సర్వకర్మ శూన్యత్వం. (ఏకర్మలు చేయక యుండుట).
నిర్గతాని కర్మాణి యస్మాత్ నిష్క్రియ బ్రహ్మాత్మ సంభోధాత్ సః నిష్కర్మా, తస్య భావః నైష్కర్మ్యం.
(బ్రహ్మజ్ఞానము కలిగియుండుటచేత కర్మలులేనివాడు,నిష్కర్ముడు - నిష్కర్ముని భావము నైష్కర్మ్యము).
(బంధమునకు కారణమైన కర్మలు చేయనివారు నిష్కర్ములు. అట్టి నిష్కర్ముల భావము నైష్కర్మ్యము).
(కర్మ లేకుండుటయే బ్రాహ్మీ స్థితి - అదియే నైష్కర్మ్యము).
(కర్మలు చేయనివాడు, కర్మయోగము గడిపినవాడు, జ్ఞాన నిష్టయందున్నవాడు - జ్ఞానయోగి. అట్టివానిభావము - అట్లుండుట నైష్కర్మ్యము -).
(కర్మ చేయకుండుట; కర్మ లేకుండుట; భగవంతుడు నిష్క్రియుడు. అందుచేత అట్టి భగవంతుని వలెనిష్కి యుడై యుండు స్థితి).
నయత్ర కర్మతన్నిష్కర్మ బ్రహ్మ. తస్య భావః నైష్కర్మ్యం నిష్క్రియంబ్రహ్మాత్మనావస్థానలక్షణాం ముక్తిం-(కర్మ చేయకయుండుట నిష్కర్మ. అదియే బ్రహ్మస్థితి. అదియే నైష్కర్మ్యము - క్రియారహితుడైన బ్రహ్మవలెనుండుట).
నిష్కర్మ భావము - కర్మ చేసినను అది అకర్మయగునట్లు చేయుట, అనగా కర్మలందాసక్తిలేక, ఫలమందు కోరిక లేక, భగవంతుని నిమిత్తము చేసి దానిని భగవంతునికి అర్పించుట).
కర్మ నివృత్తి సాధ్యం జ్ఞానం. (కర్మ నివృత్తి వలన సాధించబడిన జ్ఞానము).
ఆత్మ తత్వం (ఆత్మ స్వరూపము)
సన్యాసం (సన్యసించుట).
” న కర్మణా మనారంభాత్ నైష్కర్మ్యం పురుషో అశ్నుతే | న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 4)
(కర్మలు చేయకపోయినంతమాత్రమున అది నైష్కర్మ్యము కాదు - చిత్తశుద్ధి కలిగి, కర్మలందాసక్తిలేక, ఫలమందు కోరికలేకకర్మలు చేయుట నైష్కర్మ్యము).
sarvakarma śūnyatvaṃ. (ēkarmalu cēyaka yuṃḍuṭa).
nirgatāni karmāṇi yasmāt niṣkriya brahmātma saṃbhōdhāt saḥ niṣkarmā, tasya bhāvaḥ naiṣkarmyaṃ.
(brahmajñānamu kaligiyuṃḍuṭacēta karmalulēnivāḍu,niṣkarmuḍu - niṣkarmuni bhāvamu naiṣkarmyamu).
(baṃdhamunaku kāraṇamaina karmalu cēyanivāru niṣkarmulu. aṭṭi niṣkarmula bhāvamu naiṣkarmyamu).
(karma lēkuṃḍuṭayē brāhmī sthiti - adiyē naiṣkarmyamu).
(karmalu cēyanivāḍu, karmayōgamu gaḍipinavāḍu, jñāna niṣṭayaṃdunnavāḍu - jñānayōgi. aṭṭivānibhāvamu - aṭluṃḍuṭa naiṣkarmyamu -).
(karma cēyakuṃḍuṭa; karma lēkuṃḍuṭa; bhagavaṃtuḍu niṣkriyuḍu. aṃducēta aṭṭi bhagavaṃtuni valeniṣki yuḍai yuṃḍu sthiti).
nayatra karmatanniṣkarma brahma. tasya bhāvaḥ naiṣkarmyaṃ niṣkriyaṃbrahmātmanāvasthānalakṣaṇāṃ muktiṃ-(karma cēyakayuṃḍuṭa niṣkarma. adiyē brahmasthiti. adiyē naiṣkarmyamu - kriyārahituḍaina brahmavalenuṃḍuṭa).
niṣkarma bhāvamu - karma cēsinanu adi akarmayagunaṭlu cēyuṭa, anagā karmalaṃdāsaktilēka, phalamaṃdu kōrika lēka, bhagavaṃtuni nimittamu cēsi dānini bhagavaṃtuniki arpiṃcuṭa).
karma nivṛtti sādhyaṃ jñānaṃ. (karma nivṛtti valana sādhiṃcabaḍina jñānamu).
ātma tatvaṃ (ātma svarūpamu)
sanyāsaṃ (sanyasiṃcuṭa).
” na karmaṇā manāraṃbhāt naiṣkarmyaṃ puruṣō aśnutē | na ca sanyasanādēva siddhiṃ samadhigaccati||“. (śrīmadbhagavadgīta - 3 - 4)
(karmalu cēyakapōyinaṃtamātramuna adi naiṣkarmyamu kādu - cittaśuddhi kaligi, karmalaṃdāsaktilēka, phalamaṃdu kōrikalēkakarmalu cēyuṭa naiṣkarmyamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.