(నిర్దయత్వము; కనికరము లేకుండుట - అందఱిని సంహరించువాడు కనుక పరమాత్మ నిర్దయుడుఅనిపించును - కాని ఇది సరికాదు - అందఱిని వారి వారి కర్మానుసారముగ పుట్టించి శిక్షించుచుండు - భూతములను భూతములచతనే శిక్షింపించుచుండును –
“క. భూతములచేత నెప్పుడు
భూతములను జన్మ మరణ పోషణములు ని
ర్లీతములు చేయుచుండును
భూతమయుండీశ్వరుండు,భూత శరణ్యా||” (శ్రీమదాంధ్రమహాభాగవతము - -)
(కౌషీతకోపనిషత్ - 3 - 8)
(భగవంతుడు ఎవనిని ఈ లోకమునుండి వారి వారి కర్మ వశమున ఊర్ధ్వలోకమును పొందింపదలచునో వానిచే సాధుకర్మలు చేయించును. ఏవనిని అధోలోకములను పొందింపతలచునో వానిచే అసాధుకర్మలు చేయించును -)
“శృణ్వార్తా విత్తకామాశ్చ జ్ఞానినశ్చ ముముక్షవః |
స కామత్వేన విష్కామతయా యేమాం యధేశ్వరం |
సమస్త ఫలదాతరం భజంతే తాం స్త దైవచ |
తదభీష్ట ప్రదానేన త్వను గృహ్ణామ్యహం హరిః |
ఆర్తానార్తి వినాశేన విత్తదానేన చార్థినః |
జిజ్ఞాసూన్ జ్ఞానదేనేన జ్ఞానినో మోక్షదాన తః |
అనుగృహ్ణామ్యహంస్వామీ నాన్యకామాయ చాన్యథా |
ఫలార్థిత్వే ముముక్షుత్వే హరి రేవ నృణాం గతిః ||“. (గీతాభావ ప్రకాశము - 4 - 71 to 75)
(నా భక్తులు నాలుగు విధములుగా ఉన్నారు –
1. ఆర్తులు (బాధపడుచున్నవారు - గజేంద్రుడు, ద్రౌపది వంటివారు)
2. విత్తకాములు - (ధనము, భోగము. ఐశ్వర్యము కోరువారు - లేక ఇంకొకకోరిక ఏదైన కలవారు, వారి కోరికలు నెఱవేర్చుటకు నన్ను భజించువారు),
3. జ్ఞానులు (భగవత్తత్త్వమును తెలుసు కొనుట యందభిలాష కలవారు)
4. మోక్షము కోరువారు. వీరు ఎవరు ఏ ప్రకారము నన్ను భజించినా, కోరికతో భజించినను, కోరికలేక భజించినను - నేను సమస్తమైన కోరికలను ఇచ్చువాడను కనుక - వారి కోరికల ప్రకారమే వారిని నేను అనుగ్రహిస్తాను - అనగా, - బాధలో ఉన్నవారి బాధ నివారిస్తాను, ధనము కోరినవారికి ధనము నిచ్చెదను, జ్ఞానము కోరినవారికి జ్ఞానమునిచ్చెదను.మోక్షము కోరినవారికి మోక్షమునిచ్చెదను - ఏఫలము నిచ్చుటకైనను నేనే శక్తుడను - నన్నే భజించవలెను).
యే భజం తి తు మాం భక్త్యా మయితే తేషుచాప్యహం ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 29)
“సర్వ ప్రాణిషు తుల్యోహం సచ్చిదానందరూపతః |
అంతర్యామి తయా తద్వన్న కశ్చి ద్ద్వేషగోచరః |
ప్రియోదా మే ప్రకాశస్య సావిత్రస్యేవ కశ్చన |
కధం ఫలే (అ)స్తి వైషమ్యం స్వభక్తా భక్తయోస్తదా |
సేవంతే యేతుమాం భక్త్యా సర్వకర్మార్పణా ఖ్యయం |
చిత్త శుద్ధ్యాత్మ బోధేన తేమయ్యాత్మనిచిద్ఘనే |
స్వభావత్సంతి తత్వైకాకార వృత్త్యాతి శుద్ధయా |
అహమప్యతి శుద్ధాయాం సద్ధీ వృతౌ నిరంతరం |
ప్రతిబింబతయం తేషు వర్త ఏవ స్వభావతః |
యదాగ్నిర్నాపనయతి దూరస్థానాం నృణాంతమః |
శీతం వాతేన నద్వేష్యా అగ్నేః స్యుర్దూర గామినః |
శీతం తమో (అ)పనయతి సమీపముపసర్పతాం |
తౌతేన ప్రియాస్తస్య తద్విత్కల్ప తరోరపి |
స్వస్వకామానుసారేణ విచిత్రఫలదాయినః |
నవైషమ్యం ననైర్ఘృణ్యం భవేత్సర్వ సమస్యమే ||” (గీతాభావప్రకాశము - 9 - 192 to199)
