ధ్యాతా అనగా ధ్యానించువాడు, జీవుడు. ధ్యేయము అనగా ధ్యానము చేయతగినది, పరబ్రహ్మ. కష్టములను పోగొట్టుకొనుటకుగాని, ముక్తిని పొందుటకుగాని జీవుడు పరబ్రహ్మను ధ్యానించును. అందుచేత జీవుడు ధ్యాత - ధ్యానము చేయువాడు, పరబ్రహ్మ ధ్యేయము - ధ్యానించతగినవాడు. జీవ పరమాత్మలకు ఈ విధముగానున్న పరస్పర సంబంధము ధ్యాతృ ధ్యేయ భావము.
జీవుడు పరబ్రహ్మను ధ్యానించుట గుఱించి ఈ విధముగా చెప్పబడినది : -
కశ్చిద్ధీరః ప్రత్యగాత్మాన మై క్షదావృత్త చక్షుర మృతత్వమిచ్ఛన్ ||” (కఠోపనిషత్ - 4 - 1 -)
(పరమేశ్వరుడు బహిర్విషయము అయి అనాత్మ విషయములగు శ్రోత్రము మొదలగు ఇంద్రియములను లోనున్న ఆత్మను దర్శించుటకు సమర్థములుకానివానిని సృజించెను. అందుచేత లోకులెల్ల రును బాహ్య విషయములనే చూడగలరుగాని అంతరాత్మను చూడలేరు. కాని ఎవడో ఒక వివేకి మోక్షాభిలాషియై ఇంద్రియములను మరల్చుకొని, నిగ్రహించి, లోనున్న పరమాత్మను దర్శించిరి“.
“యం వినిద్రా జితస్వాసా స్సంతుష్టా స్సం యతీంద్రియాః
జ్యోతిః పశ్యంతి యుం జానా స్తస్మై యోగాత్మనేనమః ||” (మహాభారతము - 12 - 47 - 54)
(యోగపరాయణులు నిద్రలేనివారై ప్రాణాయామాదులచే వాయువుని జయించి, ఇంద్రియమును నిగ్రహించి సంతోషముతో జ్యోతిస్వరూపుడగు ఏ పరమాత్మను చూతురో అట్టి యా యోగస్వరూపునకు నమస్కారము (దీనినే ఆరాద్ధ్యా రాధకభావమని యందురు).
(ఈ ప్రకారముగా చెప్పుటవలన జీవుడువేరు, బ్రహ్మ వేరు అని ఇద్దరకు భేదమున్నట్లు స్ఫురించును కాని వేదాంతములం దంతటను “తత్వ మసి” అను వాక్యముచే మాటి మాటికి జీవబ్రహ్మల అభేదమే - ఐక్యమే - చెప్పబడుచున్నది. “బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి” )
(బృహదారణ్యకోపనిషత్ - 4 - 46)
(బ్రహ్మవలె నుండి బ్రహ్మను పొందుచున్నాడు -); ” సయోహవై తత్పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి” (ముండకోపనిషత్)
(ఎవడు పరబ్రహ్మ స్వరూపమును తెలుసుకొనునో అతడు బ్రహ్మస్వరూపుడే యగుచున్నాడు-). ఈ వాక్యములవలన జీవ బ్రహ్మైక్యమునకు ధ్యాతృధ్యేయ బావమువలన దోషములేదు - ఉపాధిలోనుండుటవలన జీవుడు తన స్వస్వరూపమును - తానే పరబ్రహ్మయను జ్ఞానమును - మఱచును. పరబ్రహ్మను ధ్యానించుటచేత ఈ అజ్ఞానము తొలగును - అప్పుడు తనే పరబ్రహ్మయని, జీవేశ్వరులు ఒకటేయని తెలుసుకొనును). “అహికుండలివత్” (బ్రహ్మ సూత్రములు - 3 - 2 27)
(పాము పాకురు చున్నపుడు దానిని అహి అనిన్నీ ఒక చుట్టగా చుట్టుకొనియున్నపుడు ‘కుండలము’ అనిన్నీ చెప్పినట్లే ఈశ్వరుడు జీవుడు అని ఒకే తత్వము వేఱువేఱు పేర్లతో చెప్పబడుచున్నది. అంతేగాని జీవుడు పరమాత్మను ధ్యానించుటవలన వారిద్దఱకు భేదమున్నదనుట నిజము కాదు).
