియములను మనస్సు లోనికి లాగికొని ఉంచి మనస్సును ప్రత్యక్చైతన్యము నందు ఏకాగ్రత - అది ఒకటే లక్ష్యముగా - కలిగించుకొని చింతించుట ధ్యానము - ఒక ధ్యానము చేసినట్లు కదలక మెదలకయుండుట, భూమధ్యానము చేయుచున్నట్లు కదలిక లేకయుండినట్లుండుట పర్వతములు కదలక మెదలక ధ్యానము చేసినట్లుండుట).
అంతఃకరణం చైతన్యాం తర్వర్తి ధ్యానేన కౄత్వా తస్మిన్నాత్మని అభీష్టదేవానాం యద్ధ్యానం తత్ ధ్యానం ఉచ్యతే - అంతఃకరణమును చైతన్యానంతర్వర్తి ధ్యానములోనుంచి ఆ ఆత్మయందు ఇష్టదేవతయని భావముంచి ధ్యానము చేయుట ధ్యానమనబడును.
నిగృహీ తేంద్రియ స్యైవ ప్రసాదః, ప్రసాదవతః ఏవయుక్తః యుక్తిమతః ఏవ శ్రవణమననాభ్యాం తత్వజ్ఞానం, తత్వజ్ఞానతః ఏవ అపరోక్ష జ్ఞానసాధన అధ్యానం, నాన్యథా.
(ఇంద్రియములను నిగ్రహించిన వానికే చిత్త ప్రసాదము (చిత్తశాంతి) కలుగును. చిత్తప్రసాదము కలవానికే యోగము కుదురును - యోగయుక్తునకు శ్రవణమననములవలన తత్వజ్ఞానము కలుగును - తత్వజ్ఞానము కలిగిననే అపరోక్ష జ్ఞానసాధనమైన ధ్యానము కలుగును - ఇంకొకరీతిగా ధ్యానము కుదరదు)..
ధమతిన్ నిల్పి తదీయమూర్తి విభవ ధ్యానంబు గావించి చి
త్తము సర్వాంగ విమర్శన క్రియలకున్ దార్కొల్పి ప్రత్యంగమున్
సుమవాధ్యానము సేయగా వలయుచో శుద్ధాంతరంగంబునన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 28 - 925)
(తాను ఏ మూర్తిని ధ్యానించవలెనని కోరునో ఆ మూర్తియొక్క రూపమును శాస్త్రములలో చెప్పిన ప్రకారము మనసా చింతించి మనస్సుతో ఆ రూపమును కట్టి, ఆ రూపముయొక్క గుణకర్మలను శ్రవణము చేసియు న్నందున అనుకూలములైన తలంపులను మాత్రము తలంచుచు, తదితరములైన తలంపులను మనస్సులో ప్రవేసించనీయక, ఒక పాత్రలోనుండిమఱియొక పాత్రలోనికి వంచబడిన నూనెయొక్క ధార ఏ విధముగా నెడతెగక యుండునో ఆ విధముగ నెడతెగని తలంపులతో దీర్ఘకాలము చింతించు చుండుట ధ్యానము).
భ్రమరకీటన్యాయము అనగా పురుగు, తుమ్మెదలు - ఈ రెండింటిగుఱించి చెప్పుకొనెడి న్యాయము - కీటము - పురుగు - భ్రమరమునకు భయపడి వానినే తలచుచు ఆ నిరంతరధ్యానముచేత కీటము భ్రమరాకారముగా మారును - అనునది లోకోక్తి. ఇట్లే శుద్ధమైన మనసునందు భగవంతుని రూపమునుంచు కొని నిరంతరము భగవంతుని ధ్యానించుటవలన తాను భగవదాకారముగా మారును - ” బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి” (బ్రహ్మను తెలుసుకొనినవాడు బ్రహ్మమే యగును).
” సాలగ్రామ శిలా విష్ణు రూపా ఇతి ధ్యాయత ఉత్తమం ఫలం భవతి. తత్ర పురుషః శాస్త్రేణ విష్ణుం చతుర్భుజత్వేన శంఖ చక్ర గదా పద్మలక్ష్మీ సహితత్వేన చ జానాతి. చక్షుషాతు సాలగ్రామం శిలాత్వే నైవ జానాతి. తథాపి శాస్త్ర విధౌ విశ్వాసేన ధ్యానఫలే ఇచ్ఛయా చ సాలగ్రామం విష్ణుః ఇతి ధ్యాయతి పురుషః. సాలగ్రామ శిలాయాం విష్ణు బుద్ధి కరణవత్ అన్యస్మిన్ అన్య బుద్ధికరణం ప్రతీక ధ్యానం. వైకుంఠవాసినః విష్ణోః చతుర్భుజత్వాది రూపేణ ధ్యానంతు నాన్యస్మిన్ అన్య బుద్ధి కరణరూపం. కింతు తద్ధ్యానం ధ్యేయ వస్తు స్వరూపానుసారి ధ్యానమేవ. వైకుంఠవాసినో విష్ణోః స్వరూపం న ప్రత్యక్ష గోచరం; కింతు శాస్త్రైక సమధి గమ్యం శాస్త్రేచ విష్ణోః స్వరూపం చతుర్భుజత్వేన శంఖ చక్రాద్యుపేత త్వేన చ వర్ణితం. అతః తథా విష్ణోః ధ్యానం ధ్యేయవస్తు స్వరూపానుసారి ఏవ నైరంతర్యేణ ధ్యాయాకార చిత్తవౄత్తి ప్రవాహి ధ్యానం“.