(సత్ చిత్ ఆనందములే రూపముగాగలనేను సమస్త ప్రాణులందు అంతర్యామిగానుండుటవలననేను అందఱి యెడల సమానుడనే| ఆకాశమున నున్న సూర్యకాంతి వీడు మంచివాడు, వీడికివెలుతురు నిచ్చెదను, సత్తువనిస్తాను, వీడు చెడ్డవాడు వెలుతురునందచేయను అను వైషమ్యబుద్ధిలేక అందరియెడల సమానముగా ఉండునట్లు, నాకు ద్వేష్యుడు (నేను ద్వేషించతగినవాడు),ఇష్టుడు (ఇష్టమైనవాడు) అని ఎవరూ లేరు. వీరు నాభక్తులని వీరు నా భక్తులుకారని ఫలమునిచ్చుటలో వైషమ్యములేదు. చిత్తశుద్ధితో ఆత్మజ్ఞానము కలిగి ఏ భక్తులు సర్వకర్మలు నాకుఅర్పణ చేయుచు నన్ను సేవించెదరో వారు స్వభావము చేతనే అతి శుద్ధమైన తత్వైకాకారవృత్తితోచిద్ఘనమైన నాయందే యుందురు. నేను కూడ అతి శుద్ధమైన మనస్సునందు - మనస్సుగలవారియందు - స్వభావముచేతనే అద్దమందు ప్రతిబింబరూపముగా శుద్ధమైన వస్తువునందు శుభ్రముగాకనబడు ప్రతిబింబమువలెనుందును - అగ్ని తనకు దూరముగా ఉండువారి చీకటిని, చలినిపోగొట్టలేదు. ఆ కారణముగా వారు అగ్నికి ద్వేష్యులుకారు. అగ్నికి దగ్గరగా నున్నవారికి చలిఉండదు, ఆ చీకటి ఉండదు - అంతమాత్రమున వారు అగ్నికి ప్రియులుకారు - ఈ ప్రకారముగానేకల్పవృక్షముకూడా కోరినవారి కోరికలబట్టియే చిత్రవిచిత్రమైన ఫలములనిచ్చును - ఆ ప్రకారముగానే చిత్రవిచిత్ర ఫలములనిచ్చు నాకు - అందరియెడల సముడనగుటవలన, అందరి యెడలసమముగావర్తించుటవలన - భక్తులని, భక్తులుకారని వైషమ్యము (విషమ స్వభావము) (వేఱు వేఱుగా చూచుటగాని, నైర్ఘృణ్యము (నిర్దయత్వముగాని) - భక్తులు కానివారిని నిర్దయత్వముతో చూచుటగాని లేదు).
(nirdayatvamu; kanikaramu lēkuṃḍuṭa - aṃdaṟini saṃhariṃcuvāḍu kanuka paramātma nirdayuḍuanipiṃcunu - kāni idi sarikādu - aṃdaṟini vāri vāri karmānusāramuga puṭṭiṃci śikṣiṃcucuṃḍu - bhūtamulanu bhūtamulacatanē śikṣiṃpiṃcucuṃḍunu –
“ka. bhūtamulacēta neppuḍu
bhūtamulanu janma maraṇa pōṣaṇamulu ni
rlītamulu cēyucuṃḍunu
bhūtamayuṃḍīśvaruṃḍu,bhūta śaraṇyā||” (śrīmadāṃdhramahābhāgavatamu - -)
(kauṣītakōpaniṣat - 3 - 8)
(bhagavaṃtuḍu evanini ī lōkamunuṃḍi vāri vāri karma vaśamuna ūrdhvalōkamunu poṃdiṃpadalacunō vānicē sādhukarmalu cēyiṃcunu. ēvanini adhōlōkamulanu poṃdiṃpatalacunō vānicē asādhukarmalu cēyiṃcunu -)
“śṛṇvārtā vittakāmāśca jñāninaśca mumukṣavaḥ |
sa kāmatvēna viṣkāmatayā yēmāṃ yadhēśvaraṃ |
samasta phaladātaraṃ bhajaṃtē tāṃ sta daivaca |
tadabhīṣṭa pradānēna tvanu gṛhṇāmyahaṃ hariḥ |
ārtānārti vināśēna vittadānēna cārthinaḥ |
jijñāsūn jñānadēnēna jñāninō mōkṣadāna taḥ |
anugṛhṇāmyahaṃsvāmī nānyakāmāya cānyathā |
phalārthitvē mumukṣutvē hari rēva nṛṇāṃ gatiḥ ||“. (gītābhāva prakāśamu - 4 - 71 to 75)
(nā bhaktulu nālugu vidhamulugā unnāru –
1. ārtulu (bādhapaḍucunnavāru - gajēṃdruḍu, draupadi vaṃṭivāru)
2. vittakāmulu - (dhanamu, bhōgamu. aiśvaryamu kōruvāru - lēka iṃkokakōrika ēdaina kalavāru, vāri kōrikalu neṟavērcuṭaku nannu bhajiṃcuvāru),
3. jñānulu (bhagavattattvamunu telusu konuṭa yaṃdabhilāṣa kalavāru)
4. mōkṣamu kōruvāru. vīru evaru ē prakāramu nannu bhajiṃcinā, kōrikatō bhajiṃcinanu, kōrikalēka bhajiṃcinanu - nēnu samastamaina kōrikalanu iccuvāḍanu kanuka - vāri kōrikala prakāramē vārini nēnu anugrahistānu - anagā, - bādhalō unnavāri bādha nivāristānu, dhanamu kōrinavāriki dhanamu niccedanu, jñānamu kōrinavāriki jñānamuniccedanu.mōkṣamu kōrinavāriki mōkṣamuniccedanu - ēphalamu niccuṭakainanu nēnē śaktuḍanu - nannē bhajiṃcavalenu).
