← Back to న · Booklets 21–30 (digitized file 3)

నహినిందాన్యాయము nahiniṃdānyāyamu

Original — తెలుగు
  1. “సూత్రము - నహినిందా నిందితుం ప్రవృత్త అపిచ స్తుత్యం స్తోతుః ప్రవృత్తః, ఇత్యేవనహి నిందాన్యాయః -

(వేదములు మొదలగువాటిలో అక్కడక్కడ చేయబడిన కొన్ని కొన్ని దేవతుల నిందకు ఆయా దేవతలను నిందచేయుట తాత్పర్యముకాదు. అందులో స్తుతించిన దేవతుల ఆధిక్యతే దాని తాత్పర్యము).

  1. పురాణేషు తత్త న్మత సాంప్రదాయకా స్వీయదేవతాస్తుతి మాత్ర వచనాని స్వీకృత్య మదీయేష్ట దేవతైవ శ్రేష్ట ఇతి తదుపాసకాః వయమేవో త్కృష్టా ఇత్య జ్ఞానేన తదితరా దేవా స్సర్వేపి ని కృష్టా ఇతి వక్తం న యుజ్యతే - అశాస్త్రీ యత్వాత్ -

(పురాణములందు తమతమ ఇష్టదేవతా స్తుతివాక్యములను మాత్రమే స్వీకరించి, మా యిష్ట దైవమే శ్రేష్టమనియు, ఆ దేవోపాసకులగు మేమే గొప్పవారము అనియు అజ్ఞానమువలన ఇతర దేవతులనందఱిని నిందింతురు. ఇది కేవలము అశాస్త్రీయమగుటవలన తగదు).

  1. “నామరూపాత్మక షణ్మత దర్శనేషు ప్రతిపాదిత దేవతా సర్వేపి సాక్షాత్పరబ్రహ్మ ప్రతీకాన్యేవ ఇతి విజ్ఞాయ మోక్షార్థీ తత్తత్ప్రతీక బ్రహ్మోపాసక మేవకర్తత్యః ఇత్యే సిద్ధాంతః.”

“బ్రహ్మ సత్యం జగన్మిధ్యా, జీవో బ్రహ్మైవ నాపరః”

(శ్రుతి) బ్రహ్మయనునది ఒకటే సత్యము. దానికి వేరైన జగత్తు అంతయుమిధ్య - లేనిదే. జీవుడనువాడు అజ్ఞానము తొలగించుకొనిన బ్రహ్మమే యగును - అట్టి పరబ్రహ్మ స్వరూపమును బ్రహ్మాత్మ శక్తిచే కల్పించబడిన నామ రూపాత్మక జగత్స్వరూపమును నిరూపించుటకై శ్రుతి “అస్తి, భాతి, ప్రియం రూపం నామ ఇత్యంశపంచకం. ఆద్యత్రయం, బ్రహ్మరూపం నామరూపాత్మకం జగత్-” బ్రహ్మ స్వరూపము యేది యనిన - ఉన్నది, ప్రకాశించుచున్నది ఆనందస్వరూపము అను అయిదే వస్తువులు ఈ లోకమందు గలవు. వాటిలో మొదటి మూడును బ్రహ్మస్వరూపము, మిగిలిన రెండు లేనటువంటి జగత్స్వరూపము - అందుచేత నామరూపాత్మకమగు షణ్మత దర్శన ప్రతిపాదన దేవతులందరును సాక్షాత్పరబ్రహ్మ ప్రతీకములే యగుదురు. అందుచేత వాటియందు భేదభావము చూపక దేనినైనను నిందింపక దేనినైన గ్రహించి తత్ప్రతీక బ్రహ్మోపాసన చేయుటయే సిద్ధాంతము చేయబడినది).

Transliteration
  1. “sūtramu - nahiniṃdā niṃdituṃ pravṛtta apica stutyaṃ stōtuḥ pravṛttaḥ, ityēvanahi niṃdānyāyaḥ -

(vēdamulu modalaguvāṭilō akkaḍakkaḍa cēyabaḍina konni konni dēvatula niṃdaku āyā dēvatalanu niṃdacēyuṭa tātparyamukādu. aṃdulō stutiṃcina dēvatula ādhikyatē dāni tātparyamu).

  1. purāṇēṣu tatta nmata sāṃpradāyakā svīyadēvatāstuti mātra vacanāni svīkṛtya madīyēṣṭa dēvataiva śrēṣṭa iti tadupāsakāḥ vayamēvō tkṛṣṭā itya jñānēna taditarā dēvā ssarvēpi ni kṛṣṭā iti vaktaṃ na yujyatē - aśāstrī yatvāt -

(purāṇamulaṃdu tamatama iṣṭadēvatā stutivākyamulanu mātramē svīkariṃci, mā yiṣṭa daivamē śrēṣṭamaniyu, ā dēvōpāsakulagu mēmē goppavāramu aniyu ajñānamuvalana itara dēvatulanaṃdaṟini niṃdiṃturu. idi kēvalamu aśāstrīyamaguṭavalana tagadu).

  1. “nāmarūpātmaka ṣaṇmata darśanēṣu pratipādita dēvatā sarvēpi sākṣātparabrahma pratīkānyēva iti vijñāya mōkṣārthī tattatpratīka brahmōpāsaka mēvakartatyaḥ ityē siddhāṃtaḥ.”

“brahma satyaṃ jaganmidhyā, jīvō brahmaiva nāparaḥ”

(śruti) brahmayanunadi okaṭē satyamu. dāniki vēraina jagattu aṃtayumidhya - lēnidē. jīvuḍanuvāḍu ajñānamu tolagiṃcukonina brahmamē yagunu - aṭṭi parabrahma svarūpamunu brahmātma śakticē kalpiṃcabaḍina nāma rūpātmaka jagatsvarūpamunu nirūpiṃcuṭakai śruti “asti, bhāti, priyaṃ rūpaṃ nāma ityaṃśapaṃcakaṃ. ādyatrayaṃ, brahmarūpaṃ nāmarūpātmakaṃ jagat-” brahma svarūpamu yēdi yanina - unnadi, prakāśiṃcucunnadi ānaṃdasvarūpamu anu ayidē vastuvulu ī lōkamaṃdu galavu. vāṭilō modaṭi mūḍunu brahmasvarūpamu, migilina reṃḍu lēnaṭuvaṃṭi jagatsvarūpamu - aṃducēta nāmarūpātmakamagu ṣaṇmata darśana pratipādana dēvatulaṃdarunu sākṣātparabrahma pratīkamulē yaguduru. aṃducēta vāṭiyaṃdu bhēdabhāvamu cūpaka dēninainanu niṃdiṃpaka dēninaina grahiṃci tatpratīka brahmōpāsana cēyuṭayē siddhāṃtamu cēyabaḍinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.