“వైకుంఠవాసి చతుర్భుజవిష్ణు ధ్యానవత్” అహం బ్రహ్మా “ఇతి ధ్యానం అపి ధ్యేయస్వ రూపానుసారి ఏవ ధ్యానం, నతు ప్రతీక ధ్యానం. కింతు ఇదం అహం గ్రహ ధ్యానం ఉచ్యతే”
(సాలగ్రామశిల విష్ణువుయొక్క రూపమని ధ్యానించుట ఉత్తమఫలమునిచ్చునది. ఈ సాలగ్రామములో నాలుగు భుజములుగలిగి శంఖము, చక్రము, గద, పద్మము, నాలుగు చేతులు ధరించి శ్రీ మహాలక్ష్మితో కూడియున్న శ్రీ మహావిష్ణువే యున్నాడని తెలుసుకొనును. కంటికి యా సాలగ్రామము ఒక ఱాయి యను అభిప్రాయముండదు. శాస్త్రము చెప్పినది నమ్మి ధ్యానఫలముకోరి సాలగ్రామము విష్ణువే యని ధ్యానించవలయును. సాలగ్రామము విష్ణువేయని నమ్మకముంచినట్లు మఱియొక వస్తువునందు మఱియొక భావము కలిగి ధ్యానించుట ప్రతీకధ్యానము అని చెప్పబడును - ఒకదానికి బదులుగా (- ప్రతిగా -) నింకొకదానిని వాడుట. అట్లైనను అటువంటిధ్యానము ఏ దైవమును ధ్యానము నందుంచుకొనునో ఆ దైవము గుఱించి అయిన ధ్యానమే యగును. వైకుంఠములోనుండు విష్ణువుయొక్క స్వరూపము కంటికిగోచరము కాదు - కనుపించదు. శాస్త్రములో చెప్పైనదానిని బట్టి తెలుసుకొనవలసినదే, విష్ణువుయొక్క స్వరూపము నాలుగు భుజములు కలిగియుండునని, శంఖము, చక్రము గలిగి యున్నదని వర్ణింపబడియున్నది. అందుచేత ఆ ప్రకారముగానే విష్ణువును గుఱించి - సాలగ్రామమందు ఇట్టి రూపముగల విష్ణువు ఉన్నాడని - చేసిన ధ్యానము ఏ దైవము గుఱించి చేయవలసిన ధ్యానమో అదే యీ ధ్యానము - నిరంతరము ధ్యేయమైన దైవముయొక్క ఆకారమును మనసులో ప్రవాహ రూపముగా నుంచుటే ధ్యానము).
(వైకుంఠములో నాలుగు భుజములు గలిగియుండు విష్ణువు గుఱించి అయిన ధ్యానమువలెనే ” అహం బ్రహ్మాస్మి” (నేనే బ్రహ్మను అయితిని) అనుమహావాక్యము ననుసరించి చేయు ధ్యానముకూడా ధ్యేయదైవము యొక్క ధ్యానమేయగును - అది ప్రతకధ్యానముకాదు. ఇది అహం గ్రహ ధ్యానమని చెప్పబడును-
రహితే మశకై ర్దంశై దేవాయతనకేపివా |
సిద్ధక్షేత్రే మహాతీర్థే ధ్యానసిద్ధి ప్రజాయతే |
తత్ర సిద్ధాసనం బద్ధ్వా ఋజుకాయస్తు కారయేత్ |
యుక్తాసనం సమారుహ్య సమకాయ శిరో ధరః |
నాసాగ్రదృష్టిరేకాంతే జపేదోంకారమ వ్యయం |
ఆసనేన రజోహంతి ప్రాణాయా మేన పాతకం |
వికారం మానసం యోగీ ప్రత్యాహారేణ ముంచతి |
ధారణార్థం మనో ధైర్యం ధ్యానం నిశ్చలమద్భుతం |
సమాధేర్మోక్షమా ప్నోతి త్యక్త్వా కర్మ శుభా శుభం ||”
(రమ్యమైనదిన్నీ ఇతర జనులు లేనిదిన్నీ, ఒంటరిగానుండుటకు వీలగు స్థలమందు - గుహయందుకాని, పుణ్యక్షేత్రమందుకాని, నల్లులు దోమలు మొగలగునవి లేనిచోట, దేవాలయమందుకాని, సిద్ధక్షేత్రమందుకాని, తీర్థస్థలమందుకాని చేసిన ధ్యానము సిద్ధిని పొందును. అట్టిచోట సిద్ధాసనము వేసుకొని శరీరమును తిన్నగానుంచుకొని - శరీరమును, మెడను, శిరస్సును ఒకేరీతిగా నిట్టగా ఉంచి - నాసికను చూచుచూ ఓంకారమును జపించవలెను. ఇట్లు చేయుటలో ఆసనమువలన రజోగుణము క్షీణించును, ప్రాణాయామమువలన పాపములను పోగొట్టుకొనును, ప్రత్యాహారమువలన మనోవికారములు లేకుండ చేసుకొనును - ధారణవలన మనోధైర్యము, ధ్యానము కలుగును, సమాధివలన పాపపుణ్యకర్మలను విడిచి వేయుటవలన మోక్షము సిద్ధించును).
విష్ణుసాన్నిధ్యము నవలంబించువారు ఈ ప్రకారముగా ధ్యానము చేయవలెను - ” మున్నొక్క యవయమును మనంబున కంటునట్లుగా మిగుల భావన యొనర్చి, యది దృఢముగా గుర్తు తగిలినపిమ్మట మఱియొక అంగమును భావించుచు నిత్తెఱంగున నవయవంబులనెల్ల ధ్యానించి తానూరకున్నను, లేక గమనా ది వ్యాపారంబులు వడసియున్నను, మఱియు నిట్టి యవస్థనొందియున్నను ధ్యానము మానకయుండిన నాయంగములు మనంబువిడిచి కదలకుండునట్లు అభ్యాసపాటవమొనర్చెనేని అట్టి సాధకుడు శ్రీహరిసారూప్యమునొంది ముక్తుడగును“.
“జ్ఞానం ద్వివిధం - సగుణం నిర్గుణం చేతి, సగుణం మూర్తిధ్యానం, నిర్గుణమాత్మ యధాత్మ్యం”. (శాండిల్యోపనిషత్తు)
(ధ్యానము రెండువిధములు - సగుణధ్యానము, నిర్గుణధ్యానము - సగుణరూపముగా గాని, నిర్గుణరూపముగాగాని, - సాకారరూపముగా గాని, నిరాకారరూపముగా గాని పరబ్రహ్మను ధ్యానించుట ధ్యానము).
విధి పురుషేచ్ఛ, విశ్వాసము, హిఠము, - ఇవి ధ్యానమునకు ఆవశక్యములు. విధియనగా ఈ ప్రకారముగా ఈ దేవతను ఉపాసించవలెను - అని శాస్త్రములో విధించినబడిన ప్రకారము ధ్యానము చేయవలెను. ఆ విధివాక్యమందు నమ్మకముండవలెను - ధ్యానము చేయుటకు ఇచ్ఛ - కోరిక - యుండవలయును. ధ్యానము చేయుటలో స్థిరత్వము కొఱకు హఠయోగము చేయవలయును).
“దేవానామపి సర్వేషా మాత్మ భూతోహి శంకరః |
అతః సర్వాన్ పరిత్యజ్య ధ్యాయే దీశాన మ వ్యయం |
అయత్నే నైవ సాపేభ్యో మోక్షమిచ్ఛతి చేత్సుమాన్ |
శివమేవ సదా ధ్యాయేత్ సాంబం చంద్రార్థశేఖరం ||“.
(సమస్తమైన దేవతలకు శివుడు ఆత్మ అయినవాడు - అందుచేత మిగిలిన దేవతలనందఱను విడిచిపెట్టి శివుని ధ్యానించవలెను. ఏ ప్రయత్నమునైనను చేయకనే పాపములనుండి విమిక్తికోఱువాడు చంద్రశేఖరుడు పార్వతితో కూడియుండువాడు అయిన శివుని ఎల్లపుడు ధ్యానించవలెను).
యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్త్యత్ర సంశయః |
యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం |
తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః ||
తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్వర యుద్ధ్యచ |
మయ్యర్పిత మనోబుద్ధిర్మమే వైష్యత్య సంశయః |’. (శ్రీమద్భగవద్గీత - 8 - 5 to 7)
“మావేవ వాసుదేవం యః సగుణం వాధి నిర్గుణం |
చింతయన్ సంతతం బుద్ధ్యా తత్తత్సంస్కార పాటవాత్|
సమస్త కరణగ్రామ వైయగ్ర్య సమయే మౄతౌ |
స్మరన్ కళేబరం ముక్త్వా (అ)హం మమేతి ధియం తధా |
త్యక్త్వా ప్రాణవియోగే యః సగుణ ధ్యావాన్ యది |
తదా సదేవ యానేన ప్రయాతి మదుపానకః |
మద్భావం నిర్గుణం బ్రహ్మ బ్రహ్మలోకే విరించినా |
సహ భోగావసానే (అ)సౌ ప్రాప్నోతి జ్ఞాన లాభతః |
నిర్గుణపక్షేతు ప్రయాతీత్యస్య దౄష్టితః |
నతస్య ప్రాణా ఇత్యత్ర శ్రుతౌ బ్రహ్మ విదోమునేః |
ప్రాణస్యోత్క్రమణా భావే గత్య భావ ఉదీరితః |
నసాక్షా దేవ మద్భావం యాతి బ్రహ్మైవసన్ స్వయం |
నాస్యత్ర సంశయః కశ్చిద్బ్రహ్మై బ్రహ్మ విద్యతః ||“. (గీతాభావప్రకాశము - 8 - 31 to37)
“యం యం దేవ విశేషం వా యత్కించి ద్వస్తుమాత్రకం |
చింతయన్నంతకాలే (అ)సౌత్య జతీవ కళేబరం |
తం తం స్మర్యమాణం సభావమే వైతి నాపరం |
పితృస్వస్రాత్మజత్వేనాను గ్రాహ్యో సీతి సూచ్యతే |
పూర్వాభ్యాసార్జితా పుం సాం వాసనం స్మృతి కారణం |
సర్వదా యేన యో (అ)భ్యస్తో భావో దేవాది గోచరః |
స్మర్యమాణ తయా సోం తేతం తమేవైతి నాపరం ||“. (గీతాభావప్రకాశము - 8 - 43 to47)
“యతో (అ)ంత్య భావనా హేతుః ప్రాప్తౌ దేహాంతరస్యచ |
తస్మా ద్విషయై కాంత భావనోత్పత్తి సిద్ధయే |
పూర్వ మేవాదరేణత్వం సర్వ కాలేషు మాం హరిం |
సగుణం సర్వ సౌందర్యసార సర్వస్వ మీశ్వరం |
స్మితాంకితం ముఖం మేఘశ్యామం పీతాంబరం విభుం |
శ్రీవత్సాంకిత వక్షస్థ కౌస్తుభాది శ్రియోజ్జ్వలం |
గరుడద్వజమాధారం సర్వస్య జగతః వతిం |
ఆనంద సాంద్రం శ్రీకాంతం శరణార్ధం నిరంతరం |
శంఖ చక్ర గదా పద్మ వన మాలా విభూషితం |
చినతయావిరతం ప్రేమ్ణా ద్రవీ భూతేన చేతసా ||” (గీతాభావప్రకాశము - 8 - 47 to 52)
(సమస్త జీవులందు నివసించియున్న వాసుదేవుడనైన నా యందు ఎవడు మరణకాలమున తన సంస్కారబలముకొలది సగుణబ్రహ్మయని కాని, నిర్గుణబ్రహ్మయనిగాని చిత్తము నిలుపుకొని, నేను నాది అను అహంకారమమకారము వదలిపెట్టి చనిపోవునో అట్టి నా భక్తుడు బ్రహ్మధ్యానము చేయుటబట్టి బ్రహ్మలోకమునొంది, అచ్చటి సుఖములననుభ వించి సృష్ట్యంతకాలమందు జ్ఞానముపొందినవాడై చతుర్ముఖబ్రహ్మతోపాటు నాలోకమును పొంది నన్ను చేరును. అట్లే మరణకాలమందు నిర్గుణబ్రహ్మ అయిన నాయందు ధ్యానము నిలిపినవాడు తిన్నగా నాభావమును పొందును - ఎందుచేతననగా బ్రహ్మజ్ఞానికి ప్రాణములు శరీరమును వదలి పైకి ఉత్క్రమించుట లేదు కనుకనూ, మఱియు ఇట్లు జ్ఞానయోగముచే బ్రహ్మవిదుడైనవాడు బ్రహ్మమే యగునని చెప్పబడియుండుటవలనను).
(మరణకాలమున ఏయే దేవ విశేషమును భావించినను, ఏ యే వస్తు మాత్రమును చింతించినను, అట్లు భావిచుచు చింతించుచు శరీరమును విడిచినచో ఆయా విశేషమును పొందును. అంతకాలమున భగవంతుని చింతించుచు ధ్యానించుచు చనిపోయినయడల భగవద్భావమును పొందును. ఈ నియమము భగవంతుని గుఱించి చింతించుటయందేకాక అన్ని విషయములకు వర్తించును. అంతకాలమున ఏ విషయమును గుఱించిస్మరించుచు ప్రాణములు విడుచునో ఆ విషయమును తర్వాత జన్మలో తప్పక పొందును. ఎందుచేతననగా మానవులకు పూర్వాభ్యాసముచేత ఆర్జించిన వాసనయే స్మృతికారణమగును - అందుచేత నిత్యము భగవంతుని గుఱించి ధ్యానము చేయకపోయినను మరణకాలమునందైనను భగవంతుని ధ్యానించవలెను - ఇతర విషయములగుఱించి చింతుంచుట మానవలెను).
(అంత్యకాలమున భగవంతుని గుఱించి ధ్యానము కలుగుటకు ముందునుండి అభ్యాసము చేసుకొనవలెను - అట్లు అభ్యాసము చేసుకొనుటకు అన్ని వేళలందు ముందుగానే సగుణరూపుడైన నన్ను - (భగవంతుని) - “సగుణం సర్వ సౌందర్య సార సర్వశ్వమీశ్వరం” మొదలు “వనమాలా విభూషితం” అను అంతము వరకు పైన గీతాభావప్రకాశములో చెప్పబడిన ప్రకారము నా సగుణరూపమును భక్తితో ఎడతెగని మనస్సుతో ఎల్లపుడు ధ్యానించుము - శుద్ధాంతఃకరణము లేకపోవుటవల్ల పైన చెప్పిన ప్రకారము ఎల్లపుడుఎల్లపుడు నన్ను స్మరించుటకు శక్తి లేని యడల అంతఃకరణశుద్ధికొఱకు నిష్కామచిత్తముతో నీ స్వధర్మమును నెఱవేర్చుము - దానివలన చిత్త శుద్ధికలిగి సర్వదేహములందు నివసించియుండు నాయందు - వాసుదేవుడు, ఆనందమయుడు నిర్గుణపరబ్రహ్మ అయిన నాయందు ఎల్లపుడు ధ్యానము నిలిపిన యడల నన్నే పొందగలవు).
ananyamanasā ciṃtanaṃ. (okē viṣayamunu guṟiṃci manassulō ālōciṃcuṭa).
tailadhāravada vicchinnasmṛti saṃtāna rūpaṃ. (nūne dhāra tegakuṃḍunuṃḍunaṭlu smaraṇa cēyuṭa).
manasaḥ dhyēyaika rūpatā - (manasulō okē dhyāyamu kaligiyuṃḍiṭa).
mānasikavidhamaina arcana - manasulō iṣṭadaivamunu arciṃcuṭa).
cāṃcalyamulēka bhagavaṃtuni manasulō dhyāniṃcuṭa. dhyāniṃpatagina vastuvunaṃdu buddhi nilipi dānini maruvakuṃḍuṭa.
” tatra pratyaika tānatā dhyānaṃ” (pataṃjali yōgasūtramulu)
(dhāraṇakoṟaku niyamiṃcukonina vastuvunē, lēka, bhagavaṃtuni suguṇarūpamunē tailadhāravale eḍategakuṃḍunaṭlu cittamulō nuṃcukonuṭa).
(śravaṇamu bhagavaṃtuni darśanamu modalaguvāṭi valana kaligina vāsanā mayamaina vastuvunu manasulō cūcuṭa dhyānamu).
ātma svarūpacitanaṃ - (paramātmayokka yadārtharūpamaguṟiṃci ciṃtiṃcuṭa).
nirālaṃba brahmabhāvanaṃ. (iṃkokadāniyaṃdu ālaṃbanamu lēka brahmamaṃdē bhāvana kaligiyuṃḍuṭa).
niraṃtara bhagavacciṃtanaṃ. (ellapuḍu teripi lēkuṃḍā bhagavaṃtuni ciṃtiṃcuṭa).
ēkārtha gōcarātma dhāraṇaṃ dhyānaṃ.
okē viṣayamugā ātmanuguṟiṃci ayina dhāraṇa dhyānamu -
svarūpa pratyaya tayā cittasyaika tānatā. (bhagavaṃtuni svasvarūpamutō cittamunu aikyamucēyuṭa).
“sarva śarīrēṣu caitasyaika tānatā dhyānaṃ” (maṃḍala brāhmaṇōpaniṣat)
(anniśarīramulaṃdunu - anni vastuvulaṃdunu - unna caitanyaśakti okkaṭēyani dhyāniṃcuṭa).
(nēnu brahmanu ayitini anu dhṛḍhamaina bhāvana dhyānamu).
dhyāna śabdēna vikhyātā paramānaṃda dāyinī ||“.
(nēnu brahmamē ayitini ani dhṛḍhamugā itarālaṃbanamu lēka yuṃḍusthiti).
(advitīyamaina - tanukāka reṃḍava vastuvu lēnivāḍaina - brahma vastuvunaṃdu appuḍappuḍu tegipōvucuṃḍu cittavṛttini pravāharūpamugā nuṃcuṭa).
(anēka mūkuḷḷu, kuṃḍalu modalagu vāṭilō vēru vērugānunnappaṭikī ākāśamu mukkalugā lēka aṃtā okaṭē ayi yunnaṭlu bhagavaṃtuḍu anni vastuvulalōnunnappaṭikī, avi mukkalu mukkalugā kāka aṃtā ēkamē ani dṛḍhamaina bhāvana kaligiyuṃḍuṭa).
(śabdamu modalagu viṣayamulanuṃḍi śrōtramu modalagu niṃdriyamulanu manassu lōniki lāgikoni uṃci manassunu pratyakcaitanyamu naṃdu ēkāgrata - adi okaṭē lakṣyamugā - kaligiṃcukoni ciṃtiṃcuṭa dhyānamu - oka dhyānamu cēsinaṭlu kadalaka medalakayuṃḍuṭa, bhūmadhyānamu cēyucunnaṭlu kadalika lēkayuṃḍinaṭluṃḍuṭa parvatamulu kadalaka medalaka dhyānamu cēsinaṭluṃḍuṭa).
aṃtaḥkaraṇaṃ caitanyāṃ tarvarti dhyānēna kṝtvā tasminnātmani abhīṣṭadēvānāṃ yaddhyānaṃ tat dhyānaṃ ucyatē - aṃtaḥkaraṇamunu caitanyānaṃtarvarti dhyānamulōnuṃci ā ātmayaṃdu iṣṭadēvatayani bhāvamuṃci dhyānamu cēyuṭa dhyānamanabaḍunu.
nigṛhī tēṃdriya syaiva prasādaḥ, prasādavataḥ ēvayuktaḥ yuktimataḥ ēva śravaṇamananābhyāṃ tatvajñānaṃ, tatvajñānataḥ ēva aparōkṣa jñānasādhana adhyānaṃ, nānyathā.
(iṃdriyamulanu nigrahiṃcina vānikē citta prasādamu (cittaśāṃti) kalugunu. cittaprasādamu kalavānikē yōgamu kudurunu - yōgayuktunaku śravaṇamananamulavalana tatvajñānamu kalugunu - tatvajñānamu kaliginanē aparōkṣa jñānasādhanamaina dhyānamu kalugunu - iṃkokarītigā dhyānamu kudaradu)..
dhamatin nilpi tadīyamūrti vibhava dhyānaṃbu gāviṃci ci
ttamu sarvāṃga vimarśana kriyalakun dārkolpi pratyaṃgamun
sumavādhyānamu sēyagā valayucō śuddhāṃtaraṃgaṃbunan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 28 - 925)
(tānu ē mūrtini dhyāniṃcavalenani kōrunō ā mūrtiyokka rūpamunu śāstramulalō ceppina prakāramu manasā ciṃtiṃci manassutō ā rūpamunu kaṭṭi, ā rūpamuyokka guṇakarmalanu śravaṇamu cēsiyu nnaṃduna anukūlamulaina talaṃpulanu mātramu talaṃcucu, taditaramulaina talaṃpulanu manassulō pravēsiṃcanīyaka, oka pātralōnuṃḍimaṟiyoka pātralōniki vaṃcabaḍina nūneyokka dhāra ē vidhamugā neḍategaka yuṃḍunō ā vidhamuga neḍategani talaṃpulatō dīrghakālamu ciṃtiṃcu cuṃḍuṭa dhyānamu).
bhramarakīṭanyāyamu anagā purugu, tummedalu - ī reṃḍiṃṭiguṟiṃci ceppukoneḍi nyāyamu - kīṭamu - purugu - bhramaramunaku bhayapaḍi vāninē talacucu ā niraṃtaradhyānamucēta kīṭamu bhramarākāramugā mārunu - anunadi lōkōkti. iṭlē śuddhamaina manasunaṃdu bhagavaṃtuni rūpamunuṃcu koni niraṃtaramu bhagavaṃtuni dhyāniṃcuṭavalana tānu bhagavadākāramugā mārunu - ” brahmavid brahmaiva bhavati” (brahmanu telusukoninavāḍu brahmamē yagunu).
” sālagrāma śilā viṣṇu rūpā iti dhyāyata uttamaṃ phalaṃ bhavati. tatra puruṣaḥ śāstrēṇa viṣṇuṃ caturbhujatvēna śaṃkha cakra gadā padmalakṣmī sahitatvēna ca jānāti. cakṣuṣātu sālagrāmaṃ śilātvē naiva jānāti. tathāpi śāstra vidhau viśvāsēna dhyānaphalē icchayā ca sālagrāmaṃ viṣṇuḥ iti dhyāyati puruṣaḥ. sālagrāma śilāyāṃ viṣṇu buddhi karaṇavat anyasmin anya buddhikaraṇaṃ pratīka dhyānaṃ. vaikuṃṭhavāsinaḥ viṣṇōḥ caturbhujatvādi rūpēṇa dhyānaṃtu nānyasmin anya buddhi karaṇarūpaṃ. kiṃtu taddhyānaṃ dhyēya vastu svarūpānusāri dhyānamēva. vaikuṃṭhavāsinō viṣṇōḥ svarūpaṃ na pratyakṣa gōcaraṃ; kiṃtu śāstraika samadhi gamyaṃ śāstrēca viṣṇōḥ svarūpaṃ caturbhujatvēna śaṃkha cakrādyupēta tvēna ca varṇitaṃ. ataḥ tathā viṣṇōḥ dhyānaṃ dhyēyavastu svarūpānusāri ēva nairaṃtaryēṇa dhyāyākāra cittavṝtti pravāhi dhyānaṃ”.
“vaikuṃṭhavāsi caturbhujaviṣṇu dhyānavat” ahaṃ brahmā “iti dhyānaṃ api dhyēyasva rūpānusāri ēva dhyānaṃ, natu pratīka dhyānaṃ. kiṃtu idaṃ ahaṃ graha dhyānaṃ ucyatē”
(sālagrāmaśila viṣṇuvuyokka rūpamani dhyāniṃcuṭa uttamaphalamuniccunadi. ī sālagrāmamulō nālugu bhujamulugaligi śaṃkhamu, cakramu, gada, padmamu, nālugu cētulu dhariṃci śrī mahālakṣmitō kūḍiyunna śrī mahāviṣṇuvē yunnāḍani telusukonunu. kaṃṭiki yā sālagrāmamu oka ṟāyi yanu abhiprāyamuṃḍadu. śāstramu ceppinadi nammi dhyānaphalamukōri sālagrāmamu viṣṇuvē yani dhyāniṃcavalayunu. sālagrāmamu viṣṇuvēyani nammakamuṃcinaṭlu maṟiyoka vastuvunaṃdu maṟiyoka bhāvamu kaligi dhyāniṃcuṭa pratīkadhyānamu ani ceppabaḍunu - okadāniki badulugā (- pratigā -) niṃkokadānini vāḍuṭa. aṭlainanu aṭuvaṃṭidhyānamu ē daivamunu dhyānamu naṃduṃcukonunō ā daivamu guṟiṃci ayina dhyānamē yagunu. vaikuṃṭhamulōnuṃḍu viṣṇuvuyokka svarūpamu kaṃṭikigōcaramu kādu - kanupiṃcadu. śāstramulō ceppainadānini baṭṭi telusukonavalasinadē, viṣṇuvuyokka svarūpamu nālugu bhujamulu kaligiyuṃḍunani, śaṃkhamu, cakramu galigi yunnadani varṇiṃpabaḍiyunnadi. aṃducēta ā prakāramugānē viṣṇuvunu guṟiṃci - sālagrāmamaṃdu iṭṭi rūpamugala viṣṇuvu unnāḍani - cēsina dhyānamu ē daivamu guṟiṃci cēyavalasina dhyānamō adē yī dhyānamu - niraṃtaramu dhyēyamaina daivamuyokka ākāramunu manasulō pravāha rūpamugā nuṃcuṭē dhyānamu).
(vaikuṃṭhamulō nālugu bhujamulu galigiyuṃḍu viṣṇuvu guṟiṃci ayina dhyānamuvalenē ” ahaṃ brahmāsmi” (nēnē brahmanu ayitini) anumahāvākyamu nanusariṃci cēyu dhyānamukūḍā dhyēyadaivamu yokka dhyānamēyagunu - adi pratakadhyānamukādu. idi ahaṃ graha dhyānamani ceppabaḍunu-
rahitē maśakai rdaṃśai dēvāyatanakēpivā |
siddhakṣētrē mahātīrthē dhyānasiddhi prajāyatē |
tatra siddhāsanaṃ baddhvā ṛjukāyastu kārayēt |
yuktāsanaṃ samāruhya samakāya śirō dharaḥ |
nāsāgradṛṣṭirēkāṃtē japēdōṃkārama vyayaṃ |
āsanēna rajōhaṃti prāṇāyā mēna pātakaṃ |
vikāraṃ mānasaṃ yōgī pratyāhārēṇa muṃcati |
dhāraṇārthaṃ manō dhairyaṃ dhyānaṃ niścalamadbhutaṃ |
samādhērmōkṣamā pnōti tyaktvā karma śubhā śubhaṃ ||”
(ramyamainadinnī itara janulu lēnidinnī, oṃṭarigānuṃḍuṭaku vīlagu sthalamaṃdu - guhayaṃdukāni, puṇyakṣētramaṃdukāni, nallulu dōmalu mogalagunavi lēnicōṭa, dēvālayamaṃdukāni, siddhakṣētramaṃdukāni, tīrthasthalamaṃdukāni cēsina dhyānamu siddhini poṃdunu. aṭṭicōṭa siddhāsanamu vēsukoni śarīramunu tinnagānuṃcukoni - śarīramunu, meḍanu, śirassunu okērītigā niṭṭagā uṃci - nāsikanu cūcucū ōṃkāramunu japiṃcavalenu. iṭlu cēyuṭalō āsanamuvalana rajōguṇamu kṣīṇiṃcunu, prāṇāyāmamuvalana pāpamulanu pōgoṭṭukonunu, pratyāhāramuvalana manōvikāramulu lēkuṃḍa cēsukonunu - dhāraṇavalana manōdhairyamu, dhyānamu kalugunu, samādhivalana pāpapuṇyakarmalanu viḍici vēyuṭavalana mōkṣamu siddhiṃcunu).