yē bhajaṃ ti tu māṃ bhaktyā mayitē tēṣucāpyahaṃ ||“. (śrīmadbhagavadgīta - 9 - 29)
“sarva prāṇiṣu tulyōhaṃ saccidānaṃdarūpataḥ |
aṃtaryāmi tayā tadvanna kaści ddvēṣagōcaraḥ |
priyōdā mē prakāśasya sāvitrasyēva kaścana |
kadhaṃ phalē (a)sti vaiṣamyaṃ svabhaktā bhaktayōstadā |
sēvaṃtē yētumāṃ bhaktyā sarvakarmārpaṇā khyayaṃ |
citta śuddhyātma bōdhēna tēmayyātmanicidghanē |
svabhāvatsaṃti tatvaikākāra vṛttyāti śuddhayā |
ahamapyati śuddhāyāṃ saddhī vṛtau niraṃtaraṃ |
pratibiṃbatayaṃ tēṣu varta ēva svabhāvataḥ |
yadāgnirnāpanayati dūrasthānāṃ nṛṇāṃtamaḥ |
śītaṃ vātēna nadvēṣyā agnēḥ syurdūra gāminaḥ |
śītaṃ tamō (a)panayati samīpamupasarpatāṃ |
tautēna priyāstasya tadvitkalpa tarōrapi |
svasvakāmānusārēṇa vicitraphaladāyinaḥ |
navaiṣamyaṃ nanairghṛṇyaṃ bhavētsarva samasyamē ||” (gītābhāvaprakāśamu - 9 - 192 to199)
(sat cit ānaṃdamulē rūpamugāgalanēnu samasta prāṇulaṃdu aṃtaryāmigānuṃḍuṭavalananēnu aṃdaṟi yeḍala samānuḍanē| ākāśamuna nunna sūryakāṃti vīḍu maṃcivāḍu, vīḍikiveluturu niccedanu, sattuvanistānu, vīḍu ceḍḍavāḍu veluturunaṃdacēyanu anu vaiṣamyabuddhilēka aṃdariyeḍala samānamugā uṃḍunaṭlu, nāku dvēṣyuḍu (nēnu dvēṣiṃcataginavāḍu),iṣṭuḍu (iṣṭamainavāḍu) ani evarū lēru. vīru nābhaktulani vīru nā bhaktulukārani phalamuniccuṭalō vaiṣamyamulēdu. cittaśuddhitō ātmajñānamu kaligi ē bhaktulu sarvakarmalu nākuarpaṇa cēyucu nannu sēviṃcedarō vāru svabhāvamu cētanē ati śuddhamaina tatvaikākāravṛttitōcidghanamaina nāyaṃdē yuṃduru. nēnu kūḍa ati śuddhamaina manassunaṃdu - manassugalavāriyaṃdu - svabhāvamucētanē addamaṃdu pratibiṃbarūpamugā śuddhamaina vastuvunaṃdu śubhramugākanabaḍu pratibiṃbamuvalenuṃdunu - agni tanaku dūramugā uṃḍuvāri cīkaṭini, calinipōgoṭṭalēdu. ā kāraṇamugā vāru agniki dvēṣyulukāru. agniki daggaragā nunnavāriki caliuṃḍadu, ā cīkaṭi uṃḍadu - aṃtamātramuna vāru agniki priyulukāru - ī prakāramugānēkalpavṛkṣamukūḍā kōrinavāri kōrikalabaṭṭiyē citravicitramaina phalamulaniccunu - ā prakāramugānē citravicitra phalamulaniccu nāku - aṃdariyeḍala samuḍanaguṭavalana, aṃdari yeḍalasamamugāvartiṃcuṭavalana - bhaktulani, bhaktulukārani vaiṣamyamu (viṣama svabhāvamu) (vēṟu vēṟugā cūcuṭagāni, nairghṛṇyamu (nirdayatvamugāni) - bhaktulu kānivārini nirdayatvamutō cūcuṭagāni lēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.