dhyātā anagā dhyāniṃcuvāḍu, jīvuḍu. dhyēyamu anagā dhyānamu cēyataginadi, parabrahma. kaṣṭamulanu pōgoṭṭukonuṭakugāni, muktini poṃduṭakugāni jīvuḍu parabrahmanu dhyāniṃcunu. aṃducēta jīvuḍu dhyāta - dhyānamu cēyuvāḍu, parabrahma dhyēyamu - dhyāniṃcataginavāḍu. jīva paramātmalaku ī vidhamugānunna paraspara saṃbaṃdhamu dhyātṛ dhyēya bhāvamu.
jīvuḍu parabrahmanu dhyāniṃcuṭa guṟiṃci ī vidhamugā ceppabaḍinadi : -
kaściddhīraḥ pratyagātmāna mai kṣadāvṛtta cakṣura mṛtatvamicchan ||” (kaṭhōpaniṣat - 4 - 1 -)
(paramēśvaruḍu bahirviṣayamu ayi anātma viṣayamulagu śrōtramu modalagu iṃdriyamulanu lōnunna ātmanu darśiṃcuṭaku samarthamulukānivānini sṛjiṃcenu. aṃducēta lōkulella runu bāhya viṣayamulanē cūḍagalarugāni aṃtarātmanu cūḍalēru. kāni evaḍō oka vivēki mōkṣābhilāṣiyai iṃdriyamulanu maralcukoni, nigrahiṃci, lōnunna paramātmanu darśiṃciri”.
“yaṃ vinidrā jitasvāsā ssaṃtuṣṭā ssaṃ yatīṃdriyāḥ
jyōtiḥ paśyaṃti yuṃ jānā stasmai yōgātmanēnamaḥ ||” (mahābhāratamu - 12 - 47 - 54)
(yōgaparāyaṇulu nidralēnivārai prāṇāyāmādulacē vāyuvuni jayiṃci, iṃdriyamunu nigrahiṃci saṃtōṣamutō jyōtisvarūpuḍagu ē paramātmanu cūturō aṭṭi yā yōgasvarūpunaku namaskāramu (dīninē ārāddhyā rādhakabhāvamani yaṃduru).
(ī prakāramugā ceppuṭavalana jīvuḍuvēru, brahma vēru ani iddaraku bhēdamunnaṭlu sphuriṃcunu kāni vēdāṃtamulaṃ daṃtaṭanu “tatva masi” anu vākyamucē māṭi māṭiki jīvabrahmala abhēdamē - aikyamē - ceppabaḍucunnadi. “brahmaivasan brahmāpyēti” )
(bṛhadāraṇyakōpaniṣat - 4 - 46)
(brahmavale nuṃḍi brahmanu poṃducunnāḍu -); ” sayōhavai tatparamaṃ brahmavēda brahmaiva bhavati” (muṃḍakōpaniṣat)
(evaḍu parabrahma svarūpamunu telusukonunō ataḍu brahmasvarūpuḍē yagucunnāḍu-). ī vākyamulavalana jīva brahmaikyamunaku dhyātṛdhyēya bāvamuvalana dōṣamulēdu - upādhilōnuṃḍuṭavalana jīvuḍu tana svasvarūpamunu - tānē parabrahmayanu jñānamunu - maṟacunu. parabrahmanu dhyāniṃcuṭacēta ī ajñānamu tolagunu - appuḍu tanē parabrahmayani, jīvēśvarulu okaṭēyani telusukonunu). “ahikuṃḍalivat” (brahma sūtramulu - 3 - 2 27)
(pāmu pākuru cunnapuḍu dānini ahi aninnī oka cuṭṭagā cuṭṭukoniyunnapuḍu ‘kuṃḍalamu’ aninnī ceppinaṭlē īśvaruḍu jīvuḍu ani okē tatvamu vēṟuvēṟu pērlatō ceppabaḍucunnadi. aṃtēgāni jīvuḍu paramātmanu dhyāniṃcuṭavalana vāriddaṟaku bhēdamunnadanuṭa nijamu kādu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.