viṣṇusānnidhyamu navalaṃbiṃcuvāru ī prakāramugā dhyānamu cēyavalenu - ” munnokka yavayamunu manaṃbuna kaṃṭunaṭlugā migula bhāvana yonarci, yadi dṛḍhamugā gurtu tagilinapimmaṭa maṟiyoka aṃgamunu bhāviṃcucu nitteṟaṃguna navayavaṃbulanella dhyāniṃci tānūrakunnanu, lēka gamanā di vyāpāraṃbulu vaḍasiyunnanu, maṟiyu niṭṭi yavasthanoṃdiyunnanu dhyānamu mānakayuṃḍina nāyaṃgamulu manaṃbuviḍici kadalakuṃḍunaṭlu abhyāsapāṭavamonarcenēni aṭṭi sādhakuḍu śrīharisārūpyamunoṃdi muktuḍagunu”.
“jñānaṃ dvividhaṃ - saguṇaṃ nirguṇaṃ cēti, saguṇaṃ mūrtidhyānaṃ, nirguṇamātma yadhātmyaṃ”. (śāṃḍilyōpaniṣattu)
(dhyānamu reṃḍuvidhamulu - saguṇadhyānamu, nirguṇadhyānamu - saguṇarūpamugā gāni, nirguṇarūpamugāgāni, - sākārarūpamugā gāni, nirākārarūpamugā gāni parabrahmanu dhyāniṃcuṭa dhyānamu).
vidhi puruṣēccha, viśvāsamu, hiṭhamu, - ivi dhyānamunaku āvaśakyamulu. vidhiyanagā ī prakāramugā ī dēvatanu upāsiṃcavalenu - ani śāstramulō vidhiṃcinabaḍina prakāramu dhyānamu cēyavalenu. ā vidhivākyamaṃdu nammakamuṃḍavalenu - dhyānamu cēyuṭaku iccha - kōrika - yuṃḍavalayunu. dhyānamu cēyuṭalō sthiratvamu koṟaku haṭhayōgamu cēyavalayunu).
“dēvānāmapi sarvēṣā mātma bhūtōhi śaṃkaraḥ |
ataḥ sarvān parityajya dhyāyē dīśāna ma vyayaṃ |
ayatnē naiva sāpēbhyō mōkṣamicchati cētsumān |
śivamēva sadā dhyāyēt sāṃbaṃ caṃdrārthaśēkharaṃ ||“.
(samastamaina dēvatalaku śivuḍu ātma ayinavāḍu - aṃducēta migilina dēvatalanaṃdaṟanu viḍicipeṭṭi śivuni dhyāniṃcavalenu. ē prayatnamunainanu cēyakanē pāpamulanuṃḍi vimiktikōṟuvāḍu caṃdraśēkharuḍu pārvatitō kūḍiyuṃḍuvāḍu ayina śivuni ellapuḍu dhyāniṃcavalenu).
yaḥ prayāti samadbhāvaṃ yāti nāsttyatra saṃśayaḥ |
yaṃ yaṃ vāpi smaran bhāvaṃ tyajatyaṃtē kaḷēbaraṃ |
taṃ tamē vaiti kauṃtēya sadā tadbhāva bhāvitaḥ ||
tasmātsarvēṣu kālēṣu māmanusvara yuddhyaca |
mayyarpita manōbuddhirmamē vaiṣyatya saṃśayaḥ |’. (śrīmadbhagavadgīta - 8 - 5 to 7)
“māvēva vāsudēvaṃ yaḥ saguṇaṃ vādhi nirguṇaṃ |
ciṃtayan saṃtataṃ buddhyā tattatsaṃskāra pāṭavāt|
samasta karaṇagrāma vaiyagrya samayē mṝtau |
smaran kaḷēbaraṃ muktvā (a)haṃ mamēti dhiyaṃ tadhā |
tyaktvā prāṇaviyōgē yaḥ saguṇa dhyāvān yadi |
tadā sadēva yānēna prayāti madupānakaḥ |
madbhāvaṃ nirguṇaṃ brahma brahmalōkē viriṃcinā |
saha bhōgāvasānē (a)sau prāpnōti jñāna lābhataḥ |
nirguṇapakṣētu prayātītyasya dṝṣṭitaḥ |
natasya prāṇā ityatra śrutau brahma vidōmunēḥ |
prāṇasyōtkramaṇā bhāvē gatya bhāva udīritaḥ |
nasākṣā dēva madbhāvaṃ yāti brahmaivasan svayaṃ |
nāsyatra saṃśayaḥ kaścidbrahmai brahma vidyataḥ ||“. (gītābhāvaprakāśamu - 8 - 31 to37)
“yaṃ yaṃ dēva viśēṣaṃ vā yatkiṃci dvastumātrakaṃ |
ciṃtayannaṃtakālē (a)sautya jatīva kaḷēbaraṃ |
taṃ taṃ smaryamāṇaṃ sabhāvamē vaiti nāparaṃ |
pitṛsvasrātmajatvēnānu grāhyō sīti sūcyatē |
pūrvābhyāsārjitā puṃ sāṃ vāsanaṃ smṛti kāraṇaṃ |
sarvadā yēna yō (a)bhyastō bhāvō dēvādi gōcaraḥ |
smaryamāṇa tayā sōṃ tētaṃ tamēvaiti nāparaṃ ||“. (gītābhāvaprakāśamu - 8 - 43 to47)
“yatō (a)ṃtya bhāvanā hētuḥ prāptau dēhāṃtarasyaca |
tasmā dviṣayai kāṃta bhāvanōtpatti siddhayē |
pūrva mēvādarēṇatvaṃ sarva kālēṣu māṃ hariṃ |
saguṇaṃ sarva sauṃdaryasāra sarvasva mīśvaraṃ |
smitāṃkitaṃ mukhaṃ mēghaśyāmaṃ pītāṃbaraṃ vibhuṃ |
śrīvatsāṃkita vakṣastha kaustubhādi śriyōjjvalaṃ |
garuḍadvajamādhāraṃ sarvasya jagataḥ vatiṃ |
ānaṃda sāṃdraṃ śrīkāṃtaṃ śaraṇārdhaṃ niraṃtaraṃ |
śaṃkha cakra gadā padma vana mālā vibhūṣitaṃ |
cinatayāvirataṃ prēmṇā dravī bhūtēna cētasā ||” (gītābhāvaprakāśamu - 8 - 47 to 52)
(samasta jīvulaṃdu nivasiṃciyunna vāsudēvuḍanaina nā yaṃdu evaḍu maraṇakālamuna tana saṃskārabalamukoladi saguṇabrahmayani kāni, nirguṇabrahmayanigāni cittamu nilupukoni, nēnu nādi anu ahaṃkāramamakāramu vadalipeṭṭi canipōvunō aṭṭi nā bhaktuḍu brahmadhyānamu cēyuṭabaṭṭi brahmalōkamunoṃdi, accaṭi sukhamulananubha viṃci sṛṣṭyaṃtakālamaṃdu jñānamupoṃdinavāḍai caturmukhabrahmatōpāṭu nālōkamunu poṃdi nannu cērunu. aṭlē maraṇakālamaṃdu nirguṇabrahma ayina nāyaṃdu dhyānamu nilipinavāḍu tinnagā nābhāvamunu poṃdunu - eṃducētananagā brahmajñāniki prāṇamulu śarīramunu vadali paiki utkramiṃcuṭa lēdu kanukanū, maṟiyu iṭlu jñānayōgamucē brahmaviduḍainavāḍu brahmamē yagunani ceppabaḍiyuṃḍuṭavalananu).
(maraṇakālamuna ēyē dēva viśēṣamunu bhāviṃcinanu, ē yē vastu mātramunu ciṃtiṃcinanu, aṭlu bhāvicucu ciṃtiṃcucu śarīramunu viḍicinacō āyā viśēṣamunu poṃdunu. aṃtakālamuna bhagavaṃtuni ciṃtiṃcucu dhyāniṃcucu canipōyinayaḍala bhagavadbhāvamunu poṃdunu. ī niyamamu bhagavaṃtuni guṟiṃci ciṃtiṃcuṭayaṃdēkāka anni viṣayamulaku vartiṃcunu. aṃtakālamuna ē viṣayamunu guṟiṃcismariṃcucu prāṇamulu viḍucunō ā viṣayamunu tarvāta janmalō tappaka poṃdunu. eṃducētananagā mānavulaku pūrvābhyāsamucēta ārjiṃcina vāsanayē smṛtikāraṇamagunu - aṃducēta nityamu bhagavaṃtuni guṟiṃci dhyānamu cēyakapōyinanu maraṇakālamunaṃdainanu bhagavaṃtuni dhyāniṃcavalenu - itara viṣayamulaguṟiṃci ciṃtuṃcuṭa mānavalenu).
(aṃtyakālamuna bhagavaṃtuni guṟiṃci dhyānamu kaluguṭaku muṃdunuṃḍi abhyāsamu cēsukonavalenu - aṭlu abhyāsamu cēsukonuṭaku anni vēḷalaṃdu muṃdugānē saguṇarūpuḍaina nannu - (bhagavaṃtuni) - “saguṇaṃ sarva sauṃdarya sāra sarvaśvamīśvaraṃ” modalu “vanamālā vibhūṣitaṃ” anu aṃtamu varaku paina gītābhāvaprakāśamulō ceppabaḍina prakāramu nā saguṇarūpamunu bhaktitō eḍategani manassutō ellapuḍu dhyāniṃcumu - śuddhāṃtaḥkaraṇamu lēkapōvuṭavalla paina ceppina prakāramu ellapuḍuellapuḍu nannu smariṃcuṭaku śakti lēni yaḍala aṃtaḥkaraṇaśuddhikoṟaku niṣkāmacittamutō nī svadharmamunu neṟavērcumu - dānivalana citta śuddhikaligi sarvadēhamulaṃdu nivasiṃciyuṃḍu nāyaṃdu - vāsudēvuḍu, ānaṃdamayuḍu nirguṇaparabrahma ayina nāyaṃdu ellapuḍu dhyānamu nilipina yaḍala nannē poṃdagalavu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.