← Back to న · Booklets 21–30 (digitized file 3)

నైష్టిక శాంతి naiṣṭika śāṃti

Original — తెలుగు
  1. స్థిరాత్మానుభవ రూపాం నివృత్తిం. (శ్రీరామానుజః)

(స్థిరమైన ఆత్మానుభవరూపమైన నివృత్తి).

  1. “నిష్టాయాం భవాం శాంతిం మోక్షాఖ్యాం - సత్వ శుద్ధి జ్ఞానప్రాప్తి సర్వకర్మ సన్యాస జ్ఞాన నిష్టా. క్రమేణ శాంతిం”. (శ్రీశంకరః)

(నిష్టయందున్నపుడు కలిగిన మోక్షమను పేరుగల శాంతి. - సత్వశుద్ధి, జ్ఞానప్రాప్తి, సర్వకర్మసన్యాసజ్ఞాన నిష్టా, - ఇవి క్రమముగా కలిగిన శాంతి కలుగును).

  1. “నిష్టాయాం భవతీతి నైష్టికీ - నైష్టికీ శాంతి - అనేన సాక్షాత్ మోక్షప్రతీతి స్యాత్” (వేదాంత దేశికః)

(నిష్టయందు కలుగుశాంతి నైష్టిక శాంతి - అనగా సాక్షాత్తు మోక్షమే యన్నమాట).

  1. నిష్టా యుక్తా శాంతిః (నిష్టతో కూడిన శాంతి).

  2. “యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం |”. (శ్రీమద్భగవద్గీత - 5 -11)

(నేను చేయుచున్న ఈ కర్మలు ఈశ్వరుని కొఱకే చేయుచున్నాను - ఆ కర్మలఫలము నాకు కలుగవలెననికాదు. ఇట్టి అభిప్రాయము గలవాడు యుక్తుడు - అట్టివాడు కర్మలు చేయుచున్నను - మొక్షమను పేరుగలశాంతిని పొందును. చిత్తశుద్ధి, నిత్యానిత్యవస్తు వివేకము, సన్యాసము జ్ఞాననిష్ట అనునవి క్రమముగాకలుగును. వాటివలన కలుగు శాంతి నైష్టిక శాంతి).

Transliteration
  1. sthirātmānubhava rūpāṃ nivṛttiṃ. (śrīrāmānujaḥ)

(sthiramaina ātmānubhavarūpamaina nivṛtti).

  1. “niṣṭāyāṃ bhavāṃ śāṃtiṃ mōkṣākhyāṃ - satva śuddhi jñānaprāpti sarvakarma sanyāsa jñāna niṣṭā. kramēṇa śāṃtiṃ”. (śrīśaṃkaraḥ)

(niṣṭayaṃdunnapuḍu kaligina mōkṣamanu pērugala śāṃti. - satvaśuddhi, jñānaprāpti, sarvakarmasanyāsajñāna niṣṭā, - ivi kramamugā kaligina śāṃti kalugunu).

  1. “niṣṭāyāṃ bhavatīti naiṣṭikī - naiṣṭikī śāṃti - anēna sākṣāt mōkṣapratīti syāt” (vēdāṃta dēśikaḥ)

(niṣṭayaṃdu kaluguśāṃti naiṣṭika śāṃti - anagā sākṣāttu mōkṣamē yannamāṭa).

  1. niṣṭā yuktā śāṃtiḥ (niṣṭatō kūḍina śāṃti).

  2. “yuktaḥ karmaphalaṃ tyaktvā śāṃtimāpnōti naiṣṭikīṃ |”. (śrīmadbhagavadgīta - 5 -11)

(nēnu cēyucunna ī karmalu īśvaruni koṟakē cēyucunnānu - ā karmalaphalamu nāku kalugavalenanikādu. iṭṭi abhiprāyamu galavāḍu yuktuḍu - aṭṭivāḍu karmalu cēyucunnanu - mokṣamanu pērugalaśāṃtini poṃdunu. cittaśuddhi, nityānityavastu vivēkamu, sanyāsamu jñānaniṣṭa anunavi kramamugākalugunu. vāṭivalana kalugu śāṃti naiṣṭika śāṃti